31, మార్చి 2016, గురువారం

సమస్య – 1989 (దానగుణము మిగుల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
దానగుణము మిగుల హీనగుణము.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు. 

పద్యరచన - 1188

కవిమిత్రులారా,
పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

30, మార్చి 2016, బుధవారం

సమస్య – 1988 (పసిబాలునిఁ బెండ్లియాడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పసిబాలునిఁ బెండ్లియాడెఁ బ్రౌఢ ముదమునన్.

29, మార్చి 2016, మంగళవారం

సమస్య – 1987 (ధర్మజునకుఁ గన్నతల్లి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ధర్మజునకుఁ గన్నతల్లి ద్రౌపది యందున్. 
ఈ సమస్యకు ప్రేరణ నిచ్చిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు. 

28, మార్చి 2016, సోమవారం

సమస్య – 1986 (తాటితోపులోఁ బాలను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
తాటితోపులోఁ బాలను ద్రాగవలెను.

27, మార్చి 2016, ఆదివారం

సమస్య – 1985 (కాంతుని సేవించు నాతి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కాంతుని సేవించు నాతి గయ్యాళి కదా.

26, మార్చి 2016, శనివారం

మధుర గాయకుడు పద్మశ్రీ ఘ౦టసాల



క౦టికి ఘ౦టసాల యిక కన్పడ కున్నను క౦చు క౦ఠ మి౦
టి౦ట సదా ధ్వని౦చి వినిపి౦చును కమ్మని గానస౦పదన్; 
మి౦టికి "పద్మమిత్ర - రజనీకరు" ల౦టుక యున్న మేర కా
వ౦టి సునాదమౌ గళము భావి జని౦పదు నిశ్చయ౦బుగా. 

ప౦చదారను పాలలో ను౦చి నటుల 
పాటలో నీవు లీనమై పాడు చు౦డ
కవి రచి౦చిన కవితకే కా౦తి కలుగు 
గాన గ౦ధర్వ శీల! ఓ ఘ౦టసాల!

పలుకును నీవు పల్కగనె పల్కుల రాణి విప౦చిక స్వరా 
వళి సమమైన స్పష్టతయు, పా౦డవమిత్రుని పా౦చజన్య మ౦
దలి ఘనమౌ పటిష్ఠతయు తావక క౦ఠములో స్ఫురి౦చు నో 
సలలిత గాన శీల! నిను సన్నుతి జేయగ మాకు శక్యమే?

భక్తిగీతము పాడ పరమనాస్తికు డైన 
.....తన్వయత్వము నొ౦దు స్తబ్ధు డగుచు
శోక గీత మనిన సూనరు౦ డైనను 
.....తపియి౦చు కన్నీటి ధార లిడుచు
లలితగీత మనగ పులకి౦చి డె౦ద మా
.....న౦ద మ౦దున కడు చి౦దు లేయు 
పద్య మాలాపి౦చ భావ స౦గీతముల్ 
....పలుకుచు మధువుల నొలుకు చు౦డు
ద౦డకమున దైవ౦బు ప్రత్యక్ష మగును
దేని నెటు పాడ వలయునో తెలియ జేయ
నవతరి౦చితి వయ్య నీ వవని పైన
గాన గ౦ధర్వ శీల! ఓ ఘ౦టసాల!

భగవద్గీత సమస్త మానవులకున్ భావ్య౦ బగున్ గాననే
తగ, గానమ్మును చేసినావొ యటు కాదా, శ్రీ మహావిష్ణువే
భగవద్గీత హితోపదేశము పరివ్యాప్త౦బు గావి౦పగా
జగతిన్ నీవయి పుట్టెనో, తెలుపుమా స౦గీత భాషానిధీ!
రచన : గురుమూర్తి ఆచారి

సమస్య – 1984 (రాముఁడు కన్నీరు కార్చె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రాముఁడు కన్నీరు కార్చె రావణుఁ డలరన్.

25, మార్చి 2016, శుక్రవారం

సమస్య – 1983 (జనకునకున్ సుతుండు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
జనకునకున్ సుతుండు పరిచర్య లొనర్చుట పాపకృత్యమౌ.

24, మార్చి 2016, గురువారం

సమస్య – 1982 (యముని సావిత్రి గని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
యముని సావిత్రి గని పలాయన మొనర్చె.

23, మార్చి 2016, బుధవారం

సమస్య – 1981 (వైరములను బెంచు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వైరములను బెంచు బంతికూడు.

పద్యరచన - 1187

కవిమిత్రులారా,
పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

22, మార్చి 2016, మంగళవారం

సమస్య – 1980 (పద్యరచనకు గణయతి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పద్యరచనకు గణయతిప్రాస లేల.

