3, మే 2015, ఆదివారం

సమస్యా పూరణము - 1664 (భారతదేశాధిపతి ‘ఒబామా’యె సుమీ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
భారతదేశాధిపతి ‘ఒబామా’యె సుమీ.

39 కామెంట్‌లు:

  1. పేరది అమెరిక దేశము
    కోరిక తీరంగ తెలుపు కోటను గెలిచెన్
    పౌరుల కూరిమితోనో
    భారత! దేశాధిపతి ‘ఒబామా’యె సుమీ!!

    రిప్లయితొలగించండి
  2. కోరిన డాలరు లిచ్చును
    మీరా కయెమాకు ముదము మీపని మెచ్చన్
    సౌరుగ వినయము జూపిన
    భారత దేశాధిపతి " ఒబామా "యె సుమీ

    రిప్లయితొలగించండి
  3. ఆరయ విదేశ నాయకు
    లూరక వచ్చి జనుచుందురూర్జిత మలరన్
    నేరిమితో స్నేహారం
    భా రత దేశాధిపతి యొబామాయె సుమీ

    రిప్లయితొలగించండి
  4. భారత యమెరిక రెండును
    యేరకముగ వృద్ధి జెంద నీప్సిత మౌనో
    కోరుచు కలిసిన యిర్వురు
    భారత దేశాధిపతి, యొబామా యెసుమీ

    రిప్లయితొలగించండి
  5. కూరిమి బలపడ నిరువురు
    నోరిమి తో చర్చజరుపు నుత్సాహముతో
    నారామములో నున్నది
    భారత దేశాధిపతి, ఒబామా యె సుమీ!!!

    (ఒబామా పర్యటనలో డిల్లీ ఉద్యానవనంలోయిరు నేతలు తేనీరు సేవిస్తున్న దృశ్యాన్ని దృష్టిలో పెట్టి చేసిన పూరణ )

    రిప్లయితొలగించండి
  6. మీరిచ్చిన " ఫోటో " లో
    పేరెన్నిక గన్న వారి పేర్లను చెపుదున్
    తీరుగ గనపడె మోదీ
    భారత దేశాధిపతి, ఒబామా యె సుమీ !

    రిప్లయితొలగించండి
  7. తీరిక చిక్కగ పిలిచెను
    భారతదేశాధిపతి;ఒబామాయె సుమీ!
    చేరిక యయ్యెను మనకిటు
    జోరగు సౌహార్ద్ర,మిదియె శోభాకరమౌ!

    రిప్లయితొలగించండి
  8. ఊరక రారుమహాత్ములు
    మేరువు లిరువురు గలిసిన మేలొన గూరున్
    వేరెవరో గాదు నదివొ
    భారత దేశాధిపతి, యొబామాయె సుమీ!!!

    రిప్లయితొలగించండి
  9. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమఃశతములతో...

    (ప్రపంచదేశాలలో పేరెన్నిక గనిన నేత యెవ్వరో తెలుపుమని తన కార్యదర్శిన యడుగగా, నతఁడు భారతదేశాధిపతి (ప్రధానమంత్రి) నరేంద్రమోడీకి సమాధాన మిచ్చిన సందర్భము)

    "మీరిన యధికారమునన్
    ధారుణి యంతటను గొప్పతనమందుననున్
    బేరెన్నిక గల నేతయె,
    భారతదేశాధిపతి! ’యొబామా’యె సుమీ!"

    రిప్లయితొలగించండి
  10. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమఃశతములతో...

    (ప్రపంచదేశాలలో పేరెన్నిక గనిన నేత యెవ్వరో తెలుపుమని తన కార్యదర్శిని యడుగగా, నతఁడు భారతదేశాధిపతి (ప్రధానమంత్రి) నరేంద్రమోడీకి సమాధాన మిచ్చిన సందర్భము)

    "మీరిన యధికారమునన్
    ధారుణి యంతటను గొప్పతనమందుననున్
    బేరెన్నిక గల నేతయె,
    భారతదేశాధిపతి! ’యొబామా’యె సుమీ!"

