1, ఆగస్టు 2017, మంగళవారం

సమస్య - 2426 (కాంతకై తపింతురు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కాంతకై తపింతురు వార్ధకమున మిగుల"

78 కామెంట్‌లు:

  1. సన్మతులయిన వారును జన్మసార్థ
    కతను పొందుటకై హరి కథల వినుచు
    సకల తీర్థంబులవెనుక జనుచు ముక్తి
    కాంతకై తపింతురు వార్ధకమున మిగుల

    రిప్లయితొలగించండి
  2. అర్థజన్మము వ్యర్థంబు నర్థమునకు
    వ్యర్థమగు కామమునకు జన్మార్థమింక
    ధర్మమునకు కలదె మరి తావు? మోక్ష
    కాంతకై తపింతురు వార్ధకమున మిగుల

    రిప్లయితొలగించండి
  3. "బాలస్తావత్ క్రీడాసక్తః
    తరుణస్తావత్ తరుణీ సక్తః |
    వృద్ధస్తావత్ చింతాసక్తః
    పరే బ్రహ్మణి కోపి నసక్తః ||"


    బాల్యమందు కోరెదరొహొ బంతి యాట
    యుక్త వయసున కోరగ యవతి పొందు
    చింత లెన్నియొ చీకాకు చేయ; మోక్ష
    కాంతకై తపింతురు వార్ధకమున మిగుల!

    రిప్లయితొలగించండి
  4. కాలచక్రము వైళమె కదలిపోగ
    దేహ మెంతమాత్రమును స్వాధీనపడక
    నిత్యపరిచర్య యొనరించు నిపుణ యైన
    కాంతకై తపింతురు వార్ధకమున మిగుల.

    రిప్లయితొలగించండి
  5. బాల్య మందున కొంతయు పడుచు వయసు
    నందు కొంతయు బాధ్యత లనుచు కొంత
    కాల మంతయు కరుగగ కడకు ముక్తి
    కాంతకై తపింతురు వార్ధకమున మిగుల

    రిప్లయితొలగించండి
  6. బాల్యమందు వాక్కాంతా కృపా ర్థ సిద్ధి
    యౌవనమ్మున కాంతా సమాగమమ్ము
    కోరు మనుజులె పరమాత్ము జేర, మోక్ష
    కాంతకై తపింతురు వార్ధకమున మిగుల

    రిప్లయితొలగించండి
  7. కనులు మూసి తెరువంగ కరిగి పోవు
    ఆశ చావక బ్రతుకుపై క్లేశ పడుచు
    తిరిగి రానట్టి యవ్వన తేరు సొగసు
    కాంతకై తపింతురు వార్ధకమున మిగుల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. "మూసి తెరువగనె" అనండి.

      తొలగించండి
    2. కనులు మూసి తెరువగనె కరిగి పోవు
      ఆశ చావక బ్రతుకుపై క్లేశ పడుచు
      తిరిగి రానట్టి యవ్వన తేరు సొగసు
      కాంతకై తపింతురు వార్ధకమున మిగుల

      తొలగించండి
  8. రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఖండూతి' కాదు... అది 'కండూతి"

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ:

      కొందఱు మహాశయుల కీర్తి కండూతి:

      మొన్న విద్యార్థిగా 'నేనె' మొదటి వాడ!
      నిన్న యవ్వనమ్మున 'నాదె' నేర్పు జూడ!
      కొలువు నందున మెచ్చ 'నే' గొప్ప వాడ!
      పదవి విరమించు రోజున బ్రహ్మరథమె!
      ఘనుడ! నడుగిడ ప్రతిచోట ననుచు కీర్తి
      కాంతకై తపింతురు వార్ధకమున మిగుల!

