31, డిసెంబర్ 2018, సోమవారం

సమస్య - 2889 (సాయిని నమ్మి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సాయిని నమ్మి కొలిచినఁ గసాయిగ మారున్"
(లేదా...)
"సాయిని నమ్మి కొల్చినఁ గసాయిగ మారును నిక్కమే కదా"

30, డిసెంబర్ 2018, ఆదివారం

సమస్య - 2888 (అంధుఁడు గాంచె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అంధుఁడు కనులారఁ గనె మహాద్భుత మూర్తిన్"
(లేదా...)
"అంధుఁడు గాంచె నచ్చట మహాద్భుతమై వెలుగొందు రూపమున్"
(దయచేసి ద-ధ ప్రాసను వర్జించండి) 

29, డిసెంబర్ 2018, శనివారం

సమస్య - 2887 (దొండ తీగకు బెండ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దొండ తీగకుఁ గాసెను బెండకాయ"
(లేదా...)
"దొండ తీగకు బెండ కాయుట దుర్లభం బెటు లౌనురా"
(ఈరోజు ఆకాశవాణిలో మాచవోలు శ్రీధర రావు గారి సమస్య)

28, డిసెంబర్ 2018, శుక్రవారం

సమస్య - 2886 (కనుల నీరు నింపి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కనుల నీరు నింపి కట్టెఁ దాళి"
(లేదా...)
"కన్నుల నీరు నింపుకొని కట్టెను తాళి వధూగళమ్మునన్"

27, డిసెంబర్ 2018, గురువారం

సమస్య - 2885 (కారముఁ బాయసము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కారముఁ బాయసమునందుఁ గలిపిన రుచియౌ"
(లేదా...)
"కారముఁ బాయసంబునను గల్పినచో రుచి మిక్కుటమ్మగున్"

26, డిసెంబర్ 2018, బుధవారం

సమస్య - 2884 (వనమునన్ లభించు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వనమునన్ లభించు ఘనసుఖంబు"
(లేదా...)
"వనమున లభ్యమౌ నఖిల భాగ్య సుఖంబులు మానవాళికిన్"

25, డిసెంబర్ 2018, మంగళవారం

న్యస్తాక్షరి - 61 (ఏ-సు-క్రీ-స్తు)

అంశము - శ్రీకృష్ణ స్తుతి.
ఛందస్సు- ఆటవెలది
న్యస్తాక్షరములు - నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా 'ఏ - సు - క్రీ - స్తు' ఉండాలి.
(లేదా...)
ఛందస్సు - ఉత్పలమాల
న్యస్తాక్షరములు - 
1వ పాదంలో 1వ అక్షరం - ఏ
2వ పాదంలో 8వ అక్షరం - సు
3వ పాదంలో 13వ అక్షరం - క్రీ
4వ పాదంలో 17వ అక్షరం - స్తు.

24, డిసెంబర్ 2018, సోమవారం

సమస్య - 2883 (చీమల కేనుఁగులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చీమల కేనుఁగులు పుట్టెఁ జిత్రం బగునా"
(లేదా...)
"చీమల కేనుఁగుల్ గలిగెఁ జిత్ర మదెట్టులొ విప్పి చెప్పుమా"

23, డిసెంబర్ 2018, ఆదివారం

సమస్య - 2882 (నెలఁ జూపి లతాంగి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నెలఁ జూపి లతాంగి కంట నీరున్ గార్చెన్"
(లేదా...)
"నెలఁ జూపించి లతాంగి యేడ్చెనఁట కన్నీ రొత్తుచున్ బయ్యెదన్"

22, డిసెంబర్ 2018, శనివారం

సమస్య - 2881 (చారును దూరముంచిననె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చారున్ దూరమున నుంచ సౌఖ్యం బబ్బున్"
(లేదా...)
"చారును దూరముంచిననె సాగును జీవిత మద్భుతమ్ముగా"
(ఈరోజు ఆకాశవాణిలో పూరణలు ప్రసారమయ్యే అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి సమస్య)