    రిప్లయితొలగించండి
  11. శైలజ గారి పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు

    రిప్లయితొలగించండి
  12. కం: ఉర్వర నేలెడి నేతలు
    ఇర్వురు నొకచోచేరి యిద్ధరలోనన్
    యారంభించిరి గద మన
    భారతదేశాధినేత ఒబమాయెసుమ

    రిప్లయితొలగించండి
  13. కం: ఉర్వర నేలెడి నేతలు
    ఇర్వురు నొకచోచేరి యిద్ధరలోనన్
    యారంభించిరి గద మన
    భారతదేశాధినేత ఒబమాయెసుమ

    రిప్లయితొలగించండి
  14. ధీరుడు నిజముగ నూతన
    భారత దేశాధిపతి, ఒబామాయె సుమా
    ధారుణిలో శక్తియుతుడు
    భారతు తో మైత్రినతడు భాసిలఁ జేసెన్

    రిప్లయితొలగించండి
  15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  16. భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    ఆరయ ప్రణవ ముఖర్జీ
    భారతదేశాధిపతి," 'ఒబామా’యె సుమీ
    పేరొందె నమెరికాకున్
    తీరగునధ్యక్షు "డనుచు తెలిపె జగతికిన్

    రిప్లయితొలగించండి
  17. వారించిరి తగడంచును
    చేరగనమెరిక గతమున, చేవగల మహా
    ధీరుడన నేడు వారలె
    భారత దేశాధిపతి, ఒబామా యె సుమీ!

    రిప్లయితొలగించండి
  18. ఉమాదేవి గారూ కందం లో ప్రాసను తప్పనిసరిగా పాటించాలి.
    మీ పూరణ మొదటి రెండు పాదాల్లోనూ రెండవ అక్షరం ర గుణింతం లోని అక్షరం మాత్రమే ఉండాలి.

    రిప్లయితొలగించండి
  19. భారత మమ్రిక లెన్నన్
    భూరి ప్రజాస్వామ్య దేశములు ధారుణిలో
    వేరెవరు శాంతి నిడ ధర?
    భారతదేశాధిపతి యొబామాయె సుమీ.

    రిప్లయితొలగించండి
  20. కం: ధారుణి నేలెడి నేతలు
    ఇరువురు నొకచోచేరి యిమ్ముగ చర్చల్
    యారంభించిరి గద మన
    భారతదేశాధినేత ఒబమాయెసుమీ!
    మిస్సన్నగారూ ధన్యవాదాలండీ.ఇప్పుడు సరిపోతుందేమో చూడండి.

    రిప్లయితొలగించండి
  21. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  22. తూరుపు సంస్కృతి ప్రతినిధి
    భారత దేశాధిపతి,'ఒబామా' యె సుమీ!
    ఆరయ నల్లనిజాతి య
    మేరిక రాష్ట్ర్గాధిపతిగ మెరసెను భువిలో

    రిప్లయితొలగించండి
  23. భారత ప్రభుతయె నేడిల
    నేరుగ నమెరిక విధమున నెందున సాగన్
    నీరెండు దేశము లొకటె
    భారత దేశాధిపతి,'ఒబామా'యె సుమీ!

    భారత దేశము పైనను
    కోరిన గుత్తాధిపత్య గుణమను నీతిన్
    కూరిమి నడుపగ నిపుడీ
    భారత దేశాధిపతి'ఒబామా'యె సుమీ!

    భారత ప్రధానిమోడీ
    ఛారత దేశాధిపతి;'ఒబామా'యె సుమీ
    కూరిమి మిత్రుడు జగతిని
    వారికి నెదురాడ గలుగు వారలు గలరే!

    భారత ప్రభుతయె వీడెను
    భూరగు సోషలిజము నిల,పోడిమి నెంచెన్
    భారీ పెట్టుబడి విధము
    భారత దేశాధిపతి'ఒబామా'యె సుమీ!

    రిప్లయితొలగించండి
  24. శ్రీ మిస్సన్న గారికి
    స్నేహ+ఆరంభా రత
    మైత్రి ని ఆరంభించుట లో ఇష్టము కలవాడు అని
    వ్రాశాను. ఇందులోని తప్పొప్పులను తెలుప ప్రార్థన

    రిప్లయితొలగించండి
  25. సాహితీ మిత్రులు డా.బల్లూరి ఉమాదేవిగారూ,

    కం: ధారుణి నేలెడి నేతలు
    ఇరువురు నొకచోచేరి యిమ్ముగ చర్చల్
    యారంభించిరి గద మన
    భారతదేశాధినేత ఒబమాయెసుమీ!

    మీరు సవరించిన పద్యములోని రెండవ పాదమందు "ట"కార మెగిరిపోయినది.

    ’నిరువురు నొకచోట చేరి యిమ్ముగ చర్చల” అనిన సరిపోవును.

    అటులే...
    మూడవపాదమందు ’గద’ సమస్యపాదమందు ’సుమీ’ రెండును నొకేయర్థమిచ్చును గావున ’గద’వలని ప్రయోజనము లేదు.

