మా నాన్నగారు ఈ తెల్లవారుజామున మరణించారు.
30, నవంబర్ 2015, సోమవారం
సమస్య - 1870 (మావిచిగురుఁ దినెను....)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
మావిచిగురుఁ దినెను మధుకరమ్ము
(మా నాన్నగారి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తున్నది. దినదినగండంగా గడుస్తున్నది. రోజంతా హాస్పిటల్ లోనే ఉంటున్నాను. అందువల్ల మీ పూరణలను, పద్యాలను నిశితంగా పరిశీలించలేకపోతున్నాను)
(మా నాన్నగారి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తున్నది. దినదినగండంగా గడుస్తున్నది. రోజంతా హాస్పిటల్ లోనే ఉంటున్నాను. అందువల్ల మీ పూరణలను, పద్యాలను నిశితంగా పరిశీలించలేకపోతున్నాను)
పద్యరచన - 1079
కవిమిత్రులారా,
“జననీ జనకుల పదములు...”
ఇది పద్యప్రారంభం.
దీనికి కొనసాగిస్తూ పద్యాన్ని పూర్తి చేయండి.
29, నవంబర్ 2015, ఆదివారం
సమస్య - 1869 (విస్కీ బ్రాండీల వలన...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
విస్కీ బ్రాండీల వలన విజ్ఞత హెచ్చున్.
పద్యరచన - 1078
కవిమిత్రులారా,
“హృత్పద్మము వికసించును...”
ఇది పద్యప్రారంభం.
దీనికి కొనసాగిస్తూ పద్యాన్ని పూర్తి చేయండి.
28, నవంబర్ 2015, శనివారం
చమత్కార పద్యాలు - 214
డా. గరికిపాటి వారి అవధానంలో
వర్ణనాశం “అవధానాలు - స్త్రీలు”
సంసారంలో భార్యాభర్త లిద్దరూ సమస్యల, కష్టాల రూపంలో అనేక పరీక్షల నెదుర్కొంటున్నప్పటికినీ, పురుషుడి కంటె స్త్రీయే ఎక్కువ ఓర్పును, నేర్పునూ ప్రదర్శించి అనుభవిస్తూ ఉంటుంది. అసలు ఈ ఆధునిక జీవితంలో సాధారణ గృహిణియే అష్ట కష్టావధానం చేస్తుంటుంది. ఆ సందర్భాన్ని మహాసహస్రావధాని డా. గరికపాటి నరసింహారావు గారు ఎలా వర్ణించారో చూడండి.
సీ.
అడు గడుగున నిషేధాజ్ఞ జారీచేయ
..........మగడు నిషిధ్ధాక్షరిగను దోప
గుప్పిళ్ళు నిండని గ్రుడ్డి గవ్వలతోడ
..........మాసమ్ము గడుప సమస్య కాగ
అది సర్దు మిది సర్దు మని చంపు కాన్వెంటు
..........దత్తుండు దత్త పదంబు కాగ
ముద్దు లొల్కెడి చంటి బుజ్జాయి పాపాయి
..........వర్ణనీయాంశమై వరలు చుండ
పాలు కూరలు పండ్ల బండ్ల వారల రాక
..........యాశుధారా కవిత్వార్ధ మనఁగ
అత్తయ్య వేసెడి యక్షింత లవియన్ని
..........పాత పురాణంపు పఠన మనఁగ
పోనీని రానీని ఫోను మ్రోతల రోత
..........ఘంటికా గణనమ్ము కరణి దోఁప
బోరు గొట్టించెడి ధారవాహిక సుత్తి
..........యధిక ప్రసంగమై యడ్డుపడఁగ
తే.గీ.
దినము దిన మిట్లు వనితలు తిప్పలుపడి
పూటపూటకు నవధాన పూర్ణసిధ్ధి
తనరుచుండఁగ పురుషావధానులేల?
వర సహస్రావధానులీ పడతు లెల్ల!
(ఫేసుబుక్కునుండి ధన్యవాదాలతో....)
సమస్య - 1868 (సోనియాగాంధి మోడీకి...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
సోనియాగాంధి మోడీకి చుట్ట మగును.
పద్యరచన - 1077
కవిమిత్రులారా,
“ఇడుములు వచ్చును పోవును...”
ఇది పద్యప్రారంభం.
దీనికి కొనసాగిస్తూ పద్యాన్ని పూర్తి చేయండి.
27, నవంబర్ 2015, శుక్రవారం
సమస్య - 1867 (పెద్దవాఁడు దగఁడు...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పెద్దవాఁడు దగఁడు వృద్ధుఁ డనఁగ.
పద్యరచన - 1076
కవిమిత్రులారా,
“కలిమి వివేకశీలురకుఁ గల్గఁగఁ జేయు...”
ఇది పద్యప్రారంభం.
దీనికి కొనసాగిస్తూ పద్యాన్ని పూర్తి చేయండి.
26, నవంబర్ 2015, గురువారం
సమస్య - 1866 (గంగాసుతుఁ డాలమున...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
గంగాసుతుఁ డాలమున శిఖండినిఁ జంపెన్.
పద్యరచన - 1075
కవిమిత్రులారా,
“ఋణానుబంధరూపేణ పశుపత్నీసుతాదయః”
పై భావాన్ని వివరిస్తూ మీకు నచ్చిన ఛందస్సులో పద్యం వ్రాయండి.
25, నవంబర్ 2015, బుధవారం
బ్లాగు మిత్రులు చంద్రమౌళి సూర్యనారాయణ గారికి పుత్రవియోగం
సూర్యనారాయణ గారు తమ ఏకైక కుమారుడు ‘పవన్’ ఏదో వ్యాధితో బాధపడుతున్నాడని చెప్పారు. అతడు అల్పాయుష్కుడన్న విషయం వారికి తెలుసు. మనసులో గూడుకట్టుకున్న విషాదంతో ఇంతకాలం ఎంత క్షోభను అనుభవించారో? గతమాసం ఆ అబ్బాయి జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు కూడా. ఆ సందర్భంగా ఆ తండ్రి కుమారునికి ధైర్యం చెప్తూ వ్రాసిన పద్యం ఇది...
అన్నెము పున్నెమ్మెరుగని
నిన్నీ రోగమ్ము కదలనివ్వదు సుతుడా
నాన్నను నేనున్నానుర
కన్నా! నీకెప్పుడేమి కావలెనన్నన్.
ఇంతలోనే ఈ దుర్వార్త వినవలసి వచ్చింది. వారికి, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. భగవంతుడు పవన్ ఆత్మకు శాంతి చేకూర్చుగాక!
సమస్య - 1865 (కఠినచిత్తులు గద...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కఠినచిత్తులు గద కన్నవారు.
24, నవంబర్ 2015, మంగళవారం
సమస్య - 1864 (సిరియు వాణియు నొక్కచో...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
సిరియు వాణియు నొక్కచోఁ జేర రెపుడు.
ఈ సమస్యను పంపిన భాగవతుల కౄష్ణారావు గారికి ధన్యవాదాలు.
(నాన్నగారి ఆరోగ్యం విషమంగా ఉండడంతో మిత్రుల పూరణలను సమీక్షించలేను. మన్నించండి.)
పద్యరచన - 1073
కవిమిత్రులారా,
"కందిపప్పు చారు కటువయ్యెరా రామ ...'
ఇది పద్యంలో మొదటి పాదం.
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.
23, నవంబర్ 2015, సోమవారం
సమస్య - 1863 (మూడును మూడును గలసిన...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మూడును మూడును గలసిన ముప్పదియేడౌ.
పద్యరచన - 1072
కవిమిత్రులారా,
"రాక రాక వచ్చితివి శ్రీరామచంద్ర...'
ఇది పద్యంలో మొదటి పాదం.
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.
22, నవంబర్ 2015, ఆదివారం
“గయా యాత్ర” తెలుగు అనువాదం
కాశీయాత్రలో భాగంగా గయాక్షేత్రానికి వెళ్ళాం. అక్కడ విష్ణుపాద దేవాలయం, మంగళగౌరీ మందిరం, కామాఖ్య గుడి, గదాధరుని దేవాలయం తదితర దర్శనీయ స్థలాలను చూసి ఆ నగరంలో ఉన్న ‘గీతా ప్రెస్’ వారి పుస్తకాల దుకాణానికి వెళ్ళాం. అందులో కొన్ని హిందీ, కొన్ని తెలుగు పుస్తకాలు కొన్నాను. ఆ షాపువాడికి నన్ను చూస్తే ఏమనిపించిందో ఏమో “మీరు హిందీలో ఉన్న పుస్తకాన్ని తెలుగులో వ్రాస్తారా?” అని అడిగాడు. నేను వ్రాస్తా నన్నాను. అతడు ‘గయాయాత్ర’ అనే హిందీ పుస్తకాన్ని ఇచ్చి “ఇక్కడికి తెలుగు యాత్రికులు ఎక్కువగా వస్తున్నారు. గయకు సంబంధించిన తెలుగు పుస్తకం కోసం అడుగుతున్నారు. మీరీ పుస్తకాన్ని తెలుగులో అనువదించి, టైప్ చేయించి సి.డి.లో మాకు పంపండి. ఎంత డబ్బు ఇవ్వాలో తెలియజేస్తే మీకు ఆ డబ్బు పంపిస్తాను” అన్నాడు. నేను అది దైవసంకల్పంగా భావించి డబ్బు అక్కరలేదని, చేసి పంపిస్తానని అన్నాను. ఇల్లు చేరాక ముందుగా ఆ పుస్తకాన్ని తెలుగులో అనువదించాను. గయలో వాళ్ళ దగ్గర తెలుగు ఫాంట్స్ లేని కారణంగా ఇక్కడే ఫోటోషాపులో కంపోజ్ చేయించి, దాని సి.డి.ని కొరియర్‌లో గయకు పంపించాను. ఒక పుణ్యకార్యం చేసిన సంతృప్తి మిగిలింది. ఈ అనుభవాన్ని మీతో పంచుకోవాలని బ్లాగులో తెలియజేస్తూ, అందులోని మూడు పుటలను ప్రకటిస్తున్నాను.