21, డిసెంబర్ 2018, శుక్రవారం

సమస్య - 2880 (ఒకఁడ యిద్దరా...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఒకఁడ యిద్దరా యెందరో యూహ సేయ"
(లేదా...)
"ఒకఁడా యిద్దర ముగ్గురా నలువురా యూహింప నింకెందరో"

20, డిసెంబర్ 2018, గురువారం

సమస్య - 2879 (కర్నూలునఁ గానరాఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కవి యొక్కఁడుఁ గానరాఁడు కర్నూలు పురిన్"
(లేదా...)
"కవి యొక్కండును గానరాఁడు గద యా కర్నూలునన్ జూడఁగన్"

19, డిసెంబర్ 2018, బుధవారం

సమస్య - 2878 (బకమె చాలు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"బకమె చాలుఁ గొనఁగఁ బ్రాణములను"
(లేదా...)
"బకమే చాలును ప్రాణముల్ గొనఁగ గర్వం బొంద నీ కేటికిన్"

18, డిసెంబర్ 2018, మంగళవారం

సమస్య - 2877 (హనుమద్వాలముఁ ద్రొక్కె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"హనుమంతుని తోఁకఁ ద్రొక్కె నర్జునుఁ డలుకన్"
(లేదా...)
"హనుమద్వాలముఁ ద్రొక్కె నర్జునుఁడు దా నత్యంత రౌద్రమ్మునన్"

17, డిసెంబర్ 2018, సోమవారం

దత్తపది - 150 (ఏక్-దస్‍-సౌ-హజార్)

ఏక్ - దస్ - సౌ - హజార్
పై పదాలను ప్రయోగిస్తూ
భారతార్థంలో
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యాన్ని వ్రాయండి.

16, డిసెంబర్ 2018, ఆదివారం

సమస్య - 2876 (రమణి పాపమ్ము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రమణి పాపమ్ము గద పాశురములఁ జదువ"
(లేదా...)
"రమణీ పాశురముల్ బఠించిన ధనుర్మాసమ్మునం బాపమౌ"

15, డిసెంబర్ 2018, శనివారం

సమస్య - 2875 (కొట్టెడు పతి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కొట్టెడు పతి నిష్టపడరె కోమలు లెల్లన్"
(లేదా...)
"కొట్టెడు భర్తనే సతముఁ గోమలు లిష్టపడంగ నేర్తురే"
(ఈరోజు ఆకాశవాణిలో పూరణలు ప్రసారమయ్యే అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి సమస్య)

14, డిసెంబర్ 2018, శుక్రవారం

సమస్య - 2874 (ఖరముఁ గౌఁగిలించి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
"ఖరముఁ గౌఁగిలించి కాంత మురిసె"
(లేదా...)
"ఖరమును గౌఁగిలించుకొనెఁ గాంత యొకర్తుక సంతసంబునన్"

13, డిసెంబర్ 2018, గురువారం

సమస్య - 2873 (పొలఁతి మేన....)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
"పొలఁతి మేనఁ బుణ్యక్షేత్రములు గలవఁట"
(లేదా...)
"పుణ్యక్షేత్రము లెన్నొ యున్నవఁట యా పూబోడి నెమ్మేనుపై"

12, డిసెంబర్ 2018, బుధవారం

సమస్య - 2872 (దేశము వీడిపోయిన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
"దేశమ్మును వీడి చన నదృష్టము గల్గున్"
(లేదా...)
"దేశము వీడి పోయిన నదృష్టము గల్గదె యెల్లవారికిన్"
(2-12-2018 నాడు ఆముదాల మురళి గారి అష్టావధానంలో సమస్య)

11, డిసెంబర్ 2018, మంగళవారం

సమస్య - 2871 (ఓడినవారు నవ్వి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నవ్వి రోడినవార లానందమొప్ప"
(లేదా...)
"ఓడినవారు నవ్వి రయయో యని గెల్చినవార లేడ్చిరే"

