13, ఫిబ్రవరి 2018, మంగళవారం

న్యస్తాక్షరి - 51 (శి-వ-రా-త్రి)


అంశము - శివస్తుతి
ఛందస్సు- తేటగీతి (లేదా) ఆటవెలది.
న్యస్తాక్షరములు... 
అన్ని పాదాల యత్యక్షరాలు వరుసగా "శి - వ - రా - త్రి" ఉండాలి.

112 కామెంట్‌లు:


  1. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షల తో


    శివశివ యనుమమ్మ మనసా చిగిరిలగ శి
    వకవి వలె! నాది యోగిగ వరము గా వ
    రాకములను గాచునతడు ! రాధనమును
    త్రికరణపు రీతి బడయ నింతి, సయి ధాత్రి !



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఆద్యౌ వళిః' అని బాపూజీ గారు గుర్తుచేసినట్లు మీరు న్యస్తాక్షరాలు పాదాది నుంచడం సరియైనదే.

      తొలగించండి


  2. శివ శివ యనుమమ్మ మనసా శివకవి వలె,
    వర్ధ నుడనాది యోగియు వరము లివ్వ !
    రాధనముల నిచ్చెడు శివ రాత్రి యిదియె
    త్రికరణపు రీతి బడయ ధాత్రి, నిజముగను !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      న్యస్తాక్షరాలను పాదాదిని, యతిస్థానంలో ప్రయోగించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  3. చేయ భక్తి శ్రద్ధల తోడ శివుని పూజ
    వరద పారినట్లు మనకు వరము లిచ్చు
    కాశి శతకోటి పుణ్యాల రాశి గాదె?
    యజుని సమదైవ మేలేడు త్రిజగములను!

    రిప్లయితొలగించండి
  4. జిలేబి గారు! పాదాద్యక్షరాలా?యత్యక్షరాలా?రెండూ ఒకటేనా?రెండు విధములా పూరింప వచ్చా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. జనార్ధనరావు గారికి


      సోడాబుడ్డి కళ్ళద్దాలతో
      అంత్యాక్షరాలనుకుని కొంత ఓవర్ యాక్షన్ చేసి పాద ఆది అంత్యాక్షరాలతో మొదలెట్టి " రా" దగ్గర ఆగిపోయి దిక్కుతోచక మూడో పాదం లో రా ని విడిచి ఆపై కళ్ళు ఊనించి చూసి ఓహో యతి స్థానపు అక్షరాలా అడిగినది అనుకుని మళ్ఖీ మొదలెట్టా ఆది యతి స్థానాలలో :)


      అంతా శివరాత్రి మహిమ :)

      యతి స్థానపు అక్షరాలతో చేస్తే చాలనుకుంటా


      జిలేబి

      తొలగించండి
    2. పండగ అంటేనే భయం నాకు... న్యస్తాక్షరి రాబోతోందని...😢

      తొలగించండి
    3. శ్రీహర్ష గారి విషమవృత్తము

      *రేపటి మహా శివరాత్రి సందర్భంగా విశ్వేశ్వరునికి (విష నైవేద్యం) విషమము*

      *మణులన్ గూర్చుచు గట్టెదన్ మొలకు నే మత్తేభ వృత్తంబులన్*
      *ఫణులన్ నిల్పెద కంఠభాగమున సంప్రాప్తించ కైలాసమే*
      *సాంబావేతును పీఠమున్ తమకు నే శార్దూల వృత్తంబులన్*
      *యంబా! యందును కావుమయ్యనను మీ యర్ధాంగి తో వచ్చిటన్*

      *తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష*

      తొలగించండి

    4. జీపీయెస్ వారు

      దత్తపది ఐతే ఓకేయా ? !)

      జిలేబి

      తొలగించండి
    5. శ్రీహర్ష గారి విషమ వృత్తం బాగున్నది. అయితే నాకు తెలిసినంత వరకు విషమ వృత్తాలలో నాలుగు పాదాలకూ ప్రాసమైత్రి పాటించవలసి ఉంటుంది. పై పద్యంలో రెండు రెండు పాదాలకు ప్రాసమైత్రిని పాటించారు.

