4, మార్చి 2018, ఆదివారం

సమస్య - 2615 (భారత యుద్ధరంగమున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"భారతాజిలోఁ గర్ణుండు పార్థుఁ జంపె"
(లేదా...)
"భారత యుద్ధరంగమునఁ బార్థునిఁ గర్ణుఁడు చంపెఁ గ్రుద్ధుఁడై"

60 కామెంట్‌లు:

  1. భారతాజిలోఁ గర్ణుండు పార్థుఁ జంపె
    దనని కుంతికి జెప్పెను తనివి దీర...
    తక్కిన సుతుల జంపను; లెక్క బెట్ట
    నేది యెటులైన మిగులురు నైదు మంది!

    రిప్లయితొలగించండి
  2. దొమ్మి తప్పదని యెఱంగి దుస్స సేను
    డపుడు స్వప్నమందున గనె ననిల సుతుడు
    భీముని వధించె రారాజు విక్రమమున
    భారతాజిలో గర్ణుండు పార్థుఁ జంపె

    రిప్లయితొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    ధీరుని, సత్యధర్మగుణతేజుని , నాజినిఁ గ్రీడి వంటి గాం...
    ధీ రమణీయమూర్తినొక తెంపరి భిన్నమతానుబంధియై
    క్రూరుడు గాడ్సె చంపఁ ప్రతికూలసహోదరవృత్తిఁ జూడగా
    భారత యుద్ధరంగమునఁ బార్థునిఁ గర్ణుఁడు చంపెఁ గ్రుద్ధుడై !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి

  4. సవ్యసాచి బాణములకు జచ్చె ఘోర

    భారతాజిలోఁ గర్ణుండు, పార్థుఁ జంపె

    సైందవుని సుతు డభిమన్యు చావుని గని

    అర్కుడస్తమించెడు సమయముకు మునుపె

    🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
    ☘వనపర్తి☘



    రిప్లయితొలగించండి


  5. వలదు మిత్రమా సంసీతి వలదు నీకు,
    శపనమును జేయు చుంటిని సదము నందు,
    భారతాజిలోఁ గర్ణుండు పార్థుఁ జంపె
    దనను చు, బలికె సభలోన తామసముగ

    దుర్యోధనుని తో కర్ణుడు శపధము చేయుట

    రిప్లయితొలగించండి
  6. భారతాజిలో గర్ణుండు పార్ధు జంపె
    దనుచు పల్కంగ కృష్ణుండు దలచి నవ్వె;
    ధర్మ పక్షమన నిలువక ధరణి పైన
    విజయమెట్లైన ప్రాప్తించ వీలు యగునె!

    రిప్లయితొలగించండి
  7. శల్య సారథ్యము వహించి జంకు గొలుపు
    భాషణ oబున వంచి oప వ ధ్యు డ య్యే
    భా ర తా జి లో కర్ణుడు ;పార్థు చంపె
    శత్రు సేన ల చెండా డి శక్తి మీర

    రిప్లయితొలగించండి
  8. సంత రించెను శక్తిని చంపెదనని
    భార తాజిలోఁ గర్ణుండు పార్థుఁ, జంపె
    నంగ రాజును విజయుడే రంగమందు
    కిటుకు లెరిగింప కృష్ణుడు దిటవుగాను

    రిప్లయితొలగించండి
  9. డా.పిట్టాసత్యనారాయణ
    కోరె నొకండు భారతము గ్రొత్తగ వ్రాయగ గద్య గీతముల్
    మీరగ పద్యవాసినటు మించియు గర్ణుని పైని జాలితో
    పోరున బార్థుడే ఘనుడె పూర్వ చరిత్రను? మ్లేచ్ఛ నీతినిన్
    భారత యుద్ధ రంగమున బార్థుని గర్ణుడు చంపె గ్రుద్ధుడై



    రిప్లయితొలగించండి
  10. డా.పిట్టాసత్యనారాయణ
    కోరగనె ప్రాప్త విత్తపు గురిని "బాబు"(అంబేడ్కర్)
    పారె విద్దెల బ్రాహ్మణ వడుగు దాటి
    సారహీన విభేదాల సరళి నణచె
    భారతాజిలో గర్ణుండు పార్థు జంపె!