10, డిసెంబర్ 2018, సోమవారం

సమస్య - 2870 (చెడు గుణ మున్నపుడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
"చెడు గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్"
(లేదా...)
"చెడు గుణ మున్నచో యశము చేకుఱు ధారుణి నెల్లభంగులన్"

9, డిసెంబర్ 2018, ఆదివారం

సమస్య - 2869 (పవనతనయుండు రాముని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పవనతనయుండు రామునిఁ బరిహసించె"
(లేదా...) 
"పవనసుతుండు రాముని సభాస్థలిఁ దాఁ బరిహాస మాడెఁగా" 

8, డిసెంబర్ 2018, శనివారం

సమస్య - 2868 (కరణము నమ్ము వారలకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు శుభంబుల్"
(లేదా...)
"కరణము నమ్ము వారలకుఁ గల్గు శుభంబులు నిశ్చయమ్ముగన్"
(ఈరోజు ఆకాశవాణిలో పూరణలు ప్రసారం కానున్న అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి సమస్య)

7, డిసెంబర్ 2018, శుక్రవారం

సమస్య - 2867 (ఎన్నుకొనంగ నొప్పు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఎన్నుకొనుఁడు దున్నపోఁతునే యేలికగన్"
(లేదా...)
"ఎన్నుకొనంగ నొప్పు మన కేలికగా నొక దున్నపోఁతునే"

6, డిసెంబర్ 2018, గురువారం

సమస్య - 2866 (త్రాగిన మానవులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
"త్రాగిన మానవులు ధన్యతం గాంతు రిలన్"
(లేదా...)
"త్రాగిన మానవోత్తములు ధన్యతఁ గాంతురు లోకమందునన్"

5, డిసెంబర్ 2018, బుధవారం

సమస్య - 2865 (రసమయ కావ్యమ్ము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
"రసమయ కావ్యము జనుల విరక్తులఁ జేయున్"
(లేదా...)
"రసమయ కావ్యమే జనుల రక్తిఁ దొలంగఁగఁ జేయు నెప్పుడున్"

మదనపల్లె అష్టావధానము

శ్రీ ఆముదాల మురళి గారి 122వ అష్టావధానం
'మదనపల్లె సాహితీ కళా వేదిక'
ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా
ది. 2-12-2018 (ఆదివారం)
నిర్వహణ, సమన్వయం - శ్రీ మునిగోటి సుందరరామ శర్మ గారు

1. నిషిద్ధాక్షరి - శ్రీ కంది శంకరయ్య గారు
(మదనపల్లె సాహితీ మూర్తుల ప్రాశస్త్యం)
(స)వి(ద)శ్వా(స)త్మ(క)భా(స)వ(వ)దీ(ప)వ్యత్
(ధ)శశ్వత్(క)వ్యా(ప)స(గ)క(-)వి(వ)తా(న)ధిసా(హ)ధి(క)త(క)వ(ల)ద్యా
(వ)ప్పాశ్వ(మ)వ(ర)ద(-)న(ద)ధీ(భ)మ(త)య(స)మౌ
(నాల్గవ పాదం నిషేధం లేదు. కుండలీకరణంలో ఉన్నవి నిషిద్ధాక్షరాలు. (-) ఉన్నచోట నిషేధం లేదు).
విశ్వాత్మభావదీవ్యత్
శశ్వత్ వ్యాసకవితాదిసాధితవద్యా
ప్పాశ్వవదనధీమయమౌ
శాశ్వతమగు మదనపల్లి సత్కవి తపముల్.

2. సమస్య -  శ్రీ లోకా జగన్నాథ శాస్త్రి గారు
(దేశము వీడిపోయిన నదృష్టము గల్గదె యెల్లవారికిన్)
ఆశలు చుట్టుముట్టగ ధనార్జన సేయుటె ధ్యేయమంచు ధీ
కోశము విక్రయించి సమకూర్చగ గుప్పెడు గ్రుడ్డిగవ్వలన్
కాశియు గంగయున్ గలుగ కాదని వేడుక పోవవచ్చునా
దేశము వీడిపోయిన నదృష్టము గల్గదె యెల్లవారికిన్.