      తొలగించండి
    6. జిలేబీ గారూ:

      న్యస్తాక్షరి, దత్తపది, నిషిద్ధాక్షరి,...జీడి పప్పు, బాదం పప్పు, మామిడి టెంక లాటివి నాకు...పళ్ళూడిన వాడిని...

      👇👇👇

      తొలగించండి

    7. భలే మీరే పదాల నెన్నుకున్నారు

      జీడి బాదాము మామిడి జిలేబి అందుకోండి దత్తపది :)


      చీర్స్
      జిలేబి

      తొలగించండి
    8. మామలు నత్తగారులను, మామిడి టెంకలు జీడిపప్పులన్,
      భామిని బంధులన్ , ముదురు బాదము పల్లులు వక్కలేలకుల్,
      లేమలు శ్యాలులన్, భళి జిలేబులు లడ్డులు ఘట్టివౌవడల్...
      మోమున దంతముల్ సడలి ముచ్చట తోడను వీడినానహా!

      తొలగించండి

    9. భలే వారండి మీరు

      శివస్తుతి కి దత్త పది నిస్తే యిట్లా పద్యం కడితే యెట్లాగు ?



      జిలేబి

      తొలగించండి


    10. ఓ బీలేజీ ! డిమ్భక!
      జాబిల్లమ్మా మిడిగొను చండునికిన్ ! తా
      బాబా దముకుకు, వేల్పు జి
      లేబీ కి నమస్కృతి నిడు లెమ్మ! శివోహం !

      జిలేబి

      తొలగించండి
  5. మాన్యశ్రీ శంకరయ్యగారు!
    శివరాత్రి పర్వ దినాన శివస్తుతి చేసే భాగ్యము,వందల మందితో పంచుకునే అవకాశం కల్పించి నందులకు శతకోటి ధన్యవాదాలు, వందనాలు!

    రిప్లయితొలగించండి
  6. శ్రీకరుండగు శంభు,వి*శి*ష్టుఁదలతు,
    పాప నాశంకరుని భక్త* వ*రదుఁగొల్తు,
    రాజితంబుగ నే శివ*రా*త్రి వేళ
    దేవదేవుడు శివుడు ధా*త్రి*ని రహింప!

    రిప్లయితొలగించండి
  7. శిరము మీదను శశిరేఖ; చేతిలోన
    వహ్ని; గళమందు వాసుకి; జహ్ను కన్య;
    రాణి శివకామ సుందరి; రమ్య డమరు;
    త్రిణయన! నటరాజ! యభవ! ప్రణతులివియె.

    జనార్దన రావు గారూ! నన్నయ గారు ఆంధ్ర శబ్ద చింతామణి లో "ఆద్యోవళి:" అన్నారు. కనుక మొదటి అక్షరము యతి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      న్యస్తాక్షరాలను పాదాదిని ప్రయోగించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      నేను మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. 'యత్యక్షరం' అనికాక 'యతిస్థానం'లో ఉంటే సందిగ్ధతకు తావుండేది కాదు. అందువల్ల కవిమిత్రులు న్యస్తాక్షరాలను పాదాదిని కాని యతిస్థానంలో కాని ప్రయోగించినా అంగీకరిస్తాను. ధన్యవాదాలు!

