3, జులై 2017, సోమవారం

సమస్య - 2401 (కట్లపాము చేరి...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కట్లపాము చేరి కౌగిలించె"
(లేదా...)
"స్థిరమతిఁ గట్లపాము దరిఁ జేరి ముదమ్మునఁ గౌగిలించెరా"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం సీతాదేవి గారికి ధన్యవాదాలు.

66 కామెంట్‌లు:

  1. పొట్లపాడు లోన కట్లపామొకరాత్రి
    చినుకులందు తడిసి శివశివయని
    శిధిలమైన గుడిని శివ లింగమునుచూసి
    కట్లపాము చేరి కౌగలించె

    రిప్లయితొలగించండి
  2. మోడి మంత్ర మనుచు ముమ్మర మ్ముగనట
    దేశ మందు నంత తెచ్చి నట్టి
    యా జియెస్టి యిపుడు వ్యాపార వర్గ యి
    క్కట్లపాము చేరి కౌగిలించె
    (GST)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. శంకర తనయుండు శలభమ్మురీతిగ
    నుగ్రవాదకీల నురికెనేడు
    పరమతమది దలచి పంచదారచిలక
    కట్లపాము జేరి కౌగలించె!

    ఇటీవల సుబ్రహ్మణ్యం యనే యువకుడు మతం మార్చుకుని ఉగ్రవాదిగా మారడాన్ని దృష్టిలో బెట్టుకుని వ్రాసినది!

    రిప్లయితొలగించండి
  4. శివుని పూజ జేసి శీవము తరియించె
    హస్తి నీరు జల్లి ప్రస్తు తించె
    భక్తి ముఖ్య మంట భగవంతు కొనియాడ
    కట్ల పాము చేరి కౌగి లించె

    రిప్లయితొలగించండి
  5. "చిచిండ సర్ప భ్రాంతి"

    కందుకూరు లోన కన్నియతో గూడి
    చెట్టు క్రింద జేరి చిన్న వాడు
    పొట్ల కాయ జూపి పోకిరి యరవంగ:
    "కట్ల పాము!"; చేరి కౌగిలించె

    రిప్లయితొలగించండి
  6. అస్త్రవిద్యలన్ని యలవోకగనేర్చి
    దానగుణము చేత ధన్యుడయ్యు
    నాప్తమిత్రులంచు నధముల సరిగాసి
    కట్లపాము జేరి కౌగలించె!

    రిప్లయితొలగించండి
  7. భక్తి తోడ కొలిచె భక్తుడు కన్నప్ప ,
    విందు పురుగు శివుని పొందు చేరె ,
    భూత పతిని కొలిచె భూజంతువు, శివుని
    కట్లపాము చేరి కౌగిలించె"

    రిప్లయితొలగించండి
  8. అధికడబ్బుగోరి నధికారి యొక్కడు
    విలువలేవిలేక వేలకోట్లు
    కూడబెట్టి తుదకు కీడుకలుగ నోట్ల
    కట్లపాము చేరికౌగిలించె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అధిక డబ్బు' దుష్టసమాసం. "అధిక ధనము గోరి యధికారి..." అనండి.

      తొలగించండి
  9. అరచె భీతి తోడ నడవిలో కనిపించ
    కట్లపాము, చేరి కౌగిలించె
    పరుగున జనకుండు భయమేల నీకింక
    యండ యుంటినంచు నభయ మిచ్చె

    రిప్లయితొలగించండి
  10. డా.పిట్టా
    పేదరికములోన బెనగగ నప్సర
    కైన చక్కదనము గాంచలేరు
    దేహమెల్ల పొడలు, దీప్తిని గప్ప ని
    క్కట్ల పాము జేరి కౌగిలించె!

