31, మార్చి 2015, మంగళవారం

సమస్యా పూరణము - 1636 (భీముఁ డింద్రకుమారుఁ జంపెను రణమున)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
భీముఁ డింద్రకుమారుఁ జంపెను రణమున.
(శ్రీ శలాక రఘునాథ శర్మగారి స్ఫూర్తితో...)

24 కామెంట్‌లు:

  1. వాయు నందనుడెవ్వడు? పార్ధుడనుచు
    నెవని యందురు? రాధేయు నేమిజేసె
    యర్జునుండు భారతమున? యన క్రమముగ
    భీముఁ - డింద్రకుమారుఁ - జంపెను రణమున

    రిప్లయితొలగించండి
  2. వాలి సుగ్రీవులిరువురు వాదులాడి
    యుద్ధమొనరింప చాటున సిద్ధమయ్యి
    రయముననొక బాణము వేసి రాముఁడు రణ
    భీముఁ డింద్రకుమారుఁ జంపెను రణమున!!

    రిప్లయితొలగించండి
  3. దుష్ట దృశ్యాసనున్ గూల్చు నిష్ట తోడ
    వలదు వలదంచు జంపగ వదలమనుచు
    భీముఁడింద్రకుమారుఁ, జంపె రణమున
    దొల్లి చేసిన ప్రతినలు చెల్లునటుల

    రిప్లయితొలగించండి
  4. విరుపు కోసం పద విభజన చేసేటప్పుడు "కుమారుఁ" అరసున్న గమనించవలెను గదా! అటువంటప్పుడు అర్థం మారకుండా చూసుకోవాలి.

    రిప్లయితొలగించండి
  5. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    యడాగమాల విషయంలో జాగ్రత్త పడండి. ‘ఎవని నందురు, చేసె నర్జునుడు, భారతమున నన’ అని ఉండాలి.
    *****
    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణలో అన్వయం లోపించినట్లుగా ఉంది. ఒకసారి పరిశీలించండి.
    *****
    చంద్రశేఖర్ గారూ,
    ధన్యవాదాలు. మీ సూచన ప్రకారం ఇప్పటికి వచ్చిన వాటిలో సహదేవుడు గారి పూరణలో ఆ అభ్యంతరం కనిపిస్తున్నట్టుంది.

    రిప్లయితొలగించండి
  6. ధార్త రాష్ట్రుని జంపిన దావరెవరు ?
    ఫల్గునుండన నెవ్వరు భారతమున?
    కర్ణు నేమి జేసె కిరీటి కాస్త జెపుమ ?
    భీముఁ, డింద్రకుమారుఁ, జంపెను రణమున!!!

    రిప్లయితొలగించండి
  7. పార్ధుని దపమునకు నిచ్చె పాశు పతము
    భీ ము ,డింద్ర కుమారుజంపెను ర ణ మున
    ననుట కాదుస మంజస మార్య !వినుము
    పార్ధు నిన్జంప నేరికి వలను గాదు

    రిప్లయితొలగించండి
  8. గుగురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :

    దుష్ట దృశ్యాసనున్ గూల్చు నిష్ట తోడ
    వలదు వలదంచు జంపగ వదలమనెను
    భీముఁడింద్రకుమారుఁ, జంపె రణమున
    దొల్లి చేసిన ప్రతినలు చెల్లునటుల

    రిప్లయితొలగించండి
  9. బబ్రువాహనుడు, ఖగుడు, బండనమున
    భీముడిద్రకుమారుఁ జంపెనురణమున
    చెచ్చరయులూచి తలచి సంజీవమణిని
    జీవమును పోసి విభునకు చింత దీర్చె

    రిప్లయితొలగించండి
  10. శైలజ గారూ,
    క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ఇంద్రకుమారున్’ అన్నదానికి అన్వయం కుదరడం లేదు. ‘ఫల్గుణుండని పిలుతు రెవ్వాని జనులు?’ అంటే సరిపోతుంది.
    *****
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    సహదేవుడు గారూ,
    సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  11. వాయువుకు కుంతికిన్ గల్గు బలుడు యెవరు?
    కర్ణు డెవ్వని నిర్జింప కాంక్షజేసె?
    పాశుపతమేమి జేసెను భానుసుతుని?
    భీముఁ - డింద్రకుమారుఁ - జంపెను రణమున

