15, ఏప్రిల్ 2018, ఆదివారం

సమస్య - 2652 (కాంతకు మ్రొక్కంగ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కాంతకు మ్రొక్కంగఁ గలుఁగుఁ గామితఫలముల్"
(లేదా...)
"కాంతకు మ్రొక్కినం గలుఁగుఁ గామితసంపద లెల్ల శీఘ్రమే"

134 కామెంట్‌లు:

  1. వింతగ మారిన జగతిని
    సుంతయు లేనట్టి నెమ్మి సుదతుల లనంగా
    చింతలు లేకను ప్రియముగ
    కాంతకు మ్రొక్కంఁగ గలుఁగుఁ గామిత ఫలముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదం చివర గణదోషం. సవరించండి.

      తొలగించండి
    2. వింతగ మారిన జగతిని
      సుంతయు లేనట్టి నెమ్మి సుదతుల యందున్
      చింతలు లేకను ప్రియముగ
      కాంతకు మ్రొక్కంఁగ గలుగుఁ గామిత ఫలముల్

      తొలగించండి
  2. చింతలు తీర్చెడి మాధవ!
    క్షాంతియు భక్తియు మమతయు సంకల్పముతో
    శాంతము దాంతముతో నీ
    కాంతకు మ్రొక్కంగఁ గలుఁగుఁ గామితఫలముల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "క్ష" కు "స" కు యతిమైత్రి యున్నదా? సార్!

      తొలగించండి
    2. చింతలు తీర్చెడి మాధవ!
      శాంతియు భక్తియు మమతయు సంకల్పముతో
      క్షాంతియు దాంతముతో నీ
      కాంతకు మ్రొక్కంగఁ గలుఁగుఁ గామితఫలముల్

      తొలగించండి
    3. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కకార, షకారాల సంయుక్తాక్షరం 'క్ష'. కనుక దానిని కఖగఘచఛజఝ లతో యతి చెల్లుతుంది.

      తొలగించండి
  3. డా.పిట్టా సత్యనారాయణ
    డాంతుడు శాంతుడంచు హరి డాసిన నేమను"భక్త శ్రేష్ఠుడా
    సాంతము మర్మమే యిదియ సర్వ సహంసహ త్యాగబుద్ధి, వే
    దాంతము, కోరికల్ వలదు దాచినదంతయు దానమిమ్ము" శ్రీ
    కాంతను మ్రొక్కినం గలుగు గామిత సంపదలెల్ల శీఘ్రమే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'డాంతుడు' అన్నపదం లేనట్టుంది. 'సర్వంసహ' శబ్దం ఉంది. కాని 'సర్వసహంసహ' శబ్దం లేదు. 'సహత్యాగ' అన్నపుడు 'హ' గురువై గణదోషం.

      తొలగించండి
    2. డా.పిట్టా నుండి
      ఆర్యా.,హనుమాన్ 1౦8 నామములో ఉన్నది..

      తొలగించండి
  4. సంతస మందునన్ సుదతి సాద్వి యటంచును గౌర వించినన్
    మాతగ ప్రేమ మీరగను మంచి తనంబున మాతృ దేవియౌ
    పంతము లన్నిమా నిపతి దేవుడ నంగను శాంత బుద్ధితో
    కాంతకు మ్రొక్కినం గలుఁగుఁ గామిత సంపద లెల్ల శీఘ్రమే

    రిప్లయితొలగించండి
  5. శాంతమనస్కయై హరికి సంతతసేవలొనర్చు తల్లికిన్,
    దాంతుల నెమ్మనమ్ములకు ధన్యత గూర్చెడి తెల్లనమ్మకున్,
    ధ్వాంతము బాపుచున్ జనుల స్వాంతము సాంతము గెల్చుమాత , శ్రీ
    కాంతకు మ్రొక్కినం గలుగు గామితసంపద లెల్ల శీఘ్రమే.

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టా సత్యనారాయణ
    శాంతియె విశ్వంబున సి
    ద్ధాంతవిభేదముల వలన దగులు విపత్తిన్
    క్రాంత సుదర్శిని సుష్మా(సుష్మా స్వరాజ్)
    కాంతకు మ్రొక్కంగ గలుగు గామిత ఫలముల్!

