ఆండ్రాయిడ్ ఫోన్లను
ఉపయోగిస్తున్న మిత్రులకు...
ఇప్పుడు ‘శంకరాభరణం’ బ్లాగు ఆండ్రాయిడ్
ఆప్‌గా అందుబాటులోకి వచ్చింది.
మీరు ఈ ఆప్‌ను మీ ఫోన్లోకి
దిగుమతి చేసికొనడానికి క్రింది విధంగా చేయండి...
1) ముందుగా మీ ఫోన్లోని బ్రౌజర్లో శంకరాభరణం బ్లాగును తెరవండి.
2) బ్లాగుకు పూర్తిగా క్రింద Home (హోమ్) క్రింద ‘View web version' (వెబ్ సంస్కరణలను చూడండి) అన్నదాన్ని క్లిక్ చేయండి.
3) బ్లాగు కంప్యూటర్ తెర మీద కనిపించే విధంగా తెరుచుకుంటుంది. కుడివైపు
ఉన్న ‘లింకులు...’ క్రింద ‘ఆండ్రాయిడ్ App గా శంకరాభరణం’ అన్నదానిని క్లిక్ చేయండి.
4) గూగుల్ డ్రైవ్ తెరుచుకుంటుంది. అందులో ఉన్న ‘Download' అన్నదానికి క్లిక్ చేయండి.
5) డౌన్లోడ్ అయ్యాక ‘Install'
అన్నదానిని క్లిక్ చేయండి.
అంతే మీ ఫోన్లో శంకరాభరణం
ఆప్ ఇన్స్టాల్ అవుతుంది. ఇక నేరుగా దానిని క్లిక్ చేసి బ్లాగులో ప్రవేశించవచ్చు.
(నాకు అంతగా సాంకేతిక పరిజ్ఞానం లేదు. పై వివరణ సరిగా ఉందో లేదో? మిత్రు లెవరైనా సశాస్త్రీయంగా ఆ క్రమాన్ని వివరిస్తే సవరిస్తాను)
( ఈ ఆప్ రూపకల్పనకు సహకరించిన మా మేనల్లుళ్ళు చి. మిట్టపెల్లి ప్రశాంత్, ప్రవీణ్ లకు ధన్యవాదాలు, ఆశీస్సులు!)