31, డిసెంబర్ 2018, సోమవారం

సమస్య - 2889 (సాయిని నమ్మి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సాయిని నమ్మి కొలిచినఁ గసాయిగ మారున్"
(లేదా...)
"సాయిని నమ్మి కొల్చినఁ గసాయిగ మారును నిక్కమే కదా"

30, డిసెంబర్ 2018, ఆదివారం

సమస్య - 2888 (అంధుఁడు గాంచె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అంధుఁడు కనులారఁ గనె మహాద్భుత మూర్తిన్"
(లేదా...)
"అంధుఁడు గాంచె నచ్చట మహాద్భుతమై వెలుగొందు రూపమున్"
(దయచేసి ద-ధ ప్రాసను వర్జించండి) 

29, డిసెంబర్ 2018, శనివారం

సమస్య - 2887 (దొండ తీగకు బెండ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దొండ తీగకుఁ గాసెను బెండకాయ"
(లేదా...)
"దొండ తీగకు బెండ కాయుట దుర్లభం బెటు లౌనురా"
(ఈరోజు ఆకాశవాణిలో మాచవోలు శ్రీధర రావు గారి సమస్య)

28, డిసెంబర్ 2018, శుక్రవారం

సమస్య - 2886 (కనుల నీరు నింపి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కనుల నీరు నింపి కట్టెఁ దాళి"
(లేదా...)
"కన్నుల నీరు నింపుకొని కట్టెను తాళి వధూగళమ్మునన్"

27, డిసెంబర్ 2018, గురువారం

సమస్య - 2885 (కారముఁ బాయసము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కారముఁ బాయసమునందుఁ గలిపిన రుచియౌ"
(లేదా...)
"కారముఁ బాయసంబునను గల్పినచో రుచి మిక్కుటమ్మగున్"

26, డిసెంబర్ 2018, బుధవారం

సమస్య - 2884 (వనమునన్ లభించు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వనమునన్ లభించు ఘనసుఖంబు"
(లేదా...)
"వనమున లభ్యమౌ నఖిల భాగ్య సుఖంబులు మానవాళికిన్"

25, డిసెంబర్ 2018, మంగళవారం

న్యస్తాక్షరి - 61 (ఏ-సు-క్రీ-స్తు)

అంశము - శ్రీకృష్ణ స్తుతి.
ఛందస్సు- ఆటవెలది
న్యస్తాక్షరములు - నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా 'ఏ - సు - క్రీ - స్తు' ఉండాలి.
(లేదా...)
ఛందస్సు - ఉత్పలమాల
న్యస్తాక్షరములు - 
1వ పాదంలో 1వ అక్షరం - ఏ
2వ పాదంలో 8వ అక్షరం - సు
3వ పాదంలో 13వ అక్షరం - క్రీ
4వ పాదంలో 17వ అక్షరం - స్తు.

24, డిసెంబర్ 2018, సోమవారం

సమస్య - 2883 (చీమల కేనుఁగులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చీమల కేనుఁగులు పుట్టెఁ జిత్రం బగునా"
(లేదా...)
"చీమల కేనుఁగుల్ గలిగెఁ జిత్ర మదెట్టులొ విప్పి చెప్పుమా"

23, డిసెంబర్ 2018, ఆదివారం

సమస్య - 2882 (నెలఁ జూపి లతాంగి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నెలఁ జూపి లతాంగి కంట నీరున్ గార్చెన్"
(లేదా...)
"నెలఁ జూపించి లతాంగి యేడ్చెనఁట కన్నీ రొత్తుచున్ బయ్యెదన్"

22, డిసెంబర్ 2018, శనివారం

సమస్య - 2881 (చారును దూరముంచిననె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చారున్ దూరమున నుంచ సౌఖ్యం బబ్బున్"
(లేదా...)
"చారును దూరముంచిననె సాగును జీవిత మద్భుతమ్ముగా"
(ఈరోజు ఆకాశవాణిలో పూరణలు ప్రసారమయ్యే అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి సమస్య)

21, డిసెంబర్ 2018, శుక్రవారం

సమస్య - 2880 (ఒకఁడ యిద్దరా...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఒకఁడ యిద్దరా యెందరో యూహ సేయ"
(లేదా...)
"ఒకఁడా యిద్దర ముగ్గురా నలువురా యూహింప నింకెందరో"

20, డిసెంబర్ 2018, గురువారం

సమస్య - 2879 (కర్నూలునఁ గానరాఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కవి యొక్కఁడుఁ గానరాఁడు కర్నూలు పురిన్"
(లేదా...)
"కవి యొక్కండును గానరాఁడు గద యా కర్నూలునన్ జూడఁగన్"

19, డిసెంబర్ 2018, బుధవారం

సమస్య - 2878 (బకమె చాలు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"బకమె చాలుఁ గొనఁగఁ బ్రాణములను"
(లేదా...)
"బకమే చాలును ప్రాణముల్ గొనఁగ గర్వం బొంద నీ కేటికిన్"

18, డిసెంబర్ 2018, మంగళవారం

సమస్య - 2877 (హనుమద్వాలముఁ ద్రొక్కె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"హనుమంతుని తోఁకఁ ద్రొక్కె నర్జునుఁ డలుకన్"
(లేదా...)
"హనుమద్వాలముఁ ద్రొక్కె నర్జునుఁడు దా నత్యంత రౌద్రమ్మునన్"

17, డిసెంబర్ 2018, సోమవారం

దత్తపది - 150 (ఏక్-దస్‍-సౌ-హజార్)

ఏక్ - దస్ - సౌ - హజార్
పై పదాలను ప్రయోగిస్తూ
భారతార్థంలో
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యాన్ని వ్రాయండి.

16, డిసెంబర్ 2018, ఆదివారం

సమస్య - 2876 (రమణి పాపమ్ము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రమణి పాపమ్ము గద పాశురములఁ జదువ"
(లేదా...)
"రమణీ పాశురముల్ బఠించిన ధనుర్మాసమ్మునం బాపమౌ"

15, డిసెంబర్ 2018, శనివారం

సమస్య - 2875 (కొట్టెడు పతి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కొట్టెడు పతి నిష్టపడరె కోమలు లెల్లన్"
(లేదా...)
"కొట్టెడు భర్తనే సతముఁ గోమలు లిష్టపడంగ నేర్తురే"
(ఈరోజు ఆకాశవాణిలో పూరణలు ప్రసారమయ్యే అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి సమస్య)

14, డిసెంబర్ 2018, శుక్రవారం

సమస్య - 2874 (ఖరముఁ గౌఁగిలించి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
"ఖరముఁ గౌఁగిలించి కాంత మురిసె"
(లేదా...)
"ఖరమును గౌఁగిలించుకొనెఁ గాంత యొకర్తుక సంతసంబునన్"

13, డిసెంబర్ 2018, గురువారం

సమస్య - 2873 (పొలఁతి మేన....)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
"పొలఁతి మేనఁ బుణ్యక్షేత్రములు గలవఁట"
(లేదా...)
"పుణ్యక్షేత్రము లెన్నొ యున్నవఁట యా పూబోడి నెమ్మేనుపై"

12, డిసెంబర్ 2018, బుధవారం

సమస్య - 2872 (దేశము వీడిపోయిన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
"దేశమ్మును వీడి చన నదృష్టము గల్గున్"
(లేదా...)
"దేశము వీడి పోయిన నదృష్టము గల్గదె యెల్లవారికిన్"
(2-12-2018 నాడు ఆముదాల మురళి గారి అష్టావధానంలో సమస్య)

11, డిసెంబర్ 2018, మంగళవారం

సమస్య - 2871 (ఓడినవారు నవ్వి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నవ్వి రోడినవార లానందమొప్ప"
(లేదా...)
"ఓడినవారు నవ్వి రయయో యని గెల్చినవార లేడ్చిరే"

10, డిసెంబర్ 2018, సోమవారం

సమస్య - 2870 (చెడు గుణ మున్నపుడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
"చెడు గుణ మున్నపుడె యశము చేకుఱు జగతిన్"
(లేదా...)
"చెడు గుణ మున్నచో యశము చేకుఱు ధారుణి నెల్లభంగులన్"

9, డిసెంబర్ 2018, ఆదివారం

సమస్య - 2869 (పవనతనయుండు రాముని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పవనతనయుండు రామునిఁ బరిహసించె"
(లేదా...) 
"పవనసుతుండు రాముని సభాస్థలిఁ దాఁ బరిహాస మాడెఁగా" 

8, డిసెంబర్ 2018, శనివారం

సమస్య - 2868 (కరణము నమ్ము వారలకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు శుభంబుల్"
(లేదా...)
"కరణము నమ్ము వారలకుఁ గల్గు శుభంబులు నిశ్చయమ్ముగన్"
(ఈరోజు ఆకాశవాణిలో పూరణలు ప్రసారం కానున్న అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి సమస్య)

7, డిసెంబర్ 2018, శుక్రవారం

సమస్య - 2867 (ఎన్నుకొనంగ నొప్పు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఎన్నుకొనుఁడు దున్నపోఁతునే యేలికగన్"
(లేదా...)
"ఎన్నుకొనంగ నొప్పు మన కేలికగా నొక దున్నపోఁతునే"

6, డిసెంబర్ 2018, గురువారం

సమస్య - 2866 (త్రాగిన మానవులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
"త్రాగిన మానవులు ధన్యతం గాంతు రిలన్"
(లేదా...)
"త్రాగిన మానవోత్తములు ధన్యతఁ గాంతురు లోకమందునన్"

5, డిసెంబర్ 2018, బుధవారం

సమస్య - 2865 (రసమయ కావ్యమ్ము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
"రసమయ కావ్యము జనుల విరక్తులఁ జేయున్"
(లేదా...)
"రసమయ కావ్యమే జనుల రక్తిఁ దొలంగఁగఁ జేయు నెప్పుడున్"

మదనపల్లె అష్టావధానము

శ్రీ ఆముదాల మురళి గారి 122వ అష్టావధానం
'మదనపల్లె సాహితీ కళా వేదిక'
ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా
ది. 2-12-2018 (ఆదివారం)
నిర్వహణ, సమన్వయం - శ్రీ మునిగోటి సుందరరామ శర్మ గారు

1. నిషిద్ధాక్షరి - శ్రీ కంది శంకరయ్య గారు
(మదనపల్లె సాహితీ మూర్తుల ప్రాశస్త్యం)
(స)వి(ద)శ్వా(స)త్మ(క)భా(స)వ(వ)దీ(ప)వ్యత్
(ధ)శశ్వత్(క)వ్యా(ప)స(గ)క(-)వి(వ)తా(న)ధిసా(హ)ధి(క)త(క)వ(ల)ద్యా
(వ)ప్పాశ్వ(మ)వ(ర)ద(-)న(ద)ధీ(భ)మ(త)య(స)మౌ
(నాల్గవ పాదం నిషేధం లేదు. కుండలీకరణంలో ఉన్నవి నిషిద్ధాక్షరాలు. (-) ఉన్నచోట నిషేధం లేదు).
విశ్వాత్మభావదీవ్యత్
శశ్వత్ వ్యాసకవితాదిసాధితవద్యా
ప్పాశ్వవదనధీమయమౌ
శాశ్వతమగు మదనపల్లి సత్కవి తపముల్.

2. సమస్య -  శ్రీ లోకా జగన్నాథ శాస్త్రి గారు
(దేశము వీడిపోయిన నదృష్టము గల్గదె యెల్లవారికిన్)
ఆశలు చుట్టుముట్టగ ధనార్జన సేయుటె ధ్యేయమంచు ధీ
కోశము విక్రయించి సమకూర్చగ గుప్పెడు గ్రుడ్డిగవ్వలన్
కాశియు గంగయున్ గలుగ కాదని వేడుక పోవవచ్చునా
దేశము వీడిపోయిన నదృష్టము గల్గదె యెల్లవారికిన్.

3. దత్తపది - శ్రీ తెనాలి శేషగిరి రావు గారు
(గాజులు, జాజులు, పోజులు, మోజులు పదాలతో వరూధిని విరహవేదనా వర్ణన)
గాజులు పూలవాల్జడయు కాముని బాణములంచు నెంచితిన్
జాజులు వాడిపోయె రససాగరసప్తక మావిరయ్యెగా
మోజులు తీరవాయె నను ముంచెను పారుడు దుఃఖవార్ధిలో
పూజలు నిష్ఫలమ్ములయె పో జులుముం గనబర్చ నాగడే.

4. న్యస్తాక్షరి - శ్రీ వాసా కృష్ణమూర్తి గారు
(విక్రమాదిత్యుని నవరత్నాల సభావర్ణన ఉత్పలమాలలో... న్యస్తాక్షరాలు 1వ పాదం 2వ అక్షరం 'త్య', 2వ పాదం 8వ అక్షరం 'స', 3వ పాదం 12వ అక్షరం 'ర', 4వ పాదం 16వ అక్షరం 'ధ')
ని(త్య)ము విక్రమార్క నవనీత హృదంతర శారదాబ్జమున్
సత్య సుధర్మ బద్ధ (స)రసాకృతి సత్కవిరత్నమండలిన్
భత్యము నిచ్చి ప్రోచు రసభావ(ర)వీందుకరాళి కావ్యముల్
ముత్యపు ప్రోవులన్ కనకమూలము గూర్చిన (ధ)ర్మగాథయే.

5. వర్ణన - శ్రీ మల్లెల నాగరాజు గారు
(ప్రేమ వివాహం చేసికొన్నవారి తల్లిదండ్రుల ఆవేదన మత్తేభంలో)
పదముల్ గ్రందక గుండె క్రింద నిడి పాపన్ బుజ్జి చిన్నారినిన్
హృదయంబందున గూడుగట్టి రసవాక్ప్రేమంబునన్ పెంచినన్
ముదితల్ వే తలిదండ్రి వీడి చనుటల్ మోదంబె? ఖేదం బగున్
విదితంబౌనె కుటుంబ గౌరవము లీ పిల్లల్ మనోవీథిలోన్.

6. ఆశువు - శ్రీ కె.యల్. అనంతశయనం గారు
౧. (మదనపల్లె సాహితీ కళాసమితి ప్రాశస్త్యం)
మొలకలెత్తెడి సాహిత్య మూర్తులకును
జన్మనిచ్చెడు స్థానమై సహజమైన
భావబంధుర కవితల భాగ్యమిచ్చి
వెల్గు మదనపల్లెను కళావేదిక గద!
౨. (ఏసుక్రీస్తు భగవద్గీతను చదివితే ఎలా ఉంటుంది?)
ధర్మము దప్పరా దనుచు తాను స్వయమ్ముగ బోధ సేయడే
నిర్మల భక్తి తత్పరత నిత్య మహింసను పాదుకొల్పడే
కర్మల వీడి జీవుడిట కానడు జన్మ మటంచు బల్కడే
శర్మద వృత్తి యేసు తను సాంగముగా పఠియించి గీతమున్.
౩. (శ్లోకానువాదం)
శాంతి సత్యంబు దయయును సర్వభూత
హిత మహింసయు దానంబు హ్రీసహితపు
వర్తనంబును గల్గుట వారిజాక్షు
పూజకగు పుష్పచయమని పూజ్యవాణి.

7. పురాణ పఠనం - శ్రీ జలకనూరి మురళీధర్ రాజు గారు
8. అప్రస్తుత ప్రసంగం - డా. మునిగోటి సుందరరామ శర్మ గారు

అవధానానంతరం 'మదనపల్లె సాహితీ కళావేదిక' వారు ఆముదాల మురళి గారిని
"అవధాన రత్నాకర" బిరుదంతో సత్కరించారు.

4, డిసెంబర్ 2018, మంగళవారం

సమస్య - 2864 (పుత్రా రమ్మనుచు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
"పుత్రా రమ్మనుచుఁ బిలిచెఁ బొలఁతియె మగనిన్"
(లేదా...)
"పుత్రా రమ్మని పిల్చె భార్య మగనిన్ మోదంబు చెన్నారఁగన్"

3, డిసెంబర్ 2018, సోమవారం

సమస్య - 2863 (ఆంగ్లంబున వ్రాసె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
"ఆంగ్లంబున వ్రాసెఁ బోతనార్యుండు కృతిన్"
(లేదా...)
"ఆంగ్లమునందుఁ బోతన మహాకవి భాగవతమ్ము వ్రాసెఁ బో"

2, డిసెంబర్ 2018, ఆదివారం

సమస్య - 2862 (వధాన మన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
"వధాన మన మదనపల్లె ప్రజలకు భయమౌ"
(లేదా...)
"భయమునఁ బాఱదే మదనపల్లె ప్రజాళి వధాన మన్నచో"

సమస్య - 2861 (పతి పూజయె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పతి పూజయె కార్తికమున భద్రత నొసఁగున్"
(లేదా...)
"పతి పాదార్చన కార్తికమ్మునఁ గడున్ భద్రమ్ముఁ జేకూర్చులే"
(ఈరోజు ఆకాశవాణిలో పూరణలు ప్రసారమయ్యే బండకాడి అంజయ్య గారి సమస్య)