    అంతేగాక...
    ’...చర్చల్/యారంభించిరి...’ యని లకారాంతము పిదప యడాగమము వాడితిరి.

    దీనిని...
    ’ప్రారంభించిరి! వారే
    భారతదేశాధిపతి, యొబామాయె సుమీ!!’ యని సవరించిన సరిపోఁగలదు.

    అన్యథాభావింపవలదు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  26. సాహితీ మిత్రులు MURTHY YSANగారూ,

    మీ మొదటి పూరణ పద్యమందు...
    ’....స్నేహారం/భా రత దేశాధిపతి....’ యను ప్రయోగమందు...స్నేహ+ఆరంభ...యని హ్రస్వాంతముగనే రావలసియున్నది...కాని దీర్ఘాంతమైనది...అప్పుడు..ఆరత...యను నర్థాంతరము స్ఫురించుచున్నది...(స్నేహము ప్రారంభించుట ఎంతవరకు నెరవేరునో అంతవరకు నిష్టముగలవాఁడు..అని లౌక్యముగ నర్థము చెప్పుకొన్నను నిది యెంతవరకు సరిపోవునో) పరిశీలింపుడు. సవరింపఁగలిగినచో బాగుగనుండఁగలదు.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  27. ఆరయ మోడీ యే మన
    భారత దేశాధిపతి" ఒబామా "యె సుమీ
    గౌరవ ప్రదమగు రీతిని
    భారత నాయకుని జూచె బంధువు వోలెన్

    రిప్లయితొలగించండి
  28. మిత్రులు డా. బల్లూరి ఉమాదేవిగారూ,

    నేను సమీక్షించి, సవరణము సూచించిన రెండవపాదమున నొక దోషము గలరు.

    ఈ పాదము హ్రస్వారంభముగనున్నది. కావున...

    "ధీరులు నొకచోట చేరి స్థిరముగఁ జర్చల్” అనిన సరిపోవును.

    అటులే...మీరు సమస్యా పాదమును మార్చివ్రాసితిరి.

    "భారతదేశాధినేత ఒబమాయెసుమీ!"యనినారు. దేశాధిపతిని..దేశాధినేతయనినచో గణభంగమగుచున్నది గదా.

    సమస్యా పాదమును నెట్టి పరిస్థితిలోను మార్చరాదని గమనించఁగలరు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  29. కె యస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
    తీరిచె నీదగు కోరిిక
    భారతదేశాధిపతి! 'ఒబామాయె'సుమీ!
    సౌౌరస్య స్నేహితమున
    కూరిచె యిరుదేశములకు కుశలము కలుగన్



    రిప్లయితొలగించండి
  30. ఎరాతెలియదరామూ
    భారతదేశాధి పతి-ఒబామాయె|సుమీ
    కారణ జన్మడు మోడీ
    ప్రేరణచే గెలువలేద?వినుమనె సోమే|
    [హాస్య సంభాషణ తెలియనితనము]

    రిప్లయితొలగించండి
  31. కూరిమి గోరుట కొరకై
    తీరుగ మిత్రు లను జేయు దేవుడు ఎవరో ?
    మారుగ మిత్రుడె వండన?
    భారత దేశాధిపతి ,"ఒబామా "యె సుమీ .
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి

  32. గురువు గారికి పాదాభి వందనములు
    సమస్య లో యె హ్రస్వము వాడవచ్చా

    రిప్లయితొలగించండి
  33. మధుసూధన్ గారి సూచనలకు ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  34. పేరు వహించిన నేతలు
    ధారుణి లో నెవరు గలరు ? దారిద్ర్యముతో
    పోరాడియు గెలిచిన మన
    భారత రాష్ట్రాధిపతి, ' ఒబామా' యె సుమీ .

    రిప్లయితొలగించండి
  35. పేరు వహించిన నేతలు
    ధారుణి లో నెవరు గలరు ? దారిద్ర్యముతో
    పోరాడిగెల్చిన కలామ్
    భారత రాష్ట్రాధిపతి, ' ఒబామా' యె సుమీ .

    రిప్లయితొలగించండి
  36. శ్రీ కామేశ్వర శర్మ గారికి ధన్యవాదములు..

    రిప్లయితొలగించండి
  37. మిత్రులు మధుసూదన్ గారికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  38. దూరక నొండొరులు ప్రగతి
    దారులు వెదకుచు నొనర్చి తమపర్యటనల్
    కూరిమితో గడిపినది
    భారత దేశాధిపతి, ఒబామాయే సుమీ!

    రిప్లయితొలగించండి