6, మార్చి 2018, మంగళవారం

సమస్య - 2617 (గౌరి కాత్మజుండు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"గౌరి కాత్మజుండు కమలభవుఁడు"
(లేదా...)
"వాసిగ గౌరి కాత్మజుఁడు బ్రహ్మ యనంగుఁడు శౌరి కల్లుఁడౌ"

84 కామెంట్‌లు:

  1. బొజ్జ గణపతిగద గుజ్జురూపుండుగ
    గౌరి కాత్మజుండు; కమలభవుఁడు
    నాల్గు తలలవాడు నారాయణుసుతుడు
    తలల మీద వ్రాసి మెలగువాడు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీ ఆరోగ్యం ఎలా ఉంది? జ్వరం తగ్గిందా?

      తొలగించండి
    2. 🙏🙏🙏

      జ్వరం "డోలో"యమానముగా తగ్గుతూ హెచ్చుతూనున్నది. చంద్ర కళలవోలె...

      తొలగించండి
    3. శాస్త్రిగారూ!
      నీరసంలో కూడా 'హా'రసాన్నొదలలేదు.
      త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష!!

      తొలగించండి
  2. స్కంద పూర్వ జుడుట గణముల కధిపతి
    గౌరి కాత్మ జుండు , కమల భవుడు
    పలుకు రాణి మగడు భార్గవి కొమరుండు
    వింత గాదు మనకు వినగ సొంపు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "స్కంధ పూర్వజుండు" అనండి.

      తొలగించండి
    2. ముందు " స్కందపూర్వ " జుండు " అనేరాసి మళ్ళీ చెరిపేసాను . ఎందుకంటే రెండవ పాదంలో " గౌరి కాత్మజుండు " అని ఉందికదా రెండుమాట్లు " జుండు " అని వస్తుందని అదన్నమాట అసల్ సంగతి

      తొలగించండి

  3. వెండి మల శివుడగు వేమరు చెప్పితి
    గౌరి కాత్మజుండు! కమల భవుడు
    భర్త యగును సూవె పడతి సరస్వతి
    కి! మరువకు జిలేబి, కెంపుకంటి !


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంపుకంటియే ...జిలేబి ఇంక మరచే దెక్కడ ?

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      శివుడు గౌరికి ఆత్మేశుడు. ఆత్మజుడు (కొడుకు) కాదు కదా! సవరించండి.

      తొలగించండి
  4. ఎలుక వాహనుండు యేనుగు మొగమయ్య
    "గౌరి కాత్మజుండు, కమలభవుఁడు"
    బిసరుహాసనుండు,పిoగళుడు, సతము
    హరికి సుతుడు గాదె తరచి చూడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వాహనుండు + ఏనుగు' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "ఎలుక వాహనుండె యేనుగు..." అనండి.

      తొలగించండి
  5. తరుణి వల్లి పతియె తారకాసుర హారి
    గౌరికాత్మజుండు, కమల భవుఁడు
    నాభి జన్ముడతడు నలుమొగంబుల ప్రోడ
    వేదగర్భుడంట విశ్వసృక్కు.

    రిప్లయితొలగించండి
  6. గణములన్ని జూచు ఘనుడెవ్వరిలలోన?
    వాణినెవ్వరును వివాహమాడె!
    వరుస గాను జెప్పి వాక్యంబు వ్రాసిన:
    గౌరికాత్మజుండు, కమలభవుడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వామన కుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఎవ్వరును' అని చివర 'ను' ఎందుకు? "వాణి నెవ్వడు దగ వివాహమాడె" అనండి.

      తొలగించండి
    2. నాల్గవ పంక్తి హంస పంచకంబు ఉండాలంటే ఒక అక్షరం ఎక్కువ అవుతున్నదని- ఎవ్వరును అని వ్రాశాను.

      తొలగించండి
  7. బొజ్జ దేవర మరి మూషిక వాహ్యుండు
    గౌరి కాత్మజుండు, కమలభవుఁడు
    పలుకు ముద్దరాలు భగవతి నాథుండు
    గరుడ వాహనుండు కమల ధవుఁడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. మైలవరపు వారి పూరణ

      మారహంత దాను మనువాడి మగఁడయ్యె
      గౌరి., కాత్మజుండు కమలభవుడు
      హరికి రమకు , ననగ నది సాధకులమతం..
      బాత్మవిద్య బ్రహ్మమన్న యొకటె !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    3. శాస్త్రి గారూ,
      జ్వరంలోనూ బ్లాగు సేవ చేస్తున్నారా? బాగు బాగు! విశ్రాంతి తీసుకొనండి.