    రిప్లయితొలగించండి
  7. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,


    గురుభ్యో నమః నిన్నటి పూరణ స్వీకరించ ప్రార్థన
    --------------------- ---------------------------------------------------
    ------------------------ ----------------------------------------------------



    దరికి వచ్చెడు శూర్పణఖను జూచి , లక్ష్మణుడు ముందుగా దాని

    అవయవ ‌ సంపదను బాగా పొగిడాడు • నిన్ను మన్మథ లీలలో

    దేలింతు రమ్మని ఊరించాడు • పొంగిపోయి అది‌ దగ్గరకు‌ చేరగా

    ముక్కు చెవులు కోసి పంపించాడు ‌ •

    అసలు రామ కథకు లక్ష్మణుడే నాంది పలికి నాడు • ఇది తథ్యం •


    -------------------------------------------------------------------------




    ఘన శైల ద్వయ ముద్గమించు గతి బొంగారున్ భవ ఛ్ఛ్రోణులే |

    స్తన యుగ్మంబు పరిప్లవించును మహా సంపుష్ట శృంగార ‌ మో

    హ నికేతమ్మయి | సుందరీ ! దరికి రావా ! యూర్మిళాత్మాభిరా

    మునికిన్ నేర్పగ నొప్పు రాజవదనా ! మోహంపు బుద్ధుల్ దమిన్ |

    నును మోవిన్ - నునుమోవి సంఘటిల , ‌ మేనున్ - మేను సంధిల్లగా

    దనియం జేయుము నన్ను | నిన్ను గుసుమాస్త్ర క్రీడ దేలింతు - ర

    మ్మనుచున్ శూర్పణఖన్ , దళించె గద నాసాగ్రంబు కర్ణద్వయిన్ |

    గన , సౌమిత్రియె పల్కె రామ కథకున్ నాంద్యుక్తి సంసక్తి తో



    [ ఉద్గమించు = ఎగురు ; పరిప్లవించు = దుముకు ;

    సంపుష్ట = పుష్టి గా పెరిగిన ; నికేతము = సంకేతము , గురుతు;

    ‌‌‌‌‌‌ తనియం జేయు = తృప్తి పరుచు ; ద ళిం చె = కో సె ను ;

    ‌‌‌ ‌ నాంది + ఉక్తి = నాంద్యుక్తి = నాంది వచనము ;

    సంసక్తి = ఆసక్తి , close connection ]


    -----------------------------------------------------------------------------------------------------

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి గారూ,
      మీ (నిన్నటి) పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురుమూర్తి ఆచారి

      గు రు వ ర్యు ల కు :- ధ న్య వా ద ము లు • ప ద న మ స్కృ తు లు •

      తొలగించండి
    3. ఆహాఁ! అద్భుతం గురుమూర్తి ఆచారి గారూ! అనన్య సామాన్యం!!
      🙏🏻💐

      తొలగించండి
    4. గురుమూర్తి ఆచారి

      వి ట్టు బా బు గా రూ !


      ధ న్య వా ద ము లు మరియు మ నః పూ‌ ర్వ క న మ స్కృ తు లు ,

      తొలగించండి
  8. మైలవరపు వారి పూరణ

    ప్రాంతమతాదిభేదముల వాదములన్ నిరసించి , మెట్ట వే....
    దాంతము బల్కబోక , ఘనమౌ కృషి నమ్మి , ఫలమ్ము గోరుచున్
    చెంతనె యున్న పెన్నిధిని, చింతలు దీర్చు శ్రమస్వరూపిణీ
    కాంతకు మ్రొక్కినం గలుఁగుఁ గామితసంపద లెల్ల శీఘ్రమే !

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  9. వంతులు వేయుటదెందుకు
    సంతానమునిచ్చు పడతి సంతోషమదే
    వింతది కాదే ప్రియతమ
    "కాంతకు మ్రొక్కంగఁ గలుఁగుఁ గామితఫలముల్"

    రిప్లయితొలగించండి
  10. జీతమే కాదు గీతముందెచ్చి దోసిట పోయగ
    వినమ్రతన్
    ఆలి బంధువుల సేవింపగ తన వారిని దునుమాడ
    ఉగ్రతన్
    ఏకాంతపు దివ్వెగ వెలిగినన్ అందగరాని
    శిఖరాగ్రమే
    కాంతకు మ్రొక్కినం గలుగు గామిత
    సంపదలెల్ల శీఘ్రమే

    రిప్లయితొలగించండి

  11. కం
    పంతము బట్టి పసిడికై
    యంత వరకు చేరువ వలదనె కోపముతో
    శాంతము పరచగ తన కుల
    కాంతకు మ్రొక్కంగ గలుగు గామితఫలముల్

    🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
    ☘ వనపర్తి☘

    రిప్లయితొలగించండి
  12. శాంతియు సౌఖ్యముల్ గలుగు సంతసమన్నది పొందవచ్చులే
    కాంతియె జీవితమ్మునను గారము తోడను తాను దెచ్చునోయ్
    భ్రాంతియె కాదు సత్యమిది బ్రకృతిలోగల చిత్రమే సదా
    "కాంతకు మ్రొక్కినం గలుఁగుఁ గామితసంపద లెల్ల శీఘ్రమే"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విట్టుబాబు గారూ,
      మీ పూరణ ప్రశస్తమ్గా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యోస్మి గురువుగారూ!
      మీరు ప్రశస్తం‌ అన్నారంటే ఫస్టు క్లాసే...
      🤣🙏🏻🌹

      తొలగించండి
    3. "బాగున్నది" = 50 మార్కులు
      "చక్కగానున్నది" = 60 మార్కులు
      "విలక్షణముగానున్నది" = 70 మార్కులు
      "అద్భుతముగానున్నది" = 80 మార్కులు
      "ప్రశస్తముగానున్నది" = 90 మార్కులు
      "మనోహరముగానున్నది" = 100 మార్కులు

      ...శంకరాభరణం మార్కుల పట్టీ

      తొలగించండి
    4. గత 1000 పూరణలలో నా సగటు మార్కులు: 53.5

      తొలగించండి

    5. వెయ్యి పూరీలు చేసేరా ! :)


      జిలేబి

      తొలగించండి
    6. పాతవీ కొత్తవీ మూతబెట్టినవీ కలిపితే ...

      తొలగించండి
  13. అంతర్యామియగు హరికి
    నంతయుతానౌచుసేవలందించెడియా
    యింతుల మేల్బంతికి శ్రీ
    కాంతకు మ్రొక్కంగఁ గలుఁగుఁ గామితఫలముల్
    (చిరు ప్రయత్నం)

    రిప్లయితొలగించండి

  14. శాంతము నిండిన మోమును
    కాంతియుతముగను వెలిగెడి కన్నుల తోడన్
    ధ్వాంతము దోలెడి లక్ష్మీ
    కాంతకు మ్రొక్కంగ గలుగు గామితఫలముల్

    రిప్లయితొలగించండి
  15. భ్రాంతి యు కాదిది నిజమగు
    పంతము నన్ భక్తి తోడ పరవశమగుచు న్
    సంత స మొ ప్పగ శంభు ని
    కాంత కు మొక్కoగకలుగు కామిత ఫలము ల్

    రిప్లయితొలగించండి
  16. కాంతయె కవికి నుసురు, కుల
    కాంత నిడును సంతునెపుడు కవులకు, ఘన శ్రీ
    కాంత కలిమి నొస గున్, వా
    క్కాంతకు మ్రొక్కంగఁ గలుఁగుఁ గామితఫలముల్

    కవులకు ముగ్గురు కాంతల దయ కావలెను. డబ్బున్న కవిత్వము అబ్బదు, కవిత్వమున్న డబ్బు ఉండదు, రెండు ఉన్న ఇంటిలో కుల కాంత దయలేకున్న కవిత్వము వ్రాయలేరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కులకాంత యిడును' అనండి.

      తొలగించండి
  17. ఎంతని వర్ణింతును? చిర
    చింతనమున ముక్తినిచ్చి చింతలు దీర్చున్
    సంతత చింతామణి శ్రీ
    కాంతకు మ్రొక్కంగ గలుగు గామిత ఫలముల్!

    రిప్లయితొలగించండి
  18. స్వాంతము నందున చిత్రపు
    కాంతులు ప్రసరింప జేసి కవితలు బలుకన్
    చింతన లీడేరగ వా
    క్కాంతకు మ్రొక్కంగ గలుగు గామిత ఫలముల్!!!

    రిప్లయితొలగించండి
  19. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2652
    సమస్య :: *కాంతకు మ్రొక్కినం గలుగుఁ గామిత సంపద లెల్ల శీఘ్రమే.*
    సందర్భము :: భూదేవి మన చింతల నన్నింటినీ తీరుస్తుంది. నాగలితో దున్నుతూ ఆమె దేహాన్ని చీల్చినా రైతుయొక్క క్షేమాన్ని గుఱించే ఆలోచిస్తుంది. ఆమె శరీరానికి రంధ్రం వేసినా ఆశ్చర్యపరుస్తూ (భూ)గర్భ జలాలను అందజేస్తుంది. ఆమెపై మలమూత్ర విసర్జన చేసినా తల్లియై స్నేహంతో వాత్యల్యాన్ని చూపిస్తుంది. ఇంతటి క్షమా గుణ స్వరూప యైన భూకాంతకు అంటే భూమాతకు మనం మ్రొక్కితే కోరుకొన్న సంపదలన్నీ త్వరగా సిద్ధిస్తాయి అని విశదీకరించే సందర్భం.

