20, జులై 2018, శుక్రవారం

సమస్య - 2738

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"దేవుఁడే లేఁ డటందు రాస్తికులు గాదె"
(లేదా...)
"దేవుఁడు లేఁడు లేఁడనుచు దెప్పుచు నుండెద రాస్తికుల్ గదా!"

111 కామెంట్‌లు:



  1. కావు కావు మటంచుచు కాచి వుందు
    రా పయిన కొంతయైన తీరక తమ యిడు
    ములట కష్ట పెట్టిన దైవము కన రాడు,
    దేవుఁడే లేఁ డటందు రాస్తికులు గాదె!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కావు మటంచును' అనండి.

      తొలగించండి
  2. కొండపై నుండి కొలనున, కోన లోన
    తరువులో నుండి గుడిలోని మరుగు లోన
    మనుజుని హృదిలో లేకుండ మట్టినున్న
    దేవుఁడే లేఁ డటందు రాస్తికులు గాదె

    రిప్లయితొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    దైవము జీవుడంచనుట ద్వైతవిధానము , సాధనక్రియన్
    భావము నిశ్చలమ్మగును , వాక్యచతుష్టయసారమున్ గనన్
    జీవుని యాత్మ దైవమని సిద్ధి లభింప , తదన్యమైనదౌ
    దేవుఁడు లేఁడు లేఁడనుచు దెప్పుచు నుండెద రాస్తికుల్ గదా! !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిరుసవరణ... తదన్యరూపుడౌ... అని ఉండాలి 🙏

      ...మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
    2. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    3. కవిమిత్రులకు అభివాదములు...
      మన్నన కోరుచుంటిని మరొకమారు🙏

      తదన్యమైనదౌ... అనుటయే సమంజసమని సూచించిన పెద్దలు శ్రీ నర్సయ్య గారికి నమస్సులతో... మరల సమగ్రముగా సమర్పించుచున్నాను..🙏

      దైవము జీవుడంచనుట ద్వైతవిధానము , సాధనక్రియన్
      భావము నిశ్చలమ్మగును , వాక్యచతుష్టయసారమున్ గనన్
      జీవుని యాత్మ దైవమని సిద్ధి లభింప , తదన్యమైనదౌ
      దేవుఁడు లేఁడు లేఁడనుచు దెప్పుచు నుండెద రాస్తికుల్ గదా! !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    4. "చేవను బల్కుమెల్లరు విచిత్రముగా గనునట్లసత్యమున్"
      నీవన ., నొక్కరుండు "నను నిందను జేయకుమంచు" నిట్లనెన్
      పావకుడెంచ శైత్యుడగు , భగ్గున మండును చంద్రుడిద్ధరన్
      దేవుఁడు లేఁడు లేఁడనుచు దెప్పుచు నుండెద రాస్తికుల్ గదా !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  4. పరమ భక్తితో మొఱవెట్టు భక్త జనుల
    క్లిష్టమైనట్టి జీవన కష్ట గతులు
    మార్చి, యవ్వారి కోర్కెలు తీర్చ లేని
    దేవుఁడే లేడటందురాస్తికులు గాదె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విజయకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. శ్రీ చిటితోటి విజయకుమార్ గారూ! మీ పూర్ణ చాలా బాగున్నది. నమోనమః

      తొలగించండి
  5. హేతువాదుల మనెడు వారెల్ల వేళ
    దేవుడే లేడటందు, రాస్తికులు గాదె
    సకల జగతికి మూలమ్ము సర్వ శక్తి
    పరుడొకడనుచు నమ్మెడు భక్తజనులు.

    రిప్లయితొలగించండి
  6. ఉండి లేనట్లు బ్రమలోన యడరు చుంద్రు
    కష్ట కాలము నందున ఖచ్చి తముగ
    భక్తి కొలిచిన దైవము పలుక కున్న
    దేవుఁడే లేఁ డటందు రాస్తికులు గాదె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది. "భ్రమలోన నుందు రెపుడు" ఆనండి.

      తొలగించండి

    2. ఉండి లేనట్లు బ్రమలోన నుందు రెపుడు
      కష్ట కాలము నందున ఖచ్చి తముగ
      భక్తి కొలిచిన దైవము పలుక కున్న
      దేవుఁడే లేఁ డటందు రాస్తికులు గాదె

      తొలగించండి


  7. "కావుము తండ్రి " యన్న వెనుకాడక వెంటనె వచ్చు స్వామిలే ;
    "నీవెలె మాకు ది " క్కనగ నిండగు ధైర్యము
    నిచ్చు రేడులే ;
    "నావగు తప్పులన్నిటిని నాశమొనర్చెడి
    చక్రి కాక యే
    దేవుడు లేడులే " డనుచు దెప్పుచునుండెద
    రాస్తికుల్ గదా !

    రిప్లయితొలగించండి


  8. కావు మటంచు కాళ్ళ పడి కామితముల్ నెర వేర ప్రార్థనల్
    బావు కొనంగ లేనపుడు బాంధవుడా తను యంచు పృచ్ఛలున్
    కేవల మీ జిలేబి బతుకేలనకో యని యీసడించుచున్
    దేవుఁడు లేఁడు లేఁడనుచు దెప్పుచు నుండెద రాస్తికుల్ గదా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. ఆత్మ శక్తిని దాచక యన్ని గతుల
    పురుష యత్నంబు నొనరించి పూర్ణ గతిని
    ప్రార్థనము చేయ “నో” యంచు పలుకనట్టి
    దేవుఁడే లేఁ డటందు రాస్తికులు గాదె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  10. ఉన్నది ఒకటె రెండవది లేదు వేద వాక్కిది
    నిలుపుము యెద
    జీవుడు దేవుడు వేరు కాదనుచు అద్వైతముననె
    ముందుకు పద
    తామే బ్రహ్మము అయి ఉండియు కాదనెదరు
    భ్రమలో సదా
    దేవుడు లేడు లేడనుచు దెప్పుచు నుండెద
    రాస్తికుల్ గదా

    రిప్లయితొలగించండి
  11. వరుస కష్టాలు దరి జేర వంత తోడ
    నింద చేయుచు పన వు చు ని ష్ టు రము గ
    దేవు డే లేడ ట oదు రాస్తి కు లు గాదె
    చిత్త మందు న నిల్పి యు న్ శివుని తాము

    రిప్లయితొలగించండి
  12. అన్నిచోటుల తానుండు హరి జగతిని
    కాచు తనభక్తులను సమయోచితముగ
    దేవళమ్ముల మాత్రమే దివ్యుడైన
    దేవుఁడే లేఁ డటందు రాస్తికులు గాదె

    రిప్లయితొలగించండి
  13. డా.పిట్టాసత్యనారాయణ
    గొప్ప భక్త గజేంద్రుని గురిని గనుము
    సంశయమునందె మొరవెట్ట సరకుగొనని
    దేవుడే లేడటందురాస్తికులు గాదె
    భక్తి కది పరాకాష్టగా బరగు నపుడు

    రిప్లయితొలగించండి
  14. డా.పిట్టా సత్యనారాయణ
    "దేవుడు యేడిరా?యెచట? దిక్కులు జూచెదవేల బాల? యా
    పోవడి బోని యెవ్వడుర? బుద్ధిని మార్చు మ"టన్న తండ్రియే
    పోవడె వైరభావమున పూర్ణ సుభక్తుడు తన్ను గానకే
    దేవుడు లేడు,లేడనుచు దెప్పుచు నుండెద రాస్తికుల్ గదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'దేవుడు + ఏడి' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
    2. డా.పిట్టా సత్యనారాయణ
      ఆర్యా,అంతర్జాతీయ ఖ్యాతి లభించినందులకు మీకు అభినందనలు.నా పద్యమునకు మీరొసంగిన ప్రోత్సాహమునక నా కృతజ్ఞతలు.2వ పూరణలో
      "దే..వు..డు!! యేడిరా?యెచట? "తో యడాగమఆగడమును తప్పించుకోవచ్చుననుకుంటాను.ఇది సంభాషణాత్మకమైనందున.
      ఆర్యా,అది వ్యాపారము!కృషికి విలువ నెవరొసంగుదురు.మాదీ స్వార్థమే! మీకృషికి మాలో కనిపిస్తున్న మంచి మార్పే మీకు భూషణము.కాని మనిషిని మూసలో పోసి మార్చేది ప్రజలే.R.K. Narayan ,Guide లో రాజును ఆరాజుగా చేసింది జనమే .మీరు స్థిత ప్రజ్ఞులు.అభివాదములు.

