17, ఏప్రిల్ 2018, మంగళవారం

అష్టాదశ దళ చిత్ర మాలికా బంధ తేటగీతి


కంజుని దయతోడ  సృష్టి జగతిని  గలిగె 
కంజపానము తో పరాగమము    తొలిగె
కంజనుని వలన రతిసుఖమ్ము    కలిగె 
కంజ హితుని వల్ల భువిపై కాంతి  కలిగె  
కంకటీకుని     వలననే    గాలి   యిలిగె
కంకణపు   కూడిక వలన  కడలి  కలిగె
కంకణి  వలననే   నాటకమ్ము     వెలిగె
కంకటీకుని    తో   కంతు  కట్టె     నిలిగె
కంకతము వలన శిరపు కచము  నలిగె 
కంబళి   వలననే  చలి     గాలి     తొలిగె 
కంఠము వలననె స్వరయోగమ్ము కలిగె 
కండ  తోడనే   దేహపు  ఘనత     కలిగె 
కంచు వలననే  గంటకు  క్వణము  కలిగె
కందకమ్ముతో    కోటకు    కాపు     గలిగె
కంధరము    వల్లనే    చడకమ్ము    గలిగె
కంకటము తోడ   దేహపు    గాత   తొలిగె 
కంటి  వలన  జీవి  కవలోకనము    కలిగె 
కంది బ్లాగుతోడ నె  చిరు  కవియు   వెలిగె
అర్ధములు
కంజుడు =   బ్రహ్మ ,   కంజ పానము =   అమృత సేవనము,  పరాగమము    = చావు,  కంజనుడు  =  మన్మధుడు ,కంజహితుడు =  సూర్యుడు, కంకటీకుడు =  శివుడు,  గాలి = ప్రాణము,   ఇలుగు  =  చచ్చు,     కంకణము =    నీటి బొట్టు  ,  కడలి= సముద్రము,   కంకణి   =  గజ్జె  , నాటకము   నాట్యము ,  కంతుడు = మన్మధుడు , కట్టె = శరీరము  , నిలిగు =చచ్చు,   కంకతము  = దువ్వెన     కచము  =  వెంట్రుక .     క్వణము  ధ్వని, కంధరము =  మేఘము, చడకము = పిడుగు , కంకటము =  కవచము,  గాత = దెబ్బ,  అవలోకనము =చూపు
కవి 
పూసపాటి కృష్ణ సూర్య కుమార్

1 కామెంట్‌:

  1. సుకవి మిత్రులు పూసపాటివారూ! మీ అష్టాదశ దళ చిత్రమాలికా బంధ తేటగీతి బాగున్నది. అభినందనలు!

    మొదటి పాదమున మొదటి గణమున నొక లఘు వెక్కువగ పడినట్లగుపించుచున్నది. పరిశీలించి, సరిచేయగలరు.

    రిప్లయితొలగించండి