    చింతల దీర్చు, దేహమును చీల్చెడి రైతుల క్షేమ మెంచు, వి
    భ్రాంతిగ నిచ్చు గర్భజలరాశుల రంధ్రము వేయ, తల్లియై
    పొంతముతో మెలంగు మల మూత్ర విసర్జన జేయ, గాన భూ
    *కాంతకు మ్రొక్కినం గలుగుఁ గామిత సంపద లెల్ల శీఘ్రమే.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (15-4-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
      "సముద్రవసనే దేవీ
      పర్వతస్తనమండలే
      విష్ణుపత్నీ నమస్తుభ్యం
      పాదస్పర్శం క్షమస్వమే"

      తొలగించండి
    2. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారూ ! ప్రణామాలండీ.

      తొలగించండి
  20. స్వాంతమ్మున పరవశమున
    సాంతంబుగ నమ్మి భక్తి సారముఁగనుచున్
    భ్రాంతియు విడివడ గౌరీ
    కాంతకు మ్రొక్కంగ గలుగుఁగామిత ఫలముల్

    రిప్లయితొలగించండి
  21. ఎంతటి వారైనను గన
    కాంతకు దాసోహమంద్రు గదరా జగతిన్
    చింతను మాని సచివుఁ బ్రియ
    కాంతకు మ్రొక్కంగఁ గలుగుఁ గామిత ఫలముల్.

    రిప్లయితొలగించండి
  22. కాంతను జూడగ కంపన
    కాంతను చేరగ మనసున కంతుని నూసుల్
    కాంతను నాదని చేరితి
    కాంతను మ్రొక్కంగ గలుగు గామితఫలముల్

    Dr H Varalakshmi
    Bangalore

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వరలక్ష్మి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కంతుని యూసుల్' అనాలనుకుంటాను.

      తొలగించండి

  23. మట్టిని పుట్టినాము అదియే మనకు వారధి !


    ఇంతీ! మన జీవితమున
    కంతయు మూలంబుగా సుఖమ్ముల చేర్చన్
    వంతెన గా నిలచు మహా
    కాంతకు మ్రొక్కంగఁ గలుఁగుఁ గామితఫలముల్!


    భూసూక్తం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  24. శాంతము సహనము గలుగుచు
    సాంతము గడు భక్తితోడ శంభుని గొలువ
    న్గ్రాంతులు వెదజల్లెడుశ్రీ
    కాంతకు మ్రొక్కంగ గలుగు గామిత ఫలముల్

    రిప్లయితొలగించండి
  25. పంత మదేల చెప్పినను పట్టిన పట్టును వీడ వయ్యయో
    యింతికి మ్రొక్కడే మునుపు హేళన చేతు రటంచు తగ్గెనే
    కంతుని తండ్రి? నేరమును గాచగ బుద్ధిగ వాలి కాళ్ళపై
    కాంతకు మ్రొక్కినం గలుఁగుఁ గామితసంపద లెల్ల శీఘ్రమే.

    రిప్లయితొలగించండి
  26. పంతమ్మూనుచు సృష్టి ని
    తాంతము జేయంగ భర్త , తత్సమ రీతిన్
    సంతత జ్ఞాన ప్రదాయిని
    కాంతకు మ్రొక్కంగఁ గలుఁగుఁ గామితఫలముల్

    నిన్నటి సమస్యకు నా పూరణ

    వనసీమను గని రక్కసి
    తనమనమున మదనుడునుచు తాపము చేతన్
    పనిగొని తలఁచెను రఘు రా
    మునికిన్ నేర్పంగ నొప్పు మోహపు బుద్ధుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'సంతత జ్ఞాన' మన్నపుడు 'త' గురువై గణదోషం. సవరించండి.

