12, జులై 2017, బుధవారం

దత్తపది - 118 (అన్నము-జావ-గంజి-తోప)

"అన్నము - జావ - గంజి - తోప"
పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
భారతార్థంలో
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.

55 కామెంట్‌లు:

  1. భీముడు శ్రీకృష్ణునితో ఫలికన పలుకులు:-

    అన్న ముదమొంద సంధియే యన్న మున్ను
    జావళియె నాకు, నాచేతఁ జావడె, కురు
    ఖలుని హంగంజికలను నే గనెద! పెద్ద
    తోప? శాంతోపదేశముతో పని హరి!!

    హంగు + అంజికలు = హంగంజికలు
    అంజిక = భయము

    రిప్లయితొలగించండి
  2. "అన్న! ముద్దుల కొడుకుర చిన్నవాణ్ణి
    జావగొట్టె సైంధవుడట సంధ్య వేళ !
    పాశుపతముతో పడగొట్టి వాని తలను
    వేయి గంజింపి దవ్వున వేతు జూడు!"

    :)

    రిప్లయితొలగించండి
  3. ధౌమ్య హితోప దేశముల్ తనరి వినగ
    అన్న ముచ్చటిం చినరీతి యాచ రించ
    జావ డములేక సోదరుల్ సంత సమున
    విరటు కొలువున జేరగం జినుని పలుకు
    ------------------------------
    జావడము = పిరికితనము, బేలతనము సోదరుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. "ధౌమ్యుని హితోపదేశముల్..." అనండి.

      తొలగించండి
    2. ధౌమ్యుని హితోప దేశముల్ తనరి వినగ
      అన్న ముచ్చటిం చినరీతి యాచ రించ
      జావ డములేక సోదరుల్ సంత సమున
      విరటు కొలువున జేరంగ జినుని పలుకు
      -----------------------------------
      జావడము = పిరికితనము, బేలతనము

      తొలగించండి
  4. సైంధవునితో ద్రౌపది పలుకులు

    అన్న! మున్నెన్నడెరుగలే దన్న చెల్లి
    గోర, నిను జావగం జిత్తు గొట్టెదరుగ
    పట్టపగలు చుక్కలుదోప చుట్టుముట్టి
    బావలైదుగురు మిక్కిలి బాగుగాను
    *

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బావలైవురు మిక్కిలి బాగుగాను గా చదవ ప్రార్ధన!

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "బావ లేగురు.." అనండి.

      తొలగించండి
    3. గురువుగారికి నమస్సులు! ఏవురు వ్రాయబోయి ఐవురని వ్రాశాను! ఏవురు ఏగురు సమానార్ధకాలని యిప్పిడే గ్రహించాను. ధన్యవాదములు!🙏🙏🙏

      తొలగించండి
  5. ద్రౌపది శ్రీకృష్ణునితో పల్కిన మాటలు

    *అన్న!ము*నుపేను చీరలిమ్మన్నదాన!
    కౌరవులుఁ*జావ*తథ్యంబు కదనమందు
    ఊడి*గంజి*త్తులన్ని నేనోర్వజాల
    వారి*తోప*నిమాకేమి వారిజాక్ష!!

    రిప్లయితొలగించండి
  6. అన్న!మురహరి! శ్రీకృష్ణ!యదుకులప్ర
    జావరిష్ఠ! చక్రీ! కురుసభను పణము
    గం జికాకుఁబెట్టితిరె, శక్యమెటులిపుడు
    సంధి పేర హితోపదేశములఁబల్క?

    రిప్లయితొలగించండి
  7. పద్మవ్వ్యూహానికి అభిమన్యుని పంపమని భీముడు ధర్మరాజుతో
    అన్న!ముదమార నభిమన్యు ననికి బంపు;
    సందియంబేల!శత్రుల జావనణచి
    చేరెదము;కృష్ణ మురియగం జివరివరకు;
    జయముతో పసమీరగ సాగుమయ్య!