      తొలగించండి
    4. మోసియు దెచ్చె బొమ్మలను ముంగిటనమ్మనొకండు బుట్టలో ,
      వాసిగ గౌరికాత్మజుడు , బ్రహ్మ , యనంగుడు , శౌరికల్లుడౌ
      ధీ సముపేతుడౌ గుహుడు దివ్యముగా గనుపట్ట , నా మనో...
      ల్లాసిని ! తెచ్చియుంటినిదె ! రమ్మిక బొమ్మలకొల్వు సర్దుమా !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    5. మైలవరపు వారి రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. వారికి అభినందనలు.

      తొలగించండి


  8. అరరె ! పప్పులో కాలు :) ధన్య వాదములు సవరణ కు


    మారరిపువునికి కుమారుడు గాదమ్మ
    గౌరి కాత్మజుండు! కమల భవుడు
    భర్త యగును సూవె పడతి సరస్వతి
    కి! మరువకు జిలేబి, కెంపుకంటి !


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు.
      "మారరిపువునకు" అనండి.

      తొలగించండి
  9. భాసురశక్తి తారకుని భంజనజేసిన స్కందుడెవ్వరో ?
    ఏసరి లేని విష్ణువుకు నెవ్వరుపుత్రులు జెప్పనేర్తురే?
    మోసపుజేతచే దివికిపోయిన యాయభిమన్యుడెట్టిడో?
    వాసిగ గౌరికాత్మజుడు ;బ్రహ్మ యనంగుడు ;శౌరికల్లుడౌ

    రిప్లయితొలగించండి
  10. హరి హరుల నడుమన అఱయ బేధము లేదు
    అన్న మాట మనము విన్నదేగ
    గౌరి లక్ష్ము లపుడు కాదు వేరన్నచో
    "గౌరి కాత్మజుండు కమలభవుఁడు"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఓసఖి! దెల్పనా తొలుత నుర్విన పూజల నందు నెవ్వడో?
      ఈసరి పూజలే గనని దెవ్వరు? విష్ణుని పుత్రుడెవ్వరో?
      ఆసతి ద్రౌపదీ సవతి యాత్మజు డాయభి మన్యుడెట్టిడో?
      "వాసిగ గౌరి కాత్మజుఁడు; బ్రహ్మ; యనంగుఁడు; శౌరి కల్లుఁడౌ"

      తొలగించండి
    2. విట్టుబాబు గారూ,
      'ఏకం సత్' అంటున్న మీ మొదటి పూరణ బాగున్నది. పద్యం మధ్యలో అచ్చులు రాకుండా అవసరమైన యడాగమ, నుగాగమాలను ప్రయోగించండి.
      క్రమాలంకారంలో మీ రెండవ పూరణ బాగున్నది.
      అభినందనలు!

      తొలగించండి
    3. పొరపాటు ను క్షమించ ప్రార్థన

      తొలగించండి
  11. రిప్లయిలు
    1. రాజేశ్వరరావు గారూ,
      బ్రహ్మ లక్ష్మికి భర్త అన్నారేమిటి? సవరించండి.

      తొలగించండి
    2. సవరణ
      విఘ్న ము లను బాపు వేలుపు నె న్న గా
      గౌరి కా త్మజు oడు;కమల భవు డు
      మగడు వాణి క య్యే మాన్యుడై సృష్టి కి
      మూల మ య్యే నతడు మురిప మల ర

      తొలగించండి
    3. రాజేశ్వర రావు గారూ,
      సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. లక్ష్మి చెప్పె నిట్లు లావణ్య మొలుకంగ
    గౌరి కాత్మజుండు కమలభవుఁడు
    స్రష్ట, నాథు డిచట సంరక్షకుడు జూడ
    లలిత! నీమగండు లయ మొనర్చు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి


  13. మాసటియౌ వినాయకుడు మాన్యుడు పుత్రుడెవారికో సుమా?
    బాసమగండెవండు చెలి? ఫల్యపు బాణమువేయువాడు?గొ
    మ్మా!సఖియా జిలేబి యభిమన్యుడి చుట్టరికమ్ము సీరికిన్?
    వాసిగ గౌరి కాత్మజుఁడు; బ్రహ్మ; యనంగుఁడు; శౌరి కల్లుఁడౌ