3. దత్తపది - శ్రీ తెనాలి శేషగిరి రావు గారు
(గాజులు, జాజులు, పోజులు, మోజులు పదాలతో వరూధిని విరహవేదనా వర్ణన)
గాజులు పూలవాల్జడయు కాముని బాణములంచు నెంచితిన్
జాజులు వాడిపోయె రససాగరసప్తక మావిరయ్యెగా
మోజులు తీరవాయె నను ముంచెను పారుడు దుఃఖవార్ధిలో
పూజలు నిష్ఫలమ్ములయె పో జులుముం గనబర్చ నాగడే.

4. న్యస్తాక్షరి - శ్రీ వాసా కృష్ణమూర్తి గారు
(విక్రమాదిత్యుని నవరత్నాల సభావర్ణన ఉత్పలమాలలో... న్యస్తాక్షరాలు 1వ పాదం 2వ అక్షరం 'త్య', 2వ పాదం 8వ అక్షరం 'స', 3వ పాదం 12వ అక్షరం 'ర', 4వ పాదం 16వ అక్షరం 'ధ')
ని(త్య)ము విక్రమార్క నవనీత హృదంతర శారదాబ్జమున్
సత్య సుధర్మ బద్ధ (స)రసాకృతి సత్కవిరత్నమండలిన్
భత్యము నిచ్చి ప్రోచు రసభావ(ర)వీందుకరాళి కావ్యముల్
ముత్యపు ప్రోవులన్ కనకమూలము గూర్చిన (ధ)ర్మగాథయే.

5. వర్ణన - శ్రీ మల్లెల నాగరాజు గారు
(ప్రేమ వివాహం చేసికొన్నవారి తల్లిదండ్రుల ఆవేదన మత్తేభంలో)
పదముల్ గ్రందక గుండె క్రింద నిడి పాపన్ బుజ్జి చిన్నారినిన్
హృదయంబందున గూడుగట్టి రసవాక్ప్రేమంబునన్ పెంచినన్
ముదితల్ వే తలిదండ్రి వీడి చనుటల్ మోదంబె? ఖేదం బగున్
విదితంబౌనె కుటుంబ గౌరవము లీ పిల్లల్ మనోవీథిలోన్.

6. ఆశువు - శ్రీ కె.యల్. అనంతశయనం గారు
౧. (మదనపల్లె సాహితీ కళాసమితి ప్రాశస్త్యం)
మొలకలెత్తెడి సాహిత్య మూర్తులకును
జన్మనిచ్చెడు స్థానమై సహజమైన
భావబంధుర కవితల భాగ్యమిచ్చి
వెల్గు మదనపల్లెను కళావేదిక గద!
౨. (ఏసుక్రీస్తు భగవద్గీతను చదివితే ఎలా ఉంటుంది?)
ధర్మము దప్పరా దనుచు తాను స్వయమ్ముగ బోధ సేయడే
నిర్మల భక్తి తత్పరత నిత్య మహింసను పాదుకొల్పడే
కర్మల వీడి జీవుడిట కానడు జన్మ మటంచు బల్కడే
శర్మద వృత్తి యేసు తను సాంగముగా పఠియించి గీతమున్.
౩. (శ్లోకానువాదం)
శాంతి సత్యంబు దయయును సర్వభూత
హిత మహింసయు దానంబు హ్రీసహితపు
వర్తనంబును గల్గుట వారిజాక్షు
పూజకగు పుష్పచయమని పూజ్యవాణి.