    రిప్లయితొలగించండి
  11. డా.పిట్టా
    వరుడెవ డెక్కడో యనుచు వైనముగా వెదకంగ గన్య న
    స్థిరమతి గట్లపాము దరిజేరి ముదమ్మున గౌగిలించెరా!
    భరమగు ,శ్యామదేహిని సబాంధవు లొల్లరు రంగుభేద మే
    ర్పరచిన జన్మ కష్టముల గ్రాలదె కృష్ణునిగన్న భూమిపైన్?!0
    (కట్లపాము పొడలు శరీరమంతటా వ్యాపిస్తాయి.పిల్ల తెల్లదనపు వివక్ష, గోరుచుట్టు పై రోకలి పోటు వలె దాపురించిందీ కృష్ణ జన్మభూమిపై.)

    రిప్లయితొలగించండి
  12. అరయ నొక్కనాడు వరిచేని గట్టుపై
    సర్ప మొకటి చలికి సతమత మయి
    వణుకు చుండ జూచి వచ్చుచుంటి నటంచు
    కట్లపాము చేరి కౌగిలించె.

    అరయగ నొక్కనాటి యుదయంబున పంటకు నీరు పెట్టగా
    వరిపొల మేగె నొక్కరుడు వానికి నచ్చట గోచరించె నా
    యురగము కామబాణముల నుగ్రముగా తపియించు చుండినన్
    స్థిరమతిఁ గట్లపాము దరిఁ జేరి ముదమ్మునఁ గౌగిలించెరా.


    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  13. శక్తిమంతుడయ్యు సహనశీలుడగుచు
    సత్యవాక్కునందు శ్రద్ధబూని
    సతిని విక్రయించె సంతలోనకట యి
    క్కట్లపాము జేరి కౌగలించె!

    రిప్లయితొలగించండి
  14. ధరణిన సాటిలేని ఘన దానగుణోత్తముడైన కర్ణుడే
    కురుకులనాథపుత్రుడగు కుచ్ఛితుడైన సుయోధనాధమున్
    సరసన జేరుటన్ గనిన సత్పురుషుల్ వచియింతురేమనన్
    స్థిరమతిఁ గట్లపాము దరిజేరిముదమ్మున గౌగిలించెరా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ధరణిని' అనండి.

      తొలగించండి
  15. మాయఁ జేయు శకుని శ్రేయోభిలాషిగ
    న్నస్సుయోధనుండు నాదరించ
    మదిని రగులు కసిని యదిమి పట్టి పగతోఁ
    గట్లపాము చేరి కౌగిలించె

    రిప్లయితొలగించండి
  16. తానుజూడనొకడు దైవోపహతుడేను
    గ్రహపు పీడ పట్టి వదలదాయె
    నేనునేస్తమనుచు నిట్టులే పలు యి
    క్కట్లపాము చేరి కౌగిలించె

    రిప్లయితొలగించండి
  17. కందిచేను కెలను గట్టుపై తాగాంచి
    కట్లపాము, చేరి కౌగిలించె
    నత్త ముద్దులసుత యదురుగుండియతోడ
    బొమ్మయంచుఁ దెల్ప క్రమ్మెసిగ్గు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ రెడ్డి గారూ,
      విరుపుతో మీ పూరణ సరసంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.

      తొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.

    చెలునితో వనమున కలిసియుండగ
    గాంచి
    కట్ల పాము , చేరి కౌగిలించె

    భయమున చెలికాని; వలదు చెలియ
    నీకు
    వెఱపనుచును ప్రియుడు వెన్ను తట్టె.

    *****************************

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగేశ్వర రావు గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  19. నిగనిగ మెఱయంగ నిగ్గారు మేనితోఁ
    జకచకఁ బరువెత్తి సాగి సాగి
    నీరుకట్టె పాము నీటఁ గాంచి తివిరి
    కట్లపాము చేరి కౌగిలించె


    పరవశ మంది యాటలను బాటల నింపుగ నుండ నద్దరిం
    దరుణి యొకింత దూరమునఁ దక్షకుఁ బోని భుజంగముం గనెం
    గరము భయమ్మునన్ వణఁకు కాంతను బేరిమి నూఱడించఁ దా
    స్థిరమతిఁ గట్లపాము దరిఁ జేరి ముదమ్మునఁ గౌగిలించెరా

    [పాము దరి = పాము కల యొడ్డు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి ప్రణామోత్తర ధన్యవాదములు.

