30, సెప్టెంబర్ 2015, బుధవారం

సమస్యాపూరణం - 1803 (తారల గణనమ్ము సులభతరమౌఁ జూడన్)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
తారల గణనమ్ము సులభతరమౌఁ జూడన్.

పద్య రచన - 1020

కవిమిత్రులారా,
“ఇనుము సూదంటురాయికై యెగయునట్లు....”
ఇది పద్య ప్రారంభం.
దీనిని కొనసాగిస్తూ పద్యరచన చేయండి.

29, సెప్టెంబర్ 2015, మంగళవారం

సమస్యాపూరణం - 1802 (ఘటమున నేనుఁగుల గుంపు గలదు ముకుందా)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ఘటమున నేనుఁగుల గుంపు గలదు ముకుందా!

పద్య రచన - 1019

కవిమిత్రులారా,
“చనుఁబాలు ద్రాగు బిడ్డఁడు...”
ఇది పద్య ప్రారంభం.
దీనిని కొనసాగిస్తూ పద్యరచన చేయండి.

28, సెప్టెంబర్ 2015, సోమవారం

ఆహ్వానము


అష్టావధానము

అవధాని
శ్రీమతి యం.కె. ప్రభావతి గారు

సమన్వయకర్త
శ్రీ సి.హెచ్. ప్రభాకర్ గారు

పృచ్ఛకులు
1.   నిషిద్ధాక్షరి డా. డి.వి. శ్రీనివాసాచార్యులు గారు
2.   అప్రస్తుత ప్రసంగము శ్రీ గౌతురాజు హనుమంతరావు గారు
3.   దత్తపది శ్రీ గొడవర్తి నరసింహాచార్యులు గారు
4.   పురాణ పఠనము శ్రీమతి కె. లలితా పరమేశ్వరి గారు
5.   సమస్య శ్రీ యం. సాంబశివరావు గారు
6.   వర్ణన శ్రీమతి యన్. సత్యభామ గారు
7.   న్యస్తాక్షరి శ్రీమతి టి. సంపూర్ణ గారు
8.   నామావళి శ్రీమతి పి. జ్యోతి గారు

తేది. 3-10-2015
సమయము. సా. 4 గం. నుండి 6 గం. వరకు.

వేదిక
వీరమాచనేని పడగయ్య ఉన్నత పాఠశాల,
సీతాఫల్ మండి ఫ్లై ఓవర్ దగ్గర,
సికింద్రాబాదు.


సాహితీప్రియు లందరికి ఆహ్వానము

దత్తపది - 82 (ఈగ-దోమ-పేను-నల్లి)

కవిమిత్రులారా,
ఈగ - దోమ - పేను - నల్లి
పై పదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.

పద్య రచన - 1018

కవిమిత్రులారా,
“కవివర! నీ కవిత్వమునఁ గాంతుము...”
ఇది పద్య ప్రారంభం.
దీనిని కొనసాగిస్తూ పద్యరచన చేయండి.

27, సెప్టెంబర్ 2015, ఆదివారం

సమస్యాపూరణం - 1801 (వినాయకుని సాగనంప విచ్చేసె రహీమ్)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వినాయకుని సాగనంప విచ్చేసె రహీమ్.

పద్య రచన - 1017

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

26, సెప్టెంబర్ 2015, శనివారం

సమస్యాపూరణం - 1800 (పదునెనిమిది పదునెనిమిది పదునెనిమిదియే)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పదునెనిమిది పదునెనిమిది పదునెనిమిదియే.
హమ్మయ్య! సమస్యల సంఖ్య 1800 వందలకు చేరింది. సంతోషం!
మరొక విశేషం... పేజీ వీక్షణల సంఖ్య పది లక్షలు ఎప్పుడు దాటిందో నేను గమనించనే లేదు!