    రిప్లయితొలగించండి


  11. కోరగ కవచ కుండలములను విడిచి
    తన ఉసురులను తృణముగ తలచి యాచ
    కులడుగగ సంతసమ్మున, క్రుంగి యతడు
    భారతాజిలో గర్ణుండు, పార్థు జంపె!



    జిలేబి

    రిప్లయితొలగించండి


  12. పోరితి నయ్య కైపదపు పోడిమి గాంచి జిలేబి యేసుమా!
    కారణ మెద్ది తోచక సుఖమ్ముగ పృచ్ఛితి నాప్త మిత్రుడా!
    ఓరి! శకారుడా! యెవరి నొంచెను కర్ణుడు యుద్ధమందునన్?
    "భారత యుద్ధరంగమునఁ బార్థునిఁ గర్ణుఁడు చంపెఁ గ్రుద్ధుఁడై!"
    జోరు జవాబు గాంచితిని జోతల జెప్పితి నయ్య నిప్పుడే


    శకారునికి జై :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మొత్తానికి అసందర్భాలన్నీ శకారుడివే!
      మరి చారుదత్తుడేమంటాడో!!
      ☺️

      తొలగించండి

    2. చారుదత్తుడేమంటాడో వీరేమంటారో వారేమంటారో అనుకుంటూ కూర్చుంటే మన సమస్య అట్లాగే నిలిచిపోతుందండీ :) .కాబట్టి ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటికయ్యది ....:) అంటూ పరిష్కారాన్ని కనుక్కుంటూ ముందుకు సాగి పోవడమే పదండి ముందుకు పదండి తోసుకు పోదారి పైపైకి అనుకుంటూ :) .జెకె :)

      ఇంతకీ చారుదత్తుడెవరండీ ?


      చీర్స్
      జిలేబి

      తొలగించండి


    3. వీరే మనుకొనెదరు మరి
      వారే మనుకొనెదరనుచు భవబంధములే
      లా! రయ్యనుచు సయి జిలే
      బీ రీతుల గానుము విరివిగ పూరణలన్ :)

      జిలేబి

      తొలగించండి
    4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    5. 'మృచ్ఛకటికం' నాయకుడు. శకారుడి బావగారి రాజ్యంలో సద్బ్రాహ్మణుడు. :)

      తొలగించండి
  13. అక్రమముగ తనను గూల్చ నర్జునుండు
    చూపరుల మనసు గెలిచె సూత సుతుడు
    నైతిక విజయ మనుచును నలుగు రనగ
    భారతాజిలో గర్ణుండు, పార్థు జంపె!

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2615
    సమస్య :: *భారత యుద్ధరంగమున పార్థుని కర్ణుడు జంపె క్రుద్ధుడై.*
    సందర్భం :: అర్జునుని చంపేస్తే పాండవుల నందఱినీ చంపివేసినట్లవుతుందని కర్ణునితో మంతనాలాడిన దుష్ట దుర్యోధనుడు అదే ఆలాపనతో పగలు నిద్ర పోయాడు. పార్థుని కర్ణుడు చంపినట్లు పగటి కలలు కన్నాడు. తన కల లో ఇలా కలవరిస్తున్నాడు అని ఒకవ్యక్తి (ధర్మపక్షపాతి) చెప్పే సందర్భం.

    మారడు గాక మార డభిమాన ధనుండు, సుయోధనుండు, దా
    క్రూరుడు, దుష్టుడున్ సతము కోరును పాండవ నాశనమ్మునే
    నేరము లెంచుచున్ , పగటి నిద్రను స్వప్నము నంది బల్కెడిన్
    *భారత యుద్ధ రంగమున పార్థుని కర్ణుడు జంపె క్రుద్ధుడై.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (4-3-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. స్వప్నలీలా విలాసమును కృష్ణుడే చెప్పియుండవచ్చును గదా రాజశేఖరార్యా!
      👌🏻👌🏻🙏🏻

      తొలగించండి
    2. నిజమేనండీ శ్రీ విట్టుబాబు గారూ! ఒక వ్యక్తి (ధర్మ పక్షపాతి ) అని అన్నాను మీరు సూచించినట్లు శ్రీకృష్ణుడు అని అనియుండవచ్చునండీ. చక్కని సూచన చేసిన మీకు ధన్యవాదాలండీ.

