28, ఫిబ్రవరి 2019, గురువారం

సమస్య - 2943 (సీతాపతి యనఁగ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"సీతాపతి యనఁగఁ జంద్రశేఖరుఁడు గదా"
(లేదా...)
"సీతావల్లభుఁ డిందుశేఖరుఁడు వాసిం గాంచెఁ గంసారిగన్"

27, ఫిబ్రవరి 2019, బుధవారం

సమస్య - 2942 (రమ్ము జనులకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"రమ్ము జనులకు శరణమ్ము గాదె"
(లేదా...)
"రమ్ము సుధీజనాళికి శరణ్యము మోక్షపథానుగుణ్యమౌ"

26, ఫిబ్రవరి 2019, మంగళవారం

సమస్య - 2941 (వాసన లేని పూవులన....)

కవిమిత్రులారా 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
"వాసన లేని పువు లనిన భామకుఁ బ్రియమౌ"
(లేదా...)
"వాసన లేని పూవు లన భామ ముదంబునఁ జూపు నిష్టమున్" 

25, ఫిబ్రవరి 2019, సోమవారం

సమస్య - 2940 (మునిఁ గని రాక్షసాంగన...)

కవిమిత్రులారా 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... 
"మునిఁ గని దనుజాంగన కడు మోహము నందెన్"
(లేదా....)
"మునిఁ గని రాక్షసాంగన విమోహితయై మనువాడఁగా జనెన్" 

24, ఫిబ్రవరి 2019, ఆదివారం

సమస్య - 2939 (జ్ఞానుల పాదధూళి...)

కవిమిత్రులారా 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .. 
"జ్ఞానుల పదధూళి పాప సంగతిఁ గూర్చున్" 
(లేదా...)
"జ్ఞానుల పాద ధూళి శిరసా వహియించిన ఘోర పాపమౌ"
(డా. రాంబాబు గారికి ధన్యవాదాలతో...) 

దత్తపది - 154

కరి - గిరి - దరి - సిరి
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
అన్యార్థంలో దేశభక్తిని ప్రబోధిస్తూ
స్వేచ్ఛాచ్ఛందంలో పద్యం వ్రాయండి.  
(ఆకాశవాణిలో ఈరోజు పూరణలు ప్రసారమయ్యే దత్తపది)

22, ఫిబ్రవరి 2019, శుక్రవారం

సమస్య - 2938 (భజన నొనర్చు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"భజన సేయువాఁడు భక్తుఁ డగున"
(లేదా...)
"భజన నొనర్చు మానవుని భక్తునిఁగా గణుతింప నొప్పునా"

సమస్య - 2937 (హిమగిరి మండెను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమద్య ఇది....
"హిమగిరి మండెను భగభగ హేమంతమునన్"
(లేదా...)
"భగభగ మండుచుండె హిమపర్వతమే చలికాలమం దయో"
(ఈ సమస్యను పంపిన డా. రాంబాబు గారికి ధన్యవాదాలు)

20, ఫిబ్రవరి 2019, బుధవారం

సమస్య - 2936 (హింస గల్గఁ జేయు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమద్య ఇది....
"హింస గల్గఁ జేయు హితము భువికి"
(లేదా..,.)
"హింసయె కల్గఁ జేయును మహీతలమందు హితార్థ సిద్ధులన్"

19, ఫిబ్రవరి 2019, మంగళవారం

సమస్య - 2935 (నారాయణ మంత్ర...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమద్య ఇది....
"నారాయణ మంత్ర జపము నరక మొసంగున్"

18, ఫిబ్రవరి 2019, సోమవారం

సమస్య - 2934 (తులసి వరించినది...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"తులసి వరించినది దుష్టదుర్యోధనునిన్"
(లేదా...)
"తులసి వరించి వచ్చెనట దుష్టసుయోధనునిన్ ముదమ్మునన్"
(ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు)

17, ఫిబ్రవరి 2019, ఆదివారం

సమస్య - 2933 (రాగద్వేషమ్ముల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రాగద్వేషమ్ముల విడరాదు మునులకున్"
(లేదా...)
"కలదే మోక్షపదమ్ము యోగులకు రాగద్వేషముల్ వీడినన్"

16, ఫిబ్రవరి 2019, శనివారం

సమస్య - 2932 (చైత్రమునందు వచ్చు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చైత్రమునన్ వచ్చును రథసప్తమి వేడ్కన్"
(లేదా...)
"చైత్రమునందు వచ్చు రథసప్తమి గొల్వవలెన్ గణేశునిన్"
(ఈ రోజు పూరణలు ప్రసారమయ్యే ఆకాశవాణి వారి సమస్య)

