12, ఫిబ్రవరి 2018, సోమవారం

సమస్య - 2595 (అనృతమ్ములఁ బల్కు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అనృతమ్ములఁ బల్కువాఁడె యారాధ్యుండౌ"
(లేదా...)
"అనృతమ్ముల్ గడు నేర్పునన్ బలుకువాఁ డారాధ్యుఁడౌ సత్సభన్"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

114 కామెంట్‌లు:


  1. అనవసరముగా పల్కుచు
    మన తలలన్ దినుచు పనికి మాలిన తలపుల్
    మనమదిలో చేర్చుచు హా!
    యనృతమ్ములఁ బల్కువాఁడె యారాధ్యుండౌ!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "అనవసరముగన్ బల్కుచు" అనండి.

      తొలగించండి
  2. కనకము మానము ప్రాణము
    కనుగొని గోబ్రాహ్మణులను కాచుట కొఱకై
    వినుమా! శుక్రుని నీతియు:
    "అనృతమ్ములఁ బల్కువాఁడె యారాధ్యుండౌ!"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వారిజాక్షులకూ, వైవాహములకూ చోటు దొరకలేదు...క్షంతవ్యుడను:)

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      శుక్రనీతిని ప్రస్తావిస్తూ చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
      మూడవ పాదాన్ని "వనితలతో వివహములో" అంటే సరి!

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారి సవరణతో (అన్నిటికీ చోటు దొరకునట్లు):

      కనకము మానము ప్రాణము
      కనుగొని గోబ్రాహ్మణులను కాచుట కొఱకై,
      వనితలతో, వివహములో,
      "అనృతమ్ములఁ బల్కువాఁడె యారాధ్యుండౌ!"

      🙏🙏🙏

      తొలగించండి
    4. ప్రభాకర శాస్త్రి గారూ,
      సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    5. ఆహా శాస్త్రి గారు శుక్ర నీతియే యనుకుంటే దానిని మించి పోయింది మీ నీతి!
      ఆయన పాప మాయా సందర్భములలో బొంక నఘము లేదన్నాడు. కానీ మీరు బొంకిన వాడే యారాధ్యు డంటున్నారు. మిగిలిన వారు కారు!

      తొలగించండి
    6. పోనీ లేద్దురూ...దీనిని "వక్ర నీతి" అందాం!

      తొలగించండి


  3. అనృతమ్ముల్ గడు నేర్పునన్ బలుకువాఁ డారాధ్యుఁడౌ సత్సభ
    న్ననఘా మాలిని దేశ మెల్ల గనుమా నమ్మన్ దగున్ బల్కులన్ !
    మననేతల్ తల కాయ లన్గనుము సామ్యంబేది ? సౌమ్యంబెటన్ ?
    ఘనమై నమ్మితి రే జనాళి శుభముల్ కల్గింతురే ? భ్రాంతి యే !


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. తనయుల పెంచును ప్రియముగ
      తనువంతయు ధార పోసి తన్మయ మొందున్
      కనికరము లేని పుత్రుడు
      అనృతమ్ములఁ బల్కువాఁడె యారాధ్యుండౌ

      తొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    తన పాండిత్యము రంగరించి యొకచో ధర్మంబధర్మంబుగా ,
    తన ధీశక్తి మథించి సూనృతమసత్యంబట్లు దీపింపగా
    జనముల్ మెచ్చగ , పృచ్ఛకుండిడు సమస్యల్ గాంచి యిట్లంటిరా ?
    "అనృతమ్ముల్ గడు నేర్పునన్ బలుకువాఁ డారాధ్యుఁడౌ సత్సభన్"
    గనఁ గాబోదు ! వధాని చాతురిని బల్కన్ సత్యమే నిల్చెడున్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. అనక వినక మదిఁ దలపక
      అనృతమ్ములఁ ., బల్కువాఁడె యారాధ్యుండౌ
      ఘన సత్యవాక్యమిలలో !
      గన మన రామయ్యఁ బోలు ఘన యశము గొనున్ !!