      తొలగించండి
  27. సాంతము భక్తితోడ నిల సద్గుణ భూషితు ,భక్తపాలుశ్రీ
    కాంతకు మ్రొక్కినన్గలుగు గామిత సంపద లెల్ల శీఘ్రమే
    చింతల దీర్చువాడుభువి శ్రీకర ధాముడు సత్యదేవునే
    స్వాంతము నందునన్నిలిపి సాదర మొప్పగ బూజజేయుమా

    రిప్లయితొలగించండి
  28. కాంతయె మాతయు, మంత్రియు
    చింతలు దీర్చన్, ముదముగ చెంతకు జేరన్
    కాంతయె దాసియు, సతియౌ
    కాంతకు మ్రొక్కంగ గలుగు గామిత ఫలముల్!

    రిప్లయితొలగించండి
  29. మిత్రులందఱకు నమస్సులు!

    చింతనఁ జేయఁగా మదిని "శ్రీ రమ పద్మిని లోకమాత స
    చ్చింతితవస్తుదాయి చల సింధుజ మా కమలాలయాంచితా
    త్యంతమనోజ్ఞసద్విభవదత్త మదంబ వృషాకపాయి స
    త్సంతతసంపదప్రద విశాల హరిప్రియ" యంచు నెప్డు శ్రీ
    కాంతకు మ్రొక్కినం గలుగుఁ గామిత సంపద లెల్ల శీఘ్రమే!

    రిప్లయితొలగించండి
  30. రిప్లయిలు
    1. చక్రపాణి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జయముల్ అంతయు' అని విసంధిగా వ్రాయరాదు. అక్కడ "జయమౌ। నంతయు..." అనండి.

      తొలగించండి
  31. సమస్య : -
    "కాంతకు మ్రొక్కంగఁ గలుఁగుఁ గామితఫలముల్"

    కందము*

    సొంతము జీవించ దలచ
    కొంతచదువుకున్న చాలు గొప్ప విజయమౌ
    నంతయు నంబుజగర్భుని
    కాంతకు మ్రొక్కంగఁ గలుఁగుఁ గామితఫలముల్"

    రిప్లయితొలగించండి
  32. వంత ల నెల్ల బాపు ।నని భావము నందు తలంచి భక్తి తో
    చెంత నె యున్న దేవళ ము జేరి యు నామ జపం బు స ల్పు చు న్
    సంత స మందు చు న్ సతము చక్కగ కావు మ ట oచుగోరి శ్రీ
    కాంత కుమ్రొక్కినoగలుగు గామిత సంపద లెల్లశీఘ్ర మే

    రిప్లయితొలగించండి
  33. సమస్యల లోని “కలుగు” లో నరసున్న ప్రమాద పతితమని భావించెదను.

    వింతైన వర్తనం బీ
    యింతికిఁ బంత మది చూడ నెక్కువ సుమ్మీ
    సుంత వొగడంగఁ బొంగును
    గాంతకు మ్రొక్కంగఁ గలుగుఁ గామితఫలముల్


    స్వాంత రుచిప్రభా విమల భావ సుమోక్త కదంబకమ్ములన్
    సంతత భక్తి పూర్వక వినమ్ర శిరస్సున విష్ణుదేవ దై
    త్యాంతక లోక రక్షక వరామర నాయక వత్సవాస యా
    కాంతకు మ్రొక్కినం గలుగుఁ గామితసంపద లెల్ల శీఘ్రమే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వరరావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      నిజమే. 'కలుఁగు' లో ఖండబిందువును మరచి పోయాను.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
      ఖండబిందువును మరచి పోలేదు. పొరపాటున నుంచారు.
      అర సున్న ప్రమాదవశమున మధ్యలో పడినదని ( వచ్చినదని) నా భావము. అరసున్న యున్న రంధ్రము, లేకున్న నుండు/ పొందు భావమున క్రియా పదము కదా!

      తొలగించండి
  34. శాంతము సాధువాదమున సంతస మొందుచు పూజజేయుచున్
    భ్రాంతుల నన్నిటిన్ వదలి పంతము వీడుచు పాదసేవతో
    కొంతయు వంతజేయకయె కోరిన రీతిని సాఫ్టువేరుదౌ
    కాంతకు మ్రొక్కినం గలుఁగుఁ గామితసంపద లెల్ల శీఘ్రమే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "సాఫ్టువేరుదౌ" బదులు "బ్యాంకు ఛీఫుదౌ" అని చదువ ప్రార్ధన.

