30, నవంబర్ 2019, శనివారం

సమస్య - 3207 (వడ్డనఁ జేయువాఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వడ్డించెడివాఁడు శత్రువా? తిననొప్పున్"
(లేదా...)
"వడ్డనఁ జేయువాఁడు పగవాడె తినందగు నిర్భయమ్ముగన్"
(ఈరోజు పూరణలు ప్రసార కానున్న ఆకాశవాణి సమస్య)

29, నవంబర్ 2019, శుక్రవారం

సమస్య - 3206 (నిప్పులకొండ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నిప్పులకొండ యనఁదగును నీహారాద్రిన్"
(లేదా...)
"నీహారాద్రిని నిప్పుకొండ యని వర్ణింపంగ నొప్పున్ గృతిన్"

28, నవంబర్ 2019, గురువారం

సమస్య - 3205 (మంచము క్రింద...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మంచము క్రిందన్ జొరఁబడె మానధనుండే"
(లేదా...)
"మంచము క్రిందఁ జొచ్చె నభిమానధనుండు సభీతచిత్తుఁడై"
(కాలక్షేపానికి 'కన్యాశుల్కం' సినిమా చూస్తుండగా సిద్ధమైన సమస్య...)

27, నవంబర్ 2019, బుధవారం

సమస్య - 3204 (షట్పద మొనరించు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"షట్పద మొనరించునొక్కొ ఝంకారమ్మున్"
(లేదా...)
"షట్పద మెప్పుడేనియును ఝంకృతిఁ జేయునె పుష్పవాటికన్"

26, నవంబర్ 2019, మంగళవారం

సమస్య - 3203 (రాతిరి భాస్కరుఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రాతిరి భాస్కరుఁడు వొడమె ప్రాక్శైలముపై"
(లేదా...)
"రాతిరియందు భాస్కరుఁడు ప్రాగ్గిరిపైఁ బొడసూపెఁ జూడఁగన్"

25, నవంబర్ 2019, సోమవారం

సమస్య - 3202 (కరములు లేనివాఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కరములు లేనట్టివాఁడు కత్తుల దూసెన్"
(లేదా...)
"కరములు లేనివాఁడు చురకత్తుల దూసెను యుద్ధభూమిలో"
(ఆముదాల మురళి గారి అష్టాధానం సమస్య)

24, నవంబర్ 2019, ఆదివారం

సమస్య - 3201 (కుత్సితుఁడైన....)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కుత్సితుఁడైనట్టివాఁడె గురువన నొప్పున్"
(లేదా...)
"కుత్సితుఁడైన వ్యక్తియె తగున్ గురువై జన సంస్తుతుల్ గొనన్"

23, నవంబర్ 2019, శనివారం

సమస్య - 3200 (కలికిరొ కొల్వఁగాఁ దగదు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కలికి! శివపూజఁ జేయకు కార్తికమున"
(లేదా...)
"కలికిరొ! కొల్వఁగాఁ దగదు కార్తికమాసమునందు శంకరున్"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి సమస్య)

22, నవంబర్ 2019, శుక్రవారం

సమస్య - 3199 (పుస్తక చౌర్యమే...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పుస్తక చౌర్యమునఁ గలుఁగు బుధులకుఁ గీర్తుల్"
(లేదా...)
"పుస్తక చౌర్యమే యశముఁ బొందఁగఁ జేయు బుధాగ్రగణ్యులన్"

21, నవంబర్ 2019, గురువారం

సమస్య - 3198 (విజ్ఞుఁ డననొప్పు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"విజ్ఞుఁ డననొప్పుఁ గర్తవ్యవిముఖుఁ డెపుడు"
(లేదా...)
"ఘనవిజ్ఞుండుగఁ గీర్తిఁ దెచ్చును గదా కర్తవ్యవైముఖ్యమే"

20, నవంబర్ 2019, బుధవారం

సమస్య - 3197 (హితబోధల వినెడి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"హితబోధల వినెడివారికే కీడొదవున్"
(లేదా...)
"హితబోధల్ వినువారికే యొదవుఁ గీడెల్లప్డు యోచించినన్"

19, నవంబర్ 2019, మంగళవారం

సమస్య - 3196 (రాజధాని లేని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రాజధాని లేని రాజ్యమయ్యె"
(లేదా...)
"రాజ్యము రాజధాని గనరానిది రాజెట నుండి యేలునో"

18, నవంబర్ 2019, సోమవారం

సమస్య - 3195 (వ్యాధి నయ మొనర్చు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వ్యాధి నయ మొనర్చు న్యాయవాది"
(లేదా...)
"వ్యాధిని న్యాయవాదియె నయం బొనరించును వాగ్బలంబునన్"

17, నవంబర్ 2019, ఆదివారం

సమస్య - 3194 (భార్యనుఁ గనినంత...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"భార్యనుఁ గనినంత భర్త వడవడ వడఁకెన్"
(లేదా...)
"కనుఁగొని భార్యనంత వడఁకం దొడఁగెం బతి భీతచిత్తుఁడై"

16, నవంబర్ 2019, శనివారం

సమస్య - 3193 (ధర్మము వీడు వారలకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ధర్మచ్యుతులకె శుభములు దప్పక కల్గున్"
(లేదా...)
"ధర్మము వీడు వారలకుఁ దప్పక కల్గును శాంతి సౌఖ్యముల్"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి సమస్య)

15, నవంబర్ 2019, శుక్రవారం

సమస్య - 3192 (వస్తాలే వినిపిస్త...)