సమస్య - 1862 (మదమె ప్రగతికి మార్గమై...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మదమె ప్రగతికి మార్గమై ముదము నొసఁగు.
(మద్దూరి రామమూర్తి గారికి ధన్యవాదాలతో)
పద్యరచన - 1071
కవిమిత్రులారా,
"క్షణ మొక యుగమై తోఁచెను...'
ఇది పద్యంలో మొదటి పాదం.
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.
21, నవంబర్ 2015, శనివారం
సమస్య - 1861 (వారకాంత లెల్లరు...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వారకాంత లెల్లరు పతివ్రతలు సుమ్ము.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వారకాంత లెల్లరు పతివ్రతలు సుమ్ము.
పద్యరచన - 1070
కవిమిత్రులారా,
"వచ్చి పోవుచుంద్రు బంధువుల్ మిత్రులు...'
ఇది పద్యంలో మొదటి పాదం.
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.
"వచ్చి పోవుచుంద్రు బంధువుల్ మిత్రులు...'
ఇది పద్యంలో మొదటి పాదం.
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.
20, నవంబర్ 2015, శుక్రవారం
సమస్య - 1860 (కావ్యమును లిఖించె...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కావ్యమును లిఖించెఁ గత్తితోడ.
పద్యరచన - 1069
కవిమిత్రులారా,
"నమ్మితిని నా మనమున సనాతనులగు...'
ఇది పద్యంలో మొదటి పాదం.
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.
19, నవంబర్ 2015, గురువారం
సమస్య - 1859 (లంగా లేకున్న వలదు)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
లంగా లేకున్న వలదు లక్ష్మీ పూజల్.
ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.
పద్యరచన - 1068
కవిమిత్రులారా,
"పరి పరి విధములఁ జెప్పితి...'
ఇది పద్యంలో మొదటి పాదం.
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.
18, నవంబర్ 2015, బుధవారం
సమస్య - 1858 (మానము పోవలె నటంచు...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మానము పోవలె నటంచు మానిని తలచెన్.
ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.
17, నవంబర్ 2015, మంగళవారం
సమస్య - 1857 (కారమ్మే భూజనులకు...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కారమ్మే భూజనులకుఁ గడు హిత మొసఁగున్.
పద్యరచన - 1066
కవిమిత్రులారా!
“నే నొక పూలమొక్క కడ నిల్చి...”
ఇది కరుణశ్రీ గారి పద్యప్రారంభం.
దీనిని కొనసాగిస్తూ (పుష్పవిలాపాన్ని ప్రస్తావించకుండా) పద్యం వ్రాయండి.
16, నవంబర్ 2015, సోమవారం
సమస్య - 1856 (కాకర చేఁ దన్నమాట...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కాకర చేఁ దన్నమాట కల్లయె సుమ్మీ.
పద్యరచన - 1065
కవిమిత్రులారా!
“ఎవ్వఁడో వచ్చి ని న్నుద్ధరించు ననుచు...”
ఇది పద్యప్రారంభం.
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.
15, నవంబర్ 2015, ఆదివారం
సమస్య - 1855 (జలము ఘనీభవముఁ జెందె...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
జలము ఘనీభవముఁ జెందె జ్వాలలు సోఁకన్.
పద్యరచన - 1064
కవిమిత్రులారా!
“వరవీణా మృదుపాణీ...”
ఇది పద్యప్రారంభం.
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.
14, నవంబర్ 2015, శనివారం
సమస్య - 1854 (నేఁటి బాలలే రేపటి...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
నేఁటి బాలలే రేపటి నేరగాండ్రు.
13, నవంబర్ 2015, శుక్రవారం
సమస్య - 1853 (ముద్దు మగని ప్రాణముల...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ముద్దు మగని ప్రాణముల హరించె.
