31, మార్చి 2020, మంగళవారం

సమస్య - 3325 (పతి సంపర్కము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పతి సంపర్కమ్ము లేక పడసెం బుత్రున్"
(లేదా...)
"పతి సంపర్కము లేక పుత్రుని గనెన్ వామాక్షి సచ్ఛీలయై"

30, మార్చి 2020, సోమవారం

సమస్య - 3324 (మదిరాపాన విశేష...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మదిరాపానరతులు గద మాచర్ల జనుల్"
(లేదా...)
"మదిరాపాన విశేష మత్తులు గదా మాచర్ల వాసుల్ సదా"
(మొన్న మాచర్లలో ఐతగోని వెంకటేశ్వర్లు గారి అవధానంలో నేనిచ్చిన సమస్య)

29, మార్చి 2020, ఆదివారం

సమస్య - 3323 (పండు మంచిది...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పండు మంచిది తినఁ బనికిరాదు"
(లేదా...)
"పండది మంచిదైనఁ దిన పాత్రము గాని దెఱుంగు మెప్పుడున్"

28, మార్చి 2020, శనివారం

శార్వరి ఉగాది పద్య సంకలనము

        నిన్న ప్రకటించిన ఉగాది పద్య సంకలనం అందరికీ ఆనందాన్ని కలిగించింది. సామూహిక భాగస్వామ్యంతో పుస్తకంగా ముద్రించాలని అందరి కోరిక. ఈ కరోనా వ్యగ్రత తొలగిన తర్వాత అలాగే చేద్దాం. ఇప్పుడు తొందర లేదు.
        అయితే ఇప్పటి పి.డి.యఫ్.లో కొన్ని పొరపాట్లు దొర్లాయి. కొందరు పంపిన ఉగాది పద్యాలు నా అజాగ్రత్త వల్ల తప్పిపోయాయి. మరికొందరు "అయ్యో... మాకు తెలియదండీ. ఇప్పుడు పంపించమంటారా?" అని అడిగారు.
        ఎలాగూ పొరపాట్లు సరిచేసి శుద్ధప్రతిని సిద్ధం చేయబోతున్నాను కనుక తప్పిపోయిన కవిమిత్రులు తమ ఉగాది పద్యాలను పంపించ వలసిందిగా కోరుతున్నాను.
        మీ పద్యాలను shankarkandi@gmail.com అన్న చిరునామాకు మెయిల్ చేయండి. లేదా నా వాట్సప్ నెం. 7569822984 కు పంపించండి.

సమస్య - 3322 (నవ వాసంత...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నవ్య వత్సరమిదె కరోనా యనంగ"
(లేదా...)
"నవ వాసంత శుభాగమంబిదె కరోనా నామ నూత్నాబ్దమౌ"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి సమస్య)

27, మార్చి 2020, శుక్రవారం

సమస్య - 3321 (కుసుమపత్రంబు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కుసుమపత్రంబు ఛేదించెఁ గొండ నౌర"
(లేదా...)
"కోమల పుష్పపత్రమదె కొండనుఁ జీల్చెఁ గనంగఁ జిత్రమే"

26, మార్చి 2020, గురువారం

సమస్య - 3320 (బారె శరణమయ్యె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"బారె శరణమయ్యెఁ బండితులకు"
(లేదా...)
"బారె శరణ్యమయ్యెఁ గద పండిత పామరు లెల్లవారికిన్"

25, మార్చి 2020, బుధవారం

ఉగాది కవి సమ్మేలనం

శ్రీ శార్వరి నామ సంవత్సర శుభాకాంక్షలతో...
ఉగాది కవి సమ్మేళనం
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని
మీరు వ్రాసిన ఖండికలను కాని, పద్యాలను కాని
ఇక్కడ ప్రకటించ వలసిందిగా
కవిమిత్రులకు ఆహ్వానం!

సమస్య - 3319 (సకల జనాళి భీతిలఁగ...)

