18, నవంబర్ 2017, శనివారం

సమస్య - 2523 (భరతుఁ దునిమె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.... 
"భరతుఁ దునిమె రాఘవుండు భామిని కొఱకై"
(లేదా...)
"భరతు వధించె రాఘవుఁడు భామినికై సదసద్వివేకియై"
(కంద పాద సమస్య పంచసహస్రావధాని జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పూరించినది - 
'అవధాన విద్యాసర్వస్వము' నుండి)

17, నవంబర్ 2017, శుక్రవారం

సమస్య - 2522 (పరమపదము లభ్యము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.... 
"పరమపదము లభ్యమగును పాపాత్ములకే"
(లేదా...)
"పరమపదమ్ము లభ్యమగుఁ బాపులకే సులభమ్ముగా భువిన్"

16, నవంబర్ 2017, గురువారం

దత్తపది - 126 (దొర-డబ్బు-అప్పు-వడ్డి)

దొర - డబ్బు - అప్పు - వడ్డి
పై పదాలను ఉపయోగిస్తూ
ఋణగ్రస్తుని బాధను వర్ణిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(పై పదాలను అన్యార్థంలోనే ఉపయోగించాలన్న నియమమేమీ లేదు.
 అన్యార్థంలొ ఉపయోగిస్తే సంతోషం!)

15, నవంబర్ 2017, బుధవారం

సమస్య - 2521 (పట్టపగలు వెన్నెల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.... 
"పట్టపగలు వెన్నెల విరిసెన్" (ఛందోగోపనము)
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.
(ఛందోగోపనము - పృచ్ఛకుడు సమస్యను పూర్తి పాదంగా కాకుండా కొంత భాగాన్ని, లేదా మూడవ పాదంలో కొంత భాగం నుండి మొదలు పెట్టి ఇస్తాడు. అవధాని అది ఏ ఛందస్సులో ఇముడుతుందో గ్రహించి పూరించాలి.
ఉదాహరణకు... "శివుఁడు గరుఁడు నెక్కి వడివడిఁ బారెన్" అని సమస్య ఇచ్చారనుకోండి. కందపాదం ప్రారంభంలో కొంత వదలిపెట్టారు. కవి అక్కడ మూడు లఘువులను చేర్చి కాని (పరమశివుఁడు...), ఒక గురువు ఒక లఘువు వేసికొని కాని (మూడుకనులు నయముగ గల। వాఁడు శివుఁడు...) పూరించవచ్చు.
అలాగే... "అర్జునుఁ డూరువులన్ భంగపఱచె నుగ్రుం డగుచున్" అని సమస్య ఇచ్చారనుకోండి. ఇక్కడ కందంలో మూడవ పాదం చివర నుండి సమస్య ఇవ్వబడింది. "అర్జునుఁ। డూరువులన్ భంగపఱచె నుగ్రుం డగుచున్" అని భావించాలి).

14, నవంబర్ 2017, మంగళవారం

సమస్య - 2520 (బొంకునట్టివాఁడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.... 
"బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును" 

13, నవంబర్ 2017, సోమవారం

సమస్య - 2519 (పొడి యొనర్చువాని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పొడి యొనర్చువానిఁ బొగడ వశమె"
ఈ సమస్య సూచించిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

12, నవంబర్ 2017, ఆదివారం

సమస్య - 2518 (పుస్తకముఁ బఠింత్రు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పుస్తకముఁ బఠింత్రు మూర్ఖజనులు"
(లేదా...)
"పుస్తకముల్ బఠించెదరు మూర్ఖజనాళి వివేకశూన్యులై"

11, నవంబర్ 2017, శనివారం

సమస్య - 2517 (కవులఁ బురస్కృతుల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కవులఁ బురస్కృతులఁ జేయఁగా వల దెపుడున్"
(లేదా...)
"కవులం బిల్వఁగరాదు దండుగ పురస్కారమ్ము లందిచ్చుటల్"

10, నవంబర్ 2017, శుక్రవారం

సమస్య - 2516 (శివభక్తవరేణ్యుఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"శివభక్తవరేణ్యుఁ డనఁగ శ్రీశ్రీయె కదా"
(లేదా...)
"శివభక్తాగ్రణి యెవ్వరో యెఱుఁగవా శ్రీశ్రీయె సత్యం బిదే"

ఖడ్గబంధములు

రచన - పూసపాటి కృష్ణసూర్య కుమార్

ఖడ్గ బంధ తేటగీతి - 1 (పార్వతీ ప్రార్ధన)

గౌరి, మారి, గిరిజ, భీమ, కాళి, చండ,
శారద, విజయ, మాలిని, సత్య, శంక
రి, యగజ, బహుభుజా, కర్వరి, పురుహుతి, 
కరుణ జూపి సతము మమ్ము  గాచవలయు

ఖడ్గ బంధ తేటగీతి - 2 (పార్వతీ ప్రార్ధన)

రంభ, లంభ, శాంభవి, దుద్దుర, గుహ జనని, 
గట్టు పట్టి, కాత్యాయణి, కౌసిని, శివ,
పార్వతి, పురల, యీశ్వరి, భగవతి, స్తుతి, 
వందనమ్ము మాతా నీకు వందనమ్ము.