      తొలగించండి
  16. కర్ణుడెవరిని జంపెను గమల!యనుచు
    బాఠశాలలో ప్రశ్నించ బదులు సెప్పె
    భారతాజిలోగర్ణుండు పార్ధు జంపె
    గాదు పార్ధుడు చంపెను కర్ణు డనిని
    దెలిసి కొనుమమ్మ యియ్యది బేల!నీవు

    రిప్లయితొలగించండి
  17. బారులు దీరియుండిరట బాహుబలాఢ్యులు మార్కొనంగసూ
    భారత యుధ్ధరంగమున బార్ధుని,కర్ణుడు చంపె గ్రుధ్ధుడై
    వీరులనంగవారినని వేయుచు బాణము లెన్నియో దగ
    న్నీరకమైనయుధ్ధమట యిబ్బడి ముబ్బడి గాగసాగెహో

    రిప్లయితొలగించండి
  18. శల్య సారథ్యమె కడకు శాపమాయె
    పరశురాముని శాపంబె పదును దేలె
    కవచ కుండలంబులు పోగ కాంతి బోయె
    నా పుడమి శాప భారంబు నతని గూల్చె
    ఒక్క శస్త్రము దెలియక నొంటరాయె
    "భారతాజిలోఁ గర్ణుండు; పార్థుఁ జంపె"
    నతనిని రథపు చక్రమె యంత గూల
    విధిని మార్చగ తరమెనే విధము నైన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరించిన పద్యం!!

      "భారతాజిలోఁ గర్ణుండు పార్థుఁ జంపె"
      దనని ప్రతిన బూనెను గాని దప్పదు విధి!
      కవచ కుండలంబులు పోగ కాంతి బోయె
      శల్య సారథ్యమె కడకు శాపమాయె
      పరశురాముని శాపంబె పదును దేలె
      ఒక్క శస్త్రము దెలియక నొంటరాయె
      నా పుడమి శాప భారంబు నతని గూల్చె
      అర్జునుడె జంపె గర్ణుని న్నస్త్రవిధిని!!

      తొలగించండి



  19. వరముల ను పొందితినటంచు బలిమి చేత

    భారతాజిని కర్ణుండు పార్ధు జంపె

    దనని బీరములపలికి తానె జచ్చె గాదె

    వరసుతుని చంప తరమౌనె వసుధ యందు.



    భారతాజిని కర్ణుండు పార్ధు జంపె

    దనని ప్రతినచేసెను మిత్రధర్మమూని

    చక్రి కరుణయున్న కిరీటిఁజంప గతర

    మౌనె శప్తుడౌ రాధేయు కవనియందు

    రిప్లయితొలగించండి
  20. పోరును చేయలేననుచు పొక్కగ, సిద్ధము జేసె వెన్నుడే
    భారత యుద్ధరంగమునఁ బార్థునిఁ, గర్ణుఁడు చంపెఁ గ్రుద్ధుఁడై
    వీర ఘటోత్కచున్ కలను పెల్లుదనమ్మున దాడిచేయగా
    పారుచునుండ కౌరవుల పౌజులు భీతిలి వాని ధాటికిన్

    రిప్లయితొలగించండి
  21. శాప కాయ సంతప్తుఁడు సమసెఁ గదిసి
    భారతాజిలోఁ గర్ణుండు, పార్థుఁ జంపె
    నన్న సరి గాదు సత్యము నరయఁ బుడమి
    పూర్వ జన్మ వైర మది యఖర్వ మయ్యె


    సూర కుమార పుంగవుఁడు సూత తనూజుఁడు నంగ రాజు దాఁ
    గౌరవ వంశ వర్ధనుని గాదిలి మిత్రుఁడు నస్త్ర శస్త్ర సం
    హార విదుండు చంపెను మహా నృప వర్గము నేల యిట్లనన్
    భారత యుద్ధరంగమునఁ బార్థునిఁ గర్ణుఁడు చంపెఁ గ్రుద్ధుఁడై

    [పార్థుఁడు = రాజు; సంహారము = సమూహార్థమును గూడ గ్రహించఁ దగును.]

    రిప్లయితొలగించండి
  22. "When a dog bites a man, it is no news...but when a man bites a dog, it is..."

