11, మార్చి 2018, ఆదివారం

సమస్య - 2622 (...దుష్ట కురుసార్వభౌముఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"...దుష్టుఁ డా కురురాజు భీకరముగఁ జంపె భీమసేను" (ఛందోగోపనం)
(లేదా...)
"...దుష్ట కురురాజు రణంబునఁ జంపె భీమునిన్" (ఛందోగోపనం)
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

58 కామెంట్‌లు:



  1. అమలిన కంటకమ్మకట! ఆరని మంటయు !పంచపాండవుల్
    సమసిన మేలు! సొమ్మ సిలి సంలయనమ్మున స్వప్నమందునన్,
    రమణి జిలేబి, దుష్ట కురురాజు, రణంబునఁ జంపె భీమునిన్
    తమసపు విష్ణుమాయ గద దాటతరమ్మగునే జనాళికిన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. శిష్టు జూడలేని దుష్టుడా కురురాజు
    భీకరముగ జంపె భీమసేను ;
    పగటికలలలోన పారవశ్యము నంది
    తమ్ములంత కలసి తలలనూప .

    రిప్లయితొలగించండి
  3. శిష్టు జూడలేని దుష్టుడా కురురాజు
    భీకరముగ జంపె భీమసేను ;
    పగటికలలలోన పారవశ్యము నంది
    తమ్ములంత కలసి తలలనూప .

    రిప్లయితొలగించండి
  4. దుర్మదాంధు డట్లె దుష్టుఁ డా కురురాజు,
    భీకరముగఁ జంపె భీమసేను
    డత నిఁ బ్రతిన బూని యనిలోన నలనాడు
    ద్రుపద రాజ పుత్రి తుష్టి నంద.

    రిప్లయితొలగించండి
  5. దుమ్ములాడె ననిన దుష్టుఁ డా కురురాజు
    భీకరముగఁ ,జంపె భీమసేను
    తొడను గొట్టి నీచ దుర్యోధనుని; భీమ
    సేనుడయ్యెను కద జిత్వరుండు

    రిప్లయితొలగించండి
  6. తొడలు విరిగి చచ్చె దుష్టుడా కురురాజు
    భీకరముగఁ జంపె భీమసేను
    డతనిఁ దొమ్మిలోన యలనాడు సభలోన
    పంతమూనిన విధి వాయుసుతుడు.

    రిప్లయితొలగించండి
  7. తొడలు విరిగి చచ్చె దుష్టుడా కురురాజు
    భీకరముగఁ జంపె భీమసేను
    డతనిఁ దొమ్మిలోన యలనాడు సభలోన
    పంతమూనిన విధి వాయుసుతుడు.

    రిప్లయితొలగించండి
  8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి


  9. దుండ గమ్ము జేయు దుష్టుఁ డాకురు రాజు
    నడచ కృష్ణు డచట నాంది బల్క
    భండిలుడివలెను ప్రబలమును గాంచుచు
    భీకరముగ జంపె భీమసేను

    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. శిష్టులైన జనుల దుష్టుడా కురురాజు
    భీకరముగ జంపె; భీమసేను
    డదియు దెలిసి దలచె " పాపపు కర్మము
    లవని జేయువానినసురుడంద్రు!"

    రిప్లయితొలగించండి


  11. ఒ ఓ :)



    దుండ గమ్ము జేయ దుష్టుఁ డాకురు రాజు,
    భీకరముగ జంపె భీమసేను,
    భండిలుడివలెను ప్రబలమును గాంచుచు
    నడచ కృష్ణు డచట నాంది బల్క!

    జిలేబి

    రిప్లయితొలగించండి

  12. భండిలుడివలెను ప్రబలమును గాంచుచు
    నడచ కృష్ణు డచట నాంది బల్క,
    దుండ గమ్ము జేయ దుష్టుఁ డాకురు రాజు,
    భీకరముగ జంపె భీమసేను!

