4, ఆగస్టు 2017, శుక్రవారం

న్యస్తాక్షరి - 45 (శు-క్ర-వా-రం)


అంశము- వరలక్ష్మీవ్రతము
ఛందస్సు- తేటగీతి
నాలుగు పాదాల 'మొదటి' అక్షరాలు వరుసగా "శు - క్ర - వా - రం" ఉండాలి.
ఈ న్యస్తాక్షరిని పంపిన వీటూరి భాస్కరమ్మ గారికి ధన్యవాదాలు.

81 కామెంట్‌లు:

  1. శుభములనొసగు శ్రావణ శుక్రవారం
    క్రమమున గొలువ కమలాంబ కార్యసిద్ధి
    వారిజాక్షులకు వలసిన వాయనంబు
    రంగరించిన శృంగార రాజ్యమేగ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది.
      కాని 'శుక్రవారం' అన్నచోట గణభంగం. "వారిజాక్షులకు వలయు..." అనండి. లేకుంటే గణభంగం. అలాగే "రాజ్యమె గద" అనండి.

      తొలగించండి
  2. వారిజాక్షులు వలచిన వాయనంబు గా చదువ ప్రార్ధన!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శుభములనొసగు శ్రావణ శుక్రవేళ
      క్రమమున గొలువ కమలాంబ కార్యసిద్ధి
      వారిజాక్షులు వలచిన వాయనంబు
      రంగరించిన శృంగార రాజ్యమదియె

      తొలగించండి
  3. శుభ్రవస్త్రపు వేదిక సొబగులొలయ
    క్రమ్ముకొనియెడి పరిమళకలన తోడ
    వాలుకన్నుల వరలక్ష్మి వత్సలతను
    రంజనమ్ముగ బడయంగ రండురండు.

    రిప్లయితొలగించండి
  4. శుభము లిచ్చెడి దేవత శోభ గూర్చు
    క్రమము తప్పక పూజించ కాచి నిలుచు
    వారి జాక్షుల పాలిట వరమ టంచు
    రంగు రంగుల సుఖముల హంగు లిడగ

    రిప్లయితొలగించండి
  5. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    వరలక్ష్మి వ్రతము :

    01)
    ________________________

    శుక్ల పక్షపు శ్రావణ - శుక్రదినము
    క్రమము దప్పక ప్రతి యేట - శమము గోరి
    వారిజాక్షులు వరలక్ష్మి - బతము సలుప
    రంజిలు గృహము సతతమా - లక్ష్మి కరుణ !
    ________________________
    బతము = వ్రతము

    రిప్లయితొలగించండి
  6. (శు)క్ర వారంపు వరలక్ష్మి సుఖద యగుట
    (క్ర)మముగా నిచ్చు నైశ్వర్య సమితి నిలను
    (వా)సి గూర్చును సౌభాగ్య వైభవ మిడు
    (రం)డు సద్భక్తి గొలువంగ రమణు లార!.

    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి


  7. శుభమగునుగాక యెల్లరు సుఖము గాను
    క్రతువుల నిట చేతురు గాక! కలిమి చెలియ
    వాహినిగ వెలయవలయు వరము గాను
    రండి! రారండి ! కొల్వగ రక్ష రక్ష!

    శుభాకాంక్షలతో
    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. *శు*భద,శ్రీహరిదయిత, భాసురలతాంగి,
    *క్ర*మము తప్పక నేటేట కరుణఁజూపి.
    *వా*సిగా ధనధాన్యము, ప్రవిలంపు.
    *రం*గురంగుల భవిత చేరంగ నిడుత!

    రిప్లయితొలగించండి
  9. శుభ ము సంతోష సౌ ఖ్యాలు శుద్దమతు లు
    క్రమ ము గా సాగు జీ వ న గ తి నొ సం గి
    వాన లిచ్చి యు దాహార్తి వంత బాపి
    రంజన oబును కలిగించ రమ్ము లక్ష్మి ।।।।।

    రిప్లయితొలగించండి
  10. శుక్ర వారపు వరలక్ష్మీ శుభము లిచ్చు
    క్రమము నకొలువ శ్రీదేవి క్రమ్ము కొనును
    వాయనము గద ముదితకు వడువ లయ్యి
    రoజిలునతివ మోముయె రoభ లాగ
    పoడుగ శుభాకాoక్షలు మరియు నమస్సులు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట నారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మోము+ఎ=మోమె' అవుతుంది. అక్కడ యడాగమం రాదు. "వదనమే" అనండి.