    కోరెదరెల్లరున్ ప్రజలు కుంచిత వార్తలు పత్రికందునన్:
    "పోరుచు చంద్రశేఖరుడు పొందుగ గెల్చెను నాంధ్రదేశమున్",
    "ధీరుడు చంద్రబాబపుడు దీటుగ గెల్చె తెలంగణందునన్"
    "భారత యుద్ధరంగమునఁ బార్థునిఁ గర్ణుఁడు చంపెఁ గ్రుద్ధుఁడై"

    రిప్లయితొలగించండి
  23. (కర్ణుని రణతేజస్సు తట్టుకోలేని పార్థుడు )
    దారుణమైన బాణములధాటిని సైపక జీవితాశతో
    "నారథమున్ మరల్చుమిక నావలకు ;న్నెదిరింపలే నయా
    పోరను ;పోద " మంచు తన పోడిమి వీడెను ;మానసంబునన్
    భారతయుద్ధరంగమున బార్థుని గర్ణుడు చంపె గ్రుద్ధుడై

    రిప్లయితొలగించండి
  24. ఆ సుయోధను హితునిగా నస్తమించె
    భారతాజిలో గర్ణుండు! పార్ధు జంపె
    శత్రు యోధుల నచట కేశవుని సాయ
    మంద! రాజ్యము గొనిరంత పాండుసుతులు!

    రిప్లయితొలగించండి
  25. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,

    శ్రీ కృష్ణ రాయభారము :-----
    ::::::::::::::::::::::::::::::::::

    " భారతయుధ్ధరంగమున బార్థుని గర్ణుడు జంపె గ్రుద్ధుడై

    వీరలు లెక్కయే " యనుచు వీగకు స్వప్నము లో సుయోధనా |

    వీరుడ నేనె యంచు నడిబీరము లాడెడు సూతపుత్రునిన్

    దూరముగా నటుంచి , విడు దుర్మద పూర్ణ రణాభిలాషయున్ |

    సారధి నౌచు ఫల్గుణుని స్యందన మందున నేను కూర్చొనన్ ,

    మారుతి కేతనంబు పయినన్ గదలాడ , జయింప నింక నె

    వ్వారికి శక్య మౌను కురువంశపతీ | యని మాన కున్నచో

    క్రూరుని దుస్ససేను పెను రొమ్ము పగిల్చుచు గ్రోలి నెత్తురున్ ,

    భూరి గదాభిఘాతమున‌ ముక్క లొనర్చు త్వదూరు యుగ్మమున్

    మారుతి " | యం చనియె మాధవు డప్పుడు రాయబారియై


    { అడిబీరము = పౌరుష విహీన ప్రగల్బము ; ‌‌‌‌‌

    మారుతి = హనుమంతుడు , భీముడు }

    రిప్లయితొలగించండి
  26. ............సమస్య
    భారతాజిలోఁ గర్ణుండు పార్థుఁ జంపె

    సందర్భము: దుర్యోధనుడు కురుసభలో యుద్ధారంభంలో యోధుల నుద్దేశించి ప్రసంగిస్తూ ఇలా అంటున్నాడు..
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "వీనులకు విందుగా నాకు వినబడవలె

    నొక్క శుభవార్త దిక్కులు పిక్కటిల్ల"

    ననె సుయోధను, "డే వార్త?"
    యని, రత డనె..

    "భారతాజిలోఁ గర్ణుండు పార్థుఁ జంపె"..

    2 వ పూరణము:---

    సందర్భము: దుర్యోధను డొక రోజు మధ్యాహ్నం సుష్టుగా సాపాటు చేసి మెల్లగా ఊయల మంచంమీద మేను వాల్చాడు. చిన్న కునుకు తీస్తూ రాబోయే మహా సంగ్రామం గురించి ఆలోచిస్తున్నాడు. చనువు గలిగిన అతని మేనకోడలు అనగా దుస్సల కూతురు వచ్చి వెనుక జేరి, వీవన చేబూని, యిలా.. ఆలపించ సాగినది.
    "భారత యుద్ధంలో కర్ణుడు అర్జునుని చంపాడు. నేను భీముని చంపాను అని పగతో కూడిన కలలో.. పగటి కలలో కంటూ వున్నావే! ఈశ్వరేచ్ఛ నెఱుగక గాలిమేడలు కట్టుతూ వున్నావే! "

    మొత్తానికి ఆ అమ్మాయి పాట విన్న తర్వాతనే...

    "పగటి కలలు కంటున్న మామయ్యా!
    గాలి మేడ లెన్నొ నువ్వు కట్టా వయ్యా!"