పద్య రచన - 1016

కవిమిత్రులారా,
“ఎక్కడ కేగువాఁడ నిపు డెవ్వని వేడుదు...”
ఇది పద్య ప్రారంభం.
దీనిని కొనసాగిస్తూ పద్యరచన చేయండి.

25, సెప్టెంబర్ 2015, శుక్రవారం

కవిమిత్రుని కానుక

iBalliBall Slide 3G 1026-Q18 tablet with 10.10-inch 600x1024 display powered by 1.3GHz processor alongside 1GB RAM and 5-megapixel rear camera.

          పదిరోజుల క్రితం ఒక కవిమిత్రుడు నాకు ఫోన్ చేసి “గురువు గారూ! ఈమధ్య మీరు తరచూ ప్రయాణాలలో ఉండి మా పద్యాలను వెంట వెంట సమీక్షించలేకపోతున్నారు కదా! నేను మీకొక 9 అంగుళాల టాబ్‍లెట్ పంపిస్తున్నాను. దానితో మీరు ఎక్కడున్నా బ్లాగును చూడవచ్చు. మా పద్యాలను సమీక్షించవచ్చు” అన్నారు. నా అభ్యంతరాలన్నిటినీ పక్కకు పెట్టి “ఇది నే నొక్కడినే చేయటం లేదు. పద్యాలను వ్రాయకున్నా మన బ్లాగును తప్పకుండా చూసే మరో ఇద్దరు నా స్నేహితులు కూడా కలిసారు. మీరు కాదనకండి” అనికూడా చెప్పారు. 
        ఐదు రోజుల క్రితం ఆ మిత్రుడు మళ్ళీ ఫోన్ చేసి “గురువు గారూ! ట్యాబ్‍లెట్ పంపడం లేదు. నేను హైదరాబాదు వస్తున్నాను. మీరు అక్కడ నన్ను కలిస్తే మీకు నచ్చిన ట్యాబ్‍లెట్ తీసుకోవచ్చు” అన్నారు. 
      వారు మొన్న మంగళవారం నాడు నన్ను సికింద్రాబాద్ చెన్నై (షినాయ్?) ట్రేడింగ్ సెంటర్ దగ్గరికి రమ్మన్నారు. నాకు టాబ్‍లెట్ల గురించి తెలియదు కనుక నా వెంట నా మనుమణ్ణి తీసుకువెళ్ళాను. వాడు టాబ్‍లెట్లను పరిశీలించి చివరికి ‘ibaal slide' తీసుకొమ్మన్నాడు. అది 10.1 అంగుళాల నిడివి ఉండి, ఉత్తమ సాంకేతిక సౌకర్యాలున్నది. కవిమిత్రుడు అనుకున్నది పదివేలు, కాని అది పదకొండు వేలు.  ఐనా మొత్తం తానే చెల్లించి ఆ టాబ్లెట్‍ను నాకు కొనిచ్చారు.
              తన గురించి కాని, తాను టాబ్లెట్ కొనిచ్చిన విషయం కాని బ్లాగులో ప్రస్తావించవద్దని కోరారు. అందుకే రెండు రోజులు ఆగాను. కాని నా మనస్సాక్షి ఒప్పుకోలేదు. అందుకే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. 
      ఆ కవిమిత్రునకు, వారి స్నేహితులకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, భగవంతుడు వారికి సుఖసంతోషాలను, శుభసంపదలను, ఆయురారోగ్యాలను, సర్వతోముఖాభివృద్ధిని ప్రసాదించాలని  కోరుకుంటున్నాను. స్వస్తి!

సమస్యాపూరణం - 1799 (నలుగురితోఁ దిరుగు పడఁతి నా యిల్లాలే)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
నలుగురితోఁ దిరుగు పడఁతి నా యిల్లాలే.

పద్య రచన - 1015

కవిమిత్రులారా,
“తమ్ముఁడా యి ట్లొనర్చుట ధర్మ మగునె...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యాన్ని పూర్తి చేయండి.

