24, జనవరి 2018, బుధవారం

దినకర స్తుతి బంధ సీసము


సీ:
(పూ)షుడు!(స)విత! తపుడు!(పా)సి!కిరణుడు! చీక(టి)గొంగ!దివాకరుండు!
రవి!(వా)తి!మిత్రుడు!రాకుడు!రోహిత్తు!హ(రి)వాహనుడు!మంధి!హర్త!భువుడు!
పాధి!(ది)వామణి!పద్మినీ కాంతుడు!కమలాప్తుడు!(న)గుడు!కంజహితుడు!
వినుమాని(క)ము!అవి!వెలుగుల దొ(ర)!సూరి!కపి!అంశు హ(స్తు)డు!కర్మసాక్షి!
తే:
జ్యోతిషాంప(తి)!గోపతి!జ్యోతి!ఖ(ర)మ
రీచి!గగన మణి!తిమిరారి!(ధ)రణుడు!ఖ
చరుడు!కీసుడు!సత(ము )విజయము గూర్చి
జనతకు సుఖమునిచ్చును ఘనత తోడ

రధ బంధ సీసములో దినకర స్తుతి . పసుపు పచ్చ రంగు గల మధ్య నిలువు వరుస లో “పూసపాటి వారి దినకర స్తుతి రధము “ అన్న వాక్యము బంధించ బడినది (బ్రాకెట్ లో ఉన్న అక్షరములు కలిపి చదువు కోవలెను)
కవి 
పూసపాటి కృష్ణ సూర్య కుమార్

7 కామెంట్‌లు:

  1. శంకరయ్య గారికి నమస్సులు!

    శీర్షికలో "రథ" లోపించింది. సరిచేయగలరు.

    పూసపాటివారూ! చాలా బాగున్నదండీ! సూర్యనామాలను రథబంధములో ఇముడ్చడానికి మీరు పడిన శ్రమ ప్రశంసనీయము! అభినందనలు!
    మఱొక్క విషయము... రథలో థ రావాలి గదా! దానికై మీరు "ధ"రణుడు అనే నామాన్ని వేసుకున్నారు. థ, ధ లకు భేదం పాటించలేదు. అనాథనాథుడు అనియో, లేక మఱొకటో వేసుకుని సరిచేస్తే బాగుంటుందని అనిపిస్తున్నది. అన్య(థా)ధా భావించవలదని మనవి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధుసూదన్ మిత్రమా నమస్కారములు మీ సూచన తప్పక అవలంబిస్తాను ధన్యవాదములు

      తొలగించండి
  2. సూర్య దేవుని సైతము స్తుతి యటన్న
    పేర రథమున బంధించినారు మీరు
    డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి