1, ఏప్రిల్ 2018, ఆదివారం

సమస్య - 2638 (పతి తల ఖండించి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పతి తల ఖండించి వండె బంధువులు దినన్"
(లేదా...)
"పతి తలఁ గోసి వండినది బంధువు లెల్లఁ దినంగఁ గోరుచున్"

82 కామెంట్‌లు:

  1. మైలవరపు వారి పూరణ

    కిరీటము గల్గియుండుటచే కూరలకు రారాజు వంకాయ....

    చతురుడు కూరగాయలను సంతకునేగియు దెచ్చి , వండగా
    సతినిటు బల్కె " భామిని ! విచక్షణ వండుము , మెచ్చగావలెన్
    ప్రతిజనుడున్ దినంగనె సెబాసని" , యన్న లతాంగి శాకరాట్...
    పతి తలఁ గోసి వండినది బంధువు లెల్లఁ దినంగఁ గోరుచున్" !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారూ,
      'శాకరాట్పతి (వంకాయ)'తో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. సతి యొక సంఘసేవిక , విశాలమనస్విని , జీవితమ్ములన్
      చితికిన వారికండ , తన సేవల చుట్టములంచునెంచు దా
      పతితల ., కోసి వండినది బంధువు లెల్లఁ దినంగఁ గోరుచున్
      పతి కొనినట్టి కాయలను , భర్తయు మెచ్చుచు ప్రోత్సహింపగన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి

  2. అతిధులె దేవుళ్ళనుకొను
    జతకత్తె యొకతెయు విందు జాతర దినమం
    దు తెఱగుగ జేయనట అజ
    పతి తల ఖండించి వండె బంధువులు దినన్!



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మైలవరపు వారు శాకాహారాన్ని ప్రస్తావిస్తే మీరు మాంసాహారాన్ని ప్రస్తావించారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  3. అతివకు చేపను తేగా
    పతి, తల ఖండించి వండె బంధువులు దినన్
    నుతియించుచు భళియనుచును
    మితిమీరిన లొట్ట లిడుచు మెక్కుచు వంగల్!

    రిప్లయితొలగించండి
  4. అతిరథు లెందరొ వచ్చిరి
    యతిథులుగా రాత్రివేళ, నాతిథ్యముకై
    సతికిచ్చెను కోడి నొకటి
    పతి, తల ఖండించి వండె బంధువులు దినన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
      'ఆతిథ్యమునకై' అనడం సాధువు. అక్కడ "ఆతిథ్య మిడన్" అనండి.

      తొలగించండి

  5. నారాయణ! నారాయణ! ఇంట్లో వంటే చేయని ఇగురాకుబోణులతో యేమేమి వంట చేయిస్తున్నారండి కందివారు


    కుతకుత వేడి మీద జతగూడగ విందుకు జట్టుగానటన్
    సతతము రీతి గా నతిథి సౌఖ్యము గూర్చెడు యంచయాన స
    మ్మతముగ సంతసించి మజ మత్తున దేలుచు భద్ర విట్చరా
    ట్పతి తలఁ గోసి వండినది బంధువు లెల్లఁ దినంగఁ గోరుచున్

    నో జిలేబి :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      విట్చరాపతి (అడవిపంది)తో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  6. కం.
    సతి గోరగ దెచ్చె శశము
    పతి;తల ఖండించి వండె బంధువులు దినన్
    సతి యా కుందేలును; మరి
    అతిథులు కడుపార దినిరి ఆహా! యనుచున్


    🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
    ☘ వనపర్తి☘

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతి భూషణ్ గారూ,
      విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  7. స్తుతమతి మంగళ సూత్రము
    సతీకిచ్చునెవండు? దైత్యు చంపినదెటులో?
    నతివపుడేమి చేసెన్?
    పతి, తల ఖండించి, వండె బంధువులుఁదినన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
      ఇంతకీ దైత్యుని చంపిన దెవరు?
      మూడవ పాదంలో గణదోషం. "అతివ+అపుడు" అన్నపుడు సంధి లేదు. అక్కడ "అతివ యపు డేమి చేసెను" అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు దైత్యుని చంపనదిఅమ్మవారు చాముండి

      తొలగించండి
  8. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2638
    సమస్య :: *పతి తలఁ గోసి వండినది బంధువు లెల్లఁ దినంగఁ గోరుచున్.*
    భర్త తలను కోసి బంధువులకు వండిపెట్టింది ఒక ఇల్లాలు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: ఇల్లాలు తన భర్తతో ఏమండీ! పెరటిలో ఉన్న మొక్కలు దండిగా కాయలు కాచినాయి. కోసి వండుతానండీ. ఉగాది పండుగకు వచ్చిన బంధువు లందఱూ తింటారండీ అని అనగా మౌనవ్రతంలో ఉన్న భర్త అలాగే చేయి అని నోటితో చెప్పలేక సంతోషంగా తల ఊపినాడు. అప్పుడు ఆ ఇల్లాలు పెరటి మొక్కలకు ఉన్న కాయలు కోసి తన యింటికి వచ్చినబంధువులు అందఱూ తినాలని రుచికరంగా వండి పెట్టింది అని విశదీకరించే సందర్భం.

    అతివ వచించె నీ పెరటి యందలి మొక్కలు గాసె గాయలన్
    పతివర! గోసి వండెదను బాగుగ నంచు నుగాది నాడు, దా
    వ్రతమున మౌనదీక్ష నలరారుచు, సమ్మతి దెల్ప నూపగా
    *పతి తలఁ ; గోసి వండినది బంధువుఁ లెల్లఁ దినంగఁ గోరుచున్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (1-4-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కోట రాజశేఖర్ గారూ,
      పని మౌనవ్రతంలో పెట్టి తల ఊపించారు. ప్రశస్తమైన పూరణ. అభినందనలు.

      తొలగించండి
  9. అతిథులు వచ్చిరంచుఁ గొన నంగటఁ గోడి లభింపదయ్యె న
    య్యతివకుఁ, బ్రేమతో మగఁడు పెంచిన కోడినిఁ జంపలేక తా
    సతమతమయ్యె, నా పిదప సమ్మతిఁ దెల్పుచు నూపె నప్పుడా
    పతి తలఁ, గోసి వండినది బంధువు లెల్లఁ దినంగఁ గోరుచున్.

    రిప్లయితొలగించండి
  10. కుతుకముతో శూర్పణఖయె
    యతులితబాహాబలమున నవ్విపినమునన్
    వెతకుచు వేటాడెడి నర
    పతితల ఖండించి వండె బంధువులు దినన్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      నరమాంస భక్షణ చేసే శూర్పణఖను గురించిన మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  11. పతి యిచ్చెను పలలము అజ
    పతి తల ఖండించి,వండె బంధువులు దినన్
    సతి పలు మసాల దినుసులు
    జతజేసి పలావును బహు చతురత తోడన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యకుమార్ గారూ,
      చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
      'పలలము + అజ' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. 'బహు చతురత' అన్నది దుష్ట సమాసం. "పలల మ్మజ... కడు చతురత..." అనండి.

      తొలగించండి
  12. అతి ప్రేమనింటి పెరడున
    సతి బెంచిన తోటకూర చక్కగ బెరగన్
    హితమని హరితము కోరగ
    పతి, తల ఖండించి వండె బంధువులు దినన్!

    రిప్లయితొలగించండి
  13. క్షితి మేలు గోరి యు న సు ర
    పతి తల ఖండిoచి; వండె బంధువులు దిన న్
    మితి మీరి న రుచి కర ము గ
    న తి వ యె స్వయము గ ను సత్య హర్షం బె స గ న్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని సత్యభామ నరకుని తల ఖండించలేదు కదా!

      తొలగించండి
  14. చతురతతో వండగలుగు
    నతివ యొకతె; కోడిపుంజు నపరాహ్ణమునన్
    కుతుకము తోడను తేగా
    పతి తల ఖండించి;వండె బంధువులు దినన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మగడు తెచ్చిన కోడి తలను ఖండించి వండిందన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. సతులవి నాలుగు పతి ఒకండు
    కోళ్ళను పెంచె కోమలాంగి
    కాకి అరిచెను చుట్టాలొత్తురు
    భయపడి చూసెను తొంగి తొంగి
    మగని ఆనతిగ సతులను వదులుతు
    పతి తల గోసి వండినది
    బంధువులెల్ల దినంగ గోరుచున్
    ఆతిథ్యమున పండినది

    (కవిత మాత్రమే )
    (తెలుగు భాషకు ఉడతా భక్తిగ )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. మీ ఉడతా భక్తికి మా చిరు ప్రయత్నం :)


      సతులట నల్గు రయ్యిరయ జ్ఞాని మగండట! కాకి ఒర్రుడున్!
      అతిథులు రాగ నింటికి శుభాంగియు విందుకు గేస్తు మాటగన్,
      వెతపడ గా మగండు, నలివేణియు జాయల పాయబెట్టుచున్,
      పతి తలఁ గోసి వండినది బంధువు లెల్లఁ దినంగఁ గోరుచున్!

      జిలేబి

      తొలగించండి
    2. రమేశ్ గారి వచన కవిత, దానికి జిలేబీ గారి పద్యరూపం రెండూ చదివాను. కాని భావం అగమ్యంగా ఉన్నది.

      తొలగించండి

    3. అందుకే నండి కందివారు అప్పుడప్పుడు వచనాన్ని వచనకవిత్వాన్ని కూడా చదువుతూండాలి :) చూడండి, వారు రాసిన వచన కవిత నా కర్థమయ్యి , నే రాసిన ఛందో రూపం వారి కర్థమై కృతజ్ఞతలు‌ కూడా చెప్పేసేరు వారు :)

      వచన కవితలు కూడా నర్మగర్భంగా వుండును‌ :)


      ఇట్లు
      గుండు జిలేబి

      తొలగించండి
    4. గురువుగారూ! నాలుగు పెట్టలూ, ఒక పుంజూ! చుట్టాలొస్తే, పెట్టల్ని వదిలేసి పుంజును తలకోసి వండి పెట్టింది. అదీ సంగతి!

      తొలగించండి
    5. జిలేబిగారి స్టయిలే వేరు! 👌👌👌

      తొలగించండి


    6. సీతాదేవి గారిది మాది ఒకే వేవ్ లెంథ్ :) అర్థమై పోయింది వచన కవిత

      జిలేబి


      తొలగించండి
  16. అతివలె చర్చ జరుపగన్
    కుతుకముతో పడుపు వృత్తి గూరిచి నందున్
    సుతిమెత్తగ నొక వనితయె
    పతితల ఖండించి ;వండె బంధువులు దినన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      'పతితలు' వైవిధ్యమైన అర్థంతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      "...గూరిచి యందున్" అనండి.

      తొలగించండి
  17. కొతిమెరె బాగున్నదిలే
    పతిదేవా కూరలోన బడవేతుననన్
    సుతిమెత్తగ తా నూపగ
    పతి తల - ఖండించి వండె బంధువులు దినన్

    రిప్లయితొలగించండి
  18. అతిథుల వచ్చినారు సఖి!యన్నము వండవె *శాకమందు* నీ
    ప్రతిభను జూపవమ్మ రుచి వాహ్ యనగా నియమమ్మిదే చెలీ!
    ఘృతమది కూడదంచు పతి గేహిని తోడుత దెల్ప తా వన
    స్పతి తలఁ గోసి వండినది బంధువు లెల్లఁ దినంగఁ గోరుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీహర్ష గారూ,
      వనస్పతితో మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉన్నది. అభినందనలు.
      వనస్పతి తల కోయడ మంటే అది ఉన్న కవరు పైభాగాన్ని కోయడమే కదా?

      తొలగించండి
  19. అతివల రోజు వేడుకల నత్యధికమ్ముగ
    జేయు కోరికన్
    పతినటు సంతకంపి తన పాక ప్రవీణత జూపుకోరికన్
    తతులుగ పిండివంటలు పతాకమ నందగు నాంధ్రశాకరా
    ట్పతి తల గోసి వండినది బంధువులెల్ల దినంగ గోరుచున్!