      తొలగించండి
  11. శుచికరముగ స్నానమొనర్చి శుభదినమున
    క్రమపు పద్ధతిఁ బూజించఁ గనుచుఁ బద్మ
    వాస కలిగించు నిత్య సౌభాగ్యములఁ ది
    రంబుగ మహిళా మణులకు రమణతోడ

    రిప్లయితొలగించండి
  12. శుక్రవారము గృహమును శుద్దిజేసి
    క్రమవిధానము వరలక్ష్మి వ్రతమొనర్చు
    వారిజాక్షులకోరికల్ తీరుచుండు
    రండుజూడమీకలలునూపండుచుండు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పీతాంబర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "కలలును" అనండి. దీర్ఘం ఎందుకు?

      తొలగించండి
  13. గురువర్యులుకు నమస్సులు. నిన్నటి నా పూరణను పరిశీలించ ప్రార్థన.
    ధన్యవాదములు.
    రాధా హృదయ విహారిగ
    మాధవుడే కీర్తి నందె! మదనాంతకుడై
    శోధన విడి శివుడాయె ను
    మా ధవుడట, హైమవతిని మనువాడంగా!

    రిప్లయితొలగించండి
  14. అందరికీ వరలక్ష్మీవ్రత పర్వదిన శుభాకాంక్షలు

    శుభముఁ జేకూర్చి రైతన్న కభయ మీయ
    క్రతువటంచును వరలక్ష్మి వ్రతముఁ జేయ
    వాన గురియంగ వరుణున కానతీయ
    రంగనాయకి! శుక్రవారాన రమ్మ !

    రిప్లయితొలగించండి
  15. శుక్రవారము శ్రావణశుక్ల తిథిని
    క్రమము తప్పక పంచ వర్షములు తమ వి
    వాహ మయిన పిమ్మటను సౌభాగ్యసిధ్ధి
    రంజిలగ రమణులు సేయు లక్ష్మి పూజ

    రిప్లయితొలగించండి
  16. తే.గీ.శుభము నిచ్చియు జనులకు నభయ మిచ్చు
    క్రమము తప్పక శ్రీ దేవి కరుణ తోడ
    వాసి,రాశియు పెంచును వరములొసగి
    రంజిల మనము నాదేవి వ్రతము జేయ.

    రిప్లయితొలగించండి
  17. శుభము,క్రమము పదములు చాలా పద్యాలలో వాడబడ్డాయి.

    రిప్లయితొలగించండి
  18. శుభము లీయగ వచ్చును బ్రభలువెలుగ
    క్రమము దప్పక యేటేట కనక దుర్గ
    వారి జాక్షులు నొసగెడు వాయనములు
    రండు చూతము వేగమె రామలార!

    రిప్లయితొలగించండి
  19. గురువు గారు ఈ దిగువ సoదేహాలను దూరము చేయు ము.
    క్రతువు పదము వివాహాలు మరియుయాగాల కోసం వాడుదురు.వ్రతము ల కు వాడుదురా?
    అసాధు ప్రయోగ మన నేమి?ప్రాస లో vagdhevi నాలుగవ పదము క తో వాడవచ్చా?.

    రిప్లయితొలగించండి
  20. రిప్లయిలు
    1. వెంకట నారాయణ గారూ,
      నిజమే.. క్రతువు శబ్దానికి విస్తృతమైన అర్థం ఉంది. కాని ఈ న్యస్తాక్షరి కేవలం వినోదార్థం, పద్య రచనాభ్యాసానికే కనుక అంత లోతుగా వెళ్ళనవసరం లేదు.
      ఇక ప్రాసకు సంబంధించిన మీ ప్రశ్న అర్థం కాలేదు.

      తొలగించండి
    2. వ్యాకరణ విరుద్ధమైన పదాన్ని ప్రయోగించడం సాధువు కాదు.

      తొలగించండి
  21. శుభము సౌభాగ్యములనిచ్చు సూక్తమిదియె
    క్రమము వరలక్ష్మి దేవికి సుమము లొసఁగి
    వాణి వాగ్దేవి రూపాన బదము బాడి
    రంభ ఫలములు దేవికి వాయనంబు
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  22. క్రొవ్విడి వెంకట రాజారావు:

    శుభము లిచ్చెడి వరలక్ష్మి విభవ మెంచి
    క్రమము గూడుచు నీనాడు కాంత లెల్ల
    వాటుగ రమను పూజించి వాయనమిడ
    రంజనమ్మమరుచు పొనరార గలరు

    రిప్లయితొలగించండి
  23. శుభ దినంబిది వరలక్ష్మి శోభకొరకు|
    క్రమము దప్పక భక్తితో క్రతువులాగ
    వారమందున వనితలు వ్రతముజేయ?
    రంగ డైననుమెచ్చు|శ్రీరంగమందు|

    రిప్లయితొలగించండి
  24. రిప్లయిలు
    1. రఘురామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "తెలుప నపర్ణ యడిగె... వ్రతమాచరించంగ నిందు...దీవెన లంద...వాసికెక్కిన..." అనండి.