      తొలగించండి
    2. క్షాంతినిచూప నొనరునను
      భ్రాంతినబడి జరుగకున్న బామమువిడి యే
      కాంతమునం గోముగ తన
      కాంతకుమొక్కంగ గలుగు గామితఫలముల్

      తొలగించండి
    3. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
      *****
      సీతారామయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  35. శాంతము లేక సౌఖ్యమును సాంఖ్యపు మార్గము లేక యోగమున్
    కొంతయు బొంద వీలగున ! కోరిక లెల్లెడ నిల్పినావు! యే
    కాంతకు మ్రొక్కినం గలుగుఁ గామిత సంపద లెల్ల శీఘ్రమే?
    వింతగు జీవితమ్మిదియె వీగకు వెంగలి యై సహోదరా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ:

      మీ (?) ప్రశ్నకు జవాబు కొరకు పైనున్న నా వృత్త పూరణను చూడుడు...

      తొలగించండి

    2. ఆహా ! ఎక్కడికెక్కడికి లింకు పెట్టినారండీ జీపీయెస్ వారు ! అదురహో !


      జిలేబి

      తొలగించండి
    3. జిలేబీ గారూ,
      మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  36. జంతువు తత్వమును విడిచి
    సుంతయిన మమతను పంచుచున్ బడుగులపై
    స్వాంతమును నిలిపి లక్ష్మీ
    కాంతకు మ్రొక్కంగఁ గలుఁగుఁ గామితఫలముల్

    రిప్లయితొలగించండి
  37. .........15-4-18 సమస్య
    *"కాంతకు మ్రొక్కినం గలుఁగుఁ*
    *గామిత సంపద లెల్ల శీఘ్రమే"*

    సందర్భము: శుంభ నిశుంభులను సంహరించిన దేవిని దేవత లిట్లు స్తుతించిరి.
    "ప్రణతానాం ప్రసీద త్వం దేవి విశ్వార్తి హారిణి... (ప్రపంచ క్లేశములను అడచు దేవీ నీకు మొక్కుచున్న మాయెడ ప్రసన్నత చూపుము..)"
    దేవి పలికెను..

    "వరదాహం సురగణా
    వరం యన్మనసేచ్ఛథ
    త్వం వృణుధ్వం ప్రయచ్ఛామి
    జగతా ముపకారకమ్..

    నేను వర మిచ్చెదను. మీరు మనసులో కోరుకొను ఏ వరమునైనను లోకోపకారకమైన దానిని కోరుకొనుడు."

    చూ. దేవీ మాహాత్మ్యము(శ్రీ దుర్గా సప్తశతి)
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    "అంతము లేని యార్తి చయ
    మంతముఁ జేసెడు నట్టి దేవి! నిన్
    జింతన జేయు మమ్ము దయ
    చే గను" మన్న "జగ ద్ధితార్థమై
    యెంతటి కోర్కెఁ గోరినను
    నిత్తు" నటంచు వచించు చండికా
    కాంతకు మ్రొక్కినం గలుఁగుఁ
    గామిత సంపద లెల్ల శీఘ్రమే

    మరొక పూరణము...

    సందర్భము:
    "భవాని! త్వం దాసే మయి వితర
    దృష్టిం సకరుణాం"
    ఇతి స్తోతుం వాంఛన్ కథయతి
    "భవాని! త్వ " మితి యః
    తదైవ త్వం తస్మై దిశసి నిజ
    సాయుజ్య పదవీం...
    ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట
    నీరాజిత పదామ్

    "భవానీ! నీవు నాయందు కరుణా దృష్టిని ప్రసరింపుము" అని వేడుకొన దలచి నిన్ను పూర్తిగా నమ్మిన యొక భక్తుడు నీ ముందు నిలిచి "భవానీ! నీవు.." అనగానే.. అంటే అతని మాట పూర్తి కాకుండానే నీవు నీ సాయుజ్యాన్ని అతనికి ప్రసాదిస్తున్నావే! నీ భక్తులపట్ల నీ కెంత కరుణ తల్లీ!
    అంటున్నారు ఆది శంకరులు "సౌందర్య లహరిలో.." ఆ సాయుజ్యం ముకుంద బ్రహ్మేంద్రులకైనా పొందరాని దట!
    అంతటి శుభైక్యాన్నే అనుగ్రహించ గలిగిన కరుణామయికి మనం కోరే కోరిక లేమి లెక్క! అతి సులువుగా తీరుస్తుంది.. అని భావము.
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    చింతన జేసి "నీవు దయ
    చే నను జూడు" మనంగ నెంచి, నీ
    చెంతను జేరి "నీవు దయ
    చే" ననినంతనె నీ శుభైక్య మం
    దింతు వటంచు శంకరులు
    నిన్ గొనియాడిరి; నీకు నంబికా
    కాంతకు మ్రొక్కినం గలుఁగుఁ
    గామిత సంపద లెల్ల శీఘ్రమే