    పతాకము = High light
    ఆంధ్ర శాకరాట్పతి = గోంగూర

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      ఆంధ్రశాక సమ్రాట్టు (గోంగూర)ను గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏

      తొలగించండి
  20. పతి యంత భీతినిన్ సత
    మత మయ్యెను దోచమి తన మనమున శుభదం
    తి తరుణి కోడిని, చూడఁగఁ
    బతి, తల ఖండించి వండె బంధువులు దినన్


    అతివల యందు సుందరి మహా మతిశాలిని రాఁగ బంధువుల్
    పతి నుడువంగఁ దారసపుఁ బ్రాణి నికాయ సమృద్ధపుం దటా
    క తటము వేగఁ జేర నటఁ గాంచి వధూమణి మీనముల్ తటీ
    పతితలఁ గోసి వండినది బంధువు లెల్లఁ దినంగఁ గోరుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  21. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,


    [ కొన్ని చోట్ల కొందరు శుభకార్యములలో గూడ మాంసాహారమే

    విందుగా బెట్టుదురు . " శుభమా యని కూతురు పెండ్లి జరిగినది ,

    రక్తపాత మేల " యని బార్య భర్తతో పల్కగా ‌ అతడు

    వినలేదు . భర్త ఆఙ్ఞానుసారము ఆమె పొట్టేలు తల కోసి

    వండి అందరికి వడ్డించినది ]

    " సుతకు వివాహమున్ జరిపి , శుభ్రముగా పరమాన్నభక్ష్యముల్

    హితజన బంధు వర్గము భుజించ శుభం బగు | కాని యార్య ! గ

    ర్హిత మగు నట్టి జంతుబలి యేల యటంచు వచించు ‌నట్టి యా

    సతి వచనంబులన్ వినక , స్వామి యొసంగగ నాఙ్ఞ , మేష రా

    ట్పతి - తల ‌ గోసి వండినది బందుగు లెల్ల దినంగ గోరుచున్


    { స్వామి = భర్త ; మేషరాట్పతి = బలిసిన. మగ పొట్టేలు }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి గారూ,
      మేషరాట్పతితో మీ పూరణ చాల బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురుమూర్తి ఆచారి

      గు రు భ్యో న మః . ధ న్య వా ద ము లు గు రు దే వా ! ‌

      తొలగించండి
  22. రవీందర్ గారూ,
    రాక్షసికి చిక్కిన నరపతిని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. సుతుని చదువు కోసమ్మై
    సతితో బీజింగు పోవ సాయము చేయన్
    సతికనె పొరుగావిడ యహి
    పతి తల ఖండించి వండె బంధువులు దినన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      పాములను తినే చైనీయుల గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  24. రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. సతి పుట్టినదినమనుచును
    అతిథులనాంతర్యమెరిగి ననురతి కొరకై
    పతిగోరగ ముల్లంగీ
    పతితల ఖండించి వండె బంధువులుదినన్
    పతితల=వేరుతల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ముల్లంగీపతి' అన్నది దుష్టసమాసం.

      తొలగించండి
  26. డా}.పిట్టా సత్యనారాయణ
    అతివల నాధారిత స
    న్మతి నెలకొన నూడిగాలు మగడే జేయన్
    పతి పరువుకు గతి లేకనె
    పతి తల ఖండించి వండె బంధువులు దినన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      కొంత అస్పష్టత ఉన్నా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  27. సతి కోర్కె దీ ర్ప తెచ్చె ను
    జత కోళ్ళ ను పల్లె నుండి సంబర పడు చు న్
    కుతుకము తో నొక కోడి ని
    పతి తల ఖండిoచి వండె బంధువులు దిన న్

    రిప్లయితొలగించండి
  28. డా.పిట్టా సత్యనారాయణ
    సతి "సిరియాలు"(భక్త సిరియాలు నాటికలో కొడుకు తలను గోసి వండి పెట్టమని అనడం,పదంపడి బ్రతికించడం,ఇతివృత్తం)
    నాటకము శ్రద్ధగ జూచిన రాత్రి వేళ,త
    త్పతి తలగోసి వండినది బంధువు లెల్ల దినంగగోరుచున్
    జతనము తోడ "గిన్నిసు"న జైయని చాటగనేమొ;స్వప్నమే!
    బ్రతికెను జూడ,పత్ని,తన ప్రక్కనె సన్ముని దీవెనల్ గొనె
    న్నతివల యూహలందు సలహాలవి యున్నవి లేఖకాలికిన్!