      మైలవరపు మురళీకృష్ణ మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
    3. మైలవరపు వారి రెండవ పూరణ విరుపుతో అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    4. తనకున్ దగ్గరఁ జేరి ముద్దులిడి , " *తాతా ! నేను నిద్రింపగా*
      *జనెదన్ నీ కథ విన్న* " యంచనగ *బూచాడల్లదే వచ్చుచుం*...
      *డె* నటంచున్ బెదిరించి పల్కి మనుమన్ నిద్రింపగా జేయుచో
      ననృతమ్మున్ గడు నేర్పునన్ బలుకువాఁ డారాధ్యుఁడౌ సత్సభన్ !!

      ( పద్యంలో సత్సభన్ పదాన్ని ముసలాయన సభలో కూడా గౌరవింపబడునని భావింప మనవి.. 🙂🙏) నమోనమః

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  5. జనవర వినుమా!యాపద
    లనుచిక్కినవేళ ప్రాణరక్షణ కొరకై!
    విను,విశ్వ శ్రేయమునకై
    యనృతమ్ములఁ బల్కువాఁడె యారాధ్యుండౌ

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి

  6. అనృతము జేయుము మాటల
    "అనృతమ్ములఁ బల్కువాఁడె యారాధ్యుండౌ!"
    అనృణము నుండి జనాళిన్,
    అనృశంస!నరేంద్ర మోడి ! ఆదుకొనుమయా !



    ಜಿಲೇಬಿ

    రిప్లయితొలగించండి
  7. కందం
    మన శంకరాభరణమన్
    ఘనకీర్తిని గన్న బ్లాగు గట్టెక్కంగన్
    వినగా సమస్యలనబడు
    ననృతములన్ బల్కు వాఁడెయారాధ్యుండౌ!

    (గురుదేవులకు క్షమాపణలతో)

    రిప్లయితొలగించండి
  8. ధన మాన ప్రాణములు దో
    చిన సైపక రక్షఁజేయ శీఘ్రంబే తా
    ల్చిన రౌద్రాకారుండై
    యనృతంబులుఁబల్కువాఁడె యారాధ్యుండౌ

    రిప్లయితొలగించండి
  9. జననికి తన నిజరూపము
    దన నోటను జూపిజన్మ ధన్యతగూర్చన్
    మనుదిన లేదని నటనను
    ననృతముల బల్కువాడె యారాధ్యుండౌ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మనోహరమైన పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏🙏🙏

      తొలగించండి


    3. కృష్ణం వందే జగద్గురుం !

      అద్భుతమండీ సీతా దేవి గారు !


      జిలేబి

      తొలగించండి
    4. అక్కయ్యగారూ! భక్తపూర్వకమైన పూరణ. అభివందనములు.

      తొలగించండి
    5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    6. ధన్యవాదములు జిలేబిగారూ, సహదేవుడు గారూ!🙏🙏🙏

      సహదేవులకు చిన్న విన్నపము!
      మా పుట్టింట నేను ఆఖరి సంతానము. మెట్టినింట చివరి కోడలిని! అందుచేత చెల్లెలుగా పిలిపించుకోవడమే అలవాటు. మీరు అక్కయ్యగారూ అంటూఉంటే క్రొత్తగా ఉంది! మీ అభిమానానికి ధన్యవాదములు!
      కాని సీతాదేవి గారంటేనే నాకు సౌకర్యంగా ఉంటుందన్ మనవి! అన్యధా భావించవద్దు! 😊😊😊😊😊

      తొలగించండి
    7. మీరు గౌరవనీయస్థానంలోనూ, వయసులోనూ పెద్దవారని అలా సంభోదించాను. క్షమించండి ఇకపై మీకు అసౌకర్యం కలిగించను.

      తొలగించండి
    8. సహదేవుడు గారూ! క్షమార్పణలు అవసరం లేదు! మీరు నన్ను అమ్మాయని పిలవవచ్చును! ఆ పిలుపు నా కలవాటయినదే!
      పైగా మనకందరకూ పెద్దక్కయ్య రాజేశ్వరిగారున్నారు కదా! ఆవిడ ఉన్నతస్ధానాన్ని అలాగే ఉండనిద్దాం! 🙏🙏🙏🙏

      తొలగించండి
    9. నా research ప్రకారం రాజేశ్వరి గారు నాకన్నా చిన్న.. 😊

      తొలగించండి


    10. జీపీయెస్ వారు

      మీరెంత వయోకుర్రోళ్ళండీ ?