      తొలగించండి
  15. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2738
    సమస్య :: దేవుడు లేడు లేడనుచు దెప్పుచు నుండెద రాస్తికుల్ గదా.
    దేవుడు లేనే లేడు అని చెప్పేవాళ్లు ఆస్తికులే గదా అని అనడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: దేవుని దర్శించుకోవాలని ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉన్నారు. దేవుడు ప్రతియొక్కరి హృదయంలో కొలువై ఉన్నాడని తెలిసికొని సుహృద్భావము కలిగి దైవభక్తి గలిగి చిత్తశుద్ధి కలిగి అందఱికీ మంచి చేసేందుకు ప్రయత్నం చేయాలి. ‘’ఈశ్వర స్సర్వభూతానాం హృద్దేశేఽర్జున తిష్ఠతి’’ అని గీతలో చెప్పియున్నారు కదండీ. కాబట్టి దూరంగా ఎక్కడో దేవుడు లేడు. దేవుడు నీలోనే ఉన్నాడు అని చెప్పేవారే ఆస్తికులు అని విశదీకరించే సందర్భం.

    దేవుని జూడగా పలు ప్రదేశములన్ దిరుగంగ నేల? స
    ద్భావము భక్తి గల్గి భగవానుని సాక్షిగ మంచి జేయుడీ,
    దేవుడు నిత్యుడున్ సకలదేహిహృదంతరవాసి ; యెక్కడో
    ‘’దేవుడు లేడు లేడనుచు దెప్పుచు నుండెద రాస్తికుల్ గదా.’’
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.
    (20-7-2018)

    రిప్లయితొలగించండి
  16. వాసుదేవుడె దైవము వైష్ణవులకు
    శంభులింగడె సాయము శైవులకును
    శాంభవియె దిక్కగును జూడ శాక్తికేయు
    లకును తమ దైవముల సాటి రాగలిగిన
    దేవుడే లేడటంద్రు రాస్తికులు గాదె!

    రిప్లయితొలగించండి
  17. కులమతాలకు జిక్కని గొప్పవాడు!
    భక్తిభావంబు మనసుకుబంచువాడె
    సౌఖ్య మెక్కువ నొసగిన?లౌఖ్యమందు
    దేవుడే లేడటందు!"రాస్తికులుగాదె"!

    రిప్లయితొలగించండి
  18. భావము నందు నమ్ముకొని భక్తిని నార్తిని నాశ్రయించినం
    గావుమ నిన్వినా పరుల గాంచను నే నన వారి కుండు నే
    దైవము లేదు లే దనెడు దయ్యము పట్టిన నాస్తికాళి కా
    దేవుఁడు లేఁడు లేఁడనుచు దెప్పుచు నుండెద రాస్తికుల్ గదా.



    రిప్లయితొలగించండి
  19. మ్రొక్కనేల రాళ్ళకెపుడు, ముదముగ మన
    జననిని కొలువ జాలును జగతి జనత,
    తల్లి కన్న దైవము లేదు తరచి చూడ
    దేవుడే లేడటందురాస్తికులు గాదె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కొంత అస్పష్టత ఉన్నది.

      తొలగించండి
  20. గురువు గారి గళం ఖండాంతర వాణి లో వీనులవిందు చేసింది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. www.scuberadio.com ( online radio Telugu - US ) లో నిన్న రాత్రి 9 గంటలకు ప్రసార మైంది.