కవిమిత్రులారా,
ఉగాది శుభాకాంక్షలు 2020 కోసం చిత్ర ఫలితం

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సకల జన భయంకరముగ శార్వరి వచ్చెన్"
(లేదా...)
"సకలజనాళి భీతిలఁగ శార్వరి వచ్చెను స్వాగతింపుఁడీ"

సమస్య - 3318 (కడు లాభంబగు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సత్ఫలము లభించు నీచసాంగత్యమునన్"
(లేదా...)
"కడు లాభంబగుఁ గాదె నీచజనసాంగత్యంబు ముమ్మాటికిన్"

23, మార్చి 2020, సోమవారం

దత్తపది - 166 (కత్తి-బాకు-డాలు-విల్లు)

కవిమిత్రులారా,
కత్తి, బాకు, డాలు, విల్లు
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
భారతార్థంలో నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి. 

22, మార్చి 2020, ఆదివారం

సమస్య - 3317 (వందే మాతర మనుట...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వందే మాతర మనుటయె పాపమ్మగురా"
(లేదా...)
"వందే భారత మాతర మ్మనుట పాపమ్మౌను నేరం బగున్"

21, మార్చి 2020, శనివారం

సమస్య - 3316 (దివ్వె వెలుంగు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దివ్వె వెలుంగు గదిలోనఁ దిమిరము నిండెన్"
(లేదా)
"దివ్వె వెలుంగుచుండిన గదిన్ నలువంకల నిండెఁ జీకటుల్"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి సమస్య)

20, మార్చి 2020, శుక్రవారం

సమస్య - 3315 (రాముఁ డేలఁగ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రాముఁ డేలఁగఁ జచ్చిరి ప్రజలు వేలు"
(లేదా...)
"వేమరు చచ్చినారు ప్రజ వేనకు వేలుగ రాముఁ డేలఁగన్"

19, మార్చి 2020, గురువారం

సమస్య - 3314 (గాండీవోద్గత...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గాండీవోద్గత శరప్రకాండము తృణమే"
(లేదా...)
"గాండీవోద్గత దివ్య బాణము గనంగన్ గడ్డితోఁ దుల్యమే"

18, మార్చి 2020, బుధవారం

సమస్య - 3313 (కవితాకన్యక...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కవితాకన్యక యనుజయొ? కాక గృహిణియో?"
(లేదా...)
"కవితాకన్యక నీకు నాడపడుచా? కాకున్న నిల్లాలొకో?"

17, మార్చి 2020, మంగళవారం

సమస్య - 3312 (కోడలివైపు వాఁడనని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కోడలివైపుంటిననుచుఁ గోపింపకుమా"
(లేదా...)
"కోడలివైపు వాఁడనని కోపము నాపయిఁ జూపఁబోకుమా"

సమస్య - 3311 (నాగమ పెండ్లాము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"నాగమ పెండ్లాము బ్రహ్మనాయునకుఁ గదా"
(లేదా...)
"నాగమ బ్రహ్మనాయునకు నచ్చిన పెండ్లము గాదె చూడఁగన్" 
(ఈరోజు మాచెర్లలో ఐతగోని వెంకటేశ్వర్లు గారి అష్టావధానం)

సమస్య - 3310 (ప్రజలు తిరస్కరించిరి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ప్రజల తిరస్కృతియె దక్కెఁ బద్యంబునకున్"
(లేదా...)
"ప్రజలు తిరస్కరించిరిదె పద్యకవిత్వము నన్నిరీతులన్"
(ఈరోజు మిర్యాలగూడలో 'ప్రజ-పద్యం' సమూహ సభ్యుల ఆత్మీయ సమావేశం)

14, మార్చి 2020, శనివారం

సమస్య - 3309 (అచ్చతెలుంగు పద్యమున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అచ్చతెలుఁగు పద్యమున నాంగ్లపదములె హృద్యములగు"
(ఛందో గోపనము)
(లేదా...)
"అచ్చతెలుంగు పద్యమున నాంగ్లపదంబులె శోభఁ గూర్చురా"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి సమస్య)

13, మార్చి 2020, శుక్రవారం

సమస్య - 3308 (ప్రత్యుపకారమ్ము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ప్రత్యుపకారమ్ము సలుపఁ బాపము దక్కున్"
(లేదా...)
"ప్రత్యుపకారమున్ సలుపఁ బాపము దక్కుట తప్ప దెప్పుడున్" 

12, మార్చి 2020, గురువారం

సమస్య - 3307 (వేపాకులతో...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వేపాకులతో వంటఁ జేయుమా రుచ్యంబౌ"
(లేదా...)
"వేపాకుల్ వేసిన వంటకమ్ము గడు రుచ్యంబౌను స్వాస్థ్యంబిడున్"
(ఛందోగోపన సమస్యలు)

11, మార్చి 2020, బుధవారం

సమస్య - 3306 (శ్రీకరముల్...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"బూతుమాటలు శ్రీకరమ్ములు బుధులకు"
(లేదా...)
"శ్రీకరముల్ సుధీజన వశీకరముల్ గద బూతుమాటలే"

10, మార్చి 2020, మంగళవారం

సమస్య - 3305 (అకటా రావణు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రావణుని సంహరించుట రామ! సబబ?"
(లేదా...)
"అకటా రావణు నేలఁ జంపితివి రామా నిర్దయాత్ముండవై"

9, మార్చి 2020, సోమవారం

సమస్య - 3304 (హోళీ పండుగ...)

కవిమిత్రులారా,
Image result for హోళీ శుభాకాంక్షలు
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"హోళీ పండుగను జరుపఁ డొక్కండైనన్"
(లేదా...)
"హోళీ పండుగఁ జేయ నిష్టపడఁ డేయొక్కం డయో దైవమా"

8, మార్చి 2020, ఆదివారం

సమస్య - 3303 (తలయే లేని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తలయె లేనట్టి నరుని నేత్రములు సొబగు"
(లేదా...)
"తలయే లేని నరుం డతండు గన నేత్రంబుల్ గడున్ సౌరులౌ"

7, మార్చి 2020, శనివారం

సమస్య - 3302 (తనువు లేదఁట...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తనువుఁ గనము మీటెను యువతంత్రుల వెఱఁగౌ"
(లేదా...)
"తనువు లేదఁట చిత్రమే యువతంత్రులన్ మఱి మీటెడిన్"
(ఈరోజు పూరణలు ప్రసారం కానున్న ఆకాశవాణి సమస్య)

6, మార్చి 2020, శుక్రవారం

సమస్య - 3301 (ధనధాన్యము లెన్ని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ధనధాన్యము లెన్ని యున్న దారిద్ర్యమ్మే"
(లేదా...)
"ధనధాన్యమ్ములు పెక్కు గల్గియు మహాదారిద్ర్యమే దిక్కగున్"

5, మార్చి 2020, గురువారం

సమస్య - 3300 (సంతానముఁ గాంచి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"సంతానముఁ గాంచి మురిసె సన్యాసి గడున్"
(లేదా...)
"సంతానమ్మును గాంచి మోదముఁ గనెన్ సన్యాసి సంతుష్టుఁడై"

4, మార్చి 2020, బుధవారం

సమస్య - 3299 (గుండె యాగినపుడె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గుండె యాగినపుడె పండుగ యగు"
(లేదా...)
"గుండియ యాగినప్పుడె యకుంఠిత సౌఖ్యము దక్కు పర్వమౌ"

3, మార్చి 2020, మంగళవారం

సమస్య - 3298 (గడప దాటని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గడప దాటని మగవాఁడె ఘనతఁ గాంచు"
(లేదా...)
"ధన్యుఁడు పూజ్యుఁడున్ గడప దాటని పూరుషుఁ డెల్లవేళలన్"

2, మార్చి 2020, సోమవారం

సమస్య - 3297 (పిపీలిక వడిఁ దుమ్మె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పిపీలిక తుమ్మెను జడిసి కరులు లేచి పరుగిడెన్"
(లేదా...)
"పిపీలిక వడిఁ దుమ్మె నేనుఁగులు లేచి పరుంగిడె భీతి హెచ్చఁగన్"
(ఇవి ఛందోగోపన సమస్యలు)
(ఆముదాల మురళి గారి చోడవరం అష్టావధాన సమస్య)

1, మార్చి 2020, ఆదివారం

సమస్య - 3296 (ముది పుణ్యపు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"ముది పుణ్యపు మూలమగుచు మోదమొసంగున్"
(లేదా...)
"ముది యొక పుణ్యమూలముగ మోదమొసంగును మాటిమాటికిన్"
(కడిమిళ్ళ వారి పాలకొల్లు అష్టావధాన సమస్య)