12, జనవరి 2014, ఆదివారం

సమస్యాపూరణం - 1291 (తండ్రినే భర్తగాఁ బొంది)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
తండ్రినే భర్తగాఁ బొంది తరుణి మురిసె.

27 కామెంట్‌లు:

  1. తనకుఁగల్గిన యొకచిన్న తలపుతోనె
    విశ్వమునుగన్న భగవానుఁవిధినిఁగన్న
    తండ్రినే భర్తగాఁ బొంది తరుణి మురిసె
    సలిపెనెట్టి సుకృతములో సత్యభామ !

    రిప్లయితొలగించండి
  2. తల్లిదండ్రులు ప్రేమతో తగదటన్న
    వినక, పర్ణంబులైనను తినక తపము
    పట్టువీడక నొనరించి ప్రమథులకును
    తండ్రినే భర్తగా బొంది తరుణి మురిసె.

    రిప్లయితొలగించండి
  3. రంగ నాధుని సేవించి రమణి గోద
    భక్తి గానము చేయుచు పరవశించి
    పాశురములను రచియించి భావ భవుని
    తండ్రినే భర్తగా బొంది తరుణి మురిసె


    రిప్లయితొలగించండి
  4. మేనబావను మెచ్చెను చాన, నాన్న
    వలదు వలదని చెప్పినన్ వాదులాడి
    బావనే కోరి యొప్పించి బాగుగాను
    తండ్రినే, భర్తగా బొంది తరుణి మురిసె

    రిప్లయితొలగించండి
  5. guruvugaariki dhanyavaadhamulu, telugu type jeyutaku net viduvuta ledu.ninnati numdi gmail, rediffmail error vachchuchunnavi.
    =============*==============
    tuasi maalanu bhaktito tulanu vesi
    karivaradhuni madini gelchi karuna toda
    parama purusha! bhakta varada! bhaavajunaku
    తండ్రినే భర్తగాఁ బొంది తరుణి మురిసె!

    రిప్లయితొలగించండి
  6. తల్లి దండ్రులు భ్రాతయు తగదటంచు
    నెంత చెప్పినా పూనిక సుంత విడక
    ప్రియుడినే, ధైర్యముగ నెదిరించి కన్న
    తండ్రినే, భర్తగా బొంది తరుణి మురిసె

    రిప్లయితొలగించండి
  7. తల్లి దండ్రులు భ్రాతయు తగదటంచు
    నెంత చెప్పినా దీక్షను సుంత విడక
    ప్రియుడినే, ధైర్యముగ నెదిరించి కన్న
    తండ్రినే, భర్తగా బొంది తరుణి మురిసె

    రిప్లయితొలగించండి
  8. Sri Nemaani gurudevulaku mannimcha prarthana,
    After pressing reply, it is showing loading.. only. I will reply as soon as possible sir.

    రిప్లయితొలగించండి
  9. కందుల వరప్రసాద్ గారి పూరణ....

    తులసి మాలను భక్తితో తులను వేసి
    కరివరదుని మదిని గెల్చి కరుణతోడ
    పరమ పురుషు భక్త వరదు భావజునకు
    తండ్రినే భర్తగాఁ బొంది తరుణి మురిసె!

    రిప్లయితొలగించండి
  10. భక్తి భావంబు మెరయ విభ్రాంతి కలుగు
    రీతితపమొనరంచి సంప్రీతిపరచి
    సకల భువనైక జీవసంచారములకు
    తండ్రినే భర్తగాఁ బొంది తరుణి మురిసె.

    రిప్లయితొలగించండి
  11. తా ధరించిన మాలనే దైవమునకు
    నొసగి ప్రేమతో, నబ్బుర మొందజేసి
    తండ్రినే, భర్తగా జేసి తరుణి మురిసె
    రంగనాథుని భక్తాంతరంగ నాథు

    రిప్లయితొలగించండి
  12. గూడ రఘురామ్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    భగవాను తరువాత అరసున్నా అవసరం లేదు.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    శివుణ్ణి ప్రమథపతి, ప్రమథనాథుడు, ప్రమథాధిపుడు అన్నారే కాని ప్రమథపిత అని అనలేదు కదా!
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘నాడు + ఆమె’ అన్నప్పుడు సంధి నిత్యం, యడాగమం లేదు. ఆ పాదాన్ని ‘నాడు మేటి నటియగుచు సన్నీడియోలు’ అందాం.
    ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ‘దేవ్’ను ఇంగ్లీషులో ‘deo' అని వ్రాయడం ఔత్తరాహికుల ఆచారం. హిందీ నటుడు రమేశ్ దేవ్ (Ramesh Deo), ఆర్. యస్. యస్. నాయకుడు దేవరస్ (Deoras) మొ. ఉదాహరణలు. అలాగే ధర్మేంద్ర ఇంటిపేరు ‘దేవల్ (Deol)’. కాని చాలామంది దానిని ‘డియోల్’ అంటున్నారు. నిజానికి ఆ పేరు సన్నీ దేవల్.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. తలచె రాముడు పుడమిని దైవముగను
    తండ్రినే, భర్తగా బొంది తరుణి మురిసె
    నీల మేఘపు దేహుని నిరతి శయుని
    రామ చంద్రుని ముదమార రామ సీత

    రిప్లయితొలగించండి
  16. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

    సిరికి భూదేవికిని భర్త శ్రీధరుండె
    రావణాసురు జంపగా రాముడయ్యె
    వెతుక ధరణిజకాతడే పతియునవగ
    తండ్రినే భర్తగాఁ బొంది తరుణి మురిసె!

    రిప్లయితొలగించండి
  17. గుండా సహదేవుడు గారి పూరణ...

    జనకు నింటిలోన నవని జాత పెరిగి
    శివ ధనుర్భంగ శూరుడు శ్రీహరి యని
    రామ చంద్రుని స్తుతియించ ప్రేమ మెచ్చి
    తండ్రినే, భర్తగాఁ బొంది తరుణి మురిసె

    రిప్లయితొలగించండి
  18. సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    ఈ భావంతో ఎవరు పూరిస్తారా అని ఉదయం నుండి చూస్తున్నా... చివరికి మీ నుండి వచ్చింది. మంచి పూరణ. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    నా సవరణలో యతిదోషం దొర్లింది. మన్నించండి. సవరించాను.

    రిప్లయితొలగించండి
  19. నంద గోపాలు రూపమే డెందమందు
    మెదల నార్యామహాదేవి పదములంటి
    వేడి, శ్రీకృష్ణునే నాడు; వీడి కన్న
    తండ్రినే ,భర్తగాబొంది తరుణిమురిసె !!!

    రిప్లయితొలగించండి
  20. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    కృతయుగమ్మున భూదేవి కిటికి భార్య
    త్రేత శ్రీరాము భార్య భూజాత సీత
    నరయ కిటికియు రాముడు హరియె యగుట
    తండ్రినే భర్తగా పొంది తరుణి మురిసె
    వావివరుసలు యుగముకే పరిమితమ్ము

    రిప్లయితొలగించండి
  21. మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    బాగున్నది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. తల్లి దండ్రులు లేనట్టి పిల్లదాన్ని
    మిగుల ప్రేమతో బెంచెను మేనమామ
    తండ్రి వలెసాక నతనిపై తమక మొంది
    తండ్రినే భర్తగా బొంది తరుణి మురిసె.

    రిప్లయితొలగించండి