    రిప్లయితొలగించండి
  13. విదురుడు ధర్మరాజు తో
    బెరసు, దుష్టుడా కురురాజు, భీకరముగఁ
    జంపె భీమసేనుడు వాని సమరమందు
    ధరణి నీవశమయ్యెను ధర్మరాజ!
    ఏలు కొమ్మీ కరిపురమును మేలుగాను

    రిప్లయితొలగించండి
  14. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2622
    సమస్య :: ......... *దుష్ట కురురాజు రణంబున జంపె భీమునిన్.*
    (ఛందోగోపనము అనే విశేషం ఈ సమస్యలో ఉంది)
    దుర్యోధనుడు భీముని చంపినాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: చిన్నతనం నుండి తనకు ప్రత్యర్థి గా ఉన్న భీముని చంపాలనే ఆలోచనతో ఉన్న దుర్యోధనుడు భీముని బంధించి గంగలో పడవేయించినాడు. పాములచేత కఱపించినాడు. అతనిచే విషాన్నం తినిపించినాడు. లక్కయింట ఉంచి నిప్పు పెట్టించినాడు. భీముని చంపే విషయంలో తన ఆలోచనలు బలము వృథా అవుతున్నాయని అనుకొంటూ నిద్రించినటువంటి రారాజు ఐన కురురాజు కలగన్నాడు. ఆ కలలో దుర్యోధనుడు భీముని చంపినాడు అని తెలియజెప్పే సందర్భం.

    నా జము డీతడే యనుచు నాశము జేయగ నెంచి , నేరుగా
    నాజిని జంప జాలక , విషాన్నము బెట్టితి , గంగ ద్రోసితిన్,
    నా జవ సత్త్వ రాశియు గనన్ వృథ యంచును స్వప్న మందు రా
    *రాజుగ నున్న దుష్ట కురురాజు రణంబున జంపె భీమునిన్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (11-3-2018)

    రిప్లయితొలగించండి
  15. క్రమాలంకార పూరణ :
    ======
    పగను బూని తుదకు పతన మొందెను తానె;
    యని వృకోదరుండె యరులను బహు;
    కోరుకొనె హిడింబ;దుష్టుఁ డా కురురాజు
    భీకరముగఁ జంపె భీమసేను"
    ***)()(***
    అన్వయము :
    పగను బూని తుదకు పతన మొందెను తానె దుష్టుఁ డా కురురాజు ; యని వృకోదరుండె యరులను బహు భీకరముగఁ జంపె ; కోరుకొనె హిడింబ భీమసేను.
    ***)()(***

    రిప్లయితొలగించండి

  16. [11/03, 08:12] Nvn Chary: డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
    మమతయు మానవత్వమునుమర్చి
    సుతుండభిమన్యు ముట్టి కౄ
    ర మనము తోడ దుష్ట కురురాజు రణంబున జంపె, భీమునిన్
    ప్రముఖులు ధర్మజాదులనువాడొక హీనుడు సైంధవుండహో
    విముఖత నడ్డె నొంటిగనె విక్రముడౌచు వరంబు నొందగా

    రిప్లయితొలగించండి

  17. [11/03, 08:12] Nvn Chary: డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
    మమతయు మానవత్వమునుమర్చి
    సుతుండభిమన్యు ముట్టి కౄ
    ర మనము తోడ దుష్ట కురురాజు రణంబున జంపె, భీమునిన్
    ప్రముఖులు ధర్మజాదులనువాడొక హీనుడు సైంధవుండహో
    విముఖత నడ్డె నొంటిగనె విక్రముడౌచు వరంబు నొందగా

    రిప్లయితొలగించండి
  18. దు రి త చిత్తు డు గద దుష్ టు డా కురు రాజు
    భీకర ము గ జంపె భీమ సేను
    డ త ని తొడలు విరిచి యని లోన చేసిన
    ప్రతిన తీరు నట్లు పంతమూని