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. వెలుదండ వారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. వెలుదండవారి రెండు పూరణలూ హృద్యంగా ఉన్నాయి!🙏🙏🙏

      తొలగించండి
  38. స్వాంతము నందు సంతతము సాగుచు నుండ పవిత్రభావముల్
    చెంతకు వచ్చు దీనులకు సేవలఁజేయుచు సంతతమ్ము శ్రీ
    కాంతుని భక్తిభావమున కాంచిభజించుచు, శౌరి పత్ని యౌ
    కాంతకు మ్రొక్కినం గలుఁగుఁ గామితసంపద లెల్ల శీఘ్రమే

    రిప్లయితొలగించండి
  39. గురువు గారికి నమస్సులు.
    కాంతియు భ్రాంతియు నీవే
    శాంతియు కొరకున్ వచింప శారద స్తుతుల్
    సంతసముకల్గు ప్రభునీ
    కాంతకు మ్రొక్కoగ కలుగు కామిత ఫలముల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట నారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదాన్ని "శాంతి కొరకు నే వచింప శారద స్తుతులన్" అనండి. లేకుంటే గణదోషం.

      తొలగించండి
  40. కాంతే కలిమికి బలిమికి
    శాంతంబుకు యింటియందు సర్వోత్తమమై
    బ్రాంతిని మాన్పెడిబహువిధ
    కాంతకుమ్రొక్కంగ గలుగు గామిత ఫలముల్|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శాంతంబునకు' అనడం సాధువు. "శాంతమునకు" అనండి.

      తొలగించండి
  41. ఇంతికి నర్థదేహము మహేశ్వరు డిచ్చెను, లక్ష్మినంట శ్రీ
    కాంతుడు దాచె డెందమున, కంజున కానన మయ్యె వాణియే
    యింతులు ముగ్గురీ జగములేలెడు మూర్తులు శక్తిరూపలే
    చెంతన యింతిలేనితరి శ్రీకరు లెల్లరు శక్తిహీను లే
    కాంతను మ్రొక్కినం గలుగుఁ గామిత సంపద లెల్ల శీఘ్రమే.

    రిప్లయితొలగించండి
  42. చింతను మాన్పుతల్లి మనసిచ్చియు మంచిని బెంచుభార్య|న
    త్యంత వివేకమున్ నిడును ధర్మ పథంబులు వాణి బాణియై|
    సంతసమంద జేయగల సారము బంచగ లక్ష్మిదేవి|శ్రీ
    కాంతకు మ్రొక్కినన్ గలుగు గామితసంపదలెల్లశీఘ్రమే|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      వివేకమున్ + ఇడును = వివేకము నిడును అవుతుంది. అక్కడ "వివేకదాయి యయి ధర్మ..." అనండి.

      తొలగించండి


  43. శాంతియు కలుగును మదికిట
    సంతతము ప్రశాంతమైన చిత్తము తోడన్
    స్వాంతము నందనిశము శ్రీ
    కాంతకు మ్రొక్కంగ గలుగు కామిత ఫలముల్.

    రిప్లయితొలగించండి
  44. కందం

    అంతట నిండిన వానికి
    నింతిగ హృదయాబ్జమందు నిందిర కొలువై
    సంతసమున్ బంచఁగ,శ్రీ
    కాంతకు మ్రొక్కంగఁ గలుగుఁ గామితఫలముల్

    రిప్లయితొలగించండి
  45. అంతటి విష్ణువే హృదయ మందున నిల్పెను లక్ష్మి దేవినే
    వింత యొకింతలేదు తనువిచ్చె సగంబు హరుండు గౌరికిన్
    భ్రాంతి నొకింత కాదు మరి బ్రహ్మయె నాల్కన నిల్పె భారతిన్
    కాంతకు మ్రొక్కినం గలుఁగుఁ గామితసంపద లెల్ల శీఘ్రమే

    రిప్లయితొలగించండి
  46. ఉత్పలమాల
    అంతటి బ్రహ్మయున్ హరియు నాదిగ దేవత లెల్ల మ్రొక్కగన్
    చెంతకు జేరి వాణి, రమ చేతను వీచఁగ చామరల్ వివ
    స్వంతుడు కాంతుడున్ జెవుల బంగరు వన్నెల దిద్దులైన న
    క్కాంతకు మ్రొక్కినం గలుగుఁ గామిత సంపదలెల్ల శీఘ్రమే.