      తొలగించండి
  8. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    నేటి అంశము :: న్యస్తాక్షరి , *శి* *వ* *రా* *త్రి* అనే నాలుగు అక్షరాలను నాలుగు పాదాలలో యతిస్థానములలో నిలిపి పద్యం వ్రాయాలి.
    విషయం :: *శివ స్తుతి*
    ఛందస్సు :: తేటగీతి లేదా ఆటవెలది.
    సందర్భం :: మహాశివరాత్రి పర్వ దినాన మహాదేవుడైన పరమశివుని మనసారా భక్తి ప్రపత్తులతో పూజిస్తూ నల్లని కంఠంతో విరాజిల్లే ఓ శితిగళా ! నాకు శివము (మంగళము) కలిగేందుకోసం నిన్ను స్మరిస్తాను. సులభంగా వరములిచ్చే ఓ శివా ! భక్తితో నీ స్తుతి చేస్తాను. ఈ శివరాత్రి నాడు నీ నామ జపంతో జాగారం చేస్తాను. ఓ చంద్రమౌళీ ! ఓ ముక్కంటీ ! ఓ త్రిపురాంతకా ! నాకు నీవే దిక్కు అని నిన్నే కొలుస్తాను అని శివుని స్తుతించే సందర్భం.
    ఇచ్చిన అక్షరాలను యతిస్థానములందు మాత్రమే కాకుండా పాదముల మొదట కూడా ఉంచి పద్యపూరణ చేయడం జరిగింది.

    *శి* తిగళా ! నిను దలచెద *శి* వము గల్గ,
    *వ* రద ! జేసెద భక్తి త *వ* స్తుతి , శివ
    *రా* త్రి జాగర ముండెద, *రా* జమౌళి !
    *త్రి* నయనా! నిన్నె గొలిచెద *త్రి* పురవైరి !
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు* (13-2-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      న్యస్తాక్షరాలను ఉభయత్రా వినియోగించిన మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  9. చిత్తశుధ్ధి తోడ సతము శివుని దలచి
    భక్తిమీరగ గొలువరె వసుధ జనులు
    రహిత మొనరించు నట భవరాశి నంచు
    సకల జనులు నమ్ముదురిల త్రికరణముగ.

    రిప్లయితొలగించండి
  10. శివుని దర్శించి భక్తితో శివుని గూర్చి
    వల్లె వేయుచు శివ నుతు ల్ వరలు చుండి
    రమ్య శివ కథ లాలించి రాత్రి యంత
    త్రిపుర సుందరు స్మరణ ధాత్రి ధ్వని oచు

    రిప్లయితొలగించండి
  11. చేయ పూజలు మనసార శివుని దలచి
    భక్త వత్సలుడ వనుచు వరము లిడగ
    రాజ భోగము లొద్దని రాయి వైన
    త్రిజగ ములపా లించెడి త్రిగుణ భవుడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "భోగముల్ వద్దని" ఆనండి. అలాగే "త్రిజగములను పాలించెడి" అనండి. లేకుంటే గణదోషం.

      తొలగించండి
    2. చేయ పూజలు మనసార శివుని దలచి
      భక్త వత్సలుడ వనుచు వరము లిడగ
      రాజ భోగముల్ వద్దని రాయి వైన
      త్రిజగ ములను పాలించెడి త్రిగుణ భవుడ

      తొలగించండి
  12. శివుడు సత్యము సర్వము; శివుడె మాయ;
    వదలు బంధాలు జన్మలు వాని గొలువ;
    రాయిలోనెగాదుచరాచ రమున గలడు;
    త్రిణయనునిగొల్వ కష్టాలు తీరు నయ్య.

    రిప్లయితొలగించండి
  13. గురువు గారికి నమస్సులు.
    చేతు లారంగ దళముతో శివుని పూజ
    వరమగు, కడుపే కైలాస వక్కటగును.
    రాజరాజ నరేంద్రుడు రాము కైన
    త్రిగుణ సంధ్యాత్రి వేద బుత్రి సుతు కలుగు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట నారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కైలాస వక్కటగును'...? చివరిపాదం అర్థం కాలేదు.

