30, సెప్టెంబర్ 2019, సోమవారం

సమస్య - 3148 (చైత్రములోన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చైత్రమునఁ గడుపై కనె శ్రావణమున"
(లేదా...)
"చైత్రములోనఁ దప్పె నెల జన్మ మొసంగెను శ్రావణంబునన్"
(గంగుల ధర్మరాజు గారికి ధన్యవాదాలతో...)

29, సెప్టెంబర్ 2019, ఆదివారం

సమస్య - 3147 (ఏడ్పే యిష్టమ్ము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఏడ్పే యిష్టమ్ము నా కదే మోద మిడున్"
(లేదా...)
"ఏడ్పే యిష్ట మటంచుఁ జెప్పెద నదే యెంతేని మోదం బిడున్"
(ఆముదాల మురళి గారి శ్రీకాకుళం శతావధాన సమస్య)

28, సెప్టెంబర్ 2019, శనివారం

సమస్య - 3146 (చుక్కలు భూమిపై...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చుక్కలు భువిపైన వెల్గెఁ జోద్యం బయ్యెన్"
(లేదా...)
"చుక్కలు భూమిపై వెలిఁగె సూర్యుఁడు చంద్రుఁడుఁ జోద్యమందఁగన్"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి వారి సమస్య)

27, సెప్టెంబర్ 2019, శుక్రవారం

సమస్య - 3145 (ఏనుఁగు చంపనోపునొకొ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చంపఁగలదె యేనుంగు మూషకమునైన"
(లేదా...)
"ఏనుఁగు చంపనోపునొకొ యెల్కఁ గడుంగడు విక్రమించినన్"
(డా. వెలుదండ సత్యనారాయణ గారు పంపిన సమస్య)

26, సెప్టెంబర్ 2019, గురువారం

సమస్య - 3144 (ఎంత పండితుండైన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ఎంత పండితుండైనఁ దా నెఱుఁగఁ గలఁడె"
(లేదా...)
"ఎంతటి పండితుండయిన నేర్పడఁ దా నెఱుఁగంగ శక్యమే"
(డా. వెలుదండ సత్యనారాయణ గారు పంపిన సమస్య)

25, సెప్టెంబర్ 2019, బుధవారం

సమస్య - 3143 (నకులునితోడ రాఘవుఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

"నకులునితో రాఘవుఁడు రణం బొనరించెన్"
(లేదా...)
"నకులునితోడ రాముఁడు రణం బొనరించె బుధుల్ నుతింపఁగన్"
(ఆముదాల మురళి గారి శ్రీకాకుళం శతావధాన సమస్య)

24, సెప్టెంబర్ 2019, మంగళవారం

సమస్య - 3142 (పాటలగంధి యింపుగను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మాటలే రాని మగువయే పాటఁ బాడె"
(లేదా...)
"పాటలగంధి యింపుగను బాడెను మాటలు రాకపోయినన్"

(పోచిరాజు కామేశ్వర రావు గారు పంపిన సమస్య)

23, సెప్టెంబర్ 2019, సోమవారం

సమస్య - 3141 (కులమును గుర్తించు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కులమును గుర్తించు వాఁడె గురువన నొప్పున్"
(లేదా...)
"కులముం గాంచియు బోధ సేయు గురువే క్షోణిన్ గడున్ బూజ్యుఁడౌ"

22, సెప్టెంబర్ 2019, ఆదివారం

సమస్య - 3140 (తమిళులకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తమిళులకు తెల్గుబాసపై తగని ప్రీతి"
(లేదా...)
"తమిళులకున్ దెలుంగనినఁ దద్దయుఁ బ్రీతి యటన్న నమ్ముమా"
(ఈరోజు తమిళనాడులోని హోసూరులో శ్రీమతి జయలక్ష్మి గారి పుస్తకావిష్కరణ సభలో నేను పాల్గొంటున్న సందర్భంగా...)