      తొలగించండి
    2. ధన్యవాదాలు మిస్సన్న గారూ!
      *******
      జిలేబీ గారూ,
      ఒకటి రెండు రోజుల్లో నిన్నటి ఇంటర్వ్యూను యూట్యూబులో అప్‍లోడ్ చేస్తారట. అప్పడా లింకును తెలియజేస్తాను.

      తొలగించండి
    3. గురుదేవులకు హార్ధికాభినందనలు! 💐💐💐💐🙏🙏🙏🙏

      తొలగించండి
  21. శ్రీ కంది శంకరయ్యగారి రేడియో ఇంటర్వ్యూ
    విన్న నా ప్రతిస్పందన.
    కందికులోన్నతప్రభవకావ్యరసజ్ఞవిశేషశేమషీ
    సుందరవందనీయగుణశోభితసత్కవిశిక్షకాగ్రణీ!చందురు వెన్నెలో! యనగ సాగె త్వదీయయశోమయూఖసు
    స్పందన, నీ కివే సుకవిశంకర! భవ్యశుభాభినందనల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. రికార్ద్ సూపర్ ఎక్కడ ? ఆకాశవాణి లోన !?

      జిలేబి

      తొలగించండి
    2. అరయ సంసార సాగరమందు బతుకు
      నావను సరిగా నడిపించు నావికుండు
      తనువునందలి జీవాత్మతక్క వేరు
      దేవుడే లేడటందురాస్తికులు గాదె

      తొలగించండి
    3. రామాచార్య గారూ,
      ధన్యవాదాలు!
      ****
      జిలేబీ గారూ,
      ఎస్ క్యూబ్ రేడియో (అమెరికా) వారి ఇంటర్వ్యూ అది..
      ****
      సీతారామయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

    4. వావ్! శంకరాభరణము అమెరికా రేడియో దాకా వెళ్ళిందన్నమాట ! సూపర్.

      శుభాకాంక్షలతో మీకు అమెరికా వారి ఆహ్వానము కూడా రావలని మన సారా కోరుకుంటూ


      జై శంకరాభరణం జై జై యిచ్చటి కవివరులకు


      చీర్సు సహిత
      జిలేబి

      తొలగించండి
  22. ఆత్మయున్నట్టులే పరమాత్మ గూడ
    నిండియుండును జగతిని నిక్కముగను
    నమ్మి కొల్చిన దయతోడనాదుకొనని
    దేవుఁడే లేఁ డటందు రాస్తికులు గాదె.

    రిప్లయితొలగించండి
  23. నాస్తికజనంబులెల్లరు నయము లేక
    దేవుడేలేడటందు,రాస్తికులుగాదె
    దైవముగలదనుచునుసదాభజనలు
    సేయుచుండియు,బూజలుసేయువారు

    రిప్లయితొలగించండి
  24. స్థిరత దీపింపని చపల చిత్తము గల
    వారలనుకూల మగువేళ, వరలు ననుచు
    నాపదల దాట గాలేక యప్పుడపుడు
    దేవుఁడే లేఁ డటందు రాస్తికులు గాదె?


    రిప్లయితొలగించండి
  25. దేవుడులేడులేడనుచుదెప్పుచునుండెదరాస్తుకుల్గదా
    యీవిషయంబులోనరయనిట్లుగబల్కుటన్యాయమే?ప్రభూ
    దేవుడులేడులేయనుచుదెల్పెడువారలునాస్తికుల్గదా
    దేవుడులేనిచోటిలను దెల్పగసాధ్యమె?యేరికేనిలన్

    రిప్లయితొలగించండి
  26. తొలిపాదం చివర
    ఆస్తికుల్
    గా
    చదువప్రార్ధన

    రిప్లయితొలగించండి
  27. స్థిరత దీపింపని చపల చిత్తము గల
    వారలనుకూల మగువేళ, వరలు ననుచు
    నాపదల దాట గాలేక యప్పుడపుడు
    దేవుఁడే లేఁ డటందు రాస్తికులు గాదె?
    ****)()(****
    అగ్ని దేవో ద్విజాతీనామ్
    మునీనామ్ హృది దైవతమ్౹
    ప్రతిమా స్వల్ప బుద్ధీనామ్
    సర్వత్ర సమదర్శినః ౹౹

    రిప్లయితొలగించండి
  28. దేవత లుందు రట్లు పలు తీరులు దేశవిదేశసీమలం
    దావిధి వారికట్లు సరి యైనది, కాని మతమ్ములందు
    మా
    దేవుడె కోర్కెఁ దీర్చ గల దేవుడు విశ్వము నందొకండె, యే
    దేవుడు లేడు లేడ నుచు దెప్పుచు నుండెదరాస్తికుల్ సదా.

