31, జులై 2019, బుధవారం
సమస్య - 3091 (పడమట నుదయించి...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పడమట నుదయించి తరణి ప్రాగ్దిశ కేఁగెన్"
(లేదా...)
"పడమట నుద్భవించి రవి ప్రాగ్దిశఁ జేరఁగ సాగె ముందుకున్"
(విట్టుబాబు గారికి ధన్యవాదాలతో...)
30, జులై 2019, మంగళవారం
సమస్య - 3090 (శవమ లేచి...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శవమ లేచి రమ్ము సంతసమున"
(లేదా...)
"శవమా సంతస మొప్ప రమ్ము వడిగన్ శశ్వద్యశశ్శాలివై"
29, జులై 2019, సోమవారం
సమస్య - 3089 (దివ్వె వెలుఁగెడి...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దివ్వె వెలుఁగెడి గదిలోన తిమిర ముండె"
(లేదా...)
"దివ్వె వెలుంగు చున్నను గదిన్ నలువంకలఁ గ్రమ్మెఁ జీఁకటుల్"
28, జులై 2019, ఆదివారం
సమస్య - 3088 (సదయుఁడు...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సదయుఁడు గంటం బడఁడు విశాఖనగరిలోన్"
(లేదా...)
"కరుణాత్ముండు విశాఖ పట్టణములోఁ గన్పట్ట డొక్కం డయో"
27, జులై 2019, శనివారం
దత్తపది -159
కవిమిత్రులారా,
"తట్ట - గుట్ట - చుట్ట - పుట్ట"
పై పదాలను ప్రయోగిస్తూ
'స్వచ్ఛభారత్' లక్ష్యాల గురించి
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యం వ్రాయండి.
26, జులై 2019, శుక్రవారం
సమస్య - 3087 (తొమ్మిదిలో...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ"
(లేదా...)
"తొమ్మిదిలో నొకం డుడుగఁ దొయ్యలిరో పదియౌను సత్యమే"
25, జులై 2019, గురువారం
సమస్య - 3086 (గరళము లభియించదు...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గరళము లభియించ దకట కత్తియు లేదే"
(లేదా...)
"గరళమ్మింత లభించదే యకట ఖడ్గంబైనఁ జేఁజిక్కదే"
24, జులై 2019, బుధవారం
సమస్య - 3085 (పరమతమ్ముల...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పరమతమ్ముల దూషింపవలెను సతము"
(లేదా...)
"పరమతదూషణమ్ము సలుపన్ వలె నెప్పుడు సద్గుణోత్తముల్"
23, జులై 2019, మంగళవారం
సమస్య - 3084 (అప్పు లేని...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అప్పు లేని నరుఁడు వ్యర్థుఁడు గద"
(లేదా...)
"అప్పులు లేని మానవుని వ్యర్థుఁడుగా గణియింత్రు సజ్జనుల్"
22, జులై 2019, సోమవారం
సమస్య - 3083 (మీసంబులు...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మీసంబులు దెల్లనయ్యె మీనాక్షి కహా"
(లేదా...)
"మీసంబుల్ గడుఁ దెల్లనయ్యెను గదా మీనాక్షికిన్ వింతగన్"
21, జులై 2019, ఆదివారం
సమస్య - 3082 (తప్పులఁ జూప....)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తప్పులఁ జూపంగ ముదమె దక్కును నాకున్"
(లేదా...)
"తప్పులఁ జూప నాకెపుడు దక్కుచునుండును సంతసం బిటన్"
(ఈ సమస్యను పంపిన వజ్జల రంగాచార్యులు గారికి ధన్యవాదాలు)
(లేదా...)
"తప్పులఁ జూప నాకెపుడు దక్కుచునుండును సంతసం బిటన్"
(ఈ సమస్యను పంపిన వజ్జల రంగాచార్యులు గారికి ధన్యవాదాలు)
20, జులై 2019, శనివారం
సమస్య - 3081 (పరమాత్ముని సేవ...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పరమాత్ముని సేవఁ జేయఁ బాపమె కల్గున్"
(లేదా...)