    అని ఒక సినీ గీత రచయిత వ్రాసినాడేమో!
    ~~~~~~~~~~~~~~
    షడ్రసోపేతంబు సాపాటు గావించి,
    మేలైన తూగు టుయ్యాల నెక్కి,
    కునుకు దీసెడు సుయోధనుని జేరిన మేన
    కోడలు వీవన గొనుచు బాడె..
    "గాలి మేడ ల వెన్నొ కట్టుచు నుంటివో!
    మామయ్య! కూలుట మరచినావు..
    పగల కలలొ లేక పగటి కలలొ గాని
    మామయ్య! కనుచుంటి వేమొ! నీవు

    భారతాజిలోఁ గర్ణుండు పార్థుఁ జంపె,
    నేను భీమునిఁ జంపితి, నిక్క మనుచు;...
    ఈశ్వరేచ్ఛ య దేమియో యెఱుగ లేవు...
    శాశ్వత సుఖైక సాధన సలుపలేవు..."

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  27. తేటగీతి
    తాను యుద్ధభూమిని లేని తరుణమెంచి
    దుష్ట దుర్యోధనుని తోడ దునిమి తనయుఁ
    జిమ్ముచు విషమ్ము మానసికమ్ము గాను
    భారతాజిలోఁ గర్ణుండు పార్థుఁ జంపె!

    రిప్లయితొలగించండి
  28. రిప్లయిలు
    1. మిత్రులందఱకు నమస్సులు!

      (భారత యుద్ధ రంగమున నర్జునుని యుద్ధానివర్తితశపథులైన సంశప్తకులడ్డగించిన తరుణమునఁ, గర్ణుఁడు పద్మవ్యూహ భేదకుఁడైన యభిమన్యుని నేమియుఁ జేయఁజాలక, క్రోధమున నతని యశ్వములలో నొకదానినిఁ జంపిన సందర్భము)

      ఘోరతరాశుగమ్ములనుఁ గ్రూరమనస్కతఁ బార్థుఁడేయ, గం
      భీర పరిగ్రహవ్రతులు, వీర సుశర్మ సమాహ్వయాదులుం
      జేరియు నడ్డగించిరి విశిష్ట చతుర్విధసైన్యయుక్తమౌ
      భారత యుద్ధరంగమునఁ బార్థునిఁ; గర్ణుఁడు చంపెఁ గ్రుద్ధుఁడై
      మారిగ మాఱి తాను నభిమన్యుని యశ్వము నొక్కదానినిన్!

      తొలగించండి
    2. మిత్రులందఱకు నమస్సులు!

      (2)
      (తనను పాండవ పక్షమునఁ జేరుమన్న కుంతీదేవితోఁ గర్ణుండు పలికిన సందర్భము)

      "భారతాజినిఁ గర్ణుండు పార్థుఁ జంపె
      ననియొ; కర్ణునిఁ బార్థుఁడే యనినిఁ జంపె
      ననియొ విందు! వెట్లైన నీ కైదువుఱగు
      నందనులె యుంద్రు 'పంచపాండవు' లనఁగను!"

      తొలగించండి
  29. ఘోర రణాంతరంగణ విఘూర్ణ కిరత్సముదర్చిరుగృడై
    వీరగతిన్ గమించి పటు భీషణుడట్లు కలంచుచుండగా
    భారత యుద్ధ రంగమున బార్థుని గర్ణుడు, చంపె గ్రుద్ధుడై
    ధీర ధనంజయుండు కటు తీవ్ర శరాళి సుయోధనాప్తునిన్

    రిప్లయితొలగించండి
  30. రిప్లయిలు
    1. ప్రయత్నం బాగున్నది.
      అయితే తేటగీతిలో సాగవలసిన పద్యం- మొదటి రెండు పాదాలు కంద పద్యంవలె సాగినవి. శుభాభినందనలు.