    రిప్లయితొలగించండి
  8. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    రాయబారమున కేగబోవు శ్రీకృష్ణునితో వలలుడు :

    01)
    ___________________________

    అన్న ముద్దుగ పలికిన - విన్నపముల
    నీదు సుహితోప వచనముల్ - కాదనంగ
    వలలు గద చేత జావదే - కలుగు ననుచు
    ముగియు మగ్గంజికము లింక - ముగియు ననుచు
    పలుకు మో బావ రాజుతో - వలలు పలుకు !
    ___________________________
    వలలుడు = భీముడు
    మగ్గు+అంజికములు+ఇంక
    మగ్గు = చెడు
    అంజికము = కన్ను
    ముగియు = మూతపడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వసంత కిశోర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. వసంత కిశోర్ గారు చిన్న వ్యాకరణ చర్చ:
      మగ్గంజికము లింక (మగ్గు+అంజికములు+ఇంక):
      మగ్గు అకర్మక క్రియగా నంజికమునకు తద్ధర్మార్థక విశేషణము. అప్పుడు
      మగ్గునంజికము లవుతుంది.
      విశేష్యముగా తీసుకున్న మగ్గి పోవుట , లేక మగ్గుడు అని అర్థము.
      అప్పుడు దీనిని కర్తగా ప్రయోగించ వచ్చును గాని అంజికమునకు విశేషణముగా వాడుట సమంజసము గా దనుకుంటాను.
      మగ్గిన యంజికము లనవచ్చును. పరిశీలించండి.

      తొలగించండి
    3. శంకరార్యా ! ధన్యవాదములు !
      కామేశ్వరరావు గారూ ధన్యవాదములు
      మీరు చెప్పేటి మ్రగ్గు కాదు
      మగ్గు = చెడు (ఆంధ్రభారతి నిఘంటువు)
      చెడ్డవైన కనులు అని నా భావన

      తొలగించండి
    4. వసంత కిశోర్ గారు ధన్య వాదములు.
      మగ్గు అ. క్రియ : చెడు (చెడును) ఇచ్చిన చెడు క్రియా పదమే. విశేష్య మైతే చెడుట.
      మగ్గు, మ్రగ్గు సమానార్థకములే.
      మగ్గు : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
      దే. అ.క్రి .
      ఉక్కచే చెమ్మగిల్లి చెడు.

      తొలగించండి
  9. ఆర్యా,
    డా.పిట్టా సవరించిన పూరణము
    నేటి భారత మానాటి నీతి నియమ
    *మన్నము*దమొంద*గం జి*ల్కు మాటలందె
    కృష్ణు*తోప*ని నని*జావ*రిట్టె కోటి
    దుష్టులుందురు;పాండవుల్ దొరుకరైరి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. డా.పిట్టానుండి
      ఆర్యా,ధన్యవాదాలు. ఈసమాసాలింత పొడవుగా రావడం ఆశ్చర్యకరము.అది తెలుగు కాదు సంస్కృతమే.

      తొలగించండి
  10. (అన్న! ము)దిత నిట్టు లవమాన పరచిన
    వాని (జావ) దన్ని వత్తు నిప్పు
    డనుమతించు మనియె ననిలజు డోర్వ(గం
    జి)రము చేతగాక చేవ (తోప).

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
  11. రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బావగం జిద్దు...' అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :

      అర్జునునితో శ్రీ కృష్ణపరమాత్మ:
      అన్న ముదమున సంధికై యాశపడఁగ
      బావగం జిద్దు నాపఁగ పలుచనైతి
      పార్థ! రణము సజావగు బంధము విడ
      నాదు గీతోపదేశమ్ము నాలకించు

      తొలగించండి
  12. రాయబారిగ వెళ్ళెడు కృష్ణునితో ద్రౌపతి మాటలుగా నూహించి

    అన్న, ముదము గాదది సంధి యనిన ఖలురు
    జావకున్ననే రీతి నే జడను ముడుతు
    నాగ్రహముతోపవనసుతు డాడిన శప
    థమ్ము తీరగం జినుడ పథమ్మె క్రుంగు

    రిప్లయితొలగించండి
  13. అగ్రజా వలదు వలదు యనుచు ఏల
    పల్కు చుంటివి , సంధికై పట్ట్టు బట్ట
    నేల, ఓలగం జిత్తుతో నిండు కొనగ
    యిప్పుడు హితోపదేశము లేల నయ్య ,
    వినుము, నీకన్న ముఖ్యులు వేరు లేరు
    జగతి లోన, రారాజును చంపి రుధిర
    ధారలను ద్రౌపది కేశ తావి నూనె
    గా యిడుదునని సభలోన గర్వ పడుచు
    ప్రతిన చేసితి, శఫదము భంగ పడిన
    బాధ నీకు వలదు, నీదు పంత మెపుడు
    నెగ్గ వలెనని భీముడు నింద లిడెను

    రిప్లయితొలగించండి
  14. యుద్ధము వలదు సంధి కావలెనని పల్కు ధర్మరాజును చూచి భీముడు పల్కు మాటలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యకుమార్ గారూ,
      మీ 'తేటగీతికా పూరణ' బాగున్నది. అభినందనలు.
      'వలదు+అనుచు' అన్నపుడు యడాగమం రాదు. "వలదటంచు నేల" అనండి. 'ఓలగం' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. 'కొనగ నిప్పుడు' అనండి. 'ద్రౌపదీ కేశ...' అనండి. లేకుంటే గణదోషం. 'నూనెగా నిడుదు' నని ఉండాలి.

      తొలగించండి
  15. రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ సూర్యకాంతితో దేదీప్యమానమయింది. అద్భుతంగా ఉంది. అభినందనలు. (నిజం చెప్పొద్దూ.. నిఘంటువు సాయం తీసుకోవాల్సివచ్చింది).

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి ప్రణామోత్తర ధన్యవాదములు.

      నేను గూడ అంజిష్ఠుఁడు (ఉ కారాంత పుం.) పదమును నిఘంటువు చూసి గ్రహించాను. “సమ్యగంజిష్ఠ్వాభ కాంతి కాంత” సమాసార్థమే తేటగీతిని నాశ్రయించాను.
      సాధారణముగా దత్తపద సందర్భములలో వీలైనంత చిన్న పద్యము నెన్ను కుంటాను.

      యాదృచ్ఛికము గా “తోఁప” సంకటి గాను తోఁచు / తోఁపు గాను బిందుయుతము. అన్యార్థమున కుపయోగ పడినది.

      తొలగించండి
    3. గురువుగారూ! ముదతను గని తోప ....?
      అర్ధం కాలేదు . వివరించ ప్రార్ధన'🙏🙏🙏🙏

      తొలగించండి
    4. డా. సీతా దేవి గారు “ముదితను” గా చదువ గోర్తాను. ముద్రణ దోషము. ధన్యవాదములు.
      తోఁచు నకు తోయు/ త్రోయు అని యర్థము గూడ కలదు.

      అన్న! ముదితను గని తోఁప నగునె సభకు
      నంత సమ్యగంజిష్ఠ్వాభ కాంతి కాంతఁ
      జావఁ దలతురె భీముఁ జేఁ జేవ దఱిఁగి
      కాన దైవోపహతులకుఁ గలదె దారి

      తొలగించండి
    5. సమ్యక్ + అంజిష్ఠు + ఆభ = సమ్యగంజిష్ఠ్వాభ

      తొలగించండి
    6. పూజ్యులు కామేశ్వరరావుగారికి ధన్యవాదములు! మీ శైలినందుకొనుట మాబోంట్లకసాధ్యము! 🙏🙏🙏

      తొలగించండి
  16. భోగంజిత్తుల మారిదౌను భువిలో పూర్వమ్ము తామెందరో
    సాగెన్ దీని ప్రజావళుల్ కనరె మోసమ్మారగా కౌరవుల్
    లాగెన్ రాజ్యము యన్నమున్ను కనులారంగ తానాడడే
    యోగంబియ్యది తోపదెద్ది యనుచున్ నోదార్చెతా పార్థడే
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం.
      'భోగం' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. 'రాజ్యము+అన్న' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. మూడవపాదంలో 'కనులారంగ' అన్నచోట గణదోషం. 'యనుచు న్నోదార్చె' అనండి. పార్థడే.. టైపాటు.