ఖడ్గ బంధ తేటగీతి - 3 (లక్ష్మి స్తుతి)

 రామ, రమ, కమలాలయ, రమ్య వదన, 
జలదిజ, కలిమిగుబ్బెత, చంద్ర వదన, 
మరుని తల్లి,  మా, మాత, యమల, యతిచర,
యెల్ల కాలము గాపాడు మిందు వదన.

9, నవంబర్ 2017, గురువారం

సమస్య - 2515 (కరణమ్మును నమ్ముకొనిన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు సుఖమ్ముల్"
(లేదా...)
"కరణము నమ్మువారలకుఁ గల్గు సుఖమ్ములు కచ్చితమ్ముగా"
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలతో...

8, నవంబర్ 2017, బుధవారం

సమస్య - 2514 (భీముఁడు చెలరేగి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"భీముఁడు చెలరేగి చంపె భీష్ము రణమునన్"
(లేదా...)
"భీముఁడు యుద్ధరంగమున భీష్మునిఁ జంపెఁ బరాక్రమోద్ధతిన్"
ఈ సమస్యను పంపిన ప్రసన్న కుమారాచారి గారికి ధన్యవాదాలు.

7, నవంబర్ 2017, మంగళవారం

సమస్య - 2513 (సంపదలు కొల్లగొట్టెద...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సంపదలు కొల్లగొట్టెద జనులు మెచ్చ"
(లేదా...)
"సంపదఁ గొల్లగొట్టెదఁ బ్రశస్తముగా జనులెల్ల మెచ్చఁగన్"
ఈ సమస్యను పంపిన ప్రసన్న కుమారాచారి గారికి ధన్యవాదాలు.

6, నవంబర్ 2017, సోమవారం

సమస్య - 2512 (పతులు గల రైదుగురు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పతులు గల రైదుగురు సాధ్వి భానుమతికి"
(లేదా...)
"పతులు గణింప నైదుగురు భానుమతీసతికిన్ సుయోధనా"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

5, నవంబర్ 2017, ఆదివారం

సమస్య - 2511 (సింగమ్మును గాంచి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సింగమ్మును గాంచినపుడె చింతలు దొలఁగున్"
(లేదా...)
"సింగముఁ జెంగటం గనినఁ జింతలు దీరుట తథ్యమే కదా"
ఈ సమస్యను పంపిన ప్రసన్న కుమారాచారి గారికి ధన్యవాదాలు.

4, నవంబర్ 2017, శనివారం

ఆకాశవాణి వారి 'సమస్యాపూరణం' - 2

ఈవారం సమస్య....
"అమృతము విషమయ్యెఁ జూడ నాశ్చర్యముగన్"
11-11-2017 (శనివారం) ఉదయం 7-30 గం.లకు ప్రసారమౌతుంది. 
పూరణలను పంపవలసిన చిరునామాలు....
email :
padyamairhyd@gmail.com

Postal Address :
సమస్యాపూరణం,
c/o స్టేషన్ డైరెక్టర్,
ఆకాశవాణి,
సైఫాబాద్,
హైదరాబాద్ - 500 004.

సమస్య - 2510 (కార్తిక పూర్ణిమను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కార్తిక పూర్ణిమను గంటిఁ గద నెలవంకన్"

3, నవంబర్ 2017, శుక్రవారం

సమస్య - 2509 (పలలమ్మును గోరి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పలలమ్మును గోరి చిలుక ఫలముల రోసెన్" 
ఈ సమస్యను సూచించిన పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి ధన్యవాదాలు.

2, నవంబర్ 2017, గురువారం

ఆహ్వానము (అష్టావధానము)


నిషిద్ధాక్షరి - 38

కవిమిత్రులారా,
అంశము - కుచేలుని వృత్తాంతము
నిషిద్ధాక్షరములు - కకారము (క - దాని గుణితాలు, అది సంయుక్తంగా ఉన్న అక్షరాలు)
ఛందస్సు - మీ ఇష్టము.

1, నవంబర్ 2017, బుధవారం

సమస్య - 2508 (కవి కిద్దఱు భార్యలు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కవి కిద్దఱు భార్యలున్నఁ గను సుఖ కీర్తుల్"
ఈ సమస్యను సూచించిన పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి ధన్యవాదాలు.