"పరమాత్మార్చన సేయు మానవులకుం బాపంబులే చేకుఱున్"
(ఈరోజు పూరణలు ప్రసారమయ్యే ఆకాశవాణి వారి సమస్య)
19, జులై 2019, శుక్రవారం
సమస్య - 3080 (చెలివో తల్లివొ...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చెలివో తల్లివొ వదినవొ జేజమ్మవొకో"
(లేదా...)
"చెలివో చెల్లివొ తల్లివో వదినవో జేజమ్మవో యత్తవో"
18, జులై 2019, గురువారం
సమస్య - 3079 (ఇల్ల్రరికమ్మేఁగ...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఇల్లరికమ్మేఁగ దోష మెట్లగు జగతిన్"
(లేదా...)
"ఇల్లరికంపు టల్లుఁడుగ నేఁగుట యెట్లగు దోష మిద్ధరన్"
(ధవళ భార్గవ్ గారికి ధన్యవాదాలతో...)
17, జులై 2019, బుధవారం
సమస్య - 3078 (పుట్టిన దినమంచు...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పుట్టిన దినమంచును బొరిపొరి యేడ్చిరయో"
(లేదా...)
"పొరిపొరి యేడ్చి రెల్లఱునుఁ బుట్టిన ప్రొద్దని లోకు లయ్యయో"
(ఈరోజు నా జన్మదినం!)
16, జులై 2019, మంగళవారం
సమస్య - 3077 (మేఘము లేక...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మేఘమే లేక వర్షము మిగులఁ గురిసె"
(లేదా...)
"మేఘము లేక వర్షము లమేయముగాఁ గురిసెన్ విచిత్రమే"
(ఈ సమస్యను పంపిన బొగ్గరం ప్రసాద రావు గారికి ధన్యవాదాలు)
15, జులై 2019, సోమవారం
సమస్య - 3076 (మారణ హోమమే...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మారణహోమంబు శాంతిమంత్రం బయ్యెన్"
(లేదా.....)
"మారణహోమమే మహిత మంజుల మంత్రము శాంతిఁ గూర్పఁగన్"
(ఈ సమస్యను పంపిన బొగ్గరం ప్రసాద రావు గారికి ధన్యవాదాలు)
14, జులై 2019, ఆదివారం
సమస్య - 3075 (హంపి విడిచి...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"హంపి విడిచి పారెను విరూపాక్షుఁ డడలి"
(లేదా...)
"హంపీ క్షేత్రము వీడి పారెను విరూపాక్షుండు భీతాత్ముఁడై"
(ఈరోజు నేను హంపీక్షేత్రాన్ని దర్శిస్తున్న సందర్భంగా)
13, జులై 2019, శనివారం
సమస్య - 3074 (కవి యొక్కండును...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కవి యొకఁడును గానరాఁడు గర్ణాటమునన్"
(లేదా...)
"కవి యొక్కండును గానరాఁడు వెదుకం గర్ణాటదేశమ్మునన్"
(ఈరోజు బెంగుళూరులో నా 'వరద శతకము' ఆవిష్కరణ)
12, జులై 2019, శుక్రవారం
సమస్య - 3073 (కాకరతీఁగలకు...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కాకర తీఁగలకు నల్లకలువలు పూసెన్"
(లేదా...)
"కలువలు పూసె నల్లనివి కాకర తీఁగలకున్ భళీ భళీ"
(ఈ సమస్యను పంపిన శాస్త్రుల రఘుపతి గారికి ధన్యవాదాలు)
11, జులై 2019, గురువారం
సమస్య - 3072 (మార్గశీర్షమందు...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మార్గశీర్షమందు మాఘ మలరె"
(లేదా...)
"మాఘము సంక్రమించినది మార్గశిరంబునఁ గార్తికం బనన్"
(ఈ సమస్యను పంపిన శాస్త్రుల రఘుపతి గారికి ధన్యవాదాలు)
10, జులై 2019, బుధవారం
సమస్య - 3071 (కవివర్యున్...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కవినిఁ బురస్కృతునిఁ జేయఁగా వ్యర్థమగున్"
(లేదా...)