      జిలేబి

      తొలగించండి
    11. మీకన్నా పది సంవత్సరాలు పెద్ద లెండి కనీసం

      👏👏👏

      తొలగించండి
    12. పెద్దవారినైనా చిన్నవారినైనా అమ్మా అని పిలవడం నాకు చాలా ఇష్టం. కాకపోతే కొందరికి అసౌకర్యంగా ఉంటుందని అలా పిలవను .

      తొలగించండి
  10. అనృతమ్ముల్ బలువృత్తులందుఁ గనమే యర్థంబు లార్జించగా
    ననృతమ్ముల్ గనఁ గొన్ని సంఘటనలం దామోదయోగ్యంబులౌ
    ననృతోక్తుల్ విలసిల్లు నట్టి కృతు లాస్వాద్యంబులౌ నట్లొప్పు న
    య్యనృతమ్ముల్ గడు నేర్పున్ బలుకు వాడారాధ్యుడౌ సత్సభన్.

    రిప్లయితొలగించండి

  11. అక్కా! తెల్లని తల్లి భారతి సభా ప్రాంగమ్ము మారెన్గదా !
    పక్కాపచ్చని రంగు బోయె నెచటన్? భామా ! జిలేబీ ! అరే !
    టెక్కుల్హెచ్చెను శంకరాభరణమున్ టెంప్లేటు లే మారె! నెం
    చక్కా కొత్తగ వచ్చె యామికగ సంచారమ్ము జేయన్ గదా :)


    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పద్యాన్ని చూసి మళ్ళీ పాత టెంప్లేటునే ఎన్నుకున్నాను. కలర్ బ్లైండ్‍నెస్ కారణంగా గతంలో ఏ రంగుతో ఉన్నదో గుర్తులేదు.

      తొలగించండి
  12. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2595
    సమస్య :: *అనృతమ్మున్ గడు నేర్పునన్ బలుకువాఁ డారాధ్యుడౌ సత్సభన్.*
    అబద్ధాలను తెలివిగా పలికేవాడు గొప్ప సభలలో గౌరవింపబడుతాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: మహా శివరాత్రి పండుగ నాడు అర్ధరాత్రి వేళ పరమ శివుడు ఒక లింగాకారంగా ఆవిర్భవించినాడని ఈశాన సంహితలో చెప్పబడియున్నది. బ్రహ్మ విష్ణువు నేను గొప్ప నేను గొప్ప అని వాదులాడుకొంటూ ఆ సమయంలో ఉద్భవించిన శివుని లింగరూపమునకు ఆదిని గానీ అంతమును గానీ ముందుగా ఎవరు చూడగలరో వారే గొప్పవారు అని ఒక నిర్ణయానికి వచ్చినారు. విష్ణువు వరాహ రూపంలో క్రిందికి వెళ్లగా బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్లినాడు. ఎంతగా ప్రయత్నించినా ఆ శివలింగముయొక్క ఆదిని గానీ అంతమును గానీ ఇద్దరూ చేరుకోలేకపోయారు. ఐతే బ్రహ్మ *నేను చూచినాను* అని అబద్ధం చెబుతూ తనకు సాక్ష్యం చెప్పడానికి మొగలిపువ్వును కూడా ఒప్పించాడు. శివుడు ప్రత్యక్షమై అబద్ధ మాడిన బ్రహ్మకు యజ్ఞములలో పూజ లేకుండా చేశాడు. కాబట్టి అనృతములను అంటే అబద్ధములను మాట్లాడేవాడు ఏ విధంగా ఆరాధింపబడుతాడు ? అని ప్రశ్నించే సందర్భం.