      తొలగించండి
  9. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    ఎవరికి తెలియదులే యువకుల సంగతి---

    ముందు తీగ లేకుంటే పందిరితో పని ఉందా
    పునాదులే లేకుంటే భువిని గోడ ఉంటుందా
    తరుణు లసలు లేకుంటే పురుషుల పని గోవిందా
    గోవిందా గోవింద

    ఎవరికి తెలియదులే యువకుల సంగతి---
    అన్నారుగా " దాశరథి "

    01)
    ____________________________

    బాల్యమందున తానె - పాలిచ్చి పోషించు
    బొమ్మ రూపమె గదా - యమ్మ తోడు
    బుడి బుడి యడుగుల - బడకుండ గాపాడు
    తామసి రూపమే - తల్లి తోడు
    యుక్త వయసు నందు - యుక్తిమై రక్షించు
    దుర్గయై నిలిచెడు - తోడె తోడు
    మగవాని మనసున - మాధుర్యమును నింపు
    మగనాలిగా మారు - మగువ తోడు

    శక్తి రూపిణి స్త్రీ లేక - శక్తి లేదు
    శక్తి రూపిణి స్త్రీ లేక - జవము లేదు
    శక్తి రూపిణి స్త్రీ లేక - శాంతి లేదు
    శక్తి రూపిణి స్త్రీ లేక - రక్తి లేదు

    శక్తి రూపిణి స్త్రీ లేక - భక్తి లేదు
    శక్తి రూపిణి స్త్రీ లేక - ముక్తి లేదు
    మగువ లేనిదె మగవారు - మసల లేక
    సకియకై తపింతురు గాదె - సకల గతుల
    కాంతకై తపింతురు వార్ధ - కమున మిగుల !
    ఇదియె ప్రకృతి ధర్మమ్ము ! కా- దేమి వింత !
    ____________________________
    తోడు = సహాయము(ఆసరా)
    తోడు = సోదరి(తోడబుట్టినది)
    మసలు = మను
    సకల గతుల = సర్వావస్థలందున

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వసంత కిశోర్ గారూ, మనోహరమైన పూరణ. అభినందనలు. (మరి.. ఏకాంత మనే కాంతను కోరుకొని నిజకాంతను వదలి వృద్ధాశ్రమంలో ఉన్న నా సంగతి?)

      తొలగించండి
    2. శంకరార్యా ! ధన్యవాదములు !
      మీరు ముక్తి కాంతనో, మోక్షకాంతనో పట్టాలను కొంటున్నట్టుంది !
      ఏ కాంతన్ పడతారో మరి ???

      తొలగించండి
  10. తల్లియే గద సర్వమ్ము తనయు లకును
    బాల్యమందు, విడువరైరి భార్యధ్యాస
    జవ్వనమున, క్షీణింపగన్ శక్తి, మొక్ష
    కాంతకై తపింతురు వార్థకమున మిగుల.

    రిప్లయితొలగించండి
  11. పాప భీతియె లేకుండ బ్రాయమంత
    కాంతయు కనకముల బొంద గడిపి తుదకు
    శక్తి యుడగ బెరుగు మెండు భక్తి, మోక్ష
    కాంతకై తపింతురువార్ధకమున మిగుల

    రిప్లయితొలగించండి
  12. తల్లిదండ్రులు వృద్ధులై తనయునకును
    వధువు లభియించ కునికి నవ్వాని నెప్పు
    డింటి వానిని జేతుమో యిక నటంచు
    కాంతకై తపింతురు వార్ధకమున మిగుల.
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
  13. దాచి పెట్టిన సంపదన్ దోచు కొనెడు
    వారసులకె తానిక కడు భారమైన
    వేళ, ప్రేమతో తనని సేవించు తనదు
    కాంతకై తపింతురు వార్థకమున మిగుల.

    రిప్లయితొలగించండి


  14. ఎంత వారలైన జిలేబి యీడు నందు
    కాంతకై తపింతురు, వార్ధకమున మిగుల
    వింతగానగుపించును విషయ మెల్ల
    కొంత కాలపు సరదాలు కోతి పుండు :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  15. రెక్క లొచ్చిన పిల్లలు దిక్కులకును
    కన్నవారిని వీడుచు కదలిపోవ
    కన్నతల్లి వలెతనను కనుగొను కుల
    కాంతకై తపింతురు వార్ధకమున మిగుల!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఒచ్చిన' అనడం సాధువు కాదు. "రెక్కలే వచ్చి పిల్లలు..." అనండి.