24, సెప్టెంబర్ 2015, గురువారం

సమస్యాపూరణం - 1798

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అన్నదానమ్ము సేయువా రధము లిలను.

నిన్న రాత్రినుండి మూత్రనాళంలోని రాయివల్ల విపరీతమైన నొప్పి. సాధారణంగా ఇంజక్షన్ తీసుకుంటే తగ్గిపోయేది.ఈసారి ఎందుకో తగ్గడం లేదు. చూడాలి... రేపటికి ఎలా ఉంటుందో?
స్వస్థత చేకూరే వరకు 'పద్యరచన' శీర్షిక ఉండదని గమనించ మనవి.

23, సెప్టెంబర్ 2015, బుధవారం

సమస్యాపూరణం - 1797 (కోడలా నా పతియె నీకు కొడుకు గాదె.

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.....
కోడలా నా పతియె నీకు కొడుకు గాదె.
(ప్రయాణంలో ఉండి పద్యరచన శీర్షిక ఇవ్వడం లేదు. మన్నించండి)

22, సెప్టెంబర్ 2015, మంగళవారం

సమస్యా పూరణం - 1796 (రతిపతి మన్మథుఁడు గాఁడు బ్రహ్మయె తలఁపన్)

కవి మిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రతిపతి మన్మథుఁడు గాఁడు బ్రహ్మయె తలఁపన్.
(‘కవిజనోజ్జీవని’ గ్రంథంనుండి)

పద్య రచన - 1014

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

21, సెప్టెంబర్ 2015, సోమవారం

సమస్యా పూరణం - 1795 (రాములందు గొప్ప రాముఁ డతఁడు)

కవి మిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రాములందు గొప్ప రాముఁ డతఁడు.
(ఈ సమస్యను పంపిన భూసారపు నర్సయ్య గారికి ధన్యవాదాలు)

పద్య రచన - 1013

కవిమిత్రులారా,
“మనసిజ పుష్పబాణములు మాటికి గ్రుచ్చఁగ...”
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యాన్ని పూర్తి చేయండి.

20, సెప్టెంబర్ 2015, ఆదివారం

సమస్యా పూరణం - 1794 (ఆడువారు బొంకు లాడువారు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
ఆడువారు బొంకు లాడువారు.

పద్య రచన - 1012

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
(గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలతో...)

19, సెప్టెంబర్ 2015, శనివారం

సమస్యా పూరణం - 1793 (వాసుదేవునిఁ గంసుఁడు పట్టి చంపె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
వాసుదేవునిఁ గంసుఁడు పట్టి చంపె.

పద్య రచన - 1011

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

18, సెప్టెంబర్ 2015, శుక్రవారం

సమస్యా పూరణం - 1792 (భక్షించెను గోవుఁ జంపి పాప మెటు లగున్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
భక్షించెను గోవుఁ జంపి పాప మెటు లగున్.

పద్య రచన - 1010

కవిమిత్రులారా,
“కురునృప! పాండునందను లకుంఠిత.....”
ఇది పోతన భాగవతంలోని (3-98) పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యాన్ని పూర్తి చేయండి.

17, సెప్టెంబర్ 2015, గురువారం

గణేశ స్తుతి

గణేశ స్తుతి

స్వాగత వృత్తము….
శ్రీ గణేశ! ఘన చిత్సుఖ దాతా!
శ్రీ గిరీశ సుత! శ్రేష్ఠ! వరిష్ఠా!
యోగి రాడ్వరద! యోగ విశేషా!
స్వాగత ప్రమథ వర్గ! నమో ఽహమ్! (1)

ప్రమాణి వృత్తము….
గజాననా! ఘనాకృతీ!
ప్రజావళి ప్రమోద! స
ద్ద్విజ స్తుత! స్థిరా! చతు
ర్భుజా! నమో ఽస్తు తే ఽనిశమ్! (2)