    రిప్లయితొలగించండి
  12. చూడగ సినిమా?రాత్రికిచోద్యముగను
    కలనుగాంచితి భారతకథలయందు
    భీము డింద్రకుమారుజంపెను|రణమున
    కర్ణు డభిమన్యుఛాతిలోకత్తి దింపె|

    రిప్లయితొలగించండి


  13. మణిపురవిబుండు బభ్రువాహనుడు సమర
    భీముఁ డింద్రకుమారుఁ జంపెను రణమున
    మరల బ్రతతికించె సంజీవమణిని దెచ్చి
    సతి యులూచి పార్ధుని జనుల్ సంతసించ

    రిప్లయితొలగించండి
  14. మణిపురి నేలుచున్న భీమబల,పార్ధ
    తనయు నెదిరించి,పితయని తానునెరుగ
    నతడు భభృవాహనుడు తాక,నందు,యుద్ధ
    భీము,డింద్రకుమారు జంపెను రణమున

    కొడుకు ననియును తెలియమి,గూలనరికి
    భీము,డింద్రకుమారు జంపెను రణమున
    తెలిసి,వెనుకనులూచియు తిరము నిడగ
    జీవితుడయె సంజీవని చేత నరుడు

    రిప్లయితొలగించండి
  15. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘బలుడు+ఎవడు’ అన్నప్పుడు సంధి నిత్యం. ‘బలు డెవండు’ అనండి.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణ మొదటి పాదంలో గణదోషం. ‘మణిపురము నేలుచున్న...’ అనండి.

    రిప్లయితొలగించండి
  16. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రబృందమునకు నమశ్శతములతో...

    దాశరథి, శివేష్వాసభి, ద్దానవరణ
    భీముఁ డింద్రకుమారుఁ జంపెను; రణమున
    సూర్యపుత్రుఁ డక్కజముగఁ జూచుచుండఁ;
    జెట్టు చాటున డాఁగియు శీఘ్రముగను!

    రిప్లయితొలగించండి
  17. గుండు మధుసూదన్ గారూ,
    చాలారోజుల తర్వాత అద్భుతమైన పూరణతో పునర్దర్శన మిచ్చారు. సంతోషం, అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. ఉర్వి దుర్యోధనుని నెవ రుక్కుమడచె?
    దానవీరడు శూరుడు దాత యైన
    కర్ణునెవ్వరు జంపెను కరుణ లేక?
    భీము; డింద్ర కుమారుఁ జంపెను రణమున.

    రిప్లయితొలగించండి
  19. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసనీయమే. కాని కర్ణుని ప్రస్తావనలో పొరపాటు పడ్డారు. ‘దానవీరుడు, శూరుడు, దాత ఐన కర్ణుని నిర్దయగా ఎవరు చంపారు?’ అన్న ప్రశ్నకు ‘యుద్ధంలో ఇంద్రకుమారుని (అర్జునుని) చంపాడు’ అన్నది సమాధానం కాదు కదా... సవరించండి.

    రిప్లయితొలగించండి
  20. తే.గీ. ప్రతిన బూనిగట్టిగతనుపట్టుబట్టి
    పాశుపతమెమపాశంబు వదలి సమర
    భీముఁ డింద్రకుమారుఁ జంపెను, రణమున
    సింధు రాజుపాండుశిశుల జంపనాడు

    రిప్లయితొలగించండి
  21. గురుదేవులకు నమస్సులు,

    సవరణతో.....

    ఉర్వి దుర్యోధనుని నెవ రుక్కుమడచె
    పాశుపతమును గలిగిన వాడనంద్రు
    కర్ణునేమిజేసెనొ క్రీడి నిర్ణయముగ
    భీము డింద్ర కుమారుఁ జంపెను రణమున

    రిప్లయితొలగించండి
  22. రాముఁడార్తరక్షాగుణ రక్తి గలిగి
    మెలగువాడు, ధీరుడతడు, మీననయనఁ
    గావ రవిసుతుఁ జేరె, పగఁ గొని సమర
    భీముడింద్రకుమారుఁ జంపెను రణమున.

    రిప్లయితొలగించండి