      తొలగించండి
  16. ………………………………………………
    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    అతని కన్న ము౦దే పాప మతని పత్ని

    చనియె | పక్షవాతమున మ౦చాన బడియె |

    త్రోసి రోసిరి కోడళ్ళు దూషణముల |

    నట్టి హీనపరిస్థితి య౦దు , మృత్యు

    కా౦తకై తపి౦తురు వార్ధకమున మిగుల |
    ి
    పాప ఫలము తీరువరకు వలచ దామె !

    దీర్ఘ రోగికి మృత్యువే దేవత యగు
    ి

    రిప్లయితొలగించండి
  17. పరుల మేలును గోరు టే భాగ్య మనుచు
    భక్తి భావ న హెచ్చగా భవుని గొలిచి
    పుణ్య కార్యము లొ న రి oచిపొందు ముక్తి
    కాంత కై తపింతు రు వార్థ క ము న మి గు ల

    రిప్లయితొలగించండి
  18. కార్యసాధన మందున కర్మచారి
    మంచి పనులు జేయించగ మంత్రియగును
    కమ్మని యశనమిడగను నమ్మయేగ
    పడకటింట నెపుడుదా పంకజాక్షి
    ముదిమి మంచమునబడగ ముదిత పుడమి
    యెల్లవేళల తోడుగ నింతియమర
    కాంతకై తపింతురు వార్ధకమున మిగుల!

    రిప్లయితొలగించండి
  19. కాంతకై త పింతురు వార్ధకమున మిగుల
    యక్షరాల ని జముసామి !యామె లేని
    యిల్లు కాంతివిహీనమై యుల్లమునకు
    బాధ కలిగించు దప్పక భవ్య చరిత !


    రిప్లయితొలగించండి
  20. పరుల మేలు ను కో రు టే భాగ్య మనుచు
    భక్తి భావన హెచ్చగా భవుని గొలిచి
    పుణ్య కార్య ము లొ న రి oచిపొందు ముక్తి
    కాంత కై త పి oతురు వార్థ క ము న మిగుల

    రిప్లయితొలగించండి
  21. విచ్చలవిడిగాతిరుగుచు వేశ్యలిచ్చు
    సుఖము నిత్యమని తలచి సొక్కువారు
    ధనము నపహరించి తుదకు తరిమివేయగ నిజ
    కాంతకై తపింతురు వార్ధకమున మిగుల

    రిప్లయితొలగించండి
  22. శ్రీమతి జి సందిత బెంగుళూరు


    1, ఆగస్టు 2017, మంగళవారం

    సమస్య - (కాంతకై తపింతురు...)


    పాలకై లాలనంబుకై పసితనమున
    జయముకైవృద్ధి సుఖముకై జవ్వనమున
    సంతుకైమధ్యవయసున జనులు ముక్తి
    "కాంతకై తపింతురు వార్ధకమున మిగుల"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సందిత గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జయమునకై, సుఖమునకై' అనడం సాధువు. కొందరు 'జయముకై, సుఖముకై' అనవచ్చునని ప్రౌఢ వ్యాకరణంలోని సూత్రం చెప్తారు. కాని అది అనుసరణీయం కాదు.

      తొలగించండి
  23. సతత మనురాగ మతులైన సతుల బొంది
    హాయిగా కాలమును గడ్పినట్టి వారు
    మనములోనను దలచియు మడసి నట్టి
    కాంతకై తపింతురు వార్ధకమున మిగుల

    రిప్లయితొలగించండి

  24. 1.మునులు యోగులు భువిలోన ముదము తోడ

    తపములు  వ్రతముల    జతకు  జపము చేసి

    అన్న పానాదులను విడి యమల ముక్తి

    కాంతకై తపింతురు వార్ధకమున మిగుల.