21, మార్చి 2016, సోమవారం

సమస్య – 1979 (వైధవ్యము ప్రాప్తమగుట...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
వైధవ్యము ప్రాప్తమగుట వరము తరుణికిన్.
(దయచేసి ద-ధ-థ ప్రాస ప్రయోగించకండి)
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

20, మార్చి 2016, ఆదివారం

సమస్య – 1978 (తులసీదళము మనకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
తులసీదళము మనకు విషతుల్యమ్ము గదా!
ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

19, మార్చి 2016, శనివారం

సమస్య – 1977 (నడుమునొప్పి తెచ్చె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
నడుమునొప్పి తెచ్చెఁ గడుముదమ్ము.

18, మార్చి 2016, శుక్రవారం

సమస్య – 1976 (అరిగణమ్ముల గెలిచె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
అరిగణమ్ముల గెలిచె నుత్తరుఁ డెసంగి.
(నా ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. దయచేసి మిత్రుల పూరణలను చదివి స్పందించండి. గుణదోషాలను చర్చించండి. నేనొక్కడనే సమీక్షిస్తే సరిపోదు. మీరంతా మర్యాద నతిక్రమించకుండా, సంస్కారవంతమైన భాషతో విమర్శన చేయండి. స్వస్తి!)

17, మార్చి 2016, గురువారం

సమస్య – 1975 (హవనమ్ములు కీడుసేయు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
హవనమ్ములు కీడుసేయు ననుట నిజమ్మే.

సమస్య – 1974 (పేదవడిన సురలలో...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పేదవడిన సురలలోఁ గుబేరుఁ డొకఁడు.
(బ్లాగులో ‘పద్యరచన’ శీర్షిక కనిపిస్తే నా ఆరోగ్యం కుదుటపడినట్లు లెక్క)

15, మార్చి 2016, మంగళవారం

సమస్య – 1973 (కం టెల్ మీ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కం టెల్ మీ గాడ్దిగుడ్డు కంకరపీచూ.
(మా బాల్యమిత్రుడు సుదర్శన్ బలవంతంమీద ఈ సమస్యను ఇవ్వవలసి వచ్చింది. మన్నించండి)

14, మార్చి 2016, సోమవారం

సమస్య – 1972 (బెండచెట్టుకుఁ గాచెను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
బెండచెట్టుకుఁ గాచెను బీరకాయ.

13, మార్చి 2016, ఆదివారం

సమస్య – 1971 (మధువును గ్రోలెదరు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
మధువును గ్రోలెదరు దైవమందిరమందున్.

12, మార్చి 2016, శనివారం

‘రామకృష్ణ విలోమకావ్యమ్’ వ్యాఖ్యానము

‘ఆంధ్రామృతం’ బ్లాగులో 
‘రామకృష్ణ విలోమకావ్యమ్’ వ్యాఖ్యానము
          24-1-2012 రోజున శంకరాభరణం బ్లాగులో చమత్కార పద్యాలు - 181 శీర్షికలో సూర్యకవి రచించిన ‘రామకృష్ణ విలోమకావ్యమ్’ మూలపాఠం ఇచ్చాను. ఎందరో మిత్రులు అందలి చమత్కృతికి అబ్బురపడి వ్యాఖ్యానం ప్రకటించమని కోరారు. దానికి వ్యాఖ్యానం వ్రాయగలిగిన పాండిత్యం నాకు లేక, ఇంతకాలం ఎక్కడైనా లభిస్తుందేమో అని వెదికాను. 
      మన అదృష్టం శ్రీ చింతా రామకృష్ణారావు గారి రూపంలో సాక్షాత్కరించింది. వారెంతో శ్రమపడి మేళ్ళచెర్వు వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి ‘ద్విరసన’ పేరుతో ప్రకటించిన ఆంధ్రవ్యాఖ్యానాన్ని సేకరించి వారి ‘ఆంధ్రామృతం’ బ్లాగులో రోజుకొక శ్లోకం చొప్పున ఇస్తున్నాను. చిత్రకవిత్వాభిమానులు ఆ బ్లాగులో వాటిని చదివి, స్పందించి, వారికి ధన్యవాదాలు తెలుపవలసిందిగా మనవి. 

క్రింది లింకును క్లిక్ చేయండి.

సమస్య – 1970 (త్రాగుఁబోతు గొప్ప...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
త్రాగుఁబోతు గొప్ప తత్త్వవేత్త.

11, మార్చి 2016, శుక్రవారం

సమస్య – 1969 (చంపకమాలకు గణములు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
చంపకమాలకు గణములు సభరనమయవల్.