      తొలగించండి
  14. శిరము శోభిలగ శశిసురగంగ నగము
    వరల నిఖిల జనని వధువుగాను
    రాజిత సితి కంఠు రాత్రిగొలువ దీర్చు
    త్రిప్పటలను తిరము త్రిజగములకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువుగారూ! నేను కూడ ఆద్యక్షరాలు, యత్యక్షరాలు” శివరాత్రి “గా వ్రాశాను! మీరు అందరివీ గుర్తించారు! నన్ను గుర్తించలేదు!
      విద్యార్ధి మనస్తత్వము పోలేదు!😄😄😄🙏🙏🙏🙏🙏

      తొలగించండి
    3. నిజమే సుమా... గమనించలేదు. మన్నించండి.
      మీ పద్య రచనా ప్రావీణ్యం ప్రశంసనీయం.

      తొలగించండి
    4. అయ్యో! అంత లేదులెండి ! ఏదో చిన్నతనం పోక అడిగాను! నా సామర్ధ్యం నాకు తెలుసు! నమస్సులు!🙏🙏🙏🙏

      తొలగించండి
  15. మైలవరపు వారి పూరణ

    🕉🌹నమశ్శివాయ🌺 🙏

    శ్రితజనావన ! శంకరా ! శివ ! భవ ! హర !
    భవహరా ! నీలకంథర ! వరశుభాంగ !
    రమ్యతాండవలోల ! తారాధినాథ
    దివ్య భూషణ ! మ్రొక్కెద ! త్రిభువనపతి !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూర్తిగా శివ సంబోధనలతో మైలవరపు వారి పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  16. శివము లొనగూర్చఁ కైలాసశిఖరి వీడి
    వరము లొసగగ హిమశైలవసతిఁ గొనచు
    రాజరాజేశుడై వెల్గి రాణ మీర
    త్రినయనుండు గావుత మిము త్రిపురహరుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామాచార్య గారూ,
      న్యస్తాక్షరాలను ఉభయత్రా వినియోగించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వసతిఁ గొనుచు' టైపాటు.

      తొలగించండి
  17. శి-వశివశివ యనుచు శి-తికంఠు దలచిన
    వ-రములనిడు గాదె వ-ర్ధనుండు
    రా-త్రి జాగరించి రా-జధరు గొలువ
    త్రి-మ్మటలనెడపును త్రి-పురవైరి..!!!

    శ్రీకరముగ శివుని శి-వరాత్రి దినమున
    భక్తితోడ గొలువ వ-రము లిడును
    రక్షనీవె యనుచు రా-త్రి జాగరమున్న
    దెప్పరముల దీర్చు త్రి-నయనుండు..!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ముఖ్యంగా మొదటి పూరణలో న్యస్తాక్షరాలను ఉభయత్రా వినియోగించడం ప్రశంసనీయం.

      తొలగించండి
  18. మిత్రులందఱకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు!

    శితిగళా! పరమేశ్వరా! శివ! మహేశ!
    హ్నిలోచన! కరిచర్మస్త్రధారి!
    రాజశేఖర! రాజేశ్వరా! కపర్ది!
    త్రిపురవైరి! ధూర్జటి! హరా! త్రిణయన నతి!

    స్వస్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధుసూదన్ గారూ,
      న్యస్తాక్షరాలను ఉభయత్రా ప్రయోగిస్తూ సంబోధనాత్మకమైన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  19. చేసి నంత నౌర శివపూజ భక్తితో
    వచ్చి గాతు వంట వరము లొసగి
    నీవ కృపను జూప రావవే కష్టాలు
    దీవెనలిడి కావు త్రినయన! హర!

    రిప్లయితొలగించండి
  20. అందరికీ మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.
    ఓం నమశ్శివాయ.

    చిన్న మాట నరుడ శివరాత్రి నాడైన
    ఫాలనేత్రు, శూలి వసన రహితు
    చేరి దలచి గొలిచి రార హరాయన
    ధరణి తాను బ్రోచు త్ర్యంబకుండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'త్ర్యంబకుండు' అంటే నియమోల్లంఘన అవుతుంది. అక్కడ 'జనులనెల్ల బ్రోచు త్రినయనుండు' అందామా?

      తొలగించండి
    2. మాస్టరుగారూ! ధన్యవాదములు.


      చిన్న మాట నరుడ శివరాత్రి నాడైన
      ఫాలనేత్రు, శూలి వసన రహితు
      చేరి దలచి గొలిచి రార హరాయన
      ధరణి తాను బ్రోచు త్రినయనుండు.

      తొలగించండి
  21. మాస్టరుగారూ! మీకు మరియు ముఖాముఖిని ప్రసారము చేసిన వారికి అభినందనలు.
    https://www.youtube.com/watch?v=Vxnid3m-PDI&feature=share

    పొత్తపుటాలోచనయే
    చిత్తములో మెదలె మీకు శ్రీకరముగనే
    విత్తము సమకూరునులే
    మొత్తము కవి మిత్రులంత "మోదము" దెలుపన్.

    రిప్లయితొలగించండి
  22. * గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,

    గు రు భ్యో న మః అందరికి శివరాత్రి శుభా కాంక్షలు నమస్తే


    LINES లేని కారణంగా అదివరకు పూరణ పంపించుట ఆలస్యమైనది

    " క్షమించాలి " అనృతమ్ముల్గడునేర్పునన్బలుకు వాడారాధ్యుడౌ సత్సభన్
    -----------------------------------------------------------------------------



    మును సాహాయ్య మొనర్చి నట్టి హితునిన్ మోసమ్ము గావించుచున్

    వినతున్ జూచిన లెక్క సేయక గడున్ వేదించి దూషించుచున్

    ధన మాశించుచు సాటి మానవుల హత్యన్ జేయ నూహించుచున్

    తన ప్రేమన్ నిరసించు బాలికల నత్యాచార మొందించుచున్

    తన స్వార్థంబున కెంత ఘాతుకము నైనన్ జేయ యత్నంచుచున్

    అనయమ్ము న్ననయమ్ములే సలుపు - దౌష్ట్యాకారి యై , ధాత్రి పై ,

    మను నీ మర్త్యు డసత్యవాక్యమును సంభాషింప మేలే కదా !

    అనృతమ్ముల్ గడు నేర్పునన్ బలుకు వా డారాధ్యు డౌ సత్సభన్ !

    జనులన్ మూర్ఖుల జేసి " ఓట్లు " కొని , దేశం బందు దుర్నేత లే

    మన సౌభాగ్యము దోచుచున్ సభలలో మాటాడరే బొంకులన్ ? ? ?



    { అనయము = నిత్యము , పాపము ; మనసౌభాగ్యము = మన దేశ

    సౌభాగ్యము }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      ఆలస్యమైనా అద్భుతమైన మత్తేభమాలికతో చక్కని పూరణ నందించారు. అభినందనలు.

      తొలగించండి
  23. శంకర స్తుతి

    చిత్తశుద్ధి లేక శివుని పూజలు మాని
    వదలి వేసి వేల వందనములు
    రాత్రి బవలు శంకరాభరణము నందు
    తిరుగుచుందు నేను త్రిపుటి లోన

    ...త్రిపుటి = జాగ్రత్, స్వప్న, సుషుప్త్యావస్థలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకరయ్యగారి శిష్యులగుటమేలు
      పనికిరాని పనులు వదలివేసి
      రమ్యమగు కవితలు రాత్రివేళలలోన
      తీర్చగాను మెచ్చు త్రినయనుండు!

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ ఆత్మాశ్రయమైన పూరణ బాగున్నది. అభినందనలు.
      ******
      సీతాదేవి గారూ,
      'శిష్యులగుట'ను "ఛాత్రులగుట" అనండి. యతిదోషం తొలగిపోతుంది.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా!
      సవరించిన పూరణ:

      శివనామ ధరుని శిష్యులగుల మేలు
      పనికిరాని పనులు వదలివేసి
      రమ్యమగు కవితలు రాత్రి వేళలలోన
      దీర్చగాను మెచ్చు త్రినయనుండు!

      🙏🙏🙏🙏

      తొలగించండి
  24. శివ శివాయనుచు వేడెద శివ యొసంగు
    వరములను నీదు భక్తియె వర్ధిలంగ
    రాజితమ్ముగ జ్ఞానవైరాగ్యములను
    త్రికరణమ్ముగ నొసగుమా త్రిపురనాశ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      న్యస్తాక్షరాలను ఉభయత్రా ప్రయోగించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. "శివా యని వేడెద" అనండి. "శివ మొసంగు" అని ఉండాలనుకుంటాను!

      తొలగించండి
  25. క్షేమములనీయనిరతముశివునిగురిచి
    భక్తిమీరగగొలిచెదవరదభవుని
    రండిమీరలుశుచితోడరాత్రికిమరి
    దీవనలలందుకొనగనుద్రిపురహరుని

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "దీవెనల నందుకొనగను త్రిపురహరుని" అనండి.

      తొలగించండి

  26. ఆ. వె. చిద్విలాసరూప! శిఖివిభూషలలాట!
    వాగధీశప్రణుత! వజ్రివంద్య!
    రాజరాజపూజ్య ! రామలింగేశ్వర !
    త్రిపురనాశ ! పాహి త్రిదశనుత !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విశ్వనాథ శర్మ గారూ,
      న్యస్తాక్షరాలను ఉభయత్రా వినియోగించిన మీ పూరణ బాగున్నది.
      మొదటి పాదాన్ని "శివకరా! త్రినేత్ర! శిఖివిభూషలలాట!" అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
    2. చివరి పాదంలో "త్రిదశ నుత"లో ఒక అక్షరం లోపించింది. "త్రిదశ వినుత" అంటే బాగుంటుందేమో...చూడండి.

      తొలగించండి
    3. పూ.శంకరయ్యగారికి, మధుసూదన్ గారికి వందనములు . మీసూచనలు బాగున్నవీ.ధన్యవాదములు.

      తొలగించండి
  27. శుభా కాంక్షలు
    శివరాత్రి పర్వ దినమున
    సవినయముగ వేడు కొనుదు సహ చరు లగమిన్
    శివ నామము జపియించుడు
    భవుడే మిము గాచు నెపుడు భవ్యత గలుగన్

    రిప్లయితొలగించండి
  28. సవరణలతో..

    చిలువ హారమకట *శి*రముపై గంగమ్మ
    వనిత యర్థమందు *వ*రలు చుండు
    రాగమంట నీకు *రా*మనామమనిన
    దేవ! కావు మయ్య *త్రి*పుర వైరి

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  29. శివమును గొన నిను కొలుతు శిరసు వంచి
    వరద! భక్త వత్సల! యీశ! వరములిమ్ము
    రాతిరి భజియించితి నిన్ను రాణ తోడ
    త్రినయన ! తెరువుఁ జూపు ధాత్రి విడనాడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      న్యస్తాక్షరాలను ఉభయత్రా వినియోగించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  30. చిత్తశుద్ధి గలిగి నేడు శివుని గొలువ
    భక్తి పూర్వకముగనె పవలును రాత్రి
    ప్రార్థనలు జేయగా శంకరాయనుచునె
    తీరు గోర్కెలు నిజము ధాత్రి జనులకట

    రిప్లయితొలగించండి
  31. శ్రీద మాఘ కృష్ణ చతుర్ద(శి)దిన మా య
    మరవర యుత (శి)వానంద (వ)రద నిత్య
    ధామవర (శివ) భవ్య వి(రా)మ సద్గ
    తినిఁ బ్రసాదించెడు(శివరాత్రి) శుభకరము

    శి
    శివ
    శివరా
    శివరాత్రి


    కైలాసాగమ నిత్య నర్తన లసత్కాత్యాయనీ కేళి లీ
    లాలో లాది వినోద తోషిత మనోల్లాసప్రభా విగ్రహా!
    కాలాలోకన దగ్ధ మన్మథ! పురాకారాసురఘ్నా! శివా!
    ప్రాలేయాంశు విరాజమాన వర మూర్ధా! శంకరా! కావవే


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యత్యక్షరమన యతికి మైత్రి కూర్చునక్షరముగా భావించి పూరించితిని. యుక్తాయుక్తములను తెలుప గోర్తాను.