    2పసివయసునందు క్రీడల పైన మోజు

    పడుచు ప్రాయము నందున భామ మోజు

    నడి వయసు మీర వాంఛలు విడిచి మోక్ష

    కాంతకై తపింతురు వార్ధకమున మిగుల!.



    3.వయసు పైబడిన విడక వాంఛలనిట

    కాంతకై తపింతురు వార్ధకమున మిగుల

    ననుచు వానప్రస్థమునకై యవనియందు

    సాగు చుందురు సతతమ్ము సంతసాన.

    రిప్లయితొలగించండి
  25. బాల్యమందున అమ్మసౌభాగ్య గరిమ|
    యవ్వనంబున భార్య నీకర్ధమవగ|
    యెంచ కౌమార దశలందు నిత్యసుఖము
    పంచగలిగిన పరమార్థ ప్రతి నిధనుచు
    కాంతకై తపింతురు వార్ధకమున మిగుల.
    2.అవని,అమ్మ,ఆలియులేక ఆయువేది?
    శక్తి నాసక్తి యుక్తికిరక్తియేది?
    లక్ష్మిలక్ష్యాలు లేకున్న లాభమేది?
    వాణి వాగ్దాటి నొసగక బ్రతుకదగున?
    మగని జీవన సరళియే మగువగాన
    కాంతకై తపింతురు వార్ధకమున మిగుల.




    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "నీకర్థ మవగ। నెంచ.. ప్రతినిధి యని" అనండి.
      పద్యం మధ్య అచ్చులు రాకుండా చూడండి.

      తొలగించండి
  26. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు … ధన్యవాదాలు … మన తెలుగువారికోసం ఇలాంటి మంచి వెబ్సైటు నడుపుతున్నందుకు ధన్యవాదాలు .

    ప్రపంచలో తెలుగు వారందరికోసం ఫేస్బుక్ లాంటి సోషల్ నెట్వర్క్ కూడా వచ్చేసింది . ఈ మంచి సమాచారాన్ని మన తెలుగు ప్రజలందరికి చేరవేయండి …
    http://www.telugos.com ( ప్రపంచంలోని తెలుగు వారి సోషల్ నెట్వర్క్ )
    తెలుగోస్ ఆండ్రాయిడ్ app playstore నుండి ఇన్స్టాల్ చేసుకోండి – https://goo.gl/3gy6Db

    రిప్లయితొలగించండి
  27. పడుచు వయసున్న వార లే వాంఛ దీర్చు
    కాంత కై తపింతు రు ;వార్థ క ము న మిగుల
    దైవ చింతన ఆధ్యాత్మధార్మిక త యు
    గలిగి మోక్ష ము న్ గోరఁ రే కాంక్ష తో డ

    రిప్లయితొలగించండి
  28. అకట ప్రాయమ్ము మెలమెల్ల నంతరింప
    పలుకరించును ముదిమి శాపమ్ము లిడుచు
    చెలిమి సేయంగ నేతెంచు చెలియ ముక్తి
    కాంతకై తపింతురు వార్థకమున మిగుల
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  29. అమ్మ ప్రేమను తలపించి యన్నమిడుచు
    నటన గానని ప్రియ భాషణముల కూడి
    పతికి చేదోడు నిచ్చుచు వరలెడి నిజ
    కాంతకై తపింతురు వార్ధకమున మిగుల!

    రిప్లయితొలగించండి
  30. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కీర్తి కాంక్షను గూడుచు కెలయు చుండి
    సతిని సంతుని చక్కగ సాక నెంచి
    ప్రాయమున వేసరిల్లిన వారు మోక్ష
    కాంతకై తపింతురు వార్థకమున




    రిప్లయితొలగించండి

  31. పిన్నక నాగేశ్వరరావు.