    రిప్లయితొలగించండి
  19. దు రి త చిత్తు డు గద దుష్ టు డా కురు రాజు
    భీకర ము గ జంపె భీమ సేను
    డ త ని తొడలు విరిచి యని లోన చేసిన
    ప్రతిన తీరు నట్లు పంతమూని

    రిప్లయితొలగించండి
  20. తోయజాక్షి!వినుము దుష్టుడా కురురాజు
    భీకరముగజంపెభీమసేను
    ననుచుగలను గంటి యచ్చెరు వాయెను
    నెట్లువచ్చెనట్లు నిద్దినమున

    రిప్లయితొలగించండి
  21. రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. తుష్టిలేనివాడు దుష్టుడా కురురాజు;
      భీకరముగ జంపె భీమసేను
      వాని తొడలు విరచి పూనిక నెరవేర్చె
      నతివ సంతసిల్ల నమితముగను!

      తుచ్ఛ చింతనమున దుష్టుడా కురురాజు
      భీకరముగ జంపె భీమసేను
      ప్రేమమీర బిల్చి పెక్కుమాటలు బల్కి
      క్రోడమీయ నినుప కుంతిపుత్రు!

      క్రోడము = కౌగిలింత

      తొలగించండి
    3. సీతా దేవిగారూ... రెండో పద్యం బ్రహ్మాణ్డమ్.

      నేను పొద్దున్న సమస్య చూడగానే ఇదే భావాన్ని రాయాలనుకున్నా! కాని ఇల్లు మారే క్రమంలో తీరిక చిక్కలేదు.
      ☺️

      తొలగించండి
    4. ధన్యవాదములు విట్టుబాబుగారూ!
      పద్యం నాదైనా ఆలోచన మా అన్నయ్యగారిది! మీ అభినందన ఆయనకే చెందుతుంది!😊😊😊

      తొలగించండి
    5. పుట్టుగ్రుడ్డి యైన బుద్ధివీడిన తండ్రి
      కౌగిలించ బొమ్మ గాఢముగను
      దోషమెన్నలేని దుష్టుఁ డా కురురాజు
      భీకరముగఁ జంపె భీమసేను

      తొలగించండి
  22. పౌర వాన్వ యో ద్భవ క్షాత్ర వంతుఁడు
    శత్రు పక్ష వీర సంచయమ్ముఁ
    దోరముఁ గొలుచుచు, నదుష్టుఁ డా కురురాజు
    భీకరముగఁ జంపె, భీమసేను

    [కురువు = కురుమహారాజు, కౌరవ వంశ మూల పురుషుడు; భీమ సేనుఁడు = శంకరుఁడు]


    ఓజము వీడి క్రూరుఁ డల యుద్ధపు నీతిని నెన్నకుండగన్
    రాజస మించు కేనియును రంజిల నీయక మత్త చిత్తుఁడై
    యోజన సేసి వెక్కసపు టుగ్రుఁడు, నెల్లరు దల్చి రివ్విధిన్,
    రాజు యొసంగి దుష్ట కురురాజు రణంబునఁ జంపె భీమునిన్

    [దుష్ట కురురాజు = దుష్టాన్న శ్రేష్ఠము / మహా దుష్టాన్నము ; కురువు = అన్నము; రణంబున భీమునిన్ = యుద్ధములో భయంకరుని]

    రిప్లయితొలగించండి
  23. ఆజిని కౌరవుల్మరియుపాండవులెల్లరు మార్కొనంగగా
    రాజుగనొప్పుదుష్టకురురాజు రణంబునజంపె భీమునిన్
    మాజవరాలులేపగ నుమాపటివేళనుగన్నయీకలన్
    శ్రీజకుజెప్పగావినుచుజెప్పుమ యింకను వింతలన్ననెన్

    రిప్లయితొలగించండి
  24. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. పూర్వము మీ సమీక్షణలను
    వీక్షించుటకు నెదురు చూచెడి వారము. ఇప్పుడు మా పూరణములను బరికించుటకే యెదురు చూస్తున్నాము.

