3, ఫిబ్రవరి 2018, శనివారం

సమస్య - 2587 (అల్లా క్రీస్తులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అల్లా రామునకు పుత్రుఁ డయ్యా శాస్త్రీ"
లేదా...
"అల్లా క్రీస్తులు రామచంద్రు సుతు లయ్యా శాస్త్రి! సేవింపుమా"
ఈ సమస్యను పంపిన జిలేబీ గారికి ధన్యవాదాలు.

74 కామెంట్‌లు:

  1. ముల్లాకువచ్చు కోపము
    చెల్లాచెదరౌను బుద్ధి చిందులు త్రొక్కున్,
    పుల్లారెడ్డిట్లనగనె:
    "అల్లా రామునకు పుత్రుఁ డయ్యా శాస్త్రీ!"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈనాటి కొశ్చెన్ పేపరు సారు వారం రోజుల క్రితం బ్లాగులో లీక్ చేసిరి. కాబట్టి నాకు మార్కులు సున్నా!

      తొలగించండి
    2. చమత్కార పూరణ బాగున్నది.అభినందనలు!

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. ఉల్లోలపు కడలి గడచి
      తల్లిగ సీతమ్మ దలచి; తల్లోలుండౌ
      ముల్లోకవీర హనుమయె
      అల్లా, రామునకు పుత్రుడయ్యా శాస్త్రీ !

      తొలగించండి
  3. మైలవరపు వారి పూరణ


    తెల్లారకుండ తోచిం...
    దల్లా ఒకవాక్యమీయ నందరికిని చి..
    త్తోల్లాసమౌను , నేటిది...
    "అల్లా రామునకు పుత్రుఁ డయ్యా శాస్త్రీ !!"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గాంధీ మహాత్ముడు....

      ఈశ్వర్ అల్లా తేరే నామ్
      సబ్ కో సన్మతి దే భగవాన్ !

      కొల్లాయిన్ ధరియించి, కర్రఁగొని, కాకుల్ వ్రాలగాఁ ద్రోలిన...
      ట్లెల్లల్లేకయె శాంత్యహింసలను నాంగ్లేయాదులన్ ద్రోలుచున్
      వల్లించెన్ ప్రభువొక్కడంచు నిక యీ వైవిధ్యముల్ మానుమా !
      అల్లా క్రీస్తులు రామచంద్రు సుతు లయ్యా శాస్త్రి ! సేవింపుమా !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. అల్లా హో అగబర్ స్వనమ్ములనగన్ , హల్లేలుయా యంచనన్
      చెల్లున్ , వారికి వారికిన్ వరుసగా సేవింప దైవమ్ములౌ
      అల్లా క్రీస్తులు ., రామచంద్రు సుతు లయ్యా శాస్త్రి ! సేవింపుమా !
      పిల్లల్ నిన్ గని వారి తండ్రి చెవికిన్ విన్పింత్రు నీ కష్టముల్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  4. పుల్లా రెడ్డికి దెలిసెను
    చల్లా వారింట పెండ్లి చక్కని స్వీట్ల
    న్నెల్లా గైనా పంపెద
    నల్లా రామునకు పుత్రుఁ డయ్యా శాస్త్రీ

    రిప్లయితొలగించండి
  5. తల్లి యెవరు రా యన గా
    చల్లగ జె ప్పగ ల వుండు జానకి యనుచు న్
    కల్లయె కాద ది యె ని జ o
    బల్లా రాము న కు పుత్రుడ య్యా శాస్త్రీ

    రిప్లయితొలగించండి
  6. (ఇలా వ్రాయొచ్చా--)
    అల్లా క్రీస్తులు రామచంద్రు సుతులయ్యా శాస్త్రి!సేవింపుమా
    అల్లారాములు ఏసునాధు సుతులయ్యా పౌలు,సేవింపుమా
    అల్లా సూనులె రాముఁడేసు వినవయ్యాబ్దుల్ల !సేవింపుమా
    కల్లోలాలకు తావులేదిచట మాకందర్కిదైవంబిలే

    ఇల - భారత దేశం (అన్వయం)
    Paul ను తెనుగిస్తే పౌలు


    రిప్లయితొలగించండి


  7. సల్లాపంబులవేలా!
    కల్లచ్చున నరగదీసి గాన దగునయా
    విల్లును సంధించిన వా
    డల్లా రామునకు పుత్రుఁ డయ్యా శాస్త్రీ?