    రిప్లయితొలగించండి
  29. క్రొవ్విడి వెంకట రాజారావు:

    దేవుడే తమ పనులను దీర్చు ననుచు
    దైవ భక్తిని గూడుచు తనరు వారు
    కారణాంతరమున నవి కాని వడిని
    దేవుడే లేదటందురాస్తికులు గాదె?

    రిప్లయితొలగించండి
  30. మత్త మాతంగుఁ బ్రహ్లాదు మానినీ మ
    ణి ద్రుపద రాజ తనయఁ గనిన నెఱుఁగమె
    నెమ్మి భజియింపఁ గాపాడ నేర నట్టి
    దేవుఁడే లేఁ డటందు రాస్తికులు గాదె


    ఏ విధి నుత్తరింతురొ యిఁ కే నరుఁ డండగ నుండు మీ కిలన్
    దైవ మెఱుంగు నిత్తరిని దాట సుఖమ్ముగ దుఃఖవార్ధినిన్
    నావగ మిమ్ము గావఁగను నాస్తికులం గని మీ మనమ్ములన్
    దేవుఁడు లేఁడు లేఁడనుచు దెప్పుచు నుండెద రాస్తికుల్ గదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి సప్రణామ ధన్యవాదములు.

      తొలగించండి
  31. డా.పిట్టా సత్యనారాయణ
    "దేవుడు యేడిరా?యెచట? దిక్కులు జూచెదవేల బాల? యా
    పోవడి బోని యెవ్వడుర? బుద్ధిని మార్చు మ"టన్న తండ్రియే
    పోవడె వైరభావమున పూర్ణ సుభక్తుడు తన్ను గానకే
    దేవుడు లేడు,లేడనుచు దెప్పుచు నుండెద రాస్తికుల్ గదా!

    రిప్లయితొలగించండి
  32. విశ్వమంతయు నిండిన విశ్వనాథుని
    సాటి మనిషిలో జూచి సాయమొసగు
    మానవత్వము నిండారు మనిషి సాటి
    దేవుఁడే లేఁడటందు రాస్తికులు గాదె.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి, రెండవ పాదాలలో గణదోషం. "విశ్వనాథు। ...మనుజునిలో గని సాయమొసగు.." అనండి. 'మనిషి' అన్నది సాధుప్రయోగం కాదు.

      తొలగించండి
  33. కేవల శుద్ధతత్వమును కీలకమంచును
    లోకయాత్రకై
    పావన విగ్రహంబులను ప్రార్ధన జేయుట పామరత్వమౌ
    నీవల యావలన్ వెదుక నీశ్వరుడొక్కడ నన్యభావమున్
    దేవుడు లేడు లేడనుచు దెప్పుచు నుండెద రాస్తికుల్ గదా!

    రిప్లయితొలగించండి
  34. తొమ్మిది నెలలు గర్భమందువెత బడక
    నన్ను మోసినావు జనని, చన్ను పాలు
    నాకు త్రాగించి బాల్యమ్ము సాకినావు
    మంచి బుద్ధులు నేర్పుచు మహిమ తోడ
    తీర్చి దిద్దినావు తెలివి తేటలిచ్చు
    చదువు చెప్పించి నావు, యీ సంఘ మందు
    పలుకు బడినిచ్చు నున్నత పదవి నీదు
    దయవలన పొంది నాను, నా తండ్రి పిదప
    కాలమందు మరణ మొంద కంట నీరు
    పెట్ట కుండ నీ గుండెను గట్టి పరచి
    కట్టెలమ్ముచు తిండిని బెట్టినావు
    వేరు దైవము నీకన్న లేరు నాకు
    నాస్తికులు మదము పెరుగ నభము లోన
    "దేవుఁడే లేఁ డటందు, రాస్తికులు గాదె
    పూజతో దేవతల గొల్చి పుణ్య మొందు,
    నీదు సేవయె సతతము నెమ్మి నిడును
    నాకు, పోను గుడికి నేను, నాకు మన్న
    నలిడు వమ్మ యని సుతుడు బలికె నపుడు