7. పురాణ పఠనం - శ్రీ జలకనూరి మురళీధర్ రాజు గారు
8. అప్రస్తుత ప్రసంగం - డా. మునిగోటి సుందరరామ శర్మ గారు

అవధానానంతరం 'మదనపల్లె సాహితీ కళావేదిక' వారు ఆముదాల మురళి గారిని
"అవధాన రత్నాకర" బిరుదంతో సత్కరించారు.

4, డిసెంబర్ 2018, మంగళవారం

సమస్య - 2864 (పుత్రా రమ్మనుచు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
"పుత్రా రమ్మనుచుఁ బిలిచెఁ బొలఁతియె మగనిన్"
(లేదా...)
"పుత్రా రమ్మని పిల్చె భార్య మగనిన్ మోదంబు చెన్నారఁగన్"

3, డిసెంబర్ 2018, సోమవారం

సమస్య - 2863 (ఆంగ్లంబున వ్రాసె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
"ఆంగ్లంబున వ్రాసెఁ బోతనార్యుండు కృతిన్"
(లేదా...)
"ఆంగ్లమునందుఁ బోతన మహాకవి భాగవతమ్ము వ్రాసెఁ బో"

2, డిసెంబర్ 2018, ఆదివారం

సమస్య - 2862 (వధాన మన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
"వధాన మన మదనపల్లె ప్రజలకు భయమౌ"
(లేదా...)
"భయమునఁ బాఱదే మదనపల్లె ప్రజాళి వధాన మన్నచో"

1, డిసెంబర్ 2018, శనివారం

ఆహ్వానము (అష్టావధానము)



ఆహ్వానము (అష్టావధానము)



సమస్య - 2861 (పతి పూజయె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్"
(లేదా...)
"పతి పాదార్చన కార్తికమ్మునఁ గడున్ భద్రమ్ముఁ జేకూర్చులే"
(ఈరోజు ఆకాశవాణిలో పూరణలు ప్రసారమయ్యే బండకాడి అంజయ్య గారి సమస్య)

30, నవంబర్ 2018, శుక్రవారం

సమస్య - 2860 (కాశ్మీరమ్మున నుగ్రవాదము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కాశ్మీరపు టలజడి జన కళ్యాణ మిడున్"
(లేదా...)
"కాశ్మీరమ్మున నుగ్రవాద మొసఁగున్ గళ్యాణ మిద్ధాత్రికిన్"

29, నవంబర్ 2018, గురువారం

దత్తపది - 149 (అల-కల-తల-వల)

అల - కల - తల - వల
పై పదాలను అన్యార్థంలో పాదాదిని ప్రయోగిస్తూ
రామాయణార్థంలో
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యాన్ని వ్రాయండి.

28, నవంబర్ 2018, బుధవారం

సమస్య - 2859 (చన్నులు లేని యావులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చనులు లేని యావులు పాలఁ జాల నొసఁగె"
(లేదా...)
"చన్నులు లేని యావులు బ్రసన్నతఁ బాల నొసంగె బానెడున్"

27, నవంబర్ 2018, మంగళవారం

సమస్య - 2858 (నల్లఁగా నున్న మల్లెల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నల్లఁగా నున్న మల్లెల నాతి దాల్చె"
(లేదా...)
"నల్లఁగ నున్న మల్లెలను నాతి ముదంబునఁ దాల్చెఁ గొప్పునన్"

26, నవంబర్ 2018, సోమవారం

సమస్య - 2857 (వలలునిఁ గీచకుఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వలలునిఁ గీచకుఁడు సంపె వర విక్రముఁడై"
(లేదా...)
"వలలునిఁ జంపెఁ గీచకుఁ డవక్ర పరాక్రముఁడై రణంబునన్"

25, నవంబర్ 2018, ఆదివారం

సమస్య - 2856 (కనిపించిరి కోతుల వలె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కనిపించిరి కోఁతుల వలెఁ గవివరు లెల్లన్"
(లేదా...)
"కనఁబడి రప్డు వానరులుగాఁ గవివర్యులు తత్సభాస్థలిన్" 