    రిప్లయితొలగించండి
  25. భీతిలి సైనికుండొకడు భీష్ముడు ద్రోణకృపాది వీరుల
    న్నేతరి గెల్తురో? పుడమి నెవ్విధి యేలెదరంచు శంకతో
    నాతడు ఖిన్నుడయ్యెనట, యంతట గాంచెను స్వప్నమొక్కటిన్
    రాతిరి వేళ, దుష్ట కురురాజు రణంబున జంపె భీమునిన్.

    రిప్లయితొలగించండి
  26. కావునటనకు



    కావునటంచుగర్వమున కర్ణుని తోడుగ యుద్ధ రంగ మున్
    భావనలేనిభాద్యతగ బంధువినాశనమెంచి సైన్యమున్
    రావణుడట్లుదుష్టకురురాజు రణంబునజంపె !భీమునిన్
    జీవముదీయ నెంచగనె?చిత్రముగా బలినాయె వింతగా !



    రిప్లయితొలగించండి
  27. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    *"...దుష్టుఁ డా కురురాజు భీకరముగఁ*
    *జంపె భీమసేను"*(ఛందో గోపనము)

    సందర్భము: సులభము
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    దు ష్పథానువర్తి, దుష్టుఁ డా కురురాజు...

    భీకరముగఁ జంపె భీమసేను

    డతని, తన ప్రతిజ్ఞ నమలుఁ జేసె, రణాన

    తొడలు విరుగగొట్టి త్రోసి వేసె

    2 వ పూరణము:--

    *ప్రమదావనం*

    సందర్భము: భీముడు దుర్యోధనుని భీకరంగా వధించినాడు. అతని తొడలు విరిగిపడినవి.
    ఆంజనేయునిచేత లంకా నగరంలోని ప్రమదావనంలో గొప్పగొప్ప వృక్షాలు విరిగిపడలేదా! (అదే విధంగా)
    సీతా సందర్శనం తర్వాత...
    *తతస్తు హనుమాన్ వీరో*
    *బభఞ్జ ప్రమదావనమ్...*
    (సుందర కాండ స 41 శ్లో 15)
    అప్పుడు హనుమంతుడు ప్రమదావనమును విరిచివేసెను. (ధ్వంసం చేసెను)
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    తొడలు విరిగి పడియె! దుష్టుఁ డా కురురాజు

    భీకరముగఁ జంపె భీమసేను;

    డాంజనేయుచేత నా ప్రమదావన

    మ్మున మహా మహీజములు విరుగవె!

    ..............సమస్య
    (ఛందో గోపనము)
    *"...దుష్ట కురురాజు రణంబునఁ జంపె*
    *భీమునిన్"*

    సందర్భము: ఒక యోధుడు దుర్యోధన వధానంతరం భీమునితో అంటున్నాడు..
    "అంతటి రారాజై యుండి యల్పులను మాత్రమే వధించ గలిగినాడు. ఓ భీమసేనా! నిన్ను వధించలేక యిలా భయంకరంగా కన్ను మూసినాడు."
    ~~~~~~~~~~~
    మోజు, లశాశ్వతంపు సుఖ
    ముల్, మదిఁ గోరుటె పెద్ద త ప్పగున్..
    తేజము లేని వారలను
    దీటుగ నల్పులఁ బట్టి, రాజు తా
    రాజుల కెల్ల, దుష్ట కురు
    రాజు రణంబునఁ జంపె; భీము, ని
    న్నాజి వధింప జాలక భ
    యావహ రీతిని కన్ను మూసెడిన్

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  28. .....సమస్య
    *"...దుష్టుఁ డా కురురాజు భీకరముగఁ*
    *జంపె భీమసేను"*(ఛందో గోపనము)

    సందర్భము: సులభము
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    దు ష్పథానువర్తి, దుష్టుఁ డా కురురాజు...