    కొత్తగా కలెక్టరు ఉద్యోగములో చేరబోవు కొడుకును గుడికి వెళ్ళాలని కోర తల్లితో నొక సుతుడు బలికిన పలుకులు



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాకు మీ కవిత బాగా నచ్చింది.

      తొలగించండి
    2. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చెప్పించినావు + ఈ' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  35. భావము నందు భక్తి పరిపక్వత నొందిన సజ్జనాళి స
    ద్భావము తోడ దేవ ముని వందితుడైన మహేశ్వరున్ సదా
    బ్రోవుమటంచుఁ బల్కెదరు యెక్కడ చూచిన లేడు? చూడ మా
    దేవుఁడు లేఁడు లేఁడనుచు దెప్పుచు నుండెద రాస్తికుల్ గదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '...బల్కెదరు + ఎక్కడ' అన్నపుడు యడాగమం రాదు. "..బల్కెదరె యెక్కడ" అందామా?

      తొలగించండి
    2. పొరబడితిని గురువుగారు.
      సవరణకు ధన్యవాదములు.

      తొలగించండి
  36. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    *"దేవుఁడే లేఁ డటందు రాస్తికులు గాదె"*

    సందర్భము: ఎవరికి దేవుడు లేడు... అంటే క్రింద చెప్పబడిన గుణాలు గల వారికి.. లేదా ప్రవర్తనా విధానం మార్చుకోలేని వారికి..
    ఆ యా గుణాలు, అలవాట్లు మార్చుకోగలిగితే దేవు డున్నా డని ప్రత్యేకంగా చెప్ప నక్కర లేదు. వారికే తెలిసిపోతుంది. "ఇందు గల డందు లే డని సందేహము" కలుగనే కలుగదు.
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    భక్తి విశ్వాసములు లేని వారలకును
    గోరికలవెంట పరుగెత్తు వారలకును
    వసుధ నింద్రియ లోలురౌ వారలకును
    దేవుఁడే లేఁ డటందు రాస్తికులు గాదె! 1

    స్వార్థమే మితి మీరిన వారలకును
    పేరు, సిరులనే కోరిన వారలకును
    గౌరవం బేరి కొసగని వారలకును
    దేవుఁడే లేఁ డటందు రాస్తికులు గాదె! 2

    మాట మీద నిలబడని మనుజులకును
    మాటలను మోసమును జేయు
    మనుజులకును
    మాట విలు వెఱుంగగ లేని మనుజులకును
    దేవుఁడే లేఁ డటందు రాస్తికులు గాదె! 3

    అహము వర్జింపగా లేని యయ్యలకును
    మౌన మభ్యసింపగ లేని మనుజులకును
    మహినిఁ బరులఁ బీడించు దుర్మార్గులకును
    దేవుఁడే లేఁ డటందు రాస్తికులు గాదె! 4

    హింసయే ముఖ్య మని యెంచు హీనులకును
    తెలివియే గొప్ప దని యెంచు తులువలకును
    పెద్దలకు సేవఁ జేయని మొద్దులకును
    దేవుఁడే లేఁ డటందు రాస్తికులు గాదె! 5

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ
    20.7.18

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. వెలుదండ వారూ,
      మీ ఐదు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  37. కోవెల లోనె గల్గునని కొందఱు భక్తులు నమ్ముచుంద్రుగా !
    జీవుల లోనె గల్గునని చింతన జేయరు మూఢ మానవుల్
    భావన లోనె గల్గునని బాహ్య ప్రపంచము లోననెక్కడో
    "దేవుఁడు లేఁడు లేఁడనుచు దెప్పుచు నుండెద రాస్తికుల్ గదా!"
    >>>>+++<<<<
    ఇక్కడ 'దెప్పుట ' అంటే మూఢులకు ఎత్తిపొడుపు మాట.