    రిప్లయితొలగించండి
  29. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో శనివారము 07.04.2018 నాడు ప్రసారము కాబోయే 
    సమస్య:
    కన్నులు లేనివాడు కనగల్గెను లోకము కన్నువిందుగన్

    **** *** **** **** **** **** **** **** ***
    నా పూరణ
    *** *** *** *
    ఉ.మా.
    కన్నులు నెత్తి కెక్కినవొ!కావర మెక్కువ గల్గియున్నడో!

    కన్నెల నేడిపించుచును కల్లును త్రాగుచు తూలునెప్పుడున్!

    తిన్నగ నుండకన్నతడు తిక్కగ వాగుచు బొంకెనిట్లగన్!

    " కన్నులు లేనివాడు కనగల్గెను లోకము కన్నువిందుగన్"

       -ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

                     


         

       

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతి భూషణ్ గారూ,
      బాగుంది మీ పూరణ.
      "కావర మెక్కుడు గల్గి యెప్పుడున్... తూలుచుండు దా। తిన్నగ నుండబోడికను తిక్కగ... బొంకె నిట్టులన్" అనండి.

      తొలగించండి
  30. మతిలేని మందార వల్లిని
    యతిప్రీతిగ జూడ నెంచి యాదర మొప్ప
    న్నతిధులు వచ్చిరి వడి ఖగ
    పతితల ఖండించి వండె బంధువులు దినన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మొదటి పాదంలో గణదోషం. 'వల్లిని + అతి = వతిని నతి...' అవుతుంది. యడాగమం రాదు. 'ఖగపతి' అంటే గరుత్మంతుడు లేదా గ్రద్ద. గ్రద్దను ఎవరూ తినరనుకుంటాను.

      తొలగించండి
    2. మతిలేని నాగ వల్లిని
      నతిప్రీతిగ జూడ నెంచి యాదర మొప్ప
      న్నతిధులు వచ్చిరి వడి మృగ
      పతి తల ఖండించి వండె బంధువులు దినన్

      తొలగించండి
  31. మిత్రులందఱకు నమస్సులు!

    సతినిఁ గనంగ బందుగులు చక్కఁగ నింటికి వచ్చియుండఁగా,
    మతికిని సంతసమ్మగుడు, మానిని, "భోజన మారగించి, మా
    కతిముదమందఁజేయుఁ" డని, గాటపు మేఁకనుఁ దెచ్చి, కాంచఁగాఁ
    బతి, తలఁ గోసి వండినది, బంధువు లెల్లఁ దినంగఁ గోరుచున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధుసూదన్ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      కాని స్త్రీలు కోడి తలను కోయడం చూశాను కాని, మేక తలను కోయడం నేనెక్కడా చూడలేదు. "మేకనుఁ దెచ్చి యివ్వఁగన్। బతి తలఁ గోసి, వండినది.." అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
    2. బైటి కమ్మరివాండ్ర గుడిసెలలో నెక్కువగా స్త్రీలే యీ పనిచేస్తారు. భర్తలు త్రాగి పడుకునేవారు. (కొందరు... స్త్రీలకే ఆ పని అప్పగించి, చూస్తూ ఉండేవాళ్ళు.) వీళ్ళు వండి, వాళ్ళను లేపి, తినబెట్టేవారు. నా చిన్నప్పుడు వరంగల్‍లో వివేకానంద కళాశాల కట్టక మునుపు ఉన్న స్థలంలో వీళ్ళుండేవాళ్ళు. నేను వాళ్ళు మేకను కోస్తుండగా స్వయంగా చూశాను. అది జ్ఞాపకానికి వచ్చి ఇలా రాశాను.

      మీ సూచన బాగున్నది. ధన్యవాదములు.

      తొలగించండి
    3. మేకతలకాయలను కాపి యిచ్చువ్వారు కమ్మర స్త్రీలే! అయినా... మరోలా కూడా రాయవచ్చు...

      సతినిఁ గనంగ బందుగులు చక్కఁగ నింటికి వచ్చియుండఁగా,
      మతికిని సంతసమ్మగుడు, మానిని, "భోజన మారగించి, మా
      కతిముదమందఁజేయుఁ" డని, కాంక్షను మేషశిరమ్ముఁ దెచ్చి యీన్
      బతి, తలఁ గోసి వండినది, బంధువు లెల్లఁ దినంగఁ గోరుచున్!