    రిప్లయితొలగించండి
  47. అంతము లేని చాలమియ నంతముగా నవినీతి నేతకే
    చెంతనె చేరు నాశ్రితుల సేవలు చూచితి నేమి చేతగా
    కాంతకు మ్రొక్కినం గలుఁగుఁ గామితసంపద లెల్ల శీఘ్రమే
    సాంతము స్వాభిమానమిక చౌకగ బోయెను వేంకటేశ్వరా౹౹
    (చేతగాక+అంతకు=చేతగాకాంతకు)

    రిప్లయితొలగించండి
  48. క్షాంతిని బూనుచున్ సిరులు సౌఖ్యమొసంగును హర్యురస్థయై,
    సంతతమంగళీత్వమును సాగగఁజేయు శివార్ధభాగయై,
    క్రాంతసుదర్శులౌ కవులఁ గాచు విధాతృని నాల్క నుండి, యే
    కాంతను మ్రొక్కినం గలుగుఁ గామితసంపదలెల్ల శీఘ్రమే.

    రిప్లయితొలగించండి
  49. చింతన జేయువారియెడ శీతల దృక్కుల చందమామయై
    పంతము పూనువారికిని పాశము దాల్చిన దండధారియై
    యంతయు నింతయై జగతినంతను గాచెడు మాతృమూర్తి శ్రీ
    కాంతకు మ్రొక్కినన్ గలుగు గామిత సంపదలెల్ల శీఘ్రమే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గు రు మూ ర్తి ఆ చా రి
      ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


      [ చింతామణి నాటకమందు :- భార్యను వదలి వారకాంత తో

      గూడి తిరుగు తన స్నేహితుడైన బిల్వమంగళుని

      మందలించు దామోదరుడు ]



      కాంతయె లక్ష్మి దేవియగు గాదె గృహమ్మున జీవితాంతమున్ |

      కాంతయె క్షీరసాగరముగా నొనరించు భవమ్ము నోరిమిన్ |
      .............................................................................................

      కాంత‌ యమూల్యమై మెరయు కాంచనమౌ సుమి ! కాని‌ ,‌ నీ వయః

      కాంతము కైవడిన్‌ , గడనకత్తె‌ యనంబడు నిన్ము లాగ | కా
      ...............................................................................................

      కాంత యొకింత బాష్పములు గార్చిన జీవిత మెల్ల యౌ ‌‌‌, యనే

      కాంతము | కాన నో సఖుడ ! కాంత సుఖంబును జూడు మెప్పుడున్


      { భవము = సంసారము ; అయఃకాంతము = అయస్కాంతము ;

      గడనకత్తె = వారకాంత ; అ నే కాం త ము = అ ని శ్చి త మై న ది

      ఫ ల ము లే ని ది‌ , ని య మ ము లే ని ది }

      తొలగించండి
  50. ధన్యోస్మి గురుదేవా! నమస్సులు!🙏🙏🙏

    రిప్లయితొలగించండి



  51. స్వాంతమ్మున సతతము శ్రీ

    కాంతను దలచుచు సమయము గడిపిన దక్కున్

    శాంతియు కల్గుమదికి శ్రీ

    కాంతకు మ్రొక్కంగ గలుగు కామిత ఫలముల్.


    కాంతయొసంగును సర్వము

    సంతసమున పతికితాను జగతిన నెల్లన్

    శాంతపు చిత్తము తో శ్రీ

    కాంతకు మ్రొక్కంగ గలుగు కామిత ఫలముల్.


    ఆంతము లేని ముదమ్మిల

    సంతతమందవలెనన్న జగతిని నెపుడున్

    చింతలను మాని యా భూ

    కాంతకు మ్రొక్కంగ గలుగు కామిత ఫలముల్

    రిప్లయితొలగించండి
  52. రిసర్చి స్కాలరువాచ:

    కొంతయు గిన్నెలన్ కడిగి కోరిన కూరలు కోసిపెట్టుచున్
    కొంతయు బూజులన్ దులిపి కోరిన వేళల నిల్లుజిమ్ముచున్
    పంతము వీడుచున్ కడిగి బంగరు కాళ్ళను గుర్వుగారిదౌ
    కాంతకు మ్రొక్కినం గలుఁగుఁ గామితసంపద లెల్ల శీఘ్రమే

    రిప్లయితొలగించండి