    రిప్లయితొలగించండి
  38. ఆటవిడుపు సరదా పూరణ:
    ("ఈశ్వర్ అల్లా తేరో నామ్")

    కోవెల యందునన్ విభుడు కొండను చర్చి మసీదునందునన్
    మావలె పుండ్రముల్ కలిగి మంత్రము తంత్రము యంత్రమొప్పుచున్
    మీవలె గడ్డముల్ కలిగి మీకును మాకును భిన్నరూపుడౌ
    దేవుఁడు లేఁడు లేఁడనుచు దెప్పుచు నుండెద రాస్తికుల్ గదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. ఆబ కందము :)

      కోవెల లో మస్జిదులో
      తా వెలసెన్ చర్చి లోన తరియింపగ సు
      మ్మీ, విద్వేషమ్ములతో
      దేవుడు లేదాస్తికులట దెప్పుదురుగదా!

      జిలేబి

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
      ****
      జిలేబీ గారూ,
      శాస్త్రి గారి ఉత్పలమాలకు మీ కందరూపం బాగున్నది.

      తొలగించండి
  39. గురువు గారికి నమస్సులు.
    పాపియు పలుమారు కలలో బల్కు నెపుడు
    దేవుడు లేడట0దు,రాస్తికుకులు గాదె
    వేమన సోక్రటీస్ తాత్వికు వేల కొలది.
    పరమ పావన లెల్లరన్ పరిఢ విల్ల.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట నారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కొన్ని అన్వయదోషాలు, టైపాట్లున్నవి.

      తొలగించండి
  40. తేటగీతి
    గోడు వినిపించి మముఁ బ్రోవఁ గూడ మనిన
    నమ్మి మ్రొక్కిన దైవమ్ము నడచిరాడు
    కలఁడుఁ గలఁడన్న వానినిన్ గానమనుచు
    దేవుఁడే లేఁ డటందు రాస్తికులు గాదె!

    ఉత్పలమాల
    లావు నశించి యేనుగట రమ్మన గావఁగ వచ్చి కాచెనే
    ద్రోవది యార్తిగా బిలువ బ్రోవడె చీరల నిచ్చి దైవమై
    నీవును కష్టమందు గతి నీవని నమ్ముచు వేడకుండినన్
    దేవుఁడు లేఁడు లేఁడనుచు దెప్పుచు నుండెద రాస్తికుల్ గదా! 

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. కవిపండితులు శ్రీ సూరం శ్రీ నివాసులు గారి సూచిత సవరణతో :
      ఉత్పలమాల
      లావు నశించి యేనుగట రమ్మన వైళమ వచ్చి గాచితే
      ద్రోవది యార్తిగా బిలువ బ్రోచితివే గృప చీరలిచ్చి కా
      నీ వనటన్ నిను దలఁప నీవు పరాకున రాకయున్నచో
      దేవుఁడు లేఁడు లేఁడనుచు దెప్పుచు నుండెద రాస్తికుల్ గదా! 

      తొలగించండి
  41. దావళి గట్టిపూజలను ధాటిగ జేసెడు వారుమూఢులే
    భావన కల్ల యంచునిల వాదన జేసెడు హేతువాదులే
    దేవుడు లేడు లేడనుచు దెప్పుచునుండెద, రాస్తికుల్ గదా
    కోవెల లోనె కాదు తమ గుండెల నిండుగ నిల్పుకుందురే

    రిప్లయితొలగించండి
  42. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,


    దేవుడు లేడు లే డనుచు దెప్పుచు నుండెద రాస్తికుల్ కదా

    నావుడు, సుంతయేనియును నమ్మగ శక్యమె సత్కవీశ్వరా ?