15, ఫిబ్రవరి 2019, శుక్రవారం

సమస్య - 2931 (మునిఁగిన పంట....)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మునిఁగిన పంటనుఁ గని కడు మురిసిరి రైతుల్"
(లేదా...)
"మునిఁగిన పంటఁ గాంచి కడు మోదము నందిరి రైతు లయ్యెడన్"

14, ఫిబ్రవరి 2019, గురువారం

సమస్య - 2930 (మ్రొక్కఁగ నొప్పు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మ్రొక్కఁగ నొప్పుఁ బ్రేమికుల రోజున నొజ్జల పాదపద్మముల్"

13, ఫిబ్రవరి 2019, బుధవారం

సమస్య - 2929 (చుట్టల్ గాల్చిన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్"

12, ఫిబ్రవరి 2019, మంగళవారం

సమస్య - 2928 (ఇనబింబము...)


కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ఇనబింబము పగటిపూట హిమగోళ మగున్"

సమస్య - 2927 (సింగము నోటన్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సింగము నోటన్ వసించెఁ జిలుక ముదమునన్"
(లేదా...)
"సింగము నోటిలోన నొక చిల్క వసించెఁ గడున్ ముదంబునన్"

10, ఫిబ్రవరి 2019, ఆదివారం

సమస్య - 2926 (వాగ్దేవినిఁ గొలుచు....)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వాగ్దేవినిఁ గొలుచువాఁడు వ్యర్థుఁడు జగతిన్"
(లేదా...)
"వాగ్దేవిన్ గడు భక్తిఁ గొల్చు నరుఁడే వ్యర్థుండు పో యిద్ధరన్"

9, ఫిబ్రవరి 2019, శనివారం

సమస్య - 2925 (దుష్టులకే దైవము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"దుష్టులకే దైవ మెపుడు దోడ్పడుచుండున్"
(లేదా...)
"దుష్టులకే పరాత్పరుఁడు దోడ్పడుచుండును ధర్మరక్షకై"

8, ఫిబ్రవరి 2019, శుక్రవారం

సమస్య - 2924 (అర్జున మిత్రుఁడై...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అర్జునున కాప్తమిత్రుఁడౌ నంగరాజు"
(లేదా...)
"అర్జున మిత్రుఁడై కడు సహాయ మొనర్చెను కర్ణుఁ డాజిలోన్"

7, ఫిబ్రవరి 2019, గురువారం

సమస్య - 2923 (భావజు సుమాస్త్రమే...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"భావజు సుమబాణమె యమపాశమ్ము గదా"
(లేదా...)
"మరుని సుమాస్త్రమే యముని మారణపాశ మటంచు నెంచెదన్"

6, ఫిబ్రవరి 2019, బుధవారం

సమస్య - 2922 (విధవా రమ్మనెను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"విధవా రమ్మనెను సతియె విభునిన్ బ్రేమన్"
(లేదా...)
"విధవా రమ్మని పిల్చె నాతి విభునిన్ బ్రేమాతిరేకమ్మునన్"

5, ఫిబ్రవరి 2019, మంగళవారం

సమస్య - 2921 (నక్రంబులె సంతు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నక్రంబులె సంతు నీకు నాగాభరణా"
(లేదా...)
"నక్రంబుల్ మఱి నత్తగుల్లలును సంతానంబు నీకౌ శివా"

4, ఫిబ్రవరి 2019, సోమవారం

సమస్య - 2920 (రారమ్మని పిలిచె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రారమ్మని పిలిచె సాధ్వి రంజిల విటులన్"
(లేదా...)
"రారమ్మంచును బిల్చె సాధ్వి విటులం రంజింపఁ జేయన్ దమిన్"

3, ఫిబ్రవరి 2019, ఆదివారం

సమస్య - 2919 (పద్యములలోన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పద్యములలోన యతులేల ప్రాసలేల"
(లేదా...)
"పద్యము వ్రాయఁగన్ యతులుఁ బ్రాసలతోఁ బని యేమి మిత్రమా"

2, ఫిబ్రవరి 2019, శనివారం

సమస్య - 2918 (ఇద్దరు సతులున్న...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ఇద్దఱు సతులున్న వాని కెంతొ శమంబౌ"
(లేదా...)
"ఇద్దఱు పెండ్లముల్ గలిగెనేని ప్రశాంతత దక్కు నిత్యమున్" 

1, ఫిబ్రవరి 2019, శుక్రవారం

సమస్య - 2917 (యోగికి యోగమ్ము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"యోగికి యోగమ్ము నేర్పె యోగి ముదమునన్"
(లేదా...)
"యోగికి యోగి యోగ్యమగు యోగ నియోగ మొనర్చె యోగ్యుఁడై"