      తొలగించు

      తొలగించండి
  31. భారతాజిలో గర్ణుండు,పార్థు జంపె
    రధిక బలవంతు లైనట్టిరక్షక భటు
    లెదురు బడగానె శస్త్రాస్త్ర పదునుబెట్టి
    రక్త మడుగున జేర్చిరియుక్తముగను|

    రిప్లయితొలగించండి
  32. కారణ కారకుండు నగు కారణ జన్ముడు సంధిజేయగన్
    జేరగ హస్తినాపురము శీఘ్రము బల్కె సుయోధనుండు హుం
    కారము జేసి, యాదవులు కాలము నందున నిట్లు బల్కరే
    భారత యుద్ధరంగమునఁ బార్థునిఁ గర్ణుఁడు చంపెఁ గ్రుద్ధుఁడై

    రిప్లయితొలగించండి
  33. "భారతాజిలోఁ గర్ణుండు పార్థుఁ జంపె"
    నన్న కీర్తికన్నను మించి నాశ యేది?
    యనుచు తన మిత్రునకు కర్ణు డభయ మిచ్చి
    తుదకు తానె గూలె ననిని దోర్బలుండు.

    రిప్లయితొలగించండి
  34. సర్వ సైన్యాధిపతిగ దా శక్తిజూపె
    భారతాజిలో కర్ణుండు; పార్ధు జంపె
    నాతనిని శాపవశమున యస్త్రవిద్య
    మరచి హీనబలుండైన మాత్రయందు!

    రిప్లయితొలగించండి
  35. ఉత్పలమాల
    పారక కాకరూపకము భార్గవ రాముని శాపతీవ్రతన్,
    పారుని, పృథ్వి కోపములు, వాసవు మోసపు టెత్తులొక్కటై
    సారథి శల్యుడేమరచ చావఁగ కర్ణుడుఁ! బల్కనేల నే
    భారత యుద్ధరంగమునఁ బార్థునిఁ గర్ణుఁడు చంపెఁ గ్రుద్ధుఁడై?

    రిప్లయితొలగించండి

  36. ........సమస్య
    భారతాజిలోఁ గర్ణుండు పార్థుఁ జంపె
    3 వ పూరణము:--

    సందర్భము: కష్టపడి సంపాదించిన దానితో జీవితం గడపడం సుఖ శాంతుల నిస్తుంది. ఏమాత్రం కష్టపడకుండా రాత్రికి
    రాత్రే కోటీశ్వరులై పోవా లనే ఆలోచన సృష్టి ధర్మానికే విరుద్ధమైనది. తెలివి తేటలకు నిదర్శన మనుకోవచ్చు గాని సుఖ శాంతులను సమూలంగా హరింపజేసేది. చివరకు కష్టంలోనే కూల ద్రోసేది. విద్యాధికు లంతా విస్మరించరాని అంశ మిది. ప్రాజ్ఞుల జీవితానుభవ మిది.
    రారాజు దుర్యోధనుడు కన్న కల చిట్ట చివరకు విఫలమే అయింది. అదేమంటే
    "భారత యుద్ధంలో కర్ణుడు పార్థుని వధించడం."
    పాండవులలో అర్జునుడు శివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించుకున్నాడు. అన్న దమ్ములకంటె యెక్కువగా కృష్ణుని సాహచర్యాన్ని సంపాదించుకున్నాడు. హరి హరుల యనుగ్రహా న్నీవిధంగా పొందగలిగినాడు.
    అందువల్ల అర్జును న్నొకణ్ణి నిర్మూలించ గలిగితే పాండవుల పని ఐపోయినట్టే అని భావించి ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు రారాజు. అర్జునునికి ప్రత్యర్థిగా కర్ణుని చేరదీసి ఆదరించి అంగరాజ్యా న్నిచ్చి అతని ప్రేమకు పాత్రు డయ్యాడు. కాని అతని కుండే అనేకములైన లోపాలవల్ల దుర్యోధనుని కల చెదరిపోయింది.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    వసుధలో కష్టపడకుండ వచ్చునట్టి

    తిండి దిని కన్న కల దారి తీయు నెపుడు

    కష్ట పడుటకే!.. రారాజు కల యిదె కద!

    "భారతాజిలోఁ గర్ణుండు పార్థుఁ జంపె.."

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  37. కోరిక తీరగా మురిసి క్రోధము మీరగ పోరెనయ్యరో
    భారత యుద్ధరంగమునఁ బార్థునిఁ గర్ణుఁడు;..చంపెఁ గ్రుద్ధుఁడై
    దారుణ రీతినర్జునుడు ధర్మము వీడుచు నంగరాజునే...
    వీరులు దున్మిరే కినిసి భీరుల వోలుచు పాపమెంచకే

    రిప్లయితొలగించండి