    బాల్యమందున,కౌమార ప్రాయమందు

    తల్లి యాసరా యుండుట తప్పని సరి

    యవ్వనంబున భార్యయే యండనుండు

    చరమ దశకుచేరు సమయమరసి ముక్తి

    కాంతకై తపింతురు వార్ధకమున
    మిగుల.
    ***************************

    రిప్లయితొలగించండి
  32. గురువు గారికి వoదనములు.
    బాల్య కౌమార యవ్వన ప్రాయ మoదు
    నిత్య సుఖమును బొoదురు నీతి తోడ
    కాల గమనమున మనిషి కరణ ధర్మ
    కాoత కై తపిoతురు వారధకమున మిగుల
    R d h a తె లు గు లో టైపు చేయుట రాలేదు.
    పూరణ ను స వ రిoచ మనవి.
    విధేయుడు
    పoచరత్నం వెoకట నారాయణ రావు.

    రిప్లయితొలగించండి
  33. ఆట పాటలఁ దేల బాల్యమున మిగుల
    భారపుఁ జదువు లందుఁ గౌమార ముండ
    వఱల సంసార మందు యౌవనము ముక్తి
    కాంతకై తపింతురు వార్ధకమున మిగుల

    రిప్లయితొలగించండి
  34. తరుణిమన తోడు యొక కాంత తనువునకును
    ముదిమి నందు నా కాంతయె మదికి దోడు
    కాంత లేకున్న నేకాంత గతిన మోక్ష
    కాంతకై తపింతురు వార్ధకమున మిగుల

    రిప్లయితొలగించండి
  35. యవ్వనమ్మున గోరుచు జవ్వని సతి
    న్నరులు సంసార సంద్రము నావ నీది
    ప్రవచనములను విన పాట్లు పడుచు ముక్తి
    కాంతకై తపింతురు వార్ధకమున మిగుల

    నిన్నటి సమస్యకు నా పూరణ

    కేంద్రము కర్ణసౌధమయి కీడొనరించిన వేల్పు యెవ్వడో
    సాంద్రము నందు రక్కసుల జంపుచు రాముడు జేసె నెద్దియో
    ఇంద్రకుమార పక్షమయి యెవ్వడు యేమని బల్కు నాజిలో
    నింద్రుఁడు సీతకై ధనువు నెత్తెను శల్యుఁడు మేలుమే లనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ చివరి అక్షరం గురువై గణదోషం.
      రెండవ పూరణలో "వేలు పెవ్వడో" అనండి. అక్కడ యడాగమం రాదు.

      తొలగించండి
  36. 1.వలచి,వలపించుకొన పరువమున జనులు
    కా౦తకై తపింతురు.వార్ధకమున మిగుల
    తోడు లేకున్న నొంటరి దుర్బలులకు
    కాంత లేకున్న జీవిక కష్ట మగును
    2.వార్ధకము లేని వేల్పులే భార్య కొఱకు
    శోకతప్తులై వెఱ్ఱులై ప్రాకులాడ
    మర్త్యుడౌ మానవు౦డు సమధికముగను
    కా౦తకై తపింతురు వార్ధకమున మిగుల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  37. మరొక పూరణ .దయచేసి తప్పులను తెలుపుము.
    అమ్మ తనమును నివ్వని నతివ భార్య
    యైన మగడిపా ట్లన్నియున్ యెవరి కొరకు?
    ఇoదు వదన మోహపు నిoడు భోగ
    కాoతకై తపిoతురు వార్ధకమున మిగుల
    విధేయుడు
    వేoకటనారాయణ రావు.

    రిప్లయితొలగించండి
  38. కష్టసుఖముల వడబోసి కడలి నీది
    బ్రతుకు చక్రాల జతగూడి బండి లాగి
    నొంటరిని జేసి దివికేగ నోపలేక
    గతము గురుతుల కలతలోన తనదు నిజ
    కాంతకై తపింతురు వార్ధకమున మిగుల!

    రిప్లయితొలగించండి