    వినుమయ్యా! శివరాత్రి నాటి కథ నా విష్ణుండు నా బ్రహ్మయున్
    *ఘనుడన్ నే నని కాదు నే ననగ* , లింగ మ్ముద్భవింపంగ , దా
    నిని యాద్యంతము జూడ నేగి రట , గానీ జూడలేరైరి , యై
    నను నే జూచితి నం చసత్యమును తా నా బ్రహ్మ బల్కన్ , శివుం
    డనె యజ్ఞమ్మున పూజ యుండదని బ్రహ్మన్ గూర్చి , యే రీతి దా
    *ననృతమ్మున్ గడు నేర్పునన్ బలుకువా డారాధ్యుడౌ సత్సభన్ ?*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (12-2-2018)

    రిప్లయితొలగించండి
  13. జనము ల లో చులకన గద
    ఆఁ నృతమ్ముల బల్కువాడె ;యారా ధ్యుoడౌ
    న న యము సత్యము బల్కుచు
    విన యం బు న మాసలు వా డు విశ్వ ము నం దు న్

    రిప్లయితొలగించండి
  14. వినయము తానటియించుచు
    జనులను వంచించి వారి సత్కృప తోడన్
    ఘనమగు పదవులు పొందిన
    ననృతమ్ములఁ బల్కువాఁడె యారాధ్యుండౌ.

    రిప్లయితొలగించండి
  15. కనుమా! శుక్రుని నీతియౌ: కనకమున్ కాపాడి ప్రాణమ్ములన్
    వనితల్ గోవుల బ్రాహ్మల న్నరయుచున్ వైవాహికమ్ముల్ సదా
    చనగన్ జేసెడి వేళలన్ విధిగ నాచారమ్ములన్ దీర్చుచు
    న్ననృతమ్ముల్ గడు నేర్పునన్ బలుకువాఁ డారాధ్యుఁడౌ సత్సభన్

    అరయు = రక్షించు
    చను = జరుగు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      శుక్రనీతిని సమగ్రంగా వివరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. మనుజులు కలియుగమందున
    వినిపించుకొనక హితమును పెడచెవిఁ బెట్టున్
    శని వశులౌదురు వారికి
    యనృతమ్ములఁ బల్కువాఁడె యారాధ్యుండౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "వారికి। ననృతమ్ముల..." ఆనండి.

      తొలగించండి
  17. మానము ప్రాణము పెండ్లిన
    ననృతమ్ములు బల్కు వాడె యారాధ్యుo డౌ
    వినుమిది పెద్దల మాటగ
    ననృతము లేబలుక వచ్చు నాపద లందున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పెండ్లిని" అనండి.

      తొలగించండి
  18. వనితల యారోపణపై
    తనయుని దా మందలింప దల్లి యశోదే
    'కనుమా! నేనెఱుగ ననుచు '
    "ననృతమ్ములఁ బల్కువాఁడె యారాధ్యుండౌ"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'యశోద+ఏ' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

      తొలగించండి
  19. కునుకున్ దీర్చుచు నాలసమ్ముగను నాకుల్ కూరలన్ తర్గుచున్
    పనులన్ జేయుచు గిన్నెలన్ కడిగి తాభార్యన్ సమాళించుచున్
    పనికిన్ జేరుచు జాగుగా దొరల శాపాలన్ ప్రతీక్షించుచు
    న్ననృతమ్ముల్ గడు నేర్పునన్ బలుకువాఁ డారాధ్యుఁడౌ సత్సభన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      భార్యాబాధితుని అవస్థను చక్కగా వర్ణించారు. పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  20. telugu velugu
    --------
    శంకరార్యుల బ్లాగున సముచితులగు
    కవివ రేణ్యులు దమదమ కవనములను
    పొందు పఱచుచు నుండిరి ప్రౌ ఢముగను
    వారి రచనలు సక్కగ బత్రిక యగు
    తెలుగు వెలుగున వెలుగుత ! దినముదినము

    రిప్లయితొలగించండి
  21. తనువుల గాచెడి వైద్యుడు
    తన రోగుల బాగు కొఱకు తపియించుచునే
    వెనుదీయక నాడగ దగు;
    "ననృతమ్ములఁ బల్కువాఁడె యారాధ్యుండౌ"