    భీకరముగఁ జంపె భీమసేను

    డతని, తన ప్రతిజ్ఞ నమలుఁ జేసె, రణాన

    తొడలు విరుగగొట్టి త్రోసి వేసె

    2 వ పూరణము:--

    *ప్రమదావనం*

    సందర్భము: భీముడు దుర్యోధనుని భీకరంగా వధించినాడు. అతని తొడలు విరిగిపడినవి.
    ఆంజనేయునిచేత లంకా నగరంలోని ప్రమదావనంలో గొప్పగొప్ప వృక్షాలు విరిగిపడలేదా! (అదే విధంగా)
    సీతా సందర్శనం తర్వాత...
    *తతస్తు హనుమాన్ వీరో*
    *బభఞ్జ ప్రమదావనమ్...*
    (సుందర కాండ స 41 శ్లో 15)
    అప్పుడు హనుమంతుడు ప్రమదావనమును విరిచివేసెను. (ధ్వంసం చేసెను)
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    తొడలు విరిగి పడియె! దుష్టుఁ డా కురురాజు

    భీకరముగఁ జంపె భీమసేను;

    డాంజనేయుచేత నా ప్రమదావన

    మ్మున మహా మహీజములు విరుగవె!

    ..............సమస్య
    (ఛందో గోపనము)
    *"...దుష్ట కురురాజు రణంబునఁ జంపె*
    *భీమునిన్"*

    సందర్భము: ఒక యోధుడు దుర్యోధన వధానంతరం భీమునితో అంటున్నాడు..
    "అంతటి రారాజై యుండి యల్పులను మాత్రమే వధించ గలిగినాడు. ఓ భీమసేనా! నిన్ను వధించలేక యిలా భయంకరంగా కన్ను మూసినాడు."
    ~~~~~~~~~~~
    మోజు, లశాశ్వతంపు సుఖ
    ముల్, మదిఁ గోరుటె పెద్ద త ప్పగున్..
    తేజము లేని వారలను
    దీటుగ నల్పులఁ బట్టి, రాజు తా
    రాజుల కెల్ల, దుష్ట కురు
    రాజు రణంబునఁ జంపె; భీము, ని
    న్నాజి వధింప జాలక భ
    యావహ రీతిని కన్ను మూసెడిన్

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  29. సవరణతో: ********* క్రమాలంకార పూరణ :
    ======
    పగను బూని తుదకు పతన మొందెను తానె;
    యని వృకోదరుండె యరులను బహు;
    యిష్టపడె హిడింబ;దుష్టుఁ డా కురురాజు
    భీకరముగఁ జంపె; భీమసేను"
    ***)()(***
    అన్వయము :
    పగను బూని తుదకు పతన మొందెను తానె దుష్టుఁ డా కురురాజు ; యని వృకోదరుండె యరులను బహు భీకరముగఁ జంపె ; కోరుకొనె హిడింబ భీమసేను.
    ***)()(***
    (శ్రీ నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలతో)

    రిప్లయితొలగించండి
  30. క్రొవ్విడి వెంకట రాజారావు:
    ఆ.వె.
    ద్రుఘుణ మెత్తి వచ్చె దుష్టుడా కురురాజు
    భీకరముగ; జంపె భీమసేను
    డతని తొడలు విఱిచి నాహవమందున
    ప్రతిన తనది చక్కబఱచు కొనుచు

    రిప్లయితొలగించండి
  31. క్రొవ్విడి వెంకట రాజారావు:
    ఆ.వె.
    ద్రుఘుణ మెత్తి వచ్చె దుష్టుడా కురురాజు
    భీకరముగ; జంపె భీమసేను
    డతని తొడలు విఱిచి నాహవమందున
    ప్రతిన తనది చక్కబఱచు కొనుచు

    రిప్లయితొలగించండి
  32. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    పరీక్ష గదిలో తడబాటు - జవాబు పత్రంలో పొరపాటు :