24, నవంబర్ 2018, శనివారం

సమస్య - 2855 (విద్యలు లేని మానవుఁడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"విద్యలు లేనట్టి నరుఁడె విజ్ఞుఁ డనఁ దగున్"
(లేదా...)
"విద్యలు లేని మానవుఁడె విజ్ఞుఁడుగా జనమాన్యతం గనెన్"
(ఈరోజు ఆకాశవాణిలో పూరణలు ప్రసారమయ్యే బండకాడి అంజయ్య గౌడ్ గారి సమస్య)

23, నవంబర్ 2018, శుక్రవారం

సమస్య - 2854 (చల్లని నీటిచే...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చల్లని నీరమున నొడలు సర్వముఁ గాలెన్"
(లేదా...)
"చల్లని నీటిచే నొడలు సర్వము గాలె నదేమి చిత్రమో"

22, నవంబర్ 2018, గురువారం

సమస్య - 2853 (మోస మొనరించు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మోస మొనరించు వారికే మ్రొక్కఁ దగును"
(లేదా...)
"మోసముఁ జేయువారలకె మ్రొక్కఁ దగున్ సుజనుల్ హితార్థులై"

21, నవంబర్ 2018, బుధవారం

దత్తపది - 148 (మూఁడు-ఆరు-ఏడు-పది)

మూఁడు - ఆరు - ఏడు - పది
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
భారతార్థంలో
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యాన్ని వ్రాయండి.

20, నవంబర్ 2018, మంగళవారం

సమస్య - 2852 (రమ్మని పిల్చెఁ దండ్రి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రమ్మని తండ్రి పిలిచెఁ దొలిరాత్రికిఁ గూఁతున్"
(లేదా...)
"రమ్మని పిల్చెఁ దండ్రి తొలిరాత్రికి కూఁతును ప్రేమ మీఱఁగన్"
(కుప్పిలి శశిధర్ గారికి ధన్యవాదాలతో...)

19, నవంబర్ 2018, సోమవారం

సమస్య - 2851 (బకమునుఁ గబళించు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"బకమునుఁ గబళించు బల్లిఁ గనుము"
(లేదా...)
"బకమును మ్రింగుచున్న దొక బల్లి గనుంగొనుమయ్య మిత్రమా"

18, నవంబర్ 2018, ఆదివారం

సమస్య - 2850 (సహనమె తొలఁగింపఁ జేయు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సహనమె తొలఁగింపఁ జేయు శాంతిని సుఖమున్"
(లేదా...)
"సహనమ్మే తొలఁగింపఁ జేయును గదా శాంతిన్ సుఖమ్మున్ భువిన్"

17, నవంబర్ 2018, శనివారం

సమస్య - 2849 (రణములె కద...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రణములె కద పండితులకు రమ్యక్రీడల్"
(లేదా...)
"రణములె పండితోత్తముల రమ్యఁపుఁ గ్రీడలు సాహితీసభన్"
(ఈరోజు ఆకాశవాణిలో పూరణలు ప్రసారమయ్యే బండకాడి అంజయ్య గౌడ్ గారి సమస్య)

16, నవంబర్ 2018, శుక్రవారం

సమస్య - 2848 (గంగలో మున్గ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"గంగలో మున్గఁ బాపముల్ గలుగు పెక్కు"
(లేదా...)
"గలగలఁ బాఱునట్టి సురగంగను మున్గినఁ గల్గుఁ బాపముల్"

15, నవంబర్ 2018, గురువారం

సమస్య - 2847 (మార్కండేయుని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మార్కండేయుని కొడుకుగ మారుతి పుట్టెన్"
(లేదా...)
"మార్కండేయునకున్ సుతుం డగుచు జన్మంబందె సామీరియే"

14, నవంబర్ 2018, బుధవారం

సమస్య - 2846 (వలదు చదువు...)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వలదు చదువు బాల బాలికలకు"
(లేదా...)
"చదువులు బాల బాలికల జ్ఞానము నాశ మొనర్చు వద్దురా"