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి స్పందన

      బాగుందండీ.. అభినందనలు 🙏

      తొలగించండి
    2. సుధాకర గౌడ్ గారి స్పందన

      👌🏿 బాగుందండీ

      తొలగించండి
    3. ప్రభాకర శాస్త్రి స్పందన


      సల్లాపంబులవేలా!
      పుల్లకు చుట్టించి త్రాడు పూలమ్ములతో
      విల్లును సంధించిన వా
      డల్లా రామునకు పుత్రుఁ డయ్యా శాస్త్రీ?

      తొలగించండి
    4. తల్లీ జిలేబి! యేలా
      గిల్లా గిచ్చిన సమస్య లివ్వన్మేలా?
      బిల్లంగోడాడేవా
      డల్లా రామునకుపుత్రు డయ్యాశాస్త్రీ!

      ప్రతి ఊరిలో ఉండే రాముడు!

      తొలగించండి
  8. కల్లా కపటమ్మెరుగని
    చెల్లాయికి పెళ్ళి కుదిరె చెల్లికి వరుడౌ
    మల్లన చక్కని కవితల
    నల్లా రామునకు పుత్రుఁ డయ్యా శాస్త్రీ
    (చెల్లికి వరుడైన మల్లన చక్కని కవితలనల్లు+ ఆ రాముడు అనే ఆయన పుత్రుడు అనే భావన తో వ్రాశా..అన్వయం కుదిరినట్లేనా మాష్టారూ)

    రిప్లయితొలగించండి
  9. కోదండరాముణ్ణి కవితలరాముని గా భలే అన్వయించారే !

    రిప్లయితొలగించండి
  10. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2587
    సమస్య :: *అల్లా క్రీస్తులు రామచంద్రు సుతు లయ్యా ! శాస్త్రి సేవింపుమా.*
    ఓ శాస్త్రీ!
    అల్లాక్రీస్తులు రామచంద్రుసుతులు
    అని చెప్పడంలో ఉన్న ఆలోచన ఏమిటో తెలిసికొనవలసిన అవసరం ఉంది.
    సందర్భం :: *ఏకం సద్* అనే సూక్తిని గురించి గురువు శిష్యునికి విశదీకరిస్తూ నాయనా! శాస్త్రీ ! ఉన్న భగవంతుడు ఒక్కడే అని అన్ని మతాల వారూ భావించాలి. అందరూ *పోరు నష్టము పొందు లాభము* అని తెలిసికొని ఐకమత్యంతో జీవించాలి. ఈవిషయాన్ని మన భారత జాతిపిత మహాత్మా గాంధీ గారు కూడా *ఈశ్వర్ అల్లా తేరేనామ్ సబ్ కో సమ్మతి దే భగవాన్ !* అంటూ బోధించారు. కాబట్టి మతద్వేషం వద్దు. మత సహనం ముద్దు. నీకు ఇష్టమైన వారిని సేవించు అని అంటూ మతసామరస్యం కోసం హితోపదేశం చేసే సందర్భం.

    చెల్లున్ సన్మతసామరస్య మిలలో శ్రేయ మ్మిడున్ సర్వదా
    అల్లా మాలికు ; దైవ దూత యగు తా నా క్రీస్తు ; విష్ణ్వంశ వ
    ర్ధిల్లంబుట్టిన రామచంద్రుసుతులున్, ధీరుల్, ప్రజల్ మెచ్చగా
    నుల్లంబందున నిల్చి రా లవకుశుల్ ; యోచింప పూజార్హు లా
    *యల్లా క్రీస్తు లు , రామచంద్రసుతు , లయ్యా ! శాస్త్రి ! సేవింపుమా.*
    *కోట రాజశేఖర్, పడుగుపాడు, నెల్లూరు.* (3-2-2018)

    రిప్లయితొలగించండి


  11. అల్లాటప్ప కథల్ జిలేబి పలుకుల్మాస్టారు! భారూపమీ
    యల్లా క్రీస్తులు! రామచంద్రు సుతు లయ్యా శాస్త్రి,సేవింపుమా,
    విల్లమ్ముల్ ధరియించి జానకి కథన్ వింజోవిగన్ వీధుల
    న్నుల్లాసమ్ముగ పాడి రాముని హృదిన్నుంపార దేలించిరే

    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. మల్లన్నెవరను కొంటివి?
    యుల్లమునే దోచు సుకవి; యుత్సాహముతో
    నెల్లరు మెచ్చగను కవిత
    లల్లా రామునకు పుత్రుడయ్యా శాస్త్రీ !
    (కవితలల్ల + ఆ రామునకు And/or కవితలల్లు + ఆ రామునకు)

    రిప్లయితొలగించండి
  13. కల్లోలంబుల సాహచర్య మెపుడున్ కష్టాల బాధించగా
    నుల్లాసంబగు జీవితంబు గపన్నుత్సాహమున్ జూపుచున్
    చెల్లైపోవగ వారి బాధలు,యెదన్ చీకట్లు దొల్గించుచున్
    తెల్లంజేయుము వారి మోములిట,యీదేశంబు నందున్ జనుల్
    అల్లా,క్రీస్తులు,రామచంద్రు సుతులయ్యా శాస్త్రీ సేవింపుమా

    రిప్లయితొలగించండి
  14. కల్లోలంబుల సాహచర్య మెపుడున్ కష్టాల బాధించగా
    నుల్లాసంబగు జీవితంబు గపన్నుత్సాహమున్ జూపుచున్
    చెల్లైపోవగ వారి బాధలు,యెదన్ చీకట్లు దొల్గించుచున్
    తెల్లంజేయుము వారి మోములిట,యీదేశంబు నందున్ జనుల్
    అల్లా,క్రీస్తులు,రామచంద్రు సుతులయ్యా శాస్త్రీ సేవింపుమా

    రిప్లయితొలగించండి


  15. మల్లాటమ్ములవేల! నెల్ల ప్రభువుల్ మా స్వాములే దైవ మే!
    లొల్లిన్సేయనదేల!లాభము కదా లోకజ్ఞుడా ముఖ్యమౌ!
    గల్లాపెట్టిని డబ్బులాడ వలయున్ కాదే!జగత్సాక్షులీ
    యల్లా క్రీస్తులు, రామచంద్రు సుతు లయ్యా శాస్త్రి,సేవింపుమా!

    జిలేబి
    దురదస్య దురదః శార్దూలానామ్యాః :)

    రిప్లయితొలగించండి

  16. కల్లోల మానసులకును
    సల్లాపంబొల్క పల్కె చతురత నొక్కం
    డుల్లాస పూరితంబుగ
    "అల్లా రామునకు పుత్రుడయ్యా శాస్త్రీ!"

    రిప్లయితొలగించండి


  17. ఏమండీ జీపీయెస్ వారు

    ఆకాశవాణి వచ్చే వారపు సమస్య యేమిటి ?
    ఈ వారపు పూరణా విశేషాలేమిటి ?


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుఱ్ఱం జనార్దన రావు గారు ఉవాచ:

      "ఈమారు హైదరాబాద్ ఆకాశవాణి సమస్యాపూరణ విశేషమేమిటంటే ఎప్పటిలాగే ఎక్కువగా శంకరాభరణం సమూహం కవిమిత్రులతో బాటు ఎన్నెన్నో కొత్త కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. ప్రాచుర్యం విస్తరిస్తున్నందుకు సంతోషం!"

      తొలగించండి
    2. నా మాట నమ్మ వద్దు...వినికిడి... వచ్చే వారానికి సమస్య:

      "చేదు తెలుగు గొప్ప చెప్ప గలవె?"

      తప్పైతే నన్ను కొట్ట వద్దు...

      తొలగించండి
    3. సాధువాదమిదియె సాంగత్యమాంగ్లము
      పాదుకొనగ నింట బలముగాను
      రాదురాదు సాటి రమ్యభాషది కాదు
      చేదు, తెలుగుగొప్ప చెప్పగలమె?