10, మార్చి 2016, గురువారం

సమస్య – 1968 (చక్రాయుధమున్ ధరించు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
చక్రాయుధమున్ ధరించు శంభునకు నతుల్.

9, మార్చి 2016, బుధవారం

సమస్య – 1967 (పట్టు గ్రహణమ్ము...)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

పట్టు గ్రహణమ్ము శశి నమావాస్యనాఁడు.

8, మార్చి 2016, మంగళవారం

సమస్య – 1966 (పండువెన్నెలఁ గురిపించు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పండువెన్నెలఁ గురిపించు భాస్కరుండు. 
(నాలుగైదు రోజులుగా నాకు విపరీతమైన వెన్నునొప్పి, నడుమునొప్పి. ఎక్కువసేపు కూర్చొనలేకపోతున్నాను. బ్లాగుకు ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నాను. అందుకే ఈరోజు ‘పద్యరచన’ శీర్షికను ఇవ్వడం లేదు. మన్నించండి)

7, మార్చి 2016, సోమవారం

సమస్య – 1965 (శివరాత్రికిఁ జేయవలెను...)

కవిమిత్రులారా,
మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు!

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
శివరాత్రికిఁ జేయవలెను శ్రీహరి పూజల్.

పద్యరచన - 1186

కవిమిత్రులారా,
పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

6, మార్చి 2016, ఆదివారం

శ్రీకృష్ణావతార వర్ణనము


రచన :- గుండు మధుసూదన్

పంచాశత్పాద మత్తేభవిక్రీడిత మాలిక
ధరణీ భారము నుజ్జగింపఁగను స్వత్వాంశాస్థ సంభూతుఁడై
చెఱసాలన్ జనియింప నా యమున గూర్చెన్ దారి వ్రేపల్లెకై
పరఁగన్ నందయశోద లింట నడుగుం బద్మమ్ములన్ మోపియున్
సరవిన్ బూతన పాలుఁ ద్రావి యుసురుల్ సర్వమ్ముఁ దాఁ బీల్చి, యెం
దఱు దుష్టాత్ములు నేఁగుదెంచి యతనిన్ దర్పోద్ధతిం జంపఁగా
విరచింపన్ బలు మాయలన్ విఱిచియున్ వేగమ్ముగన్ జంపి, సో
దర యుక్తుండయి వ్రేఁత లిండ్లఁ జని దుగ్ధమ్మంతయుం ద్రావ,
త్వర మా బాలుని చేష్టలన్ని తెలుపన్, ♦ దన్మాత యా బాలునిన్
బరమాత్మున్ బసిబాలుఁ డంచుఁ దెలుపన్ వారందఱుం బోవ, నా
దరమెంతేఁ గనిపింప గోపిక లటన్ స్త్నానమ్ముఁ జేయంగ,
ల్వుర వల్వల్ దగ దొంగిలించియు వెసన్ భూజమ్ముపై దాఁచఁగన్
బరమాత్ముండని వారలంత కరముల్ పైకెత్తి దండమ్మిడన్
గరుణాత్ముండయి వారి కిచ్చె వలువల్, ♦ కైమోడ్పులం గొంచుఁ, దా
నరుదెంచెన్ బశుపాలనమ్మునకు సఖ్యాళిం దగం గూడియున్
జిరకాలమ్మట బంతులాఁడు కలనన్, ♦ జిత్రమ్ముగా బంతి యా
సరసిన్ మున్గఁగఁ గృష్ణుఁ డప్డు మడువున్ జక్కంగఁ దా దూఁకఁగన్
సరసిం గాళియ సర్ప మప్పుడు హరిన్ జంపంగ నుంకించఁ, దా
నురుహస్తమ్మున ముష్టిఘాత మిడఁగా నుద్వేగ మెంతేని రా
నురగ మ్మప్పుడు కృష్ణుపైఁ దనదు దంష్ట్రోత్సేక హాలాహలో
త్కరముల్ చిమ్మ యశోద సూనుఁ డపుడున్ దా వేగ సర్పమ్ముపై
నుఱికెన్ భోగము పైన నెక్కి నటరాజోత్తంస విద్వాంస రా
డ్వర నాట్యాంబుధి మున్గి ధింతకిట ధిం తద్ధింత తద్ధింత ధిం
ధిర ధిమ్మంచును నాట్యమాడ నపుడున్ దీనుండు కాళీయుఁ డా
దరమొప్పంగను "గావు" మంచుఁ బలికెన్ దర్పమ్ము సర్పమ్మునన్
దరలెన్; గర్వము ఖర్వమయ్యె, సతులున్ దర్జించి రా కాళియున్;
గరుణన్ వీడు మటంచుఁ బల్క నపు డా కాళీయ దర్పోర్జితుం
డురగమ్మున్ విడనాడి దూఁకె భువిపై దూరీకృతావేశుఁడై;
వరమిచ్చెన్ దన పాదముద్రఁ గని వే పక్షుల్ దొలంగున్ సదా
త్వరఁ బొమ్మంచును బల్కి, చేరె సఖులన్ వర్ణింప నా గాథనున్;
సరసీజాత సునేత్రుఁ డప్డు మఱలెన్ సభ్రాతృమిత్రాదుఁడై;
కరియానల్ మురళీరవమ్ము వినియున్ గానామృతమ్మానఁగన్
దరహాసాంబుధి ముంచి తేల్చి, దయతోఁ దన్వంగులం గూడి, వే
గిరమే కంసుని ప్రోలికిం జనియుఁ గల్కిం గుబ్జనున్ వేగ సుం
దరిగన్ జేసియు, హస్తిఁ దున్మి, జనులత్యాదృత్యుదారాత్ములై
వఱలన్ జాణుర ముష్టికాఖ్యుల వధింపన్ యుద్ధముం జేసి కూ
ల్చి రణౌత్సుక్యునిఁ గంసుఁ జంపియును దల్లిందండ్రినిన్ జేరి వే
చెఱసాలన్ వెడలించి, కొల్చి, మురిపించెన్ సేవ లందించియున్;
సరసీజాక్షిని రుక్మిణీ మణిని హృత్స్థానమ్మునందున్ దగన్
బరిగృహ్యాంచితగా నొనర్చి వరుసన్ భార్యాష్టకుండయ్యు,
ద్వరదుండయ్యెను పాండుభూపు తనయుల్ ధర్మాత్ములై కొల్వఁగన్
నరు సారథ్యముఁ జేసి కూర్మి సలహా నందించి గెల్పొందఁగన్
కురువీరుల్ తమయంతఁ దాము తొలఁగన్ గోపాలుఁడే పూని యు
ర్వరనున్ గెల్వఁగఁ జేసెఁ; బుట్టి ముసలంబా యాదవామ్నాయమున్
బరిమార్పన్ సమకట్ట, నప్డు, మునిశాపమ్మున్ మదిం గాంచియున్
జరియింపంగను లేక తాను వనిలో శయ్యావిలోలుండయెన్;
శరమున్ వేయఁ గిరాతుఁ డొక్కఁ డట, విశ్వాకారుఁ డా వెంటనే
సరవిన్ జన్మ సమాప్త మౌట, వెడలెన్ సర్వేశుఁ డా చక్రియున్
వర వైకుంఠముఁ జేరె! నట్టి ఘనుఁడౌ పక్షీంద్ర యానుండు శ్రీ
హరి విశ్వాత్ముఁడు పద్మనాభుఁడు నిలింపారాతివైరుండు శా
ర్ఙ్గి రమానాథుఁడు పాంశుజాలికుఁడు పుండ్రేక్షుండు మమ్మోమెడున్!