21, సెప్టెంబర్ 2019, శనివారం

సమస్య - 3139 (వచ్చెను మార్గశీర్షమున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మార్గశిరమందు వచ్చె నామని పుడిమికి"
(లేదా...)
"వచ్చెను మార్గశీర్షమున భవ్యవసంతము ధాత్రి నిండుగన్"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి వారి సమస్య)

20, సెప్టెంబర్ 2019, శుక్రవారం

సమస్య - 3138 (స్తంభంబునఁ బుట్టి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"స్తంభంబునఁ బుట్టి చంపె స్కందుం డసురున్"
(లేదా...)
"స్తంభంబందునఁ బుట్టి చంపె నసురున్ స్కందుండు సంరంభియై"

19, సెప్టెంబర్ 2019, గురువారం

సమస్య - 3137 (జలముఁ జల్లినంత...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"జలముఁ జల్లినంత జ్వాల లెగసె"
(లేదా...)
"జలమునుఁ దెచ్చి చల్లఁగనె జ్వాలలు రేఁగె నిదేమి చిత్రమో"

18, సెప్టెంబర్ 2019, బుధవారం

సమస్య - 3136 (మత్స్యాహారమె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మత్స్యాహారమ్మె మేలు మౌనివరులకున్"
(లేదా...)
"మత్స్యాహారమె మేలు మౌనులకు ధర్మజ్ఞోక్తియౌ నిద్దియే"

17, సెప్టెంబర్ 2019, మంగళవారం

సమస్య - 3135 (కుజనులు క్రూరాత్ములు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కుజనులు క్రూరాత్ములు గద గుంటూరు జనుల్"
(లేదా...)
"కుజనుల్ క్రూరమనస్కు లెల్లరు గదా గుంటూరు వాసుల్ గనన్"
(మొన్న శ్రీకాకుళం వెళ్తున్నపుడు రైలు గుంటూరు స్టేషనులో ఆగినప్పుడు సిద్ధమైన సమస్య. గోలి హనుమచ్ఛాస్త్రి గారు, బొగ్గరం ప్రసాద రావు గారు తదితర గుంటూరు మిత్రులు క్షమిస్తారని ఆశిస్తూ...)

16, సెప్టెంబర్ 2019, సోమవారం

సమస్య - 3134 (శుష్కకార్యము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శుష్కకార్యము పుస్తకావిష్కరణము"
(లేదా...)
"వినుమా వ్యర్థమె సుమ్ము పుస్తకము నావిష్కారమున్ జేయఁగన్"
(ఈరోజు గుండు మధుసూదన్ గారి పుస్తకావిష్కరణ సందర్భంగా...)

15, సెప్టెంబర్ 2019, ఆదివారం

సమస్య - 3133 (శ్రీనాథుండు చరించి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శ్రీనాథుఁడు రోసెనంట శ్రీకాకుళమున్"
(లేదా...)
"శ్రీనాథుండు చరించి రోసెనఁట యీ శ్రీకాకుళమ్మున్ గటా"
(మొన్న శ్రీకాకుళంలో ఆముదాల మురళి గారి శతావధానంలో నేనిచ్చిన సమస్య)

14, సెప్టెంబర్ 2019, శనివారం

సమస్య - 3132 (పడమటి దిక్కులో...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పడమట నుదయించె నినుఁడు ప్రాగ్దిశఁ గ్రుంకెన్"
(లేదా...)
"పడమటి దిక్కులో పొడిచె భానుడు గ్రుంకెను తూర్పు దిక్కులో"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి వారి సమస్య)

13, సెప్టెంబర్ 2019, శుక్రవారం

సమస్య - 3131 (జనకుని సేవించు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"జనకుని సేవించు సుతుఁడు చను యమపురికిన్"
(లేదా...) 
"జనకుని సేవఁ జేయు తనుజాతుఁడు రౌరవ మంది చింతిలున్"