      తొలగించండి
    4. " చేదు, తెలుగుగొప్ప చెప్పగలమె "

      తొలగించండి
  18. ఆకాశవాణి సమస్య
    చేదు తెలుగు గొప్ప చెప్పగలమె

    రిప్లయితొలగించండి
  19. మీకు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నపుడే పూరణలను సమీక్షీంచ గలరు. కళ్ళకు వత్తిడి ఇవ్వకండి.

    రిప్లయితొలగించండి
  20. ఈ రోజు ఆకాశవాణి వారి సమస్యా పూరణంలో వినిపించిన శంకరాభరణం బ్లాగ్ మిత్రుల పేర్లివి. అందరికి అభినందనలు, అంతకంటే ముందుగా గురువర్యులు శంకరయ్య గారికి ధన్యవాదములు. ఈ జాబితా లోని మొదటి ఆరు మంది మిత్రుల పద్యాలు మాత్రమే చదువ బడ్డాయి. మరింత మంది కవులు/కవయిత్రుల పద్యాలు చదివే అవకాశం కోసం ఈ కార్యక్రమపు సమయాన్ని పెంచ మంఅంటూ అందరం విడి విడిగా మెయిల్ ద్వారా ఆకాశవాణి వారిని కోరితే బాగుంటుందని అనుకుంటున్నాను.

    బొగ్గారం ఉమాకాంత ప్రసాద్ గారు
    బి వి వి హెచ్ వి ప్రసాద్ రావు గారు
    మంద పీతాంబర్ గారు
    చంద్రమౌళి రామారావు గారు
    చంద్రమౌళి సూర్యనారాయణ గారు
    బొగ్గారం చంద్రమౌళి గారు
    జిలేబి గారు
    బండకాడి అంజయ్య గౌడ్ గారు
    తిరుక్కొళ్ళూర్ శ్రీహర్ష గారు
    గుఱ్ఱం జనార్దన రావు గారు
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు
    ఆకుల శాంతి భూషణ్ గారు
    డా. బల్లూరి ఉమాదేవి గారు
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారు
    మాచవోలు శ్రీధర రావు గారు
    వీటురి భాస్కరమ్మ గారు
    ఈశ్వరప్ప గారు
    గుఱ్ఱం సీతాదేవి గారు
    విరించి గారు
    కొనగళ్ళ ఫణీంద్ర రావు గారు
    గుఱ్ఱం ప్రభాకర శాస్త్రి గారు
    పోచిరాజు సుబ్బారావు గారు
    ఆకుండి శైలజ గారు
    పై వారానికి సమస్య: "చేదు తెలుగు గొప్ప చెప్ప గలమె "
    ధన్యవాదములు.


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. వావ్ ! నెనరులండీ !

      ఆకాశవాణి వారు కూడా ఓ బ్లాగులో వచ్చిన వాటిని ప్రచురించితే బాగుంటుందనుకుంటా సమయాభావం తక్కువ వుండక పోవక చదవలేక పోవటానికి పరిష్కారంగా

      మరీ పదినిముషాలు చాల తక్కువ సమయం కేటాయించారు

      పై లిస్టులోని పేర్లని చదవడానికే పదినిమిషాలు పట్టేటట్టున్నది :)


      మదిమది సయి జేర్చి మత్తున దేల్చుచు
      హృదయ కుహుర మందు హృణి తొలగిచి
      మదిని హత్తు కొనెడు మధువుగ మేధను
      చేదు, తెలుగు గొప్ప చెప్ప గలమె!


      జిలేబి

      చేదు - లాగు అన్న అర్థంలో

      జిలేబి

      తొలగించండి


    2. ఈ క్రింది విన్నపాన్ని ఇవ్వాళ ఆకాశవాణి కి పంపించాను



      ఆకాశవాణి వారికి

      ఓ బ్లాగులో వచ్చిన పూరణలను ప్రచురించితే బాగుంటుందనుకుంటా సమయాభావం తక్కువ వుండక పోవక చదవలేక పోవటానికి పరిష్కారంగా + రాబోయే తరానికి మార్గదర్శకంగా.


      మరీ పదినిముషాలు చాల తక్కువ సమయం కేటాయించారు
      దయచేసి ముప్పై నిమిషాలకు పెంచవలసినది.


      ఇట్లు
      జిలేబి

      తొలగించండి
    3. ధన్యవాదములు శ్రీధర్ గారూ! మీ విన్నపము సరియైనదే! తప్పక అభ్యర్ధన పంపుదాము!