    దేవుడు లే డటంచు నతి తెల్విగ వాగెడు వారు నాస్తికుల్ |

    దేవుని కందరున్ సమమె ! దివ్యపథంబున వర్తిలన్ సదా

    ప్రోవ గలాడు | కా దనుచు , పోతర మెక్కి చరించు దుష్టునిన్

    పావక కీల కాశమును భస్మ మొనర్చెడు లీల గాల్చు | స

    ద్భావముతో మెలంగు , మదిఁ బాతక భీతిని గల్గి నిత్యమున్


    { నావుడు = అనవుడు = అని పలుకగా ; ‌

    పోతర మెక్కి = మదమెక్కి ; కాశము = కాశతృణము

    = రెల్లు - గడ్డి }

    -------------------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  43. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  44. కావు మటంచునా వనిని కాతుర గాత్రముతోడ వేడకాచితే
    దేవ గతెవ్వరంచునిను దీనముగా పిలువంగ వచ్చితే
    నీవిక జాగుసేయుటిది నెమ్మియు కాదని వేదనమ్ముతో
    దేవుడు లేడు లేడనుచు దెప్పుదు నుండెద రాస్తికుల్ గదా!

    ముడుపు లెన్నో యొసంగితి ముందుగానె
    సేవలు పరిపరి విధాల చేసితినిట
    నైనను కరుణ జూపవ టంచునార్తిఁ
    దేవుఁడే లేఁ డటందు రాస్తికులు గాదె.

    కరిని బ్రోచిన శ్రీహరి కరుణ జూప
    తడవదేల చేయు దెలుపు ధరణి యందు
    బాధలిక తాళ లేమంచు వగపు తోడ
    దేవుడే లేడటందు రాస్తికులు గాదె.

    రిప్లయితొలగించండి
  45. నాస్తికులగు వారెల్లరు నమ్మకముగ
    దేవుడేలేడటందు, రాస్తికులు గాదె
    అవిరళమగుభక్తిగలిగి యణువణువున
    దైవమునుగొల్చు చుందురు ధరణిలోన!!!

    రిప్లయితొలగించండి
  46. 20.7.18 శంకరాభరణము
    ఉ.
    జీవుడు బ్రహ్మమేనరయ చేకురుముక్తి యటంచు పల్కుచున్
    తావివరించె శంకరుడు తారకమైనవిచారణాపథ
    మ్మావిధమాచరించి కనినంతట జీవుడు తక్క వేరుగా
    దేవుడు లేడు లేడనుచు దెప్పుచునుండెదరాస్తికుల్ గదా .. కోట శర్మ

    రిప్లయితొలగించండి
  47. సవరణతో
    దేవ గతెవ్వరంచు నిను దీనముగాసతి వేడినంతనే
    కావుమటంచు వారణము కాతుర గాత్రము పూని పిల్వగా
    నీవట వచ్చి కాచితివి నెన్నగ భారమె నీకటంచిటన్
    దేవుడు లేడు లేడనుచు దెప్పుచు నుండెదరాస్తికుల్ గదా.

    రిప్లయితొలగించండి

  48. కావడి బట్టువారలను గాంచి వితాకున బాలలెల్లరున్
    తాఁ వడిగుప్పిగంతులిడె తామసవేళఁ,హరోంహరా యనిన్
    దోవన పిచ్చివాడొకడు తూలుచు తూలఁగనాడెనిత్తరిన్
    "దేవుఁడు లేఁడు లేఁడనుచు దెప్పుచు నుండెద రాస్తికుల్ గదా"

    రిప్లయితొలగించండి
  49. బావురుమంచు పాడుచును భక్తి పురాణపు మెండు గీతముల్
    చావగ బంధుబాంధవులు శ్రాద్ధపు తంత్రము లెల్లనొల్లుచున్
    పావల వడ్డిలేదనగ బ్యాంకుల తిట్టుచు గుండెబాదుచున్
    దేవుఁడు లేఁడు లేఁడనుచు దెప్పుచు నుండెద రాస్తికుల్ గదా!

    రిప్లయితొలగించండి