    రిప్లయితొలగించండి
  22. ఘనమగు సమరము నడుమన
    గునగున ధర్మజుడరిగెను గురువరు కడకు
    న్ననువగు నసత్య మాడెను
    "ననృతమ్ములఁ బల్కువాఁడె యారాధ్యుండౌ"

    రిప్లయితొలగించండి
  23. అనిలో ధర్మ విజయమును
    గొనగన్నా ధర్మజుండె గొంకెను గదరా !
    కనగంబాండు సుతులకు
    "న్ననృతమ్ములఁ బల్కువాఁడె యారాధ్యుండౌ"

    రిప్లయితొలగించండి
  24. రవీందర్ గారూ,
    సమస్యపాదాన్ని ప్రశ్నార్థకంగా మార్చిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. విను వారును నుడివెడు వా
    రును గర మరుదు సుహితము లురుతర కటువులై
    నను వచనములఁ బ్రియ తరము
    లనృతమ్ములఁ బల్కువాఁడె యారాధ్యుండౌ


    ఘను లీ రాజులు రాగ తామస గుణైక భ్రాజమానుల్ సుమీ
    కన శక్యంబె మనో గతమ్ములను నాక క్ష్మాధి నాథుండునున్
    స్వన గాంభీర్య విరాజిత ప్రణత సత్సంభావ్య వాక్కుల్ పరా
    గనృతమ్ముల్ గడు నేర్పునం బలుకువాఁ డారాధ్యుఁడౌ సత్సభన్
    [పరాక్ + అనృతమ్ముల్ =పరాగనృతమ్ముల్: అనృత బాహ్యములు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. పరాఙ్ముఖుడు వలె పరాగనృతమ్ముల్ ప్రయోగం ప్రశంసనీయం. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  26. మిత్రులందఱకు నమస్సులు!

    అనృత మ్మాడఁగ రా; దవశ్యమగుచో, నాపద్వ్యథల్ గూర్చెడిన్
    ధన జీవ ప్రతిపత్తి భంగములలోఁ, దన్వంగులన్, బాణిపీ
    డనలన్, భీత పయస్వినీ ద్విజుల నౌదార్యమ్మునన్ గావఁగా

    ననృతమ్ముల్ గడు నేర్పునన్ బలుకువాఁ డారాధ్యుఁడౌ సత్సభన్!

    రిప్లయితొలగించండి
  27. వినుమా! గూర్చెద పెక్కులాభముల
    వైవిధ్యమ్ముగా నోటుతో
    నను మీరందరు నెన్నుకోవ తొలు
    తానందాంధ్ర దేశంబు గ్ర
    న్నన పర్యాటక వాడగన్ పిదప
    జ్ఞానాంధ్రమ్ము జేతు సదా
    పనులన్ క్రొత్తవి దెత్తునే నిచట వ్యాపారంబువర్ధిల్లగన్
    వనరుల్ బెంచెద నిత్తునే జనులకున్
    వైద్యంపు భీమాలనే
    యనుచు న్నాశల బెంచుచున్ బ్రజల
    మాయల్జేయగా నాడెడిన్
    యనృతమ్ముల్ కడునేర్పునన్ బలుకు వాడారాధ్యుడౌ సత్సభన్

    రిప్లయితొలగించండి
  28. ఒంటి కన్నుగల తిరుమల రాయలవారు వికటకవి తెనాలి రామలింగని గని తనపై పద్యము జెప్పమని గోరగా వారు వ్యంగంగా పద్యము జెప్పే సందర్భంగా..

    మత్తేభవిక్రీడితము

    కనగన్ గన్నొకటుండ మీకు సతితో గన్పించ నీశుండవే! 
    వినుమా శుక్రుడవొక్కడైన! ప్రభు పువ్విల్తుండవే రెంటితో! 
    ననుచున్ నా తిరురాయలున్ బొగడె నాహా! రామలింగండట
    న్ననృతమ్ముల్ గడు నేర్పునన్ బలుకువాఁడారాధ్యుఁడౌ సత్సభన్!

