28, జనవరి 2022, శుక్రవారం

సమస్య - 3976

 29-1-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బలినిఁ బొగడె విష్ణుభక్తుఁ డొకఁడు”
(లేదా...)
“బలిని నుతించె విష్ణుపద పంకజ దాసుఁడు క్షుత్పిపాసతన్”

40 కామెంట్‌లు:


  1. అబ్దిశయనుడంచు నంబుజోదరుడంచు
    చక్రధరుడవంచు జహ్నువంచు
    దానవారివీవు దైత్యారివని మహా
    బలినిఁ బొగడె విష్ణు భక్తుడొకఁడు.

    రిప్లయితొలగించండి
  2. పరమపూజ్యుడతడుబహిరంతరములను
    విశ్వమంతనిండివెలుగుజూపు
    చిన్నరూపువానిచేతనదెలుపుట
    బలినిపొగడెవిష్ణుభక్తుడొకడు

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చెవినెట్టి' - ఎట్టి అనడం సాధువు కాదు. "పెడచెవి నిడి" అనండి.

      తొలగించండి
    2. ఆటవెలది
      గురువు శుక్రుని పలుకులు పెడచెవినిడి
      వామనుండు కోర బలియు దాన
      మిడెను మూడడుగుల మేదిని ముదముతో
      బలిని బొగడె విష్ణు భక్తు డొకడు.
      ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
      ఉండవల్లి సెంటర్.

      ధన్యవాదాలు గురువు గారు.

      తొలగించండి
  4. శ్రేష్ట దానవుండీ దాన శీలి‌ యనుచు

    భరువు బలిని పొగడె,విష్ణు భక్తడొకడు

    హరిని‌ యడుగంగ తెలిపెగా‌ నద్రి‌ పుత్రి

    కా బలి ఘనతననుచు ముక్కంటి పలికె

    రిప్లయితొలగించండి
  5. భక్తి శ్రధ్ధ గలిగి భ గ వంతు సేవించి
    యుపవ సించు చుండ నోర్మి తోడ
    దీక్ష విరమణ మున దీక్షితు o డొసఁగు నం
    బలి ని బొగడె విష్ణు భక్తు డొకడు

    రిప్లయితొలగించండి
  6. అలసినసాధనంబుననుహాయనివేదనతోడభక్తుడున్
    కలయగమోక్షకాంతవడికర్మలవీడుచుమార్గదర్శినా
    తలపులభావజాలములతన్మయమందెడిబుద్ధిమంతునిన్
    బలినినుతించెవిష్ణుపదదాసుడుతీర్పగక్షుత్పిపాసలన్

    రిప్లయితొలగించండి
  7. గురువుగారికి నమస్సులు
    🙏
    చిరు వ్రయత్నం


    దానశీలతయందు ధర్మప్రభువునీవె
    మూడుయడుగులడుగ మోస మనుచు
    గురువువలదుయనిన కోర నిచ్చెననుచు
    *బలిని బొగడె విష్ణుభక్తు డొకడు*

    మీ దివాకర శాస్త్రి
    వికారాబాద్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. 'మూడు+అడుగుల, వలదు+అనిన' అన్నపుడు యడాగమం రాదు. సవరించండి.

      తొలగించండి

  8. కలతలు తీర్చువాడనుచు కైటభ వైరిని విశ్వసించుచున్

    బిలిచిన భక్తకోటి మది వేదన దీర్పెడు నీరజోదరా!

    బలువిడి బ్రోవరమ్మనుచు పద్మమనోహరుడైన యా మహా

    బలిని నుతించె విష్ణుపద పంకజ దాసుడు క్షుత్పిపాసతన్.

    రిప్లయితొలగించండి
  9. హరిని,దనుజ హరుని,కరివరదుని,ఖగ
    వాహనుని,మునిజన వర్ణితుని,ము
    రారి,నహి శయనుని,యౌర!పాదాక్రాంత
    బలినిఁ,బొగడె విష్ణు భక్తుఁడొకడు.

    రిప్లయితొలగించండి
  10. రిప్లయిలు
    1. ఆటవెలది
      అదిగొ! యదిగొ! యనుచు పదివేల శేషుల
      పడగలమయమంచు భక్తిఁ బొంగఁ
      బ్రీతిఁ బదకవితల వేంకటేశ్వరుని గు
      బ్బలినిఁ బొగడె విష్ణుభక్తుఁ డొకఁడు!

      చంపకమాల
      అలమిన చీకటుల్ దొలఁగి యల్లదిగో హరివాసమంచుఁ దా
      నలుపున నెక్కుచున్ దొరలి యమ్మగ శ్రీరమ యాదరించి యా
      కలికి ప్రసాద మీయ మదిఁ గమ్మని కీర్తనఁ దిర్మలేశు గు
      బ్బలిని నుతించె విష్ణుపదదాసుఁడు దీర్పఁగ క్షుత్పిపాసలన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  11. పరమ భక్తు డైన ప్రహ్లాద పౌత్రుడు
    సర్వలోకజేత చక్రవర్తి
    హరికిదానమిడిన చిరజీవియతడని
    బలినిఁ బొగడె విష్ణుభక్తుఁ డొకఁడు

    రిప్లయితొలగించండి
  12. ఆలయమును జెఱచ నారుగురు పొడువ
    లొక్క పరిగ వచ్చి యుండ , వారి
    నెల్ల నెదిరి పోరి యెలమినొసగిన యా
    బలినిఁ బొగడె విష్ణుభక్తుఁ డొకఁడు

    రిప్లయితొలగించండి
  13. మూడడుగులమేర ముచ్చటగనడిగి
    విక్రమించినత్రివిక్రముండు
    వామనావతార వైభవ కారకున్
    బలినిఁ బొగడె విష్ణుభక్తుఁ డొకఁడు

    రిప్లయితొలగించండి
  14. జలనిధి కన్యకాపతిని,సన్నుత దివ్యమునీంద్రవేష్టితున్
    హలధరుసోదరున్,హరిని ,యంబుజనాభుని ,విష్ణు ,కేశవున్
    జలధరు వర్ణు,వామనుని,చక్రిని,ధ్వంసిత దైత్యరాట్
    బలిని నుతించె విష్ణుపద పంకజదాసుడు క్షుత్పిపాసతన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణభంగం. "ధ్వంసిత సర్వదైత్యరాట్..." అందామా?

      తొలగించండి
    2. నమస్తే శంకరయ్యగారు!నేనుగమనిణచలేదు.
      అలాగే అందాం.

      తొలగించండి
  15. సలలిత వేష ధారియయి సామజ నేత్రుడు
    బ్రహ్మణుండునై
    చెలగుచు దాన కర్ణుడని జెప్పు బలీశుని
    చెంతకేగి తా
    బలికెను భిక్ష నిమ్మనుచు, భావముతో నత
    డిచ్చెవెంటనే
    బలిని నుతించె విష్ణు పద పంకజ
    దాసుడు క్షుత్పిపాసుడై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      బలిని తర్వాతి కాలం వాