8, ఫిబ్రవరి 2018, గురువారం

కమల బంధ తేటగీతిక - లక్ష్మీదేవి ప్రార్థన



అంబుజాసన! అతిచర! అమల! అబ్ధి
తనయ! తమ్మియింటిగరిత! తల్లితల్లి!
కలిమి చెలి! కమలాలయ! కలిమి గుబ్బె
త! రమ! రామ! గోమిని! మరుతల్లి! మాత!
పద్మలాంచన! పద్మిని! పద్మవాస!
పద్మగుణ! పద్మకర! పద్మ! పార్దివి! సిరి !
పాల మున్నీటి రాకన్య! పైడి నెలత!
లక్ష్మి! లిబ్బుల జవరాలు! లంబ! లాస్య 
లోకమాత! జలధిజ! వృషాకపాయి!
విష్ణు వల్లభ! సింధుజ! విష్ణు పత్ని! 
జయ! విజయ! జన రoజని! జగము తల్లి! 
శ్రీ సినీ వాలి! శ్రీదేవి! శ్రీ విరక్త!
శ్రీ సునాసిక! శ్రీ దివ్య! శ్రీ మరీచి!
పంచ లోచన! చంద్రిక! భగవతి! శివ!
సుప్రజాత! సునందన! సుద్యుపాశ్య!
బ్రహ్మ విష్ణు శివాత్మిక! భగళ! బాల!
ఇంది! ఇందిర! ఈశ్వర! నందిని! సిత!
సత్య!  చంద్ర సహోదరీ! సంధ్య! సంప
దా! కరుణ జూపి కాచుము దాసునెపుడు. 


పూసపాటి కృష్ణ సూర్య కుమార్

5 కామెంట్‌లు:

  1. సూర్య కుమార్ గారు మీ కమల బంధ తేటగీతిక మనోహరముగా నూన్నది.
    లిబ్బుల జవరాల! అని సంబోధనాత్మకముగా వ్రాయండి. అన్ని సంబోధనలే కదా.
    సంధి లేని చోటల్లా యడాగమము చేయండి

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలు కామేశ్వరరావు రావు గారు

    రిప్లయితొలగించండి