      తొలగించండి
  25. మిత్రులందఱకు వరలక్ష్మీ వ్రత పర్వదిన శుభాకాంక్షలు!

    శుద్ధ హృదయాన శ్రావణ శుక్రవార
    క్రమిక దినమున వరలక్ష్మి వ్రతము భక్తి
    వారిజాక్షులు సలుప, సంపత్కరి రమ
    రంజిలుచు మెచ్చి, వరమ్ములిడును!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరణతో...

      *శు*ద్ధ హృదయాన శ్రావణ శుక్రవార
      *క్ర*మిక దినమున వరలక్ష్మి వ్రతము భక్తి
      *వా*రిజాక్షులు సలుప, సంపత్కరి రమ
      *రం*జిలుచు మెచ్చి, నచ్చు వరమ్ములిడును!

      తొలగించండి
    2. మధుసూదన్ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  26. శుభతర కటాక్ష లబ్దేంద్ర శుభ్రి హరుల
    క్రమము దనర శ్రీరంగ ధామ మలరంగ
    వార్ధి సంజననంబు దేవ గణ సేవ
    రంజిలు సిరినిఁ బూజింతు లక్ష్మి నెపుడు

    రిప్లయితొలగించండి
  27. శుభ్రకరుని తోబుట్టువు ,శుభుడగు ఉరు
    క్రముని పట్టపు రాణియు, కడలి పుత్రి ,
    వాక్కు తల్లి యత్త ,పంచ వదను డగు ని
    రంజుని సహోదరి ఐన శ్రీ రక్ష నిచ్చు

    రిప్లయితొలగించండి
  28. సీ౹౹
    శుభములు సంపదల్ శోభిల్ల వలెనన
    ---వ్రతమేది తెలుపం చపర్ణ యడిగె
    క్రమశిక్షణగ స్త్రీ క్రమముగాను రెండవ
    ---శ్రావణ శుక్రవారము శుచిగ సు
    వాసినుల్ దోడ నా వరలక్ష్మి వ్రతమాచ
    ---రించంచు నిందుమౌళి వివరించె
    రంధ్రపు గారె పూర్ణపు బూరె వాయనం
    ---బొసగి దీవెనలందె పుణ్యవతులు

    తే౹౹
    శుద్ధ చిత్తము చేతల శోభలీను
    క్రయము లేనిదౌ యిల బుణ్యకార్య మిదియె
    వాశికెక్కిన వ్రతమిది వరములిచ్చు
    రండు లక్ష్మిని పూజింప రమణులార!

    రిప్లయితొలగించండి
  29. కoద పద్యం రెoడవ పాదము మొదటి పదము వాగ్డేవి
    యతి లో కరుణ వ్రాయ వచ్చా?
    నమస్సలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వ్రాయరాదు. పాదం మొదట 'వా' ఉన్నందున యతిస్థానంలో అ,ఆ,ఐ,ఔ లతో కూడిన ప,ఫ,బ,భ,వ లతో మొదలయ్యే పదమే ఉండాలి.
      ముందు మీరు ప్రాస గురించి అడిగినట్టున్నారు!

      తొలగించండి
  30. శుభములొసగు శ్రావణ శుక్ల తిధిని
    క్రమముదప్పక వరలక్ష్మి వ్రతము జేసి
    వాయనములిడి సిరులు సౌభాగ్యములను
    రంగుగాకోరి వనితలు ప్రస్తుతింత్రు!!!

    రిప్లయితొలగించండి
  31. వరలక్ష్మీ వ్రత పర్వదిన శుభాకాంక్షలు!

    శుభములను గూర్చు శ్రీ దేవి ప్రభలు నిండి
    క్రమ వికాసము బ్రతుకున కలన జేసి
    వాసిగాంచెడి నాయమ వరములీయ
    రమ్య ధన కనక గృహరాసి లభ్యమగుత
    ముదిత వరలక్ష్మి దయచేత మోదమలర!
    (రం...ను, ర-ము...గా స్వీకరించాను)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శిష్ట్లా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నిజానికి 'శుక్రవారం' అని వ్యావహారికాన్ని అక్కడ న్యస్తాక్షరిగా ఇవ్వడం నాకూ ఇష్టం లేదు. కాని కావలసింది నాలుగక్షరాలే. అందుకని ఇవ్వవలసి వచ్చింది.

      తొలగించండి
  32. లేక తనర్చి

    తే.గీ.
    అంతరంగంబునం దొక యింత యేని
    యలుకు లేక తనర్చి బ్రహ్మాస్త్రమునన
    వేడుకకు మరలించిన విధము దోఁప
    నద్భుతంబుగ వారించె నర్జునుండు. భార. ద్రోణ. 5. 299


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీరిచ్చిన ఉదాహరణతో 'లేక' అన్నది కళ అని రూఢి అవుతున్నది. శ్యామల రావు గారు ఈ విషయమై వివరంగా నాకు లేఖ వ్రాశారు. దానిని మీ మెయిలుకు పంపిస్తాను. చూడండి.

      తొలగించండి
  33. శుచిగ స్నానము చేసియు రుచిగ వండి
    క్రమము దప్పక శ్రావణ కాల శుక్ర
    వారమందున చక్కగ వ్రతము జేయ
    రంగనాధుని పత్నియు రహిన నుండు

    రిప్లయితొలగించండి
  34. శుభము గోరుచు భక్తి ప్రసూనములిడి
    క్రతువు పగిదిని సిరిపూజ కాంతజేయ
    వారిజాక్షి కొసంగదే వరము లెన్నొ
    రంజిలిన వరలక్ష్మియే రసధునియన

    రిప్లయితొలగించండి

  35. పిన్నక నాగేశ్వరరావు.

    శుభము కలుగజేయు మనుచు శుద్ధ
    మతిని
    క్రమము తప్పక వరలక్ష్మి వ్రతము చేసి

    వాయనమ్ముల నిత్తురు పడతులంత

    రండు గైకొన మీరంత రమణులార !

    రిప్లయితొలగించండి
  36. శుక్రవారము దినమున శోభమీర
    క్రమము తప్పక పూజింప ప్రమద మెసగ
    వారిజాసని వరలక్ష్మి వరము లొసగి
    రంజలంగను జేయదే రమణులలర
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రంజిలంగను' టైపాటు.

      తొలగించండి
  37. శుభకరము ప్రతీ దినముగ శుభములు కద
    క్రమము తప్పక తరుణులు కలశ పూజ
    వాయనములు శనగలు సువాసినులకు
    రంగ నాయకి లక్ష్మికిరంగ పూజ

    రిప్లయితొలగించండి



  38. శుక్రవార మెల్లరకును శుభము లిచ్చు

    క్రమము విడక స్తోత్రము చేయ కరుణ జూపు

    వారి పైనసందియమది వలదు వలదు

    రంజనమున వరమొసగు రమయు తాను.




    శుభమునిచ్చును వరలక్ష్మి సుదతులకును

    క్రమము దప్పక తనకు నర్చనలు చేయు

    వారి కిలలోన మెచ్చుచు వదలకుండ

    రంగుగ సకలసిరులిచ్చు రయము గాను.



    శుకతరువు పూల తోడను గోమిని కిల

    క్రమముగా పూజ లను చేయ కలిమి నొసగు

    వారిజాక్షులకెల్లను వాసిగాను

    రంధి తో నమ్మ నర్చించ రండు వేగ

    రంధి=ఏకాగ్రత


    శుఫరుకము నందు చక్కని శుకఫలమిడి

    క్రన్నన వ్రతాచరణమును ఘనముగాను

    వారిజకు చేసి నాపైన వాయనములు

    రంగుగా రమణుల కిడ రమయు మెచ్చు.

    శుఫరుకము=పెద్దపాత్ర

    శుకఫలము=దానిమ్మపండు

    రంగుగా=సొబగుతో


    శుక్రవారము పూటను సొబగుతోడ

    .క్రకచతో లక్ష్మికి జడను గట్టు చునుసు

    వాసికత్తియ నటరాగ  వలపు తోడ

    రంభఫలముల నొసగుము రయముగాను.

    క్రకచ=మొగలి రేకు

    వాసికత్తియ=ఉన్నతురాలు


    శుక్ర వారమందేనక శుభము లొసగ
    క్రన్ననగ నరు దెంచనీ కమలగంధి
    వాయనమ్ముల నొసగంగ వాసిగాను
    రండు ముత్తైదువులు వేగ రమణతోడ.

    రిప్లయితొలగించండి
  39. శుక్ర వారమందు మనకు శుభము లొసగ
    క్రన్ననగ నరు దెంచనీ కమలగంధి
    వాయనమ్ముల నొసగంగ వాసిగాను
    రండు ముత్తైదువులు వేగ రమణతోడ.

    రిప్లయితొలగించండి