12, నవంబర్ 2015, గురువారం
సమస్య - 1852 (శివునిఁ జంపె భీమసేనుఁ డలిగి)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
శివునిఁ జంపె భీమసేనుఁ డలిగి.
పద్యరచన - 1062
కవిమిత్రులారా!
“అటఁ జని కాంచెను ప్రవరుఁడు...”
ఇది పద్యప్రారంభం.
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.
11, నవంబర్ 2015, బుధవారం
10, నవంబర్ 2015, మంగళవారం
సమస్య - 1851 (కల్లుపాకలోఁ బురుషసూక్తము...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కల్లుపాకలోఁ బురుషసూక్తముఁ బఠించె.
పద్యరచన - 1060
కవిమిత్రులారా!
“ఒక మంచిమాటె చాలును...”
ఇది పద్యప్రారంభం.
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.
9, నవంబర్ 2015, సోమవారం
సమస్య - 1850 (శవపూజల వలన జన్మ...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
శవపూజల వలన జన్మ సార్థక మగురా.
పద్యరచన - 1059
కవిమిత్రులారా!
“పూమాలల్ గడు భక్తిఁ దెచ్చితిని నీ పూజార్థినై...”
ఇది పద్యప్రారంభం.
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.
8, నవంబర్ 2015, ఆదివారం
సమస్య - 1849 (కష్టము గద కవిత లల్ల...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కష్టము గద కవిత లల్లఁ గందమునందున్.
ఈ సమస్యను పంపిన భాగవతుల కృష్ణారావు గారికి ధన్యవాదాలు.
పద్యరచన - 1058
కవిమిత్రులారా!
“నీతుల్ జెప్పెడివారలు...”
ఇది పద్యప్రారంభం.
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.
7, నవంబర్ 2015, శనివారం
సమస్య - 1848 (భరణమ్మును బొందె వధువు...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
భరణమ్మును బొందె వధువు భాగ్య మటంచున్.
ఈ సమస్యను పంపిన భాగవతుల కృష్ణారావు గారికి ధన్యవాదాలు.
పద్యరచన - 1057
కవిమిత్రులారా!
“కాలుని దున్నపోతు మెడ గంటలు...”
ఇది పద్యప్రారంభం.
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.
6, నవంబర్ 2015, శుక్రవారం
సమస్య - 1847 (ముండా యని పిలువుమనుచు...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ముండా యని పిలువు మనుచు ముదితయె చెప్పెన్.
ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.
పద్యరచన - 1056
కవిమిత్రులారా!
“పద్యముఁ జెప్పఁగావలెను భావము...”
ఇది పద్యప్రారంభం.
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.
5, నవంబర్ 2015, గురువారం
సమస్య - 1846 (రామ యనిన నోరు...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రామ యనిన నోరు ఱాతిరోలు.
ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.
పద్యరచన - 1055
కవిమిత్రులారా!
“వనితయుఁ గవితయు రెండును...”
ఇది పద్యప్రారంభం.
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.
4, నవంబర్ 2015, బుధవారం
సమస్య - 1845 (పిన్నలు పెద్ద లేఁగిరఁట...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పిన్నలు పెద్ద లేఁగిరఁట భీష్ముని పెండ్లికి మోద మందుచున్.
పద్యరచన - 1054
కవిమిత్రులారా!
“చుక్కలు మిలమిల మెరిసెను...”
ఇది పద్యప్రారంభం.
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.
3, నవంబర్ 2015, మంగళవారం
సమస్య - 1844 (అంగదునిఁ జంపె...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అంగదునిఁ జంపె నర్జునుఁ డాహవమున.
పద్యరచన - 1053
కవిమిత్రులారా!
“దైవముపైన భారమిడి ధర్మముఁ దప్పక...”
ఇది పద్యప్రారంభం.
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.
2, నవంబర్ 2015, సోమవారం
సమస్య - 1843 (ధనమే మోక్షమును...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ధనమే మోక్షము గడించు దారినిఁ జూపున్.
పద్యరచన - 1052
కవిమిత్రులారా!
“విసమును మ్రింగినట్లు కడు వేదన...”
ఇది పద్యప్రారంభం.
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.
1, నవంబర్ 2015, ఆదివారం
సమస్య - 1842 (బ్రాహ్మణుండు మాంస....)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
బ్రాహ్మణుండు మాంసభక్షకుండు.
పద్యరచన - 1051
కవిమిత్రులారా!
“భరతభూమి రక్ష బడులు గుడులు...”
ఇది పద్యప్రారంభం.
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.
(రామడుగు రాంబాబు గారికి ధన్యవాదాలతో...)