13, నవంబర్ 2018, మంగళవారం

సమస్య - 2845 (పందినిఁ గని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పందినిఁ గని శంకరుండు పార్వతి నెంచెన్"
(లేదా...)
"పందినిఁ జూచి శంకరుఁడు పార్వతిగాఁ దలపోసె ముగ్ధుఁడై"

12, నవంబర్ 2018, సోమవారం

సమస్య - 2844 (మాఘము సంక్రమించినది...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మాఘము సంక్రమణ మయ్యె మార్గశిరమునన్"
(లేదా...)
"మాఘము సంక్రమించినది మార్గశిరంబునఁ గార్తికం బనన్"

11, నవంబర్ 2018, ఆదివారం

ఆహ్వానం!


సమస్య - 2843 (కప్పను గని పాము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కప్పను గని పాము కలఁతఁ జెందె"
(లేదా...)
"కప్పను గాంచి పాము వడఁకం దొడఁగెన్ గడు భీతచిత్తయై"

10, నవంబర్ 2018, శనివారం

సమస్య - 2842 (లయమే శాంతిని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"లయమె శాంతిఁ గూర్చు నయముగాను"
(లేదా...)
"లయమే శాంతినిఁ గల్గఁ జేయును గదా రంజిల్ల సన్మార్గమై"
(ఈరోజు ఆకాశవాణిలో పూరణలు ప్రసారమయ్యే బండకాడి అంజయ్య గౌడ్ గారి సమస్య)

9, నవంబర్ 2018, శుక్రవారం

సమస్య - 2841 (తోడఁ బుట్టువే...)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తోడఁ బుట్టువే యన్నకుఁ గీ డొనర్చె"
(లేదా...)
"తోడం బుట్టిన చెల్లె లగ్రజునకున్ ద్రోహమ్ముఁ జేసెన్ గదా!"

8, నవంబర్ 2018, గురువారం

సమస్య - 2840 (భరతుఁడు రామునకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"భరతుఁడు రామున కొసంగెఁ బాదుక లెలమిన్"
(లేదా...)
"భరతుఁడు భ్రాతృవత్సలతఁ బాదుక లిచ్చెను రామమూర్తికిన్"

కౌస్తుభ చిత్ర బంధ సీసము


శివ ప్రార్ధన

శ్రీ శృంగి నాదా! గిరిసుత వల్లభ!  శితి
          కంఠ! కాలాంతకా! ఖరువు! హీర!
అర్ధనారీశ్వర! అలరు సాయకు వైరి!
          పంచ వదన! పశుపతి!  మలహర!
విలయ దర్శక! భూరి!జలధి తూణీరుడ!
           కరకంఠ!అనలాంబక!పరమేశ!
ఖట్వాoగి! ఉగ్రాక్ష!కామారి! ముక్కంటి!
            పురభిత్తు! మరుగొంగ! భూతరాట్టు!
అసమ నేత్ర! ఈశానుడ! అచల! శూలి!
పర్వత తనయ మది చోర! భవుడ! పాశు
పతుడ!బేసికంటి! కపర్ది! భద్ర!  నైక
మాయ!   నాకు నొసగుము శమము వినయము

ఈ  పద్యము లోని విశేషము   మధ్య  గడిలోని (పసుపు పచ్చ రంగు గల) అక్షరములు బంధించ బడినవి .
“శ్రీగిరి శిఖర దర్శనము సర్వ పాప నాశనము “   అన్న వాక్యము బందిమ్చబడినది 


                                                            బంధ కవి   పూసపాటి కృష్ణ సూర్య కుమార్ 

7, నవంబర్ 2018, బుధవారం

సమస్య - 2839 (తిమిర మ్మెల్లెడల...)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తిమిర మ్మెల్లెడల నిండు దివ్వెలు వెలుఁగన్"
(లేదా...)
"తిమిరము నిండు నెల్లెడల దీపము లెన్నియొ వెల్గుచుండినన్"