    రిప్లయితొలగించండి
  29. క్రొవ్విడి వెంకట రాజారావు:

    తనపనులకు కొనియాడుచు
    ననవరత మతిశయమ్మగు నగ్గింపులతో
    నిను యింద్రుడు చంద్రుడనుచు
    ననృతమ్ముల బల్కువాడె యారాథ్యుండౌ

    రిప్లయితొలగించండి
  30. Vj entertainments చానెల్‍లో నా ఇంటర్వ్యూ....
    https://youtu.be/Vxnid3m-PDI

    రిప్లయితొలగించండి
  31. అనయము సత్యమె పలుకుచు,
    ననునయమున ప్రియముఁ బల్కి,యప్రియహితముల్
    గొనకొని నుడివెడుఁబట్టుల
    ననృతమ్ములుఁ బల్కు వాడు నారాధ్యుండై.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
      న బ్రూయాత్ సత్యమ ప్రియం"
      అను హితోపదేశశ్లోకానుసారం.

      తొలగించండి
    2. సార్! మీరు చెప్పినది నిజమే!


      గీతలో "అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియ హితం" అని ఉన్నది కదా...ఇది దాదాపు అసంభవం...

      తొలగించండి
  32. మనుగడ లాపద జేరిన?
    ననృతమ్ములు బల్కువాడె!యారాధ్యుండౌ
    తనవలె పరిరక్షణకై
    ఘానముగ యితరులను జూచు కరుణా మయుడే!

    రిప్లయితొలగించండి
  33. దయచేసి నాల్గవ పాదము ఘనముగ అని చదువ ప్రార్థన

    రిప్లయితొలగించండి
  34. పనిగొని పదవుల కెగపడి
    కనకము గురిపింతు మీకు కాదనకుడు న
    న్ననునతడు పూజ్యుడయె! నే
    డనృతమ్ములఁ బల్కువాఁడె యారాధ్యుండౌ

    రిప్లయితొలగించండి
  35. 1. కనగా నేడిల రాజకీయమను సంగ్రామంబులో గెల్వగా
    జనులన్ నమ్మగ బల్కుచున్నకట విశ్వాసంబునే నింపుచున్
    యనృతమ్ముల్ గడు నేర్పునన్ బలుకువాఁ డారాధ్యుఁడౌ సత్సభన్!
    ఘనమౌ గద్దెల నెక్కగా దొరల నాల్కల్ సిగ్గునే వీడులే

    2*తన యాలెంతయు* కొట్టితిట్టినను సంతాపంబు కల్గించినన్
    ఘనమౌ చీరలు హారముల్ కొనగ సంగ్రామంబు సృష్టించినన్
    తనసంసారము గొప్పదంచు మగడుత్సాహంబుతో పొంగుచున్
    *యనృతమ్ముల్ గడు నేర్పునన్ బలుకువాఁ డారాధ్యుఁడౌ సత్సభన్*

    తిరుక్కోవళ్లూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  36. వినమా! నామతమెంచి జూడగను నీ విశ్వమ్ములో బాడియే
    యనుమానమ్మిసు మంతలేదు గనుమా!యాలోచనే జేయుమా!
    జన సామాన్యము రూఢియైన దిదియే! సాగన్నిరాటంకమై!
    యనృతమ్ముల్ గడు నేర్పునన్ బలుకు వాడారాధ్యుడౌ సత్సభన్

    రిప్లయితొలగించండి
  37. అష్టకాల నరసింహరామ శర్మ గారి అష్టావధానంలో ఉన్నాను. అందువల్ల బ్లాగుకు అందుబాటులో లేను.

    రిప్లయితొలగించండి
  38. కనులగాంచితినీపూటకందిశంక
    రయ్యగారిముఖాముఖియయినభాష
    ణమ్ముయూట్యూబునందున,నిమ్ముసాగె
    వారిప్రతిభనుగూర్చినబలుకులెన్నొ

    రిప్లయితొలగించండి
  39. కనివిని యెరుగని రీతిగ
    తనతల్లిని మభ్యపరచి తనరుచు నిలలో
    జనులను గాచెను వెన్నుడు
    అనృతమ్ములఁ బల్కు వాడె యారాధ్యుండౌ!!!

