29, సెప్టెంబర్ 2014, సోమవారం

పద్యరచన - 691

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10 కామెంట్‌లు:

  1. కుప్పను నూర్చిన చేసిన
    యప్పుల తీర్చంగ వచ్చు హాయిగనిక మా
    తిప్పలు తీరును కడుపుకు
    ముప్పూటల లోటు లేక బువ్వయు దొరకున్

    రిప్లయితొలగించండి
  2. దసరా శుభాకాంక్షలు
    బ్లాగు మిత్రుల కిడుదును వంద నములు
    దసర పండుగ కతనన దండి గాను
    అందు కొను డార్య !మీరంద రందుకొనుడు
    నా శు భాకాంక్ష లీ యవి ,వేశ తములు

    రిప్లయితొలగించండి
  3. వరికుప్ప లవియ చూడుము
    వరి ధాన్యము తోడ మరిని వరుసగ నుండెన్
    వరిధాన్యము సరి యగుటకు
    చెరుగుచు నట యుండె నొకడు చేటల తోడన్

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింపనున్నవి !

    రైతు :

    01)
    _______________________________

    పరమ సాధువు యైనట్టి - పంటకాపు
    కష్ట నష్టమ్ములను మోయు - కర్షకుండు
    సేద్యమొక్కటె యెరిగిన - సేద్యకాడు
    సకల లోకాన్నదాయక - సైరికుండు !

    క్షేత్రమునె క్షేత్రమని యెంచు - క్షేత్రకరుడు
    దుక్కి దున్నుటలో సొక్కు - దుక్కిముచ్చు
    అప్పనెడి నిప్పులను క్రాలు - యద్దెకాపు
    సకల లోకాన్నదాయక - సైరికుండు !

    హాయి జేకూర్చ శ్రమజేయు - హాలికుండు
    బద్ధకించని శ్రమ జీవి - బహు కుటుంబి
    పృథివి మీదున్న బ్రహ్మయౌ - కృషాణుండు
    సకల లోకాన్నదాయక - సైరికుండు !

    కదులు చున్నాడు దిబ్బపై - కమతకాడు
    కుప్ప నూర్చగ నెడ్లతో - గూడ కలసి
    కఱవు దీరగ ధాన్యమ్ము - ఖాయ మనుచు
    కళ్ళ ముందెన్నొ కమ్మని - కలల గనుచు
    సకల లోకాన్నదాయక - సైరికుండు !
    _______________________________
    క్షేత్రము = పంటభూమి, పుణ్యభూమి(a place of pilgrimage)
    సొక్కు = పరవశించు
    క్రాలు = అల్లలాడు

    రిప్లయితొలగించండి
  5. శ్రీగురుభ్యోనమ:

    వన్యమృగంపు దాడులను వర్షపు లేమియు చీడపీడలున్
    హైన్యము గూర్చుచుండినను యాతన నొందక నోకృషీవలా
    ధాన్యము బండజేసితిరి ధన్యులు మీరిక పండుగే కదా
    అన్యులకెట్లు సాధ్యమగు హాలిక గైకొను వందనంబులన్

    రిప్లయితొలగించండి
  6. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. కుప్ప నూర్పిడిఁ జేయుచు కూర్మి సఖులు
    పాట పాడుచు నుండిరి పరవశమున
    రైతు ముఖములు వికసించె రమణ (ప్రీతి) తోడ
    పల్లె సీమల యందున పండు గాయె
    సఖుడు: సహాయుడు

    రిప్లయితొలగించండి
  8. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. మొన్నటి పద్య రచన :
    బొట్టు పెట్టఁ జూడ!పూలు ముడవఁ జూడ!
    చెరఁగు జారు వేళ సిగ్గు జూడ!
    చెవికి కమ్మలనిడు సింగారమది జూడ!
    చెదర దెవరి మనము కుదురు లేక!
    నిన్నటి పద్య రచన :
    అడవిని కాపాడగ నీ
    వడగకనే యొంటి కోర నాయుధ మాయెన్!
    జడుపేదో గల్గించుచు
    పొడుచుననుచుఁ దోచు నీదు మోమది ఖడ్గీ!
    నేటి పద్యరచన :
    వరి కుప్పలు రైతులకవి
    సిరి కుప్పలు నూర్చి చేర్చి చేటలఁ జెరుగన్
    ధర పలుకుగ మోదంబుగ!
    పరిమార్చును ధరలు తగ్గ బాధిత రైతున్!

    రిప్లయితొలగించండి
  10. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ మూడు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి