30, సెప్టెంబర్ 2018, ఆదివారం

సమస్య - 2804 (ప్రకృతి వినాశమె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ప్రకృతి వినాశనమె మిగులఁ బావనము భువిన్"
(లేదా...)
"ప్రకృతి వినాశనంబె కడు పావన కార్యము ధాత్రిలోపలన్"

29, సెప్టెంబర్ 2018, శనివారం

సమస్య - 2803 (పిల్లినిఁ జంక నిడుకొని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పిల్లినిఁ జంక నిడుకొనియె పెండ్లికిఁ జనుమా"
(లేదా...)
"పిల్లినిఁ జంకఁ బెట్టుకొని పెండ్లికి నేగుట పుణ్యకార్యమౌ"

28, సెప్టెంబర్ 2018, శుక్రవారం

సమస్య - 2802 (ముండా మ్రొక్కెద...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ముండా మ్రొక్కెద నిడు పదముల నా తలపై"
(లేదా...)
"ముండా మ్రొక్కెద నీ పదమ్ములను నా మూర్ధమ్ముపై నుంచవే"

27, సెప్టెంబర్ 2018, గురువారం

సమస్య - 2801 (భాష నశించె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"భాషను నశింపఁ జేసెను పండితాళి"
(లేదా...)
"బాస నశించెఁ గారణము పండితులే కద తెల్గు నేలపై"

26, సెప్టెంబర్ 2018, బుధవారం

సమస్య - 2800 (తాతకున్ దండ్రికిన్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తాతకుం దండ్రికిఁ దనకు దార యొకతె"
(లేదా...)
"తాతకుఁ దండ్రికిం దనకుఁ దన్వి యొకర్తుక దార యయ్యెడిన్"

25, సెప్టెంబర్ 2018, మంగళవారం

సమస్య - 2799 (నగ్నముగా...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నగ్నముగా సంచరించినన్ మేలనరే"
(లేదా...)
"నగ్నముగాఁ జరించిన ఘనంబుగ మేలని మెచ్చరే జనుల్"

24, సెప్టెంబర్ 2018, సోమవారం

సమస్య - 2798 (మిడుఁగుఱుల వెల్గులో...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మిడుఁగుఱుల వెల్గులో రవి మింట సాగె"
(లేదా...)
"మిడుఁగుఱు దారిఁ జూపఁగను మింటను సూర్యుఁడు సాగె సూటిగన్"

23, సెప్టెంబర్ 2018, ఆదివారం

సమస్య - 2797 (పగలో మున్గిన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పగలో మున్గిన నఘములు భస్మమ్ము లగున్"
(లేదా...)
"పగలో మున్గినవారి పాపచయముల్ భస్మమ్ములౌ నెప్పుడున్"

22, సెప్టెంబర్ 2018, శనివారం

సమస్య - 2796 (జనకునిఁ జంపి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"జనకుని రాముఁడు వధించి జానకిఁ దెచ్చెన్"
(లేదా...)
"జనకునిఁ జంపి దాశరథి జానకిఁ దెచ్చెను శౌర్యమూర్తియై"

21, సెప్టెంబర్ 2018, శుక్రవారం

సమస్య - 2795 (కోకిల కావుకావుమని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ఆమనినిఁ గోకిలయె కావు మనుచుఁ గూసె"
(లేదా...)
"కోకిల కావుకావుమని కూసెను రమ్య వసంత వేళలన్"

20, సెప్టెంబర్ 2018, గురువారం

అష్టావధానము

ఆహ్వానము
వైశాలి ఎన్‌క్లేవ్ గణేశ్ కమిటి, మదీనాగూడ వారి అధ్వర్యంలో
తేదీ 20-9-2018, గురువారం, సా. 7-30 గం.లకు
అష్టావధానం
అవధాని : శ్రీ తాతా శ్రీనివాస రమా సత్య సందీప శర్మ గారు
సంధానకర్త : శ్రీ చింతా రామకృష్ణా రావు గారు
పృచ్ఛకులు :
1. నిషిద్ధాక్షరి : శ్రీ కంది శంకరయ్య గారు 
2. సమస్య : శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు
3. దత్తపతి : శ్రీ మాచవోలు శీధర రావు గారు
4. వర్ణన : శ్రీ ధనికొండ రవిప్రసాద్ గారు
5. ఆశువు : శ్రీమతి వై. దత్తశ్రీ గారు
6. వ్యస్తాక్షరి : శ్రీ సాధు శ్యాంప్రసాద్ గారు
7. వారగణన : కుమారి సాధు శ్రీవైష్ణవి గారు
8. అప్రస్తుత ప్రసంగం : శ్రీ కామవరపు లక్ష్మీ కామేశ్వర రావు గారు
ఆహ్వానించువారు
వైశాలి ఎన్‌క్లేవ్ గణేశ్ కమిటీ, మదీనాగూడ.