    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2617
    సమస్య :: *వాసిగ గౌరి కాత్మజుడు బ్రహ్మ యనంగుడు శౌరి కల్లుడౌ.*
    పార్వతి యొక్క కుమారుడు బ్రహ్మ అని, మన్మథుడు అని, అతడే విష్ణుమూర్తికి అల్లుడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: శ్రీ మహాలక్ష్మి పద్మావతీ దేవిగాను , శ్రీ మహా విష్ణువు కలియుగ దైవమైన శ్రీ శ్రీనివాసుడు గాను భూలోకంలో అవతరించారు. కాలక్రమంలో వారి వివాహం నిశ్చయింపబడింది. పద్మావతీ శ్రీనివాసుల కల్యాణం చూచేందుకు దేవతలంతా దివి నుండి భువి కి దిగివచ్చినారు. వధూవరులపై అక్షతలు చల్లే సమయంలో గౌరికి పెద్దకొడుకైన వినాయకుడు, బ్రహ్మదేవుడు, మన్మథుడు, శ్రీ హరికి అల్లుడు అందమైనవాడు అగు కుమారస్వామి, పార్వతి, పరమశివుడు, సరస్వతీ దేవి వీరందరూ ఒక్కసారిగా అక్షతలు చల్లినారు. శుభం కలగాలని దీవించారు అని విశదీకరించే సందర్భం.

    శ్రీసతి పద్మ యౌచు విలసిల్లగ, విష్ణువు శ్రీనివాసుడై
    భాసిల, వారి పెండ్లి గన వచ్చిరి దేవత లెల్ల వారిలో
    *వాసిగ గౌరి కాత్మజుడు, బ్రహ్మ, యనంగుడు, శౌరి కల్లుడౌ*
    భాసురమూర్తి షణ్ముఖుడు, పార్వతి, శంభుడు, వాణి యక్షతల్
    వేసిరి యొక్కసారి కనువిందగురీతి శుభమ్ము పల్కుచున్.
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (6-3-2018)

    రిప్లయితొలగించండి
  15. శౌరి తోడ గూడి సకల దేవతలును
    గౌరికాత్మజుండు, కమల భవుడు
    నెంద రడ్డు పడిన నెట్టులైనను గాని
    గయుని గాతు నని విజయుడు పలికె.

    రిప్లయితొలగించండి
  16. రణము నందు గూల రావణాసురుడప్డు
    సురలు,మునులు, మఱియు నరులు గూడి
    శౌరి శత విధముల శ్లాఘించి రందరు
    గౌరి కాత్మజుండు, కమల భవుడు

    రిప్లయితొలగించండి
  17. సతతము కొనసాగ  శంకరాభరణమ్ము
    కాచుచుండవలెను కలసి శివుడు,
    హరియు షణ్ముఖుండు,నాదిపరాశక్తి,
    గౌరి కాత్మజుండు, కమలభవుఁడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు!

      తొలగించండి
  18. స్కంద నామ కుండు శతపత్ర శకటుండు
    గౌరికాత్మజుండు,కమలభవుడు
    జగపు సృష్టి కర్త,శారదాదేవికి
    భర్త,పరమ పూజ్యు డార్య! మనకు

    రిప్లయితొలగించండి
  19. ఆ సుర వందితుండు దరహాసముఖుండు కుమారసామియే
    భాసిలి రొప్పుగన్ ధనుజభండనుడైన మురారి పుత్రులై
    తా సరిలేని వీరుడుసుధాహృదయుండు సుభద్ర సూనుడే
    *వాసిగ గౌరి కాత్మజుడు, బ్రహ్మ యనంగుడు, శౌరి కల్లుడౌ*

    రిప్లయితొలగించండి
  20. పలికెనిట్టులొక్క పాండిత్య హీనుండు
    వాణిపుత్రుడౌను వాసవుండు
    లక్ష్మి కొడుకు కాదె లంకాదిపతి చూడ
    గౌరికాత్మజుండు,కమలభవుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా చక్కగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  21. పద్మనాభ నాభి పద్మ సంజాతుఁడు
    బ్రహ్మ దేవుఁ డనఁగఁ బరమ సాధ్వి
    శ్రీరమాసతి కగుఁ జెన్నుగఁ బూజిత
    గౌరి కాత్మజుండు కమలభవుఁడు


    వాసురఁ బ్రాణి కోటి తమి బ్రహ్మ సృజించఁగఁ బాలనమ్ము చే
    వాసికి నెక్క విష్ణువు శివక్షయ మౌను గ్రమమ్ము దల్చగన్
    భాసిలి యగ్నిసంభవుఁడు, పద్మభవుండు, స్మరుండు, దైత్యుఁడున్
    వాసిగ గౌరి కాత్మజుఁడు, బ్రహ్మ, యనంగుఁడు, శౌరి కల్లుఁ డౌ

    [దైత్యుఁడు = ఇక్కడ ఘటోత్కచుఁడు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      'పూజిత గౌరికి' అంటూ మొదటి పూరణ, క్రమాలంకారంలో రెండవ పూరణ రెండూ అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  22. శ్రీసతి లచ్చిమాతకునుశ్రీకరధాముడు విష్ణుమూర్తికిన్
    భాసురమౌ విధానమున బ్రాహ్మణవర్యులుబెండ్లిజేయగా
    వాసిగ గౌరికాత్మజుడుబ్రహ్మయనంగుడుశౌరికల్లుడౌ
    యాసమవర్తియున్మిగులనార్ద్రతభావమువిల్లసిల్లగన్ సేసనబ్రాలనన్నిడగశీర్షముపైననువచ్చియుండిరే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      లక్ష్మీ నారాయణుల పెండ్లికి వారి ఇద్దరు కుమారులను, మేనల్లుని రప్పించారు.

      తొలగించండి
  23. వాసిగ గౌరి కాత్మజుఁడు, బ్రహ్మ, యనంగుఁడు, శౌరి కల్లుఁడౌ
    దూసుకు వ్యూహమున్ చెలగి ద్రుంపిన యోధుడు, వాయుపుత్రుడున్,
    మోసపు మామయౌ శకుని, ముక్కను సామియు, పోతురౌతుయున్,
    మీసములున్న వారలని మీసము త్రిప్పుచు నేనుచెప్పెదన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      'దోస మటం చెరింగియును దుందుడు కొప్పగ పెంచినార మీ మీసము...' అని ప్రతిజ్ఞ చేసిన తిరుపతి వేంకట కవులలో ఒక్కరికే మీసం ఉంది. అలాగే మీసాలు లేనివాళ్ళకు కూడా ఉన్నాయని (లేని) మీసం తిప్పుతూ మీరు పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.

      తొలగించండి
    2. సార్! ఇటీవలే ఇచ్చట ప్రతి దేవునికీ ఏదో ఒక మందిరములో మీసములున్నవని చదివినట్లున్నాను :)

      తొలగించండి
  24. అవకతవకలన్ని జెప్ప అర్థ ముండగల్గునా
    కవిత?గౌరి కాత్మ జుండు కమలభవుడు గాదుగా
    అవగతమగు బదులుజెప్పు!అసలు మసలు బుఱ్ఱచే
    ఆవిదితమును దిద్దబోకు అతి తెలివిగమాటలా !

    రిప్లయితొలగించండి
  25. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,

    ఆ సురలోకసేవ్యు , డనయాచల తేజిత వజ్ర మెవ్వరో

    ఆ సరసీజసంభవుడు , ప్రాణి సమూహ విధాత యెవ్వరో

    ఆ సుమసాయకుండు , మరి యా ప్రణయోద్భవ కర్త ‌యెవ్వరో

    ఆ సరసీజ మందున నిరాయుధుడై మృతి జెందె నెవ్వరో

    వాసిగ | గౌరి కాత్మజుడు | బ్రహ్మ | యనంగుడు | శౌరి కల్లు డౌ |

    { తేజిత = నిశిత ; సరసీజము = పద్మము = పద్మవ్యూహము }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ క్రమాలంకార పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  26. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఏనుగుమొగమయ్య నీశ్వరు యర్థాంగి
    గౌరికాత్మజుండు; కమలభవుడు
    జీవ పోషకుండు దేవదేవుండునౌ
    యంబుజోదరునకు యౌరసుండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "..నీశ్వరు నర్ధాంగి...జోదరునకు నౌరసుండు" అనండి.

      తొలగించండి
  27. ఆటవెలది
    కాలయమునిఁ దన్ని బాల మార్కండేయు
    నాలయమున బ్రోచ నాదిశివుడు
    విగ్రహమ్ము లౌచు విస్తుపోయి రచట
    గౌరికాత్మజుండు, కమలభవుఁడు!

    రిప్లయితొలగించండి
  28. రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  29. వాసిగ గౌరికాత్మజుడు,బ్రహ్మ, యనంగుడు,శౌరికల్లుడౌ
    భాసుర షణ్ముఖుండు నట ప్రాకట భీషణ దృశ్యమట్లుగా
    జూసిరి కర్ణ పార్థులను శూరుల భీకర యుద్ధమందునన్
    దోసిట పూవులన్ ముదముతో గురిపించిరి వారిపైబడన్

    రిప్లయితొలగించండి
  30. ఉత్పలమాల
    చూసితి స్వర్గమే భువికి సొంపును గూర్చఁగ వచ్చినట్లు 'కుం
    దా' సుర ధామమందు హరి త్ర్యంబకు లెల్ల సతీ సమేతులై
    వాసిగ గౌరి కాత్మజుఁడు, బ్రహ్మ, యనంగుఁడు, శౌరి కల్లుఁడౌ
    భాసుర మూర్తులున్ గొలువుఁ బంచఁగఁ దోచును మానవాళికిన్

    రిప్లయితొలగించండి
  31. .......సమస్య
    *"వాసిగ గౌరి కాత్మజుఁడు బ్రహ్మ*
    *యనంగుఁడు శౌరి కల్లుఁడౌ"*

    సందర్భము: శ్రీ వేంకటేశ్వరుని కళ్యాణం పద్మావతితో అంగ రంగ వైభవంగా జరగబోతోంది.
    ఆ పెండ్లికి గౌరీ ప్రియ పుత్రుడైన వినాయకుడు, బ్రహ్మ దేవుడు, మన్మథుడు, గౌరికి మరో పుత్రుడూ దేవసేనాని యైన సుబ్రహ్మణ్యుడు, సరస్వతి, పార్వతి, పరమేశ్వరుడు విచ్చేశారు.
    అంతే గాకుండా యెన్నడూ వాడిపోని దివ్య పుష్పాలు ధరించి గంగా యమున మొదలైన పుణ్య నదీ మతల్లులు, ఇంద్రుడు మొదలైన దేవతలూ విచ్చేశారు.
    ఐతే వారంతా జంగమ రూపాలలో విచ్చేయడం జరిగింది.
    దేవతలకు స్థావర జంగమ రూపాలు వేర్వేరుగా వుంటాయి. ఉదాహరణకు సూర్య గోళం, చంద్ర మండలం అనేవి సూర్యునియొక్క చంద్రునియొక్క స్థావర రూపాలు. అవి తమ తమ విధ్యుక్త ధర్మాలను
    నిర్వహించడానికి ఉపకరిస్తాయి. సూర్య చంద్రులకు మనలాంటి రూపాలూ వున్నాయి. అవి లోక వ్యవహాల కుపకరిస్తాయి. అట్లే పుణ్య నదులకు కూడా.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    వాసిగ గౌరి కాత్మజుఁడు
    బ్రహ్మ యనంగుఁడు శౌరి కల్లుఁడౌ
    నా సుర సేనుడున్ జదువు
    లమ్మయు గౌరియుఁ జంద్రమౌళియున్
    దోసిట దివ్య పుష్పముల
    తోడను పుణ్య నదీ మతల్లులున్
    వాసవు డాదిగా సురలు
    వచ్చిరి జంగమ రూప ధారులై...
    భాసిలు వేంకటేశ్వరుడు
    పద్మను చేకొను పెండ్లి వేళలో..

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    6.3.18

    రిప్లయితొలగించండి

  32. సులభ వరప్రదాత సుముఖనాముడితడు

         గౌరి కాత్మజుండు కమలభవుఁడ

          నంగ గనుము పుత్రు డప్రమేయునకును

          బ్రహ్మ దేవుడనగ వాసికెక్కె.


    వ్యాస భారతమును వ్రాసిన గణపతి

    గౌరి కాత్మజుండు కమలభవుఁడు

    చదువు సంధ్యలనిల చక్కగా నేర్పెడి

    వాణిమాత కితడు పతియు భువిని.


    గుహుని యన్నగానె గురినిముట్టిన వాడు

    గౌరి కాత్మజుండు కమలభవుఁడు

    వాణిపతియు సతము వ్రాయును మనతల

    వ్రాతలను విడువక వసుధ యందు.

    రిప్లయితొలగించండి
  33. డా.పిట్టాసత్యనారాయణ}
    వారిజాసనుండె వరుసదప్పి నడచె
    బ్రహ్మ రిమ్మ దెచ్చె బహుగ చేటు
    తర్కమేల మనకు తల్లిదండ్రులెగద
    గౌరికా,త్మజుండు, కమల,విభుడు!

    రిప్లయితొలగించండి
  34. మోసము జేయబూనుచును మోదముతో నిడు కైపదమ్ములన్
    వాసిగ గౌరి కాత్మజుఁడు, బ్రహ్మ, యనంగుఁడు, శౌరి కల్లుఁడౌ
    భాసిలు వారలెల్లరును భండనమౌ యవధాన ప్రక్రియన్...
    దూసుకు పోవుచున్ మురిసి దుందుభి వోలుచు చీల్చిచెండెదన్!

    రిప్లయితొలగించండి