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా, ఉత్తమంగా ఉన్నది.
      దాని ననుసరించిన మీ శివస్తుతి మనోహరంగా ఉన్నది.
      అభినందనలు.
      యత్యక్షర విషయంలో మీ భావన యుక్తమే. నేను ఆ అభిప్రాయంతోనే ఇచ్చాను. బాపూజీ గారు 'ఆద్యో వళిః' సూత్రాన్ని గుర్తు చేశారు. అందువల్ల రెండు విధాలనూ ఆమోదిస్తున్నాను. కొందరైతే రెండు విధాలుగా ప్రయోగించారు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  32. ఆటవెలది
    శిశిరకరుడు గంగ శిరమున శివమిడ
    వలిమల సుత మేన వరము లిడగ
    రాజిత పదయుగలి రాజిల్ల నటరాజ
    త్రినయన మము గావు త్రిపురవైరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుగురుదేవుల కవిమిత్రులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు

      తొలగించండి
    2. సహదేవుడు గారూ,
      న్యస్తాక్షరాలను ఉభయత్రా ప్రయోగించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రాజిత... రాజిల్ల' అని పునరుక్తి. "రాజిత పదయుగళి రాణింప..." అందామా?

      తొలగించండి
    3. గురుదేవులకు ధన్యవాదములు

      సవరించిన పూరణ :

      శిశిరకరుడు గంగ శిరమున శివమిడ
      వలిమల సుత మేన వరము లిడగ
      రాజిత పదయుగలి రాణింప నటరాజ
      త్రినయన! మము గావు త్రిపురవైరి!

      తొలగించండి
  33. గిరిజ వామమందు శిరమందున గంగ
    నుదుట కన్ను శాంతి వదన మందు
    నఱ్ఱున గరళము కరాబ్జమున డమరు
    త్రిశిఖ ధారి గాచు త్రిభువనముల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదం చివర గణదోషం. "శిరమందు గంగమ్మ" అందామా?

      తొలగించండి
  34. శితివపుషుడనంగరిపుడు,శివకరుడు,భు
    వనపతి,ఘనపింగళజటవలయధరుడు,
    రామసంసేవ్యితుఁనిరతరామజపుడు,
    త్రిపురదళణుడితడుభవుఁ,త్రినయనుడును...

    తండ్రి పుత్రుని పొగిడిన ఆయుఃక్షీణము.. అదే పుత్రుడు తండ్రిని పొగిడితే ఆయుర్వృద్ధి. జగముకంతటికీ తల్లిదండ్రులు అయిన శివశక్తులను స్తుతించి మనమందరమూ ఆయురారోగ్యాలు పొందెదము గాక..

    శంకరయ్య గారి శంకరాభరణం మరింత వినుతికెక్కుగాక.

    తథాస్తు..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకటేశ్ ప్రసాద్ గారూ,
      న్యస్తాక్షరాలను ఉభయత్రా ప్రయోగించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జటవలయ' మనరాదు. అది "జటావలయధరుడు".

      తొలగించండి
    2. అలాగే సార్. ధన్యవాదాలు..
      మీ interview చూశాను. చాలా బాగుంది..

      తొలగించండి
  35. శివశివాయనంచు శివపూజ జేసిన
    వరము లొసగు భక్తవరదుడతడు
    రాగరహితుడతడు రాజీవనేత్రుడు
    త్రిగుణ నిర్గుణుండు త్రినయనుండు

    రిప్లయితొలగించండి
  36. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


    శివ ! మహేశ ! దయాంబురాశి ! శశిధర ! భ

    వహర ! గంగాధరా ! త్రిదివనుత గుణ ! హ

    రా ! వినీలకంఠా ! బ్రోవ రావ దేవ !