ప్రణవ వృత్తము….
హేరంబా! మిత హిత సంతోషా!
గౌరీ నందన! కరి మూర్ధన్యా!
సూరి ప్రాకట శుభ సంశ్లోకా!
భూరి క్షత్ర! విముఖ! వందే ఽహమ్! (3)

శాలినీ వృత్తము….
సారాచారా! నీత సత్పుణ్య దాతా!
పారాశర్యామోద బాష్పోత్సుకా!
క్రౌంచారి భ్రాతా! భూరి సమ్మోద పాత్రా!
ధీర స్తుత్యా! హే ద్విదేహ ప్రభాసా! (4)

వంశస్థము….
నమో నమో విఘ్న వినాశకాయ తే!
నమో విచిత్రాయ! వినాయకాయ తే!
నమః పవిత్రాంచిత నామకాయ తే!
నమో సదాదాన! ఘనాయ తే నమః! (5)

వన మయూరము….
హేరుక! భవాత్మజ! మహేంద్ర నుతగాత్రా!
ధీర! సుముఖ! ప్రముఖ! దివ్య దరహాసా!
ఘోరతర సంసృతి వికూప తరణాప్తా!
చారు రుచి దంత కులిశ ప్రహరణాఢ్యా! (6)

స్రగ్విణీ వృత్తము….
పార్వతీ నందనా! భారతోల్లేఖనా!
సర్వ గర్వాపహా! ఛాత్ర విద్యోదయా!
ఖర్వ విఘ్నోన్నతా! కార్య సిద్ధిప్రదా!
శర్వ పుత్రాగ్రజా! శాంత మూర్తీ! నమః! (7)

ఇంద్ర వంశము….
జీవేశ! సర్వోత్తమ! చేతన ప్రదా!
దేవస్తుతా! శాంకరి! ధీవిశేష! ది
వ్యా! విశ్వ సంపూజిత! వక్రతుండ! ఢుం
ఠీ! వేద వేద్యా! ఘన తేజ! తే నమః! (8)

భుజంగ ప్రయాతము….
ద్విపాస్య! త్రిధామ! త్రిధాతు! ప్రసిద్ధా!
సుపర్వ ప్రమోదా! శుభాంగా! వృషాంకా!
కపిత్థాత్త సంపృక్త భుక్త ప్రహృష్టా!
కృపాంభోధి! కుబ్జాకృ తీశా! నమస్తే! (9)

శుభం భూయాత్…..

గుండు మధుసూదన్

(‘మధురకవనంబ్లాగునుండి ధన్యవాదాలతో...)

వినాయక స్తుతి

ఓం గణేశ్వరాయ నమః

 శ్రీ విఘ్నేశ్వరు నేకదంతు సుముఖున్ చిన్మూర్తి లంబోదరున్,
దేవారాధ్యు! మునీంద్ర వంద్యుని ! మహాదేవీ ముఖాబ్జార్కునిన్
భావాతీతు దురంత షడ్రిపు హరున్ పాశాంకుశాంచత్కరున్
ధీ వాగ్ధార లనుగ్రహించి సతమున్ దీవించ ప్రార్థించెదన్.

శ్రీదు! సుఖ ప్రసాదు! వర సిద్ధివినాయకు! విఘ్న వారణున్
మోదక హస్తు! దంతిముఖు! మూషక వాహను! నేకదంతు లం
బోదర పాద పద్మములు ముక్తి వధూటికి తావలంబు లం
చాదర మొప్ప గొల్చెద ననంత శుభంబులు గల్గ నియ్యెడన్.

శ్రీకర మాద్య మార్యజన సేవ్యము దివ్య మనంత మచ్యుతం
బేక మహీన మద్భుత మనేకమునై దగు త్వ త్స్వరూపమున్
జేకొని యెల్ల వేళలను చిత్తమునన్ దలపోసి మ్రొక్కు సు
శ్లోకుల బ్రోతు వవ్విధిని జూపుము నీ కృప విఘ్నవారణా!