      తొలగించండి
    4. జిలేబీ గారూ:

      అంతకన్నా సులభోపాయము:

      సార్ ని అడుగుదాం... ప్రతి శనివారం "ఆకాశవాణి సమస్యా పూరణలు" అని ప్రత్యేక శంకరాభరణ శీర్షిక విడుదల చేస్తే ఎవరి పూరణలు వారు అక్కడ పోస్ట్ చేయవచ్చు...ఇష్ట పడితే...

      తొలగించండి

    5. వావ్ బెస్ట్ అండ్ ఈజీ సొల్యూషన్ !

      ఐఐటి బుర్రయా మజాకా !


      సూపర్!

      ఏమండీ కందివారు ఓకేనా ?

      జిలేబి

      తొలగించండి
    6. ధన్యవాదాలండి, జిలేబి గారు, సీతాదేవి గారు & ప్రభాకర శాస్త్రి గారు మంచి ఆలోచన.

      తొలగించండి
    7. నాకిదే ఆలోచన వచ్చి సమయం పెంచమంటూ విజ్ఞప్తి పంపాను.మరోమారు పంపుతాను.

      తొలగించండి
    8. నేను కుడా విజ్ఞప్తి పంపాను. అసలు ఆరోజుల్లో అరగంట ఉండేదని గుర్తు .

      తొలగించండి
  21. రసూల్ ఖాన్ తన మిత్రుడు
    రామశాస్త్రికి చెప్పిన విషయంబెట్టిదనిన :
    " పుల్లా రావా రాముని
    యల్లుండేనని పొరబడి యనుకుంటివిగా
    మల్లన్నే చెప్పె ! సుభా
    నల్లా ! రామునకు పుత్రుడయ్యా శాస్త్రీ !"


    రిప్లయితొలగించండి
  22. కందం
    తల్లడిల రామలక్ష్మణు
    లుల్లమ్ములు హయము బట్ట నుద్దండులుగన్
    జెల్లెడు లవుండును కుశుం
    డల్లా రామునకు పుత్రుఁ డయ్యా శాస్త్రీ!

    రిప్లయితొలగించండి
  23. ఉల్లమ్మందున మూడుయౌ మతములన్నొప్పారగా గొల్చుచున్
    నెల్లూరందున రామచంద్రుడను మా నేస్తమ్ము రాజిల్లగా
    బిల్లల్ యిద్దరు గల్గవారలకు తా బేర్లుంచె మోదమ్ముగా
    నల్లా,క్రీస్తులు,రామచంద్రు సుతులయ్యా శాస్త్రి సేవింపుమా

    రిప్లయితొలగించండి
  24. ఫుల్లాబ్జాక్షుడు రాముడు
    యుల్లమ్మున మెచ్చి సీతనొప్పుగ గొనగన్
    బిల్లలనొక్కడుయౌ కుశు
    డల్లా ! రామునకు పుత్రుడయ్యా శాస్త్రీ !"

    రిప్లయితొలగించండి
  25. 😊😊😊

    ముల్లాయొక్కడు తా మసీదు తలుపుల్ మూయించి "కాదో"యనెన్:
    విల్లాలో దొరగారొకండు పయిపున్ పీల్పించి "కాదో"యనెన్ :
    గుళ్ళోబాపడు దీపమార్పి చెవులన్
    గోకించి "నిక్కమ్మ"నెన్:
    "అల్లా క్రీస్తులు రామచంద్రు సుతు లయ్యా శాస్త్రి! సేవింపుమా!"

    రిప్లయితొలగించండి
  26. సమయాభావమయనకను
    సమయంబునుబెంపుజేసిచదువుడుసామీ!
    కమనీయంబుగబద్యము
    లమరులుజేజేలుగొట్టయాకసవాణిన్
    ఇట్లు
    పోచిరాజు సుబ్బారావు
    అలకాపురి,హైదరాబాదు

    రిప్లయితొలగించండి
  27. తల్లి యిలా సుతకుఁ గవల
    పిల్లలు లవకుశులు పేర్మిఁ పెద్దయ్యెను దా
    నుల్లం బలరంగఁ గుశుం
    డల్లా రామునకు పుత్రుఁ డయ్యా శాస్త్రీ

    [అల్లా = ఆహా/ ప్రసిద్ధి సూచకము ]


    సల్లాపంబులఁ జెల్లు నెట్లయిన శాస్త్రంబుల్ సమర్థించవే
    ఫుల్లాంభోజ ము ఖారవింద నయనా పూర్ణేందు బింబాననా
    కల్లల్ సుమ్మి వినిశ్చయమ్ముగను వాక్యంబుల్ వచింపంగ ని
    ట్లల్లా క్రీస్తులు రామచంద్రు సుతు లయ్యా శాస్త్రి! సేవింపుమా

    రిప్లయితొలగించండి
  28. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,


    శాస్త్రి ప్రశ్న :-

    పల్లెకు ప్రసిడెం టెవ్వరు ?

    పుల్లయ్య కుమారుడు గద . ముల్లా సాహెబ్ !
    ...................................................................

    ముల్లా సాహెబ్ జవాబు :-

    పుల్లయ్య " బేట నహి . అరె

    అల్లా !! " రామునకు పుత్రు డయ్యా శాస్త్రీ !

    రిప్లయితొలగించండి
  29. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,


    శాస్త్రి ప్రశ్న :-

    పల్లెకు ప్రసిడెం టెవ్వరు ?

    పుల్లయ్య కుమారుడు గద . ముల్లా సాహెబ్ !
    ...................................................................

    ముల్లా సాహెబ్ జవాబు :-

    పుల్లయ్య " బేట నహి . అరె

    అల్లా !! " రామునకు పుత్రు డయ్యా శాస్త్రీ !

    రిప్లయితొలగించండి
  30. మల్లయ్య పలికె నిట్లని
    యల్లా రామునకు పుత్రుడయ్యా శాస్త్రీ!
    కల్లలను బలుక నెప్పుడు
    నెల్లరకు న్జెప్పుమయ్య! యియ్యది యిపుడే

    రిప్లయితొలగించండి
  31. రిప్లయిలు
    1. కొల్లంగొట్టగ నోట్లు యన్య జనతా కూటమ్ము లాలింపగా
      పిల్లాపాపల తోడకూరిమిని తా పీర్లంచు టోపీలతో
      సల్లాపంబు సువార్తతోడ సఖుడౌ
      సాల్మన్ కు సంప్రీతిగా
      నల్లాక్రీస్తులు రామచంద్రు సుతులయ్యా శాస్త్రి సేవింపుమా!

      తొలగించండి
  32. ఎల్లరకు హితము బంచుచు
    చెల్లెడీ మాయూరి ప్రజల చిక్కులు మాన్పే
    ఉల్లాసపరుడు చూడం
    డల్లా రామునకు పుత్ర డయ్యా శాస్త్రీ !

    రిప్లయితొలగించండి

  33. .......సమస్య
    అల్లా క్రీస్తులు రామచంద్రు సుతు
    లయ్యా! శాస్త్రి! సేవింపుమా!

    సందర్భం:
    అయ్యా! ఈ స్వప్నానికి ఫల మేమి టని మీరు న న్నడుగకండి. ఆ అవకాశం మీ కీయబడలేదు. నేనే ముందుగా మిమ్మల్ని అడుగుతున్నాను. కాబట్టి చెప్పవలసిన వారు మీరే! వినవలసిన వాణ్ణి మాత్రమే నేను. సరేనా!

    ఉల్లాసంబున నొక్కనాడు ధర ది
    వ్యుల్ నవ్వులన్ దేలగా
    నల్లా క్రీస్తులు నొక్క వైపునను తా
    మా రామ పుత్రుల్ సదా
    ఫుల్లాబ్జాక్షులు నొక్కవైపు కబడీ
    పోటీల పాల్గొన్నటుల్
    తెల్లంజామున వచ్చె స్వప్న మొక టం
    తే! తెల్పు డేమో ఫలం!
    బల్లా క్రీస్తులు రామచంద్రు సుతు ల
    య్యా! శాస్త్రి! సేవింపుమా!

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    తెల్లంజాము= తెల్లవారుజాము..
    పాలమూరు మాండలికం

    రిప్లయితొలగించండి

  34. ........సమస్య
    అల్లా క్రీస్తులు రామచంద్రు సుతు
    లయ్యా! శాస్త్రి! సేవింపుమా!

    సందర్భం:
    అయ్యా! ఆత్మ స్వరూపు లందరూ ఆనందమయులే! వారినుండి నేర్చుకో వలసింది ఆనందమే గాని ఆరాటం కాదు సుమా!
    అలా నేర్చుకోవడమే నిజమైన సేవ. ఊదు బత్తీలు అంటించడం, కొబ్బరి కాయలు కొట్టడం త ప్పని కాదు గాని ప్రాథమిక సేవలే!
    ఆ స్థితినుండి మనం ఎదుగాలి.
    నిజమైన సేవ ఎవరు నేర్పుతా రంటే ఆ దివ్యానంద స్వరూపులే!
    అందరూ ఆ ఒకటే నేర్పుతున్నారు. అదే మంటే *ఆనందం*
    ఆ ఒక్కటే మనం నేర్చుకోలేక పోతున్నాం. ఎందుకంటే ఏడుపే మన కలవాటై పోయింది. అందుకే ఈ జన్మ పరంపర.

    అల్లా క్రీస్తులు రామచంద్రు లవి పే
    ర్లౌ.. నేర్చుటే సేవయౌ..
    నుల్లాసం బది వారె నేర్పెదరుగా!
    ఊద్బత్తు లంటించుటల్,
    లొల్లుల్ వెట్టుట, కల్లలాడుటలు మే
    లో.. సేవ లె ట్లౌనొకో!
    అల్లా క్రీస్తులు రామచంద్రు సుతు ల
    య్యా! శాస్త్రి! సేవింపుమా!

    ~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  35. కల్లలఁ జెప్పకు, మెవ్విది
    అల్లా రామునకు పుత్రుఁ డయ్యా శాస్త్రీ?
    అల్లా ముస్లిము వేలుపు
    తల్లి కుజ రఘుపతులకు తనయుడు కుశుడే

    రిప్లయితొలగించండి
  36. చిల్లర మాటలు పల్కకు
    చల్లగ జీవించు వారి సరసకు జీరీ
    కల్లలు నేర్పకు మెట్టుల
    అల్లా రామునకు పుత్రుఁ డయ్యా శాస్త్రీ?

    రిప్లయితొలగించండి
  37. అల్లరి జేయుచు మేజా
    బల్లలపై దూకుచుండె ,బాబరు !ఎవరీ
    పిల్లడు నీ సుతుడా ?,యా
    యల్లా! రామునకు పుత్రుడయ్యా శాస్త్రీ!!!


    తల్లిని దండ్రిని గొలుచుచు
    తల్లడము లెదురయిన నిల ధర్మము విడకు
    న్నెల్లరి కిహితమొ సగు వా
    డల్లా రామునకు పుత్రుడయ్యా శాస్త్రీ..!!!

    రిప్లయితొలగించండి
  38. ఎల్లరి మన్నన బొందిన
    తల్లి ధరణిజ తొలిచూలి ధన్యుండతడే!
    విల్లును బట్టిన యా కుశు
    డల్లా రామునకు పుత్రు డయ్యా శాస్త్రీ !
    ****}{}{****
    కుశుడు + అల్ల + ఆరామునకు
    అల్ల = ఆ; (That)

    రిప్లయితొలగించండి

  39. ........సమస్య
    అల్లా క్రీస్తులు రామచంద్రు సుతు
    లయ్యా! శాస్త్రి! సేవింపుమా!

    సందర్భం:
    భాషాభేదాలు ప్రాంతీయ భేదాలు మొదలైన వన్నీ మానవులను విడదీయడానికే వున్నాయి గాని కలుపడానికి కాదు.
    ఇవన్నీ దాటిన పోయిన వాళ్ళే దివ్యాత్మ స్వరూపు లౌతారు. వాళ్ళే సర్వదా ఆనందంగా వుంటారు. వాళ్ళకు సృష్టి యంతా ఒక క్రీడ.
    గెలుపుతో ఆనందించి నట్టే ఓటమి తోనూ ఆనందిస్తారు. మనం గెలుపుతోనే కదా!
    నిత్య సత్యమైన ఆనందానికి మన కన్నీ అడ్డంకులే! (కుల మతాదులు)
    పరతత్వాన్ని మాత్రమే గుర్తుంచుకుంటే పై భేదా లేవీ గుర్తుండవు. మనమూ దివ్యులమే ఐపోతాము. జీవితమంతా క్రీడగానే మారిపోతుంది.