12, సెప్టెంబర్ 2019, గురువారం

సమస్య - 3130 (దైవమునుఁ గొల్వ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దైవమునుఁ గొల్వరాదంద్రు ధర్మవిదులు"
(లేదా...)
"దైవమ్మున్ గొలువంగ రాదని రయో ధర్మజ్ఞులున్ యోగులున్"

11, సెప్టెంబర్ 2019, బుధవారం

సమస్య - 3129 (కంబు సుమీ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కంబు సుమీ ముఖము రతి సుఖంబును బొందన్"
(లేదా...)
"కంబు సుమీ ముఖం బతి సుఖంబు సుమీ రతి నోలలాడగన్"

10, సెప్టెంబర్ 2019, మంగళవారం

సమస్య - 3128 (నల్లని యుత్పలమ్ము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నల్లని యుత్పలము దోచె నభమున శశియై"
(లేదా...)
"నల్లని యుత్పలమ్ము గగనమ్మునఁ దోచె శశాంకబింబమై"

9, సెప్టెంబర్ 2019, సోమవారం

సమస్య - 3127 (వనవాసమె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వనవాసమె సంపదను శుభంబు నొసంగున్"
(లేదా...)
"వనములలో వసించిన శుభంబు ధనంబు యశంబు దక్కురా"

8, సెప్టెంబర్ 2019, ఆదివారం

సమస్య - 3126 (తల్లికిఁ గొమరుండు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తల్లికిఁ గొమరుండు సూత్రధారణఁ జేసెన్"
(లేదా...)
"తల్లికిఁ బ్రీతి సూత్రమును ధారణఁ జేసెను పుత్రుఁ డంతటన్"

7, సెప్టెంబర్ 2019, శనివారం

సమస్య - 3125 (అజ్ఞానమ్ము వికాస...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అజ్ఞానము వికసనమును హ్లాద మొసంగున్"
(లేదా...)
"అజ్ఞానమ్ము వికాసదాయక మహో హ్లాదమ్ముఁ బండించెడిన్"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి సమస్య)

6, సెప్టెంబర్ 2019, శుక్రవారం

సమస్య - 3124 (కారముఁ గని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్"
(లేదా...)
"కారముఁ జూచి దేవుఁడని గట్టిన నమ్మెను చిత్ర మెట్టులౌ"

5, సెప్టెంబర్ 2019, గురువారం

సమస్య - 3123 (బడి కేగని...)


కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"బడి కేగని పంతులె కడు ప్రాభవమొందున్"
(లేదా...)
"బడికిఁ జనంగలే ననెడి పంతులె ప్రాభవమొందు మెండుగన్"

4, సెప్టెంబర్ 2019, బుధవారం

దత్తపది - 161

కవిమిత్రులారా,
'లంగా - చీర - రవిక - పయట'
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
భారతార్థంలో స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి. 

3, సెప్టెంబర్ 2019, మంగళవారం

సమస్య - 3121 (మకరినిఁ జంపి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కరుణతో నుమాపతి గాచెఁ గరివరేణ్యు"
(లేదా...)
"మకరినిఁ జంపి సత్కృప నుమాపతి గాచెఁ గరీంద్రు ప్రాణమున్"

2, సెప్టెంబర్ 2019, సోమవారం

న్యస్తాక్షరి - 65


కవిమిత్రులారా,
'వి - నా - య - కా'
పై అక్షరాలు వరుసగా పాదాంతంలో వచ్చే విధంగా 
వినాయకుని స్తుతిస్తూ 
కందం లేదా ఏదైనా వృత్తపద్యం వ్రాయండి. 

1, సెప్టెంబర్ 2019, ఆదివారం

సమస్య - 3122 (కర్ణపేయమ్ముగా...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కర్ణపేయమ్ముగాఁ బాడె గార్దభమ్ము"
(లేదా...)
"గాడిద కర్ణపేయముగ గానము సేయఁగ మెచ్చి రెల్లరున్"