-:శుభం భూయాత్:-

సమస్య – 1964 (కలవారలకున్ గరళము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కలవారలకున్ గరళము గావలెను సుమీ.
ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

పద్యరచన - 1185

కవిమిత్రులారా,
“నమ్ముము నా వచనమ్ముల...”
ఇది పద్యప్రారంభం. దీనిని కొనసాగిస్తూ మీకు నచ్చిన అంశంపై పద్యాన్ని వ్రాయండి.

5, మార్చి 2016, శనివారం

సమస్య – 1963 (అప్పులున్నవారె...)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

అప్పులున్నవారె గొప్పవారు.

పద్యరచన - 1184

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

4, మార్చి 2016, శుక్రవారం

సమస్య – 1962 (పాపులు దుర్జనుల్ ఖలులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పాపులు దుర్జనుల్ ఖలులు భ్రష్టులు నీచులు నీతిదూరులున్.

పద్యరచన - 1183

కవిమిత్రులారా,
పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

3, మార్చి 2016, గురువారం

సమస్య – 1961 (లచ్చిమగఁడు వసించు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
లచ్చిమగఁడు వసించుఁ గైలాసమందు.

పద్యరచన - 1182

కవిమిత్రులారా,
పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

2, మార్చి 2016, బుధవారం

సమస్య – 1960 (పెండ్లిలో వధూవరులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పెండ్లిలో వధూవరు లేల పేరిశాస్త్రి!

పద్యరచన - 1181

కవిమిత్రులారా,
పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

1, మార్చి 2016, మంగళవారం

సమస్య – 1959 (కాకర బెల్లమ్మువోలె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కాకర బెల్లమ్మువోలెఁ గడు పులుపు కదా!

పద్యరచన - 1180

కవిమిత్రులారా,
పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.