    ఎల్లల్ భాషలు ప్రాంతముల్ కుల మతా
    లీ జాతు లీ రీతులున్
    కల్లల్ గాని నిజంబు లీ ధరణిలో
    కాబోవటంచున్ సదా
    యుల్లాసంబున దివ్యు లుంద్రు కద! క్రీ
    డోత్సాహులై.. చూడరో!
    అల్లా క్రీస్తులు రామచంద్రు సుతు ల
    య్యా! శాస్త్రి! సేవింపుమా!

    ~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి

  40. ..........సమస్య
    అల్లా రామునకు పుత్రు డయ్యా! శాస్త్రీ!

    సందర్భం:
    శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారికి.. సమాధానంగా..

    తెల్లారకున్న నేమీ!
    తెల్లారకపోవ నేమి! దివ్యంబగు నా
    యుల్లాసముకోసమె మరి..
    "అల్లా రామునకు పుత్రు డయ్యా! శాస్త్రీ!"

    ~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  41. ఓ సంఘసంస్కర్తయైన రామచంద్రుల వారు గుడిలో వారి పిల్లల పేర్లతో అర్చన చేయించడానికి వచ్చినపుడు పిల్లల పేర్లువిని ఆశ్చర్యపడి శాస్త్రి యన్న పేరుగల పూజారి తో ఆలయ ధర్మకర్త వారి గురించి వివరించి వారి పేర దైవాన్ని సేవించుమని
    జెప్పు సందర్భం :

    పిల్లల్లేక యనాథ లిద్దరిని తృప్తింబెంచ గైకొంచుఁ దా
    నెల్లల్లేని ప్రశాంత చిత్త గతుడై యిల్లాలి సౌజన్యతన్
    ముల్లా యేసుల పోలు పిల్లలనుచున్ మోదాన నామాలిడె
    న్నల్లా క్రీస్తులు రామచంద్రు సుతు లయ్యా శాస్త్రి! సేవింపుమా.

    రిప్లయితొలగించండి
  42. అల్లా చంద్రయ్య యనగ
    "అల్లా రామునకు పుత్రుఁ డయ్యా శాస్త్రీ"
    అల్లా యె యింటిపేరౌ
    నల్లా యన మహ్మదీయుడను భ్రమ కలుగున్
    (కొన్ని ఇంటి పేర్లు ఇలా ఉంటాయి. వాటికి అర్థం తెలియదు)

    రిప్లయితొలగించండి
  43. చెల్లిని "కుశుడెవ" డన్నా
    డల్లా ! "రామునకు పుత్రుడయ్యా శాస్త్రీ"
    ఎల్లరకు తెలియుననె మా
    చెల్లి "శబా"సంచు శాస్త్రి చెల్లిని మెచ్చెన్
    (పల్లెలలో పూర్వం స్త్రీలు "ఏందల్లా ! చెప్పండల్లా" మొదలైన పదాలు వాడుతూ ఉండే వారు . అది నాగరికత గల ప్రయోగంగా చూడకున్నా ఇప్పటికీ వాడుతూనే ఉంటారు. వారి భాష వారిది. మనం ఆనందించాలి. నా దృష్టిలో ఆ అందమైన పదాన్ని పద్యాలకి స్వీకరించినా తప్పు లేదు )

    రిప్లయితొలగించండి
  44. నెల్లూరందున పుట్టి పెర్గితినినే నెర్జాణ లాడించగా
    కల్లాకప్టము లేక త్రుళ్ళితినినే కల్కత్త ప్రాంతమ్ములో
    తెల్లారంగను వింటి దుర్భరముగా తెల్గాణ రాష్ట్రమ్ములో:👇
    "అల్లా క్రీస్తులు రామచంద్రు సుతు లయ్యా శాస్త్రి! సేవింపుమా"

    రిప్లయితొలగించండి