సమస్య - 2794 (చీమ తుమ్మఁగా...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చీమ తుమ్మఁగా దిక్కరుల్ సెదరి పాఱె"
(లేదా...)
"చీమ యొకండు దుమ్మగనె శీఘ్రమ దిక్కరు లెల్లఁ బాఱెనే"

19, సెప్టెంబర్ 2018, బుధవారం

ఆహ్వానము (అష్టావధానము)

ఆహ్వానము
దీప్తిశ్రీ నగర్, సి.బి.ఆర్. ఎస్టేట్ కమిటీ అధ్వర్యంలో
తేది 19-09-2018 సాయంత్రం 7 గం.లకు
అష్టావధానము

అవధాని : అవధాన రత్న శ్రీ ముద్దు రాజయ్య గారు
సంధానకర్త : శ్రీ చింతా రామకృష్ణా రావు గారు
పృచ్ఛకులు...
1. నిషిద్ధాక్షరి : డా. డి.వి.జి.ఎ. సోమయాజులు గారు
2. సమస్య : శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు
3. దత్తపది : శ్రీ మాచవోలు శ్రీధర రావు గారు
4. వర్ణన : శ్రీ కంది శంకరయ్య
5. ఛందోభాషణ : శ్రీ ధనికొండ రవిప్రసాద్ గారు
6. పురాణ పఠనము : డా. కావూరి రాజేశ్ పటేల్ గారు
7. వార గణన : కుమారి సాధు శ్రీవైష్ణవి గారు
8. అప్రస్తుత ప్రసంగము : శ్రీ భమిడిపాటి వేంకటేశ్వర రావు గారు

ఆహ్వానించువారు
సి.బి.ఆర్. ఎస్టేట్ గణేశ్ కమిటీ, దీప్తిశ్రీ నగర్,
మదీనాగూడ, హైదరాబాదు

సమస్య - 2792 (భాగ్య మెడఁబాయ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"భాగ్య మెడల వెలుఁగు భరతభూమి"
(లేదా...)
"భాగ్యము లెల్లఁ బాసిననె భాసిలు భారతభూమి యన్నిఁటన్"

18, సెప్టెంబర్ 2018, మంగళవారం

సమస్య - 2791 (పతితోఁ బోరాడిన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పతితోఁ బోరాడిన సతి వంద్య యగుఁ గదా"
(లేదా...)
"పతితోఁ గ్రూరతఁ బోరినట్టి సతికిన్ భక్తిన్ నతుల్ సేయరే"

సమస్య - 2790 (రాముఁడే దైవమని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రాముఁడే దైవమని చెప్పె రావణుండు"
(లేదా...)
"రాముఁడు నాకు దైవమని రావణుఁ డంగదుతోడఁ జెప్పెరా"

16, సెప్టెంబర్ 2018, ఆదివారం

సమస్య - 2789 (విషగళుండైన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"విషగళుండైన నవధాని వినుతి కెక్కు"
(లేదా...)
"విషగళుఁ డైనచో మిగుల విశ్రుతి కెక్కు వధాని మాన్యుఁడై"

15, సెప్టెంబర్ 2018, శనివారం

సమస్య - 2788 (దేహినిఁ బెండ్లాడ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"దేహినిఁ బెండ్లాడె సకల దివ్యులు మెచ్చన్"
(లేదా...)
"దేహినిఁ బెండ్లియాడెఁ గద దివ్యులు మౌనులు మెచ్చు రీతిగన్"

14, సెప్టెంబర్ 2018, శుక్రవారం

సమస్య - 2787 (రవిబింబం బుత్తరమున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రవిబింబం బుత్తరమున రాతిరి పొడమెన్"
(లేదా...)
"రవిబింబం బుదయించె నుత్తరదిశన్ రాత్రిన్ మహాశ్చర్యమై"

13, సెప్టెంబర్ 2018, గురువారం

నిషిద్ధాక్షరి - 46


కవిమిత్రులారా,
అంశము - విఘ్నేశ్వర స్తుతి
నిషిద్ధము - 'వ'కారము (వకార సంయుక్తము కూడ)
ఛందస్సు - మీ ఇష్టము.