ద్వాదశ దళ గర్భ దీప చిత్ర బంధము


   శ్రీ కృష్ణ ప్రార్ధన


(క)మలనాభా!  పోత ! గరుడ వాహన! (కా)లగమ్యా! గదాగ్రజ! కైటభారి 
(క)మలాక్ష!దైత్యారి!అమర వందిత!(మ)ధు సూధనా! హేమాoగ!సోమ గర్భ!
(క)రివేల్పు! భూజాని ! తరిదాల్పు! (చ)క్రి నందకి! నీరజోదర! దానవారి  
(క)పిల!జగన్నాధ!గరుడి రవుతు(వే)దగర్భా!  పరంధామ! గట్టు తాల్పు 
(క)ర్మేశ ! పుండరీ కాక్ష! పురుష వరా(గా)నలోలా !  వర్దమాన! శేషి!
శ్రీ(క)రా!విక్రమా!శ్రీ జాని!వనమాలి! (లో)కనాధ! పెరుమాళ్ళు!యమ కీల!
(క)పి! పురాణ పురుష !కంసారి!(స)రసిజనాభ! దామోదర! నాగ  శయన!
(క)న్నయా !వెన్నదొంగా!యతి!విరజ!(కా)లపురుషా!మురభిత్తు!లచ్చి మగడ!     
(క)మల నయన! ధర్మి!గరుడ ధ్వజా!(మీ)నరూపుడా !వంశీధరుడ! సిరిపతి!        
( క)స్యప రూప!చక్రాయుధా! మధునిషూ ద(ను)డా!పురంధరా! తాత తాత!                                                                 
(క)రి నేస్తి!  శ్రీధరా !కంబుపాణీ!  నేత! (చ)క్ర  ధారీ! హరీ! సంకు దారు!  
(క)రుణాంత రంగా!జగపతీ శుభాం(గా)! వరాహమూర్తి!శిఖండి!రమ్య నేత్ర!  
దేవకీ సుతా! గోపాల! దీన బాంద
వా! జగద్రక్షకా!సూరీ! వాసు దేవ!,
కాచు మయ్య చక్రీ వేణు గాన లోల 
సర్వ కాలమీ దీనుని చల్ల గాను                                               
  ఇది సీస పద్యము శ్రీకృష్ణ ప్రార్ధన :  (క) అను అక్షరము మధ్యలో బంధింప బడినది    అక్షరంతో సీస పద్యములోని పాదములు మొదలు  అవుతాయి (ఒక్క పాదములో తప్ప ) .  ముందుగా      తో 1  వ గడి (బాణము గుర్తు  గల)లో నుంచి మొదలు పెట్టాలి  (కమల నాభాఅన్న పదము తో మొదలు పెట్టి గరుడ వాహన  దగ్గిర ఆపి పైన గల (కా) తో కలుపుకొని (కాలగమ్యాఅని 

చదువుకొంటూ క్రిందకు వచ్చి  మరల ( తో కలుపుకొని  ప్రక్క గడిలో పాదము చదువుకోవాలి  అలా  12 వ గడిలో (రమ్య నేత్రఅని చదివి  క్రింద  ప్రమిదలోని  తేట గీతి మొదటి పద్యపాదము  (దేవకీ సుతాతో మొదలు పెట్టి  (వాసు దేవా) అని పదము తోటి ముగించాలి ఈ బంధములో విశేషము తేట గీతి లోని చివరి రెండు పాదములు పైన దళ మల  కొసలలో బంధించ బడినవి (వాసు దేవ)  చదివిన తర్వాత 1 వ దళము కొసలో గల  (కా)  తో తిరిగి మొదలు పట్టి వరుసగా   (కాచుమయ్య చక్రీ , వేణుగాన లోల  సర్వ కాల మీ దీనుని చల్ల గాను)  అని ప్రతి అక్షరము కలిపి చదివితే    పద్యము ముగుస్తుంది 
 
బంధ కవి పూసపాటి కృష్ణ సూర్య కుమార్