"కవివర్యున్ బిలిపించి యిచ్చెడి పురస్కారమ్ము వ్యర్థంబగున్"
(ఈరోజు నేను కోరుట్లలో అందె వేంకటరాజము స్మారక పురస్కారం
అందుకుంటున్న సందర్భంగా....)
9, జులై 2019, మంగళవారం
సమస్య - 3070 (మాట తీపి....)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మాట తీపి కాలకూట మెడఁద"
(లేదా...)
"మచ్చిక మీఱ తియ్యనగు మాట లెదం గనఁ గాలకూటమే"
8, జులై 2019, సోమవారం
సమస్య - 3069 (వేయంచుల కైదువు...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వేయంచుల కైదువుఁ గొని విష్ణువు సెలఁగెన్"
(లేదా...)
"వేయంచుల్ గల కైదువుం గొని మహావిష్ణుండు రేగెన్ వడిన్"
7, జులై 2019, ఆదివారం
సమస్య - 3068 (శ్రీరాముని రోసిరి...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శ్రీరాముని రోసిరెల్ల రేపల్లె జనుల్"
(లేదా...)
"శ్రీరామున్ జనులెల్ల రోసిరి కదా రేపల్లెలోఁ జూడఁగన్"
6, జులై 2019, శనివారం
సమస్య - 3067 (పాపి యొక్కఁడు...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పాపి యొక్కఁడు సన్మానపాత్రుఁ డయ్యె"
(లేదా...)
"నయదూరుండగు పాపి యొక్కరుఁడు సన్మానంబుఁ బొందెన్ సభన్"
5, జులై 2019, శుక్రవారం
సమస్య - 3066 (పూరణఁ జేయంగ...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పూరణఁ జేయంగఁ బలుకుఁబోఁడికిఁ దరమే"
(లేదా...)
"పూరణఁ జేయఁగాఁ బలుకుఁబోఁడికి బ్రహ్మకునైన సాధ్యమే"
(జిలేబీ గారికి ధన్యవాదాలతో....)
(లేదా...)
"పూరణఁ జేయఁగాఁ బలుకుఁబోఁడికి బ్రహ్మకునైన సాధ్యమే"
(జిలేబీ గారికి ధన్యవాదాలతో....)
4, జులై 2019, గురువారం
న్యస్తాక్షరి - 64
కవిమిత్రులారా,
గ్రంథపఠనం వల్ల ప్రయోజనాలను తెలుపుతూ
ఉత్పలమాల వ్రాయండి.
న్యస్తాక్షరాలు.......
మొదటి పాదం 5వ అక్షరం 'పు'
రెండవ పాదం 11వ అక్షరం 'స్త'
మూడవ పాదం 14వ అక్షరం 'క'
నాల్గవ పాదం 17వ అక్షరం 'ము'
(లేదా...)
నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా "పు - స్త - క - ము" ఉండే విధంగా ఆటవెలది వ్రాయండి
(లేదా...)
నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా "పు - స్త - క - ము" ఉండే విధంగా ఆటవెలది వ్రాయండి
3, జులై 2019, బుధవారం
సమస్య - 3065 (గుట్టలు మున్నీటిలోన...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గుట్టలు మున్నీటిలోన గునగున నడచెన్"
(లేదా...)
"నగములు వార్ధిలో గునగునన్ నడచెన్ గడు సుందరమ్ముగన్"
(ఈ సమస్యను పంపిన కె. బాలస్వామి గారికి ధన్యవాదాలు)
2, జులై 2019, మంగళవారం
సమస్య - 3064 (చార్వాకుండు....)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చార్వాకుం డాస్తికుండు సద్భక్తుఁడె పో"
(లేదా...)
"చార్వాకుండను మౌని యాస్తికుఁడుగా సద్భక్తుఁడై యొప్పెఁ బో"
1, జులై 2019, సోమవారం
దత్తపది - 158
హరి - మాధవ - కేశవ - అచ్యుత
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ శివుని స్తుతిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.