12, సెప్టెంబర్ 2018, బుధవారం

సమస్య - 2786 (గెలిచెను సోమకుని...)

కవిమిత్రులారా,
నేఁడు 'వరాహ జయంతి'

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"గెలిచెను సోమకుని శివుఁడు కిటిరూపమునన్"
(లేదా...)
"అడఁచెన్ సోమక నామ దైత్యుని వరాహస్వామియై శూలియే"

11, సెప్టెంబర్ 2018, మంగళవారం

సమస్య - 2785 (బలరాముని కంటె...)

కవిమిత్రులారా,
నేఁడు 'బలరామ జయంతి'

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"బలరాముని కంటె పాపి వసుధం గలఁడే"
(లేదా...)
"బలరామున్ దలమీఱు పాపి గలఁడే భావింపఁగా మేదినిన్"

10, సెప్టెంబర్ 2018, సోమవారం

సమస్య - 2784 (ద్వాపరమున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ద్వాపరమున సోమకుఁ జంపె దాశరథియె"
(లేదా...)
"ద్వాపరమందు సోమకవధం బొనరించెను రాముఁ డుద్ధతిన్"

సమస్య - 2783 (లంక నేలినాఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"లంక నేలినాఁడు లక్ష్మణుండు"
(లేదా...)
"లంకను పోరులో గెలిచి లక్ష్మణుఁ డేలె సహస్రవర్షముల్"

8, సెప్టెంబర్ 2018, శనివారం

సమస్య - 2782 (తేలును ముద్దాడి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తేలును ముద్దాడి పల్కు తేనియ లూరన్"
(లేదా...)
"తేలును ముద్దులాడి యిక తేనియ లూరఁగఁ బల్కవే చెలీ"

7, సెప్టెంబర్ 2018, శుక్రవారం

సమస్య - 2781 (పుత్రినిం గూడి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పుత్రినిం గూడి శశిమౌళి పుత్రుఁ గనెను"
(లేదా...)
"పుత్రినిఁ గూడి శంకరుఁడు పొందెఁ గుమారుని మెచ్చ దేవతల్"

6, సెప్టెంబర్ 2018, గురువారం

సమస్య - 2780 (చెల్లికి మగఁడయ్యె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చెల్లికి మగఁడయ్యె జనుల చిత్తము లలరన్"
(లేదా...)
"చెల్లికి వల్లభుం డగుటచే జను లెల్లరు మోదమందిరే"

5, సెప్టెంబర్ 2018, బుధవారం

న్యస్తాక్షరి - 59 (గు-రు-దే-వ)

అంశము - గురు వందనము
ఛందస్సు- ఆటవెలది
న్యస్తాక్షరములు - నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా 'గు-రు-దే-వ' ఉండాలి.
(లేదా...)
ఛందస్సు - చంపకమాల
న్యస్తాక్షరములు - 
1వ పాదంలో 10వ అక్షరం - గు
2వ పాదంలో 2వ అక్షరం - రు
3వ పాదంలో 11వ అక్షరం - దే
4వ పాదంలో 18వ అక్షరం - వ.
(పై నియమాల ప్రకారం ప్రాసాక్షరం 'ర'కారమని, మూడవ పాదంలో యతిస్థానంలో 'దే' ఉన్నదని గమనించండి).

4, సెప్టెంబర్ 2018, మంగళవారం

సమస్య - 2779 (వనరాజుకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వనరాజుకు మూషికమ్ము వాహన మయ్యెన్"
(లేదా...)
"వనరాడ్వాహన మయ్యె మూషికము దివ్యశ్రేణి మేల్మేలనన్"

3, సెప్టెంబర్ 2018, సోమవారం

దత్తపది - 145 (హర-శివ-భవ-కపాలి)


హర - శివ - భవ - కపాలి
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
శ్రీకృష్ణుని స్తుతిస్తూ
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యాన్ని వ్రాయండి.

2, సెప్టెంబర్ 2018, ఆదివారం

సమస్య - 2778 (మేకను సాధువులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మేకను సాధువులు వండి మేలని తినిరే"
(లేదా...)
"మేకను వండి సాధువులు మేలని మెచ్చుచు నారగించిరే"

1, సెప్టెంబర్ 2018, శనివారం

సమస్య - 2777 (ప్రాఙ్నగ శృంగమ్మున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ప్రాఙ్నగ శృంగమ్మున నదె భానుఁడు గ్రుంకెన్"
(లేదా...)
"ప్రాఙ్నగ శృంగభాగమున భానుఁడు గ్రుంకె నదేమి చిత్రమో"