కరిరాజ వదను! గౌరీ
వరముఖ పద్మార్కు! నాఖు వాహను! లంబో
దరు! విఘ్నవారణున్ శ్రీ
కరు గణపతి భక్తి గొల్తు కైమోడ్పులతో.

విఘ్న తమస్సహస్రకర! విఘ్న మహావనహవ్య వాహనా!
విఘ్న భుజంగ విష్ణురథ! విఘ్న మహోదధి కుంభసంభవా!
విఘ్న మహా గిరీంద్ర పవి! విఘ్న మదేభ మృగేంద్ర! శ్రీ ముఖా!
విఘ్న పయోద మారుత! అభీష్టము దీర్చుమ విఘ్న వారణా!

వినాయక చవితి శుభాకాంక్షలతో….


మద్దూరి రామమూర్తి. పూణె.

సమస్యా పూరణం - 1791 (ఏకదంతుని వాహన మెలుక కాదు)

వినాయక చవితి శుభాకాంక్షలు!
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
ఏకదంతుని వాహన మెలుక కాదు.

పద్య రచన - 1010

వినాయక చవితి శుభాకాంక్షలు!
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16, సెప్టెంబర్ 2015, బుధవారం

సమస్యా పూరణం - 1790 (కొఱవితోడను దల గోకికొనుట మేలు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
కొఱవితోడను దల గోకికొనుట మేలు.

పద్య రచన - 1009

కవిమిత్రులారా,
“వలదు వలదన్న వినక యీ పను లొనర్చి.....”
ఇది తేటగీతి మొదటిపాదం. 
దీనిని కొనసాగిస్తూ మీకు తోచిన అంశంపై పద్యాన్ని పూర్తి చేయండి.

15, సెప్టెంబర్ 2015, మంగళవారం

సమస్యా పూరణం - 1789 (శిశుపాలునిఁ జంపినట్టి శివునకు జేజే)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
శిశుపాలునిఁ జంపినట్టి శివునకు జేజే.

పద్య రచన - 1008

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14, సెప్టెంబర్ 2015, సోమవారం

సమస్యా పూరణం - 1788 (రామకథ విని మురిసెను రాక్షసుండు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
రామకథ విని మురిసెను రాక్షసుండు.

13, సెప్టెంబర్ 2015, ఆదివారం

సమస్యాపూరణ - 1787 (భీముఁ డతిభీకరమ్ముగ భీముఁ జంపె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
భీముఁ డతిభీకరమ్ముగ భీముఁ జంపె.
ఈ సమస్యను సూచించిన భూసారపు నర్సయ్య గారికి ధన్యవాదాలు.

పద్య రచన - 1007

కవిమిత్రులారా,
“వర మయ్యొ శాప మయ్యెను.....”
ఇది కందపద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ మీకు తోచిన అంశంపై పద్యాన్ని పూర్తి చేయండి.

12, సెప్టెంబర్ 2015, శనివారం

సమస్యాపూరణ - 1786 (ధర్మమార్గముఁ దప్పఁడు దానవుండు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
ధర్మమార్గముఁ దప్పఁడు దానవుండు.

పద్య రచన - 1006

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

11, సెప్టెంబర్ 2015, శుక్రవారం

సమస్యాపూరణ - 1785 (అనుభవ మ్మనరానిది యనుభవమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
అనుభవ మ్మనరానిది యనుభవమ్ము.
ఈ సమస్యను పంపిన భూసారపు నర్సయ్య గారికి ధన్యవాదాలు. 

పద్య రచన - 1005

కవిమిత్రులారా,
“ఎందుల కిన్ని బాధల సహింతువు.....”
ఇది పద్యప్రారంభం. దీనిని కొనసాగిస్తూ మీకు తోచిన అంశంపై పద్యాన్ని పూర్తి చేయండి. 