    రిప్లయితొలగించండి
  40. గురువు గారు ఈ రోజు యు.ట్యూబ్ లో మీ ముఖాముఖి
    కార్యక్రమం చూసాము చాలా బాగున్నది.

    రిప్లయితొలగించండి
  41. అభినందనలు !💐💐👍👌💐💐 ఇంటర్వ్యూ చాలా స్పష్టంగా వచ్చింది. స్పష్టంగా వినబడింది.మీకు జేజేలు,జోహార్లు, ధన్యవాదాలు ! పుస్తక రూపంలో తేవాలన్న ఆలోచన కొత్తది కాకున్నా,మీనోట వినటం చాలా సంతోషం!పాల్గొన్న కవిమిత్రులు కూడా విడివిడిగా వారివారి పూరణలతో శతకాలు,ద్విశతకాలు,త్రింశతకాలు etc.వెలువరించ వచ్చు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. యూ ట్యూబు లింకు ఇవ్వగలరు


      జిలేబి

      తొలగించండి

    2. అదురహో ఇంటర్వ్యూ !


      చేసిరి శంకరాభ రణ సేవను మీదగు రీతి లోనయా
      వాసము జేరి సత్కవులు వాసిని రాసిని పెంచి రయ్య! సా
      వాసము పేర్మి గా బడసి వాహిని యై వెలసెన్ బిరాదరీ !
      మీ, సములన్ గనంగఁ గలమే యిక మేదిని నెందుఁ గాంచినన్!

      జిలేబి

      తొలగించండి
  42. వినుడోయీ జనులార మీరలు మహా విజ్ఞుల్ సదా మీకు సే
    వనముల్ జేసెడు నన్ను నాయకునిగా ప్రార్థింతు జేపట్టగన్
    కనకమ్మున్ పొనరింతు మీ బ్రదుకులన్ కాదోయి కల్లంచు తా
    ననృతమ్ముల్ గడు నేర్పునన్ బలుకువాఁ డారాధ్యుఁడౌ సత్సభన్.

    రిప్లయితొలగించండి
  43. అనువుల్ జిక్కిన వెంటనే గురువు నాహాయంచు దూషించుచున్
    కనినన్ దూరుచు మూలలన్ మఱుగుచున్ కాఠమ్ములన్ రువ్వుచున్
    చనిపోవంగనె పాటలన్ నుతుల వాచాలత్వముం జూపుచు
    న్ననృతమ్ముల్ గడు నేర్పునన్ బలుకువాఁ డారాధ్యుఁడౌ సత్సభన్

    రిప్లయితొలగించండి
  44. మాస్టరుగారూ! మీకు మరియు ముఖాముఖిని ప్రసారము చేసిన వారికి అభినందనలు.

    పొత్తపుటాలోచనయే
    చిత్తములో మెదలె మీకు శ్రీకరముగనే
    విత్తము సమకూరునులే
    మొత్తము కవి మిత్రులె యా "మోదము" దెలుపన్.

    రిప్లయితొలగించండి



  45. ధనమది చేజారునపుడు

    వనితలవిషయంబునందువసుమతి యందున్

    మనువు,గోరక్షణముల

    అనృతమ్ములఁ బల్కువాఁడె యారాధ్యుండౌ

    రిప్లయితొలగించండి
  46. ముత్తుకూరు హైస్కూలులో రెడ్డిగారబ్బాయి (1953):

    కునుకుల్ దీయుచు క్లాసునందునను తా కూర్చుండి లాస్ట్ బెంచిలో
    కనులన్ గొట్టుచు సత్యభామలకటన్ కన్గొంగ ఫస్ట్ బెంచిలో
    కొనుచున్ దాల్చగ నల్లరంగులవియౌ కూలింగు గ్లాసుల్లతో
    ననృతమ్ముల్ గడు నేర్పునన్ బలుకువాఁ డారాధ్యుఁడౌ సత్సభన్

    రిప్లయితొలగించండి