కవిమిత్రులారా,
(మన జి. ప్రభాకర శాస్త్రి గారి 'సరదా పూరణలు' చదివి, చదివి 
నాకూ ఓ సరదా సమస్య ఇవ్వాలనిపించింది)
ఈరోజు పూరింపవలసిన సరదా సమస్య ఇది...
"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"
(లేదా...)
"వస్తాలే వినిపిస్త పద్యశతకం బస్తాడు పేలాలకున్"
(ఇది సరదా సమస్య కనుక మీ పూరణలలో వ్యావహారిక, గ్రామ్య, అన్యదేశ్య పదాలను, యడాగమ నుగాగమాలను, దుష్టసమాసాలను పట్టించుకోను. కాని గణ యతి ప్రాసలు తప్పకుండా ఉండాలి)

14, నవంబర్ 2019, గురువారం

సమస్య - 3191 (చదువని బాలలె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చదువని బాలలె గడింత్రు జాతికి కీర్తిన్"
(లేదా...)
"చదువని బాల బాలికలె జాతికిఁ గీర్తి గడింతు రెల్లెడన్"

13, నవంబర్ 2019, బుధవారం

సమస్య - 3190 (శుభములు లభియించు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శుభములు లభియించుఁ గాక చోర విటులకున్"
(లేదా...)
"శుభములు గల్గుఁ గాక ఖల చోర విటాళికి శిష్టు లౌననన్"

12, నవంబర్ 2019, మంగళవారం

సమస్య - 3189 (మాతృభాషలోఁ జదువుట...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మాతృభాషలోఁ జదువుట మానుటొప్పు"
(లేదా...)
"మన బడులందిఁకన్ జదువు మానుటె యొప్పగు మాతృభాషలో"

11, నవంబర్ 2019, సోమవారం

సమస్య - 3188 (ప్రతిభ లేనివాఁడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ప్రతిభ లేనివాఁడె పండితుండు"
(లేదా...)
"ప్రతిభాశూన్యుఁడె మేటి పండితుఁడుగాఁ బ్రఖ్యాతుఁడౌ నిద్ధరన్"

10, నవంబర్ 2019, ఆదివారం

సమస్య - 3187 (ప్రజలెల్లరు రోసిరి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ప్రజలెల్లరు రోసిరయ్యొ పద్యమ్ములనే"
(లేదా...)
"ప్రజలు దృణీకరించిరఁట పద్యకవిత్వము వద్దటం చయో"
(ఈరోజు 'ప్రజ-పద్యం' సమూహం వారి పద్య పట్టాభిషేకోత్సవం)

9, నవంబర్ 2019, శనివారం

సమస్య - 3186 (చలికాలమున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చలికాలమున వడదెబ్బ చప్పునఁ దగిలెన్"
(లేదా...)
"తగిలెను శీతకాలమున దారుణమౌ వడదెబ్బ చప్పునన్"

8, నవంబర్ 2019, శుక్రవారం

సమస్య - 3185 (రతి మూలము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రతి మూలము సర్వధర్మ రక్షణ కొఱకై"
(లేదా...)
"రతియే మూలము సర్వధర్మముల సంరక్షింప లోకమ్మునన్"

7, నవంబర్ 2019, గురువారం

సమస్య - 3184 (హరుని కరమునందు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"హరుని కరమునందు చక్ర మలరారుఁ గదా"
(లేదా...)
"హరుని కరంబులందు నలరారుచునుండును శంఖచక్రముల్"

6, నవంబర్ 2019, బుధవారం

సమస్య - 3183 (మరణమ్మును...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మరణమ్మును గోరుకొంద్రు మానవులెల్లన్"
(లేదా...)
"మరణముఁ గోరుకొందురట మానవు లెల్లరు ముక్తకంఠులై"

5, నవంబర్ 2019, మంగళవారం

న్యస్తాక్షరి - 66

కవిమిత్రులారా,
'సు - ప్ర - భా - తం'
పై అక్షరాలతో వరుసగా నాలుగు పాదాలను ప్రారంభిస్తూ
సూర్యోదయాన్ని వర్ణిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి. 

4, నవంబర్ 2019, సోమవారం

సమస్య - 3182 (వేసమ్మె ప్రధానమగును...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వేసమ్మె ప్రధానమగును వేదాంతమునన్"
(లేదా...)
"వేసమ్మే కడు ముఖ్యమౌను గనఁగన్ వేదాంతసారం బిదే"

3, నవంబర్ 2019, ఆదివారం

సమస్య - 3181 (అన్నప్రాశనము....)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అన్నప్రాశనముఁ జేయుఁ డాఱవయేటన్"
(లేదా...)
"అన్నప్రాశన మాచరింప హితమౌ నాఱేండ్లకున్ సద్విధిన్"
(నేడు అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి మనుమడి అన్నప్రాశనోత్సవము)

2, నవంబర్ 2019, శనివారం

సమస్య - 3180 (కలువలు కత్తులయ్యెడిని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కలువ కత్తి దండ కార్ముకమ్ము"
(లేదా...)
"కలువలు కత్తులయ్యెడిని కార్ముకముల్ విరిదండలయ్యెడిన్"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి సమస్య)

1, నవంబర్ 2019, శుక్రవారం

సమస్య - 3179 (కార్తికమాసమందు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కార్తికమున శివుని గుడినిఁ గాలిడఁ దగునే"
(లేదా...)
"కార్తికమాసమందుఁ జొరగం దగ దే శివమందిరమ్మునన్"