10, సెప్టెంబర్ 2015, గురువారం

సమస్యాపూరణ - 1784 (రామునకె చెందు నెల్లప్డు రాధ వలపు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
రామునకె చెందు నెల్లప్డు రాధ వలపు.

పద్య రచన - 1004 (గాలిమేడలు)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశం....
“గాలిమేడలు”

9, సెప్టెంబర్ 2015, బుధవారం

సమస్యాపూరణ - 1783 (కాంతా రమ్మనెను మోక్షకాముకుఁడు తమిన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
కాంతా రమ్మనెను మోక్షకాముకుఁడు తమిన్.
(ఈరోజు వేములవాడ, రేపు ధర్మపురి క్షేత్రాలకు వెళ్తున్నాను. ఈ రెండు రోజులు నేను బ్లాగుకు అందుబాటులో ఉండకపోవచ్చు. మిత్రులు దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.)

పద్య రచన - 1003

కవిమిత్రులారా,

పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

8, సెప్టెంబర్ 2015, మంగళవారం

సమస్యాపూరణ - 1782 (దేవుఁడే లేఁ డనెడువాఁడు దేవుఁ డయ్యె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
దేవుఁడే లేఁ డనెడువాఁడు దేవుఁ డయ్యె.

పద్య రచన - 1002 (విద్యాధనం సర్వధనప్రధానమ్)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశం...
‘విద్యాధనం సర్వధనప్రధానమ్’

7, సెప్టెంబర్ 2015, సోమవారం

సమస్యాపూరణ - 1781 (ఏనుఁగు చిట్టెలుకఁ గాంచి యెంతొ భయపడెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
ఏనుఁగు చిట్టెలుకఁ గాంచి యెంతొ భయపడెన్.
(‘తెలుగు వెలుగు’ పత్రిక సౌజన్యంతో)

పద్య రచన - 1001

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

6, సెప్టెంబర్ 2015, ఆదివారం

సమస్యాపూరణ - 1780 (పాపకర్ములు దుష్టులు భాగవతులు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
పాపకర్ములు దుష్టులు భాగవతులు. 

పద్య రచన - 1000

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

5, సెప్టెంబర్ 2015, శనివారం

సమస్యాపూరణ - 1779 (అధ్యాపకుఁ డనఁగ నెవ్వఁ డజ్ఞాని గదా)

కవిమిత్రులారా,
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
అధ్యాపకుఁ డనఁగ నెవ్వఁ డజ్ఞాని గదా.

పద్య రచన - 999

కవిమిత్రులారా,
శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు!
“కృష్ణం వందే జగద్గురుమ్”

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

న్యస్తాక్షరి - 33 (య-తి-ప్రా-స)

అంశము- ఛందోబద్ధ కవిత్వము
ఛందస్సు- తేటగీతి.
నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా 
‘య - తి - ప్రా - స’ ఉండాలి.

పద్య రచన - 998

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

3, సెప్టెంబర్ 2015, గురువారం

సమస్యాపూరణ - 1778 (చట్రాతిని నారఁ దీయఁ జయ్యన వచ్చున్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
చట్రాతిని నారఁ దీయఁ జయ్యన వచ్చున్.
(వావిళ్ళ వారి ‘తెలుఁగు సమస్యలు’ గ్రంథంనుండి)

పద్య రచన - 997

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

సమస్యాపూరణ - 1777 (రోగము లొసంగు జనులకు భోగములను)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
రోగము లొసంగు జనులకు భోగములను.
(ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు)

పద్య రచన - 996

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

1, సెప్టెంబర్ 2015, మంగళవారం

సమస్యాపూరణ - 1776 (కష్టం బవధానవిద్య కా దనిరి కవుల్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
కష్టం బవధానవిద్య కా దనిరి కవుల్.
(ఈ సమస్యను పంపిన భాగవతుల కృష్ణారావు గారికి ధన్యవాదాలు)