      తొలగించండి
  20. రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో '...బగను నోపి...' అనండి. లేదంటే గణదోషం.
      (కౌరవులపై పగబట్టి శకుని వారి నాశనానికి కారకుడైన కథ వ్యాస భారతంలో లేనట్టుంది).

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు.టైపాట్ల సవరణతో :

      చెరనిడి కౌరవాధములు చేర్చఁగ నొక్కడి భోజనంబు సో
      దరులట త్యాగులై శకుని తైజసమందఁగ పంచియిచ్చిన
      న్నురకలు వేయుచున్ బగల నోపి సుయోధను, స్వార్థ భావనన్
      స్థిరమతిఁ గట్లపాము దరిఁ జేరి ముదమ్మునఁ గౌగిలించెరా!

      (గురుదేవులకు చిత్రసీమననుకరించాను)

      తొలగించండి
  21. మరణమునొంద తమ్ములును మాన్యుడు తండ్రియు ఖైదులోపలన్
    కురుకులనాశమున్ శకుని గోరుచు చేరెను వారిపక్షమున్
    స్థిరమతిఁ గట్లపాము దరిఁ జేరి ముదమ్మునఁ గౌగిలించెరా
    జరుగును కౌరవాన్వయ విషాదమటంచు తలంచ నెల్లరున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      (పైన సహదేవుడు గారికి ఇచ్చిన సందేశాన్ని గమనించండి).

      తొలగించండి
  22. శంకరార్యుల సలహాను సాదరముగ
    నొప్పు కొనుచును నిత్తును దప్ప కమరి
    వలయు సొమ్మును నావంతు పంపుడా ర్య !
    "బ్యాంకు అక్కౌంటు " నెంబరు మఱువ కుండ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      సమస్యలు, పూరణల సేకరణ ఇప్పుడే ప్రారంభించాను. మొత్తం పుస్తకం పూర్తయ్యాక చూద్దాం. తొందర లేదు.

      తొలగించండి
  23. బీద,సాధువులకు ఆదరణ టమోట
    అందబోనిధరల మందమందు
    కట్లపాముజేరి కౌగిలించెననగ|
    పచ్చిమిరప ధరలుపట్టుకొనెను|

    రిప్లయితొలగించండి
  24. *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    *కనగ నందమైన కన్యకన్ కాపాడె*
    *యుక్తిగ వనమందు యువకుడట్లు*
    *భయముగొల్పనతనిప్రక్కన చచ్చిన*
    *కట్ల పాము జేరి కౌగిలించె!*

    *శ్రీమతి జి సందిత బెంగుళూరు*

    రిప్లయితొలగించండి
  25. పాము బట్టు నతడు భయమను నదిలేక
    కట్ల పాము చేరి కౌగి లించె
    నవ్వి యేక దమరి యాదు కొనుచు నుండి
    భుక్తి గలుగ జేయు భువన !తెలియు

    రిప్లయితొలగించండి
  26. అటక మీద కెక్కి యరిసెల పాత్రను
    తీయుచుండు వేళ తేలు కుట్టి
    బాధపడుచు నుండ బాలయ్య చెంతకు
    కట్లపాము చేరి కౌగి లించె.

    హ.వేం.స.నా. మూర్తి

    రిప్లయితొలగించండి
  27. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  28. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  29. ఖాండవదహనమున కాలిన తక్షక
    కట్లపాముచేరి కౌగిలించె
    కర్ణు విశిఖమందు కక్షతోనర్జుని
    చంపబూని తానె సమసి పోయె.

    రిప్లయితొలగించండి
  30. వరమిది నన్ను రమ్మనెను వాంఛితము న్నెరవేర్చ మాలినీ
    వరసురగాత్రి పోదు నని వాలగ సూర్యుడు కీచకుండు తా
    నరిగెను నృత్యశాల కబలాకృతినిన్ గనినంత మోహియై
    స్థిరమతిఁ గట్లపాము దరిఁ జేరి ముదమ్మునఁ గౌగిలించెరా.

    రిప్లయితొలగించండి
  31. చెట్ల పాదులోన పొట్ల తీగను నేడు
    కట్లపాము జేరి కౌగలించె
    చాల భయము నాకు సర్పమంటె నిప్ఫు
    డెట్లు కోయగలను పొట్లకాయ


    రిప్లయితొలగించండి
  32. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వెనుక గుమ్మ మందు కనుపించె కదలుచు
    కట్లపాము; చేరి కౌగలించె
    తనయ భయము తోడ దాపునున్న పితను
    పాము యన శిశువుకు పంతు గాదె?





    రిప్లయితొలగించండి
  33. సర్పయాగ మందు చల్లగ ప్రాకుచు
    సన్నికల్లు జూసి సంతసించి
    చుట్ట చుట్టి చుట్టి కట్టుదిట్ట మనుచు
    కట్లపాము చేరి కౌగిలించె

    రిప్లయితొలగించండి
  34. వాసుకి మొదలైన పాములవన్నియు
    యాభరణము లయ్యె హరునకచట
    నాయఘమ్మదేమొ ననుచునా లింగమున్
    కట్లపాము చేరి కౌగిలించె.


    వ్యాఘ్రమచట రాగ భయముతో వృక్షమున్
    కట్లపాము చేరి కౌగిలించె
    తీవెయేమొ యనుచు తిరుగ నాశార్దూల
    మపుడు సంతసించె నహియు మదిని.

    రిప్లయితొలగించండి
  35. మల్లె పూలతీగలల్లిన మ్రానును
    కట్లపాము జేరి కౌగిలించె
    పరిమళంబటన్న బహు ప్రీతి ఫణులకు
    నేటి మీ సమస్య చాటె నిజము

    రిప్లయితొలగించండి
  36. భామ రూపు దాల్చి భీముడు నర్తన...
    శాల యందు పుష్ప శయ్యనుండ
    సింహబలుడు వచ్చి చేతుల బంధించి
    కట్లపాము చేరి కౌగిలించె !!



    కరవగ లేదు దంతముల , కన్నులఁ జూడగ లేదు , నేలపై
    జర జర పాకలేదది , విసమ్మును గ్రక్కగ లేదు , జూడ న...
    చ్చెరువగు ! సాజమౌనటుల చిత్రము గీచిన యట్టులుండ , న...
    స్థిరమతిఁ గట్లపాము దరిఁ జేరి ముదమ్మునఁ గౌగిలించెరా !!

    రిప్లయితొలగించండి
  37. వాసుకి మొదలైన పాములవన్నియు
    యాభరణము లయ్యె హరునకచట
    నాయఘమ్మదేమొ ననుచునా లింగమున్
    కట్లపాము చేరి కౌగిలించె.


    వ్యాఘ్రమచట రాగ భయముతో వృక్షమున్
    కట్లపాము చేరి కౌగిలించె
    తీవెయేమొ యనుచు తిరుగ నాశార్దూల
    మపుడు సంతసించె నహియు మదిని.

    రిప్లయితొలగించండి
  38. నాగుల చవితీదినానభక్తాళి చే
    పుట్టలోన పాలు పోయగా ను
    పుట్టలోని త్రాచుపూజ చేయంగ నే
    కట్లపాము చేరి కౌగిలించె

    రిప్లయితొలగించండి
  39. ధరనొక వీధి వోటరులు దండము నెత్తుచు కొట్టబోవగా
    స్థిరమతిఁ గట్లపాము దరిఁ జేరి ముదమ్మునఁ గౌగిలించెరా
    పరుగిడి శంభు లింగమును పాపులు కాపులు విస్తుపోవగా;...
    ...కరచెడి కోరలూడెనట గట్టిక కొర్కగ చంద్రబాబునున్...

    రిప్లయితొలగించండి