    త్రిభువన‌పరిపాలక ! భవ ! త్రిపుర వైరి !

    రిప్లయితొలగించండి
  37. శిఖలయందు పట్టె శివమెత్తు గంగమ్మ
    వలపురాయు జంపె వహ్నికన్ను
    రాచవిషము మ్రింగె రాబట్ట క్షేమంబు
    త్రిపురవైరి గొలుతు త్రిపుటి యందు!

    రిప్లయితొలగించండి
  38. క్రొవ్విడి వెంకట రాజారావు:
    ఆ.వె.
    చెదరని మదిదోడ శివరాత్రినందున
    వదలక నిను గొల్చి వఱలు నాకు
    రక్షి వగుము సతము రాజధరుడవైన
    త్రినయనా! భగాలి! త్రిపురవైరి!

    రిప్లయితొలగించండి
  39. శవ !భవ హర !రుద్ర !శితి కంఠ !మల్లేశ !
    వర గుణేశ ! చర్మ వ సనధారి !
    రాజమౌళి !మహి త రాజ రాజేశ్వర !
    త్రిగుణ శక్తీ దాయి ! త్రిపుర వైరి !

    రిప్లయితొలగించండి
  40. చిత్తమందు సేవించుచు శివ శివ యన
    భక్త కోటిని కరుణించి వరము లొసగ,
    రాజశేఖరుండా నీదె రాజ ముద్ర!
    దీవన లిడ కొల్తు శివరాత్రి దినమందు!

    రిప్లయితొలగించండి
  41. పరమేశ్వర ప్రీత్యర్థం పంచచామరం సమర్పయామి..

    వరించె తాను శాంభవీ,సభాస్థలిన్ నటింపగా
    విరించి చేరె దాల్మితో,భవేశ నిన్ నుతింపగా
    వెరించినాంధకున్ భళా!సువేశినిన్ హరింపగా
    మురారికైనశక్యమే,అమూర్త!మిమ్ము నెంచగన్..

    రిప్లయితొలగించండి
  42. ఆ.వె:శేఖరముగ సిగను శిశిరకరుని దాల్చు

    భక్తసులభుడితడు వరము లొసగు

    రమణి తోడ తాను రాణించు పదముల

    తిరముగ కొలువుండు త్రిపుర హరుడు.

    ఆ.వె: చిత్త శుద్ధి తోడ శివ పూజను చేయ
    వరము లొసుగు చుండు వసుధ యందు
    రాత్రియుపవసించి రాగయుక్తముగను
    త్రిపుర హరుని గొలువ త్రికరణముల.

    ఆ.వె: శివుని కొలువ మనకు శివముకలుగు చుండు
    భక్త వత్సలుండు వరప్రదాయి
    రాముడితని కొలిచెరావణుండును కొల్చె
    త్రినయనుండితండు త్రిపుర హరుడు.

    ఆ.వె: సేమమొసగు నెపుడు శివుని నామ స్మరణ
    వాసిగాను జనులు వసుధ యందు
    రహిని కూర్చు చుండు రమ్యముగా నిల
    త్రినయనుండు‌ శూలి త్రిజట ధారి

    ఆ.వె:శివ శివ యనుచుండ శీఘ్రమే కరుణను
    వసుధలోన చూపు బంధ హరుడు
    రార భక్త పోష రమణీయముగ నిట
    త్రిపురహర యనంగ దీవనొసగు.

    ఆ.వె :సేవలకును మెచ్చు శివశంకరుడితడు
    బంధము లను బాపు వసుధ యందు
    రజత గిరిని వెలసి రామ తో సతతమ్ము
    తిరుగు చుండు తాను త్రిపుర హరుడు.

    రిప్లయితొలగించండి