      తొలగించండి
  17. అన్న! మునుపేగి హరి బల్కె నెన్నొ, గాన
    మంచి మాటలతో పని మనకు లేదు
    నేరుగంజిష్ణు సాయము నేగి యనిని
    జావ గొట్టుట తప్పదు శత్రువులను

    నిన్నటి సమస్య కు న పూరణ

    ప్రభవు రాబడి గోరక, ప్రజల బ్రతుకె
    సేమకరమని భావించు నీమ మెరిగి
    యంగడుల నమ్ము మద్యము నాపగ దల
    చెడుపనియె సుమ్ము మద్యనిషేధ మిడుట

    రిప్లయితొలగించండి
  18. అన్న ముష్టిగ నైదూళ్ళ నడుగు మనగ
    రాయబారిగం జినుడు తా బోయె నిపుడు
    సంధి కుదిరిన జావరె శత్రుమూక
    యనుచు భీముని తోపల్కె నర్జునుండు.

    రిప్లయితొలగించండి
  19. అన్న ముష్టిగ నైదూళ్ళ నడుగు మనగ
    రాయబారిగం జినుడు తా బోయె నిపుడు
    సంధి కుదిరిన జావరె శత్రుమూక
    యనుచు భీముని తోపల్కె నర్జునుండు.

    రిప్లయితొలగించండి
  20. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అపుడు పేరోలగంజిక్కి యన్నెమైన
    సంగతెంచి ఫల్గునుడట సంగరమున
    విల్లుతో పరిఘములంపి పెఱల జావ
    మోదె వేగిరమున యన్న ముదము నొంద

    రిప్లయితొలగించండి
  21. డా.పిట్టానుండి
    ఆర్యా,గరికిపాటివారి పూరణ పాఠం లోగడ మీరిచ్చారు.నిజంగా"అవధాన రాక్షసుడన్నారంటే అనరుమరి!

    రిప్లయితొలగించండి
  22. అన్నముఖంబు జూచి వెరగందుచు భీత హిడింబి "నాకు జా
    వన్న భయమ్ములేదు.మనసంతయు సత్వుడు భీము పైన పో
    తున్నది పత్నిగా నతనితో పయనించెద"నంచు పల్కుగం
    జిన్నది మాటలన్ సరకు సేయక యుద్ధము సేసె భీముతోన్

    రిప్లయితొలగించండి
  23. అన్న! ముడువని నాకురుల్ చిన్నవోయె
    దుస్ససేను డాజిని జావ దుఃఖ మడగు
    కౌరవాళి భోగము కాగ గంజిగుల్ల
    పోరునే తోపనీ రాయబారవేళ.

    రిప్లయితొలగించండి
  24. అన్న! మూర్ఖదుశ్శాసను హతముచేసి
    ముదముతో పత్ని కేశముల్ ముడియొనర్చి
    నప్పుడనిఁ బ్రజావర్గము హర్షమొంద
    దృఢముగం జింపుసేసెద ద్వేషిమూక

    రిప్లయితొలగించండి
  25. [7/12, 9:13 AM] Dr Umadevi B: 9493846984  డా.బల్లూరి ఉమాదేవి.


    అన్నమురిపము తోడను నంపి నంత

    జావ గొట్టి వచ్చెద జరాసంధు ననుచు

    శీఘ్రమే వాని రెండుగంజింపుదునని

    వచ్చె శౌరి,ఫల్గుణులతో పవనసుతుడు.


    ఆ .వె:అన్న ముందు వలువ లందించి మానము

           కాచి తివలనాడు కనలి జావ

           లేక బ్రతుకు చున్న లేమగంజింతించ

             కృష్ణుతో పలికెను కృష్ణ తాను.


    ఆ.వె:అన్నముందుగ మారాడ నట్టి కవలు

           జావగొట్టిరి సమరాన సైనికులను

             ద్రౌపది వెలుగంజిమ్మ ధరనుతించి

              ముదముతో పల్కె నకులుతో ముదిత తాను.

    రిప్లయితొలగించండి


  26. అన్నముద్దుగ పెంచిన యనుగు సుతుడు
    నాహవమునందు జావగ నడలె మనము
    హంతకుని గంజికాల్విర్చి యార్తి బాపు
    మనుచు కృష్ణుతో పల్కెనా యనుజ తాను.

    రిప్లయితొలగించండి