      తొలగించండి
  32. ( పెండ్లి చూపులకు వచ్చిన వారు భోజనం చేయమని చెప్పగా దానికి భర్త సరేనని తలవూపగా దానిని ఖండించి భార్య వంటచేసిందట .....)


    గతికిన యతకదనంచు
    న్నతిథులు సంశయము తెలిపి రాశ్చర్యముగా
    నతివిన యమ్మన నూపెను
    పతితల, ఖండించి వండె బంధువులు దినన్

    రిప్లయితొలగించండి
  33. అతిథులు వచ్చిజేరిరపరాహ్నము వేళను భోజనానికం
    చతివయె గోరినంత వడి నంగడిలో కొని తెచ్చి చెప్పెనే
    యతి రుచి గాను వండమని యాలికి నిచ్చెను కోడినొక్కటిన్
    బతి, తలఁ గోసి వండినది బంధువు లెల్లఁ దినంగ గోరుచున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో "కతికిన నతక దని యనుచు। నతిథులు..." అనండి. ఇక్కడ సతి ఖండించింది సంశయాన్నన్న మాట!

      తొలగించండి
  34. కందం
    సుతరామూ నూపడనుచుఁ
    బతి తలఁ, ఖండించి వండె బంధువులు దినన్ 
    కుతుకమ్మున గ్రుడ్లు నుడుక
    సతియె! కులాంతర వివాహ సరళి యదేమో? 

    చంపకమాల
    మతములు వేరు వేరు నభిమానమె యొక్కటి జేసె నిద్దరిన్
    కుతుకము మీర మాంసమును కోమలి కైకొన నూపఁడంచు నా
    పతి తలఁ, గోసి వండినది బంధువు లెల్లఁ దినంగఁ గోరుచు
    న్నతివయె పీతలన్నతని కత్తిరసాలను జేసి పెట్టుచున్ !

    రిప్లయితొలగించండి
  35. 1-4-18..సమస్య
    *"పతి తల ఖండించి వండె*
    *బంధువులు దినన్"*

    సందర్భము: భర్త బుఱ్ఱలో యెప్పుడూ సాహిత్యానికి చెందిన ఖండన మండనములే! సాహితీ బంధువుల నడుమ అవి సాగుతూనే వుంటాయి.
    భర్త తలలోని ఆ వాదములను భార్య ఖండించి, ప్రేమతో సరసమైన పదార్థాలను అంటే రుచి గల పదార్థాలను వండి పెట్టింది సాహితీ బంధువులు తినడానికై..
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    పతి ఖండన మండన మతి;
    జత సాహితి బంధు వితతి;
    సతి సరస పదా
    ర్థ తతిని గొని, వాదములను
    పతి తల.. ఖండించి, వండె
    బంధువులు దినన్

    ..........సమస్య
    పతి తలఁ గోసి వండినది
    బంధువు లెల్లఁ దినంగఁ గోరుచున్

    సందర్భము: చిరుతొండ నంబి
    జంగమార్చనం.. సులభం.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    సతతము జంగమార్చనమె
    సద్గతి యన్ చిరుతొండనంబి తా
    నతిథుల కాది దంపతుల
    కా సిరియాలుని వండిపెట్ట ని
    శ్చిత మతి యయ్యె, బంధువులు
    శ్రీ శివ భక్తు లటంచు నమ్మె, తా
    సతి కిది చెప్పె, నాయమయు
    సంతస మందె, యనుజ్ఞ నీయగా
    పతి... తలఁ గోసి వండినది
    బంధువు లెల్లఁ దినంగఁ గోరుచున్

    ~డా వెలుదండ సత్యనారాయణ
    1-4-18

    రిప్లయితొలగించండి
  36. అతులిత మాధురీ గళము హాయిగ తీయగ గార్దభమ్ముదై...
    సతతము భర్త వీనులను చక్కగ కోయుచు మేయుచుండు నా
    యతివ ముఖారి రాగమున హైరన జేయుచు తున్క తున్క గా
    పతి తలఁ గోసి;...వండినది బంధువు లెల్లఁ దినంగఁ గోరుచున్

    రిప్లయితొలగించండి