    01)
    ____________________________

    "భీకరముగ జచ్చె - భీము జేత"
    వ్రాయబోయి యొకడు - వ్రాసె నిటుల
    "ధుర్మదాంధుడైన - దుష్టుడా కురురాజు
    భీకరముగ జంపె - భీమ సేను"
    ____________________________

    రిప్లయితొలగించండి



  33. దుష్ట బుద్ధి జూపు తులువయౌ కురురాజు

    భీకరముగఁ జంపె భీమసేను

    డతని తొడలు పట్టి యదుముచు నాజిలో

    ప్రతిన దీర్చుకొనియె పట్టు బట్టి.


    భారత రణమందు బలముతో కురురాజు  

    భీకరముగఁ జంపె భీమసేను

    మడుగులోన దాగ మర్మభేదములగు

    పలుకులాడి యతని బయట పిలిచె.

    రిప్లయితొలగించండి
  34. "దుర్మదాంధు డతడు దుష్టుఁ డా కురురాజు,
    భీకరముగఁ జంపె భీమసేను
    డతని తొడలు విరిచి; ఆజిలోన గెలుపు
    నందె పాండు పుత్రు లా క్షణమ్ము!

    రిప్లయితొలగించండి
  35. ఆటవెలది
    తొందర పడి రగిలి దుష్టుడా కురురాజు 
    భీకరముగఁ జంపె భీమసేను 
    ప్రతిమఁ గౌగిటఁ గొని సుతుఁ గూల్చె నని నొచ్చి
    సూత్రధారిగ హరి శుభము నొసగ.
    (కురురాజు = ధృతరాష్ట్రుడు)

    రిప్లయితొలగించండి
  36. "దుర్మదాంధు డతడు దుష్టుఁ డా కురురాజు,
    భీకరముగఁ జంపె భీమసేను
    డతని తొడలు విరిచి; ఆజిలోన గెలుపు
    నందె పాండు పుత్రు లా క్షణమ్ము!

    రిప్లయితొలగించండి
  37. మొదటి పాదంలో గణదోషం
    ఔను గదూ - గమనించ లేదు
    మిత్రమా
    ధన్యవాదములు !
    సవరణతో

    పరీక్ష గదిలో తడబాటు - జవాబు పత్రంలో పొరపాటు :

    01అ)
    ____________________________

    "భీకరముగ జచ్చె - బీమసేనుని చేత"
    వ్రాయబోయి యొకడు - వ్రాసె నిటుల
    "ధుర్మదాంధుడైన - దుష్టుడా కురురాజు
    భీకరముగ జంపె - భీమ సేను"
    ____________________________

    కవులూరు రమేష్(వసంత కిశోర్)

    రిప్లయితొలగించండి
  38. శంకరార్యా ! ధన్యవాదములు !
    ఈ పద్యంతొ
    శంకరాభరణం - బ్లాగుకు సంబంధించినంత వరకూ
    ఈ 2018 సంవత్సరానికి
    Life Certificate submit చేసేసినట్టే
    మీరు ఆమోద ముద్ర వెయ్యడమే తరువాయి

    నా ఆరోగ్యం
    "నానాటికీ తీసికట్టు నాగంబొట్లూ"
    అన్నట్లుంది
    నాలుగడుగులు నడవలేను
    కాళ్ళ నొప్పులు (SCIATICA)
    కుదురుగా కూర్చోలేను వంగో లేను నిలబడనూ లేను
    నడుము నొప్పి (DISC COMPRESSION)
    వేగంగా మెడా చేతులూ కదపలేను
    మెడ నొప్పి (SPODILITIS)

    అనేకానేక మానసిక సమస్యలు(MENTAL DEPRESSION)

    నడుముకూ కాళ్ళకూ రక్తప్రసరణ బాగా తగ్గిపోయిందని
    ABDOMEN లో చెరొక ప్రక్కనా
    రెండు STENTS కూడా వేయించు కున్నాను
    ప్రయోజనం శూన్యం

    LATEST DEVELOPEMENT ఏమిటంటే
    CARERACTS బాగా వృద్ధి చెంది కళ్ళు కనబడడం లేదు
    భూతద్దం పెట్టుకొని అక్షరం అక్షరం చదవ వలసిన పరిస్థితి

    OPERATION చేయించుకుందామంటే వీలులేని స్థితి
    విపరీతమైన SUGAR
    FASTING BLOOD SUGAR > 300
    POST LUNCH BLOOD SUGAR 450-600

    రోజుకు 100 యూనిట్లు INSULIN తీసుకున్నా
    CONTROL కావడం లేదు

    ఈ రోజెందుకో మీతో నాలుగు ముక్కలు పంచుకోవాలనిపించింది
    వీలైనప్పుడు మళ్ళీ కలుస్తా

    రిప్లయితొలగించండి
  39. ధర్మరాజు - దుస్వప్నం - కలత - తేరుకొనుట :

    02)
    ____________________________

    క్షుద్రపు స్వప్నమందు గని - క్రుంగగ గుండెలు ధర్మజుం, " డనిన్
    రుద్ర సమానుడై గదను - రువ్వగ భీముడు రాజు యూరువున్
    ఛిద్రము జేయగా దలచి; - చిత్రముగా మరి త్రిప్పి మోదుచున్
    రౌద్రముతోడ దుష్ట కురు - రాజు రణంబున జంపె భీమునిన్ ! "
    భద్రము భీమసేనుడను - పార్థుని పల్కుల శ్రాంతుడయ్యెడున్ !
    ____________________________

    కవులూరు రమేష్(వసంత కిశోర్)



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వసంత కిశోర్ గారు మీ యారోగ్యము కుదుట పడి యూఱట కలుగ వలెనని భగవంతుని బ్రార్థించు చున్నాను.

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ ! ధన్యవాదములు !

      తొలగించండి
  40. ధర్మరాజు - దుస్వప్నం - కలత - తేరుకొనుట :

    02)
    ____________________________

    క్షుద్రపు స్వప్నమందు గని - క్రుంగగ గుండెలు ధర్మజుం, " డనిన్
    రుద్ర సమానుడై గదను - రువ్వగ భీముడు రాజు యూరువున్
    ఛిద్రము జేయగా దలచి; - చిత్రముగా మరి త్రిప్పి మోదుచున్
    రౌద్రముతోడ దుష్ట కురు - రాజు రణంబున జంపె భీమునిన్ ! "
    భద్రము భీమసేనుడను - పార్థుని పల్కుల శ్రాంతుడయ్యెడున్ !
    ____________________________

    కవులూరు రమేష్(వసంత కిశోర్)



    రిప్లయితొలగించండి
  41. శంకరార్యా మోడరేషన్ పెట్టారా ? ఎందుకని ?

    రిప్లయితొలగించండి
  42. ఆటవెలది
    తొందర పడి రగిలి దుష్టుడా కురురాజు 
    భీకరముగఁ జంపె భీమసేను 
    ప్రతిమఁ గౌగిటఁ గొని సుతుఁ గూల్చె నని నొచ్చి
    సూత్రధారిగ హరి శుభము నొసగ.
    (కురురాజు = ధృతరాష్ట్రుడు)

    రిప్లయితొలగించండి
  43. ఉత్పలమాల
    చేటు గలుంగు వాయుసుతుఁ జిక్క సుయోధను కంచు నమ్మియున్
    గోటను వీడలేని తను గ్రుడ్డిగ సంజయు మాధ్యమాన పో
    రాటము జూచి స్వప్నమున రంజిల నెంచుచు పుత్రవత్స లా
    రాటము తోడ దుష్ట కురురాజు రణంబునఁ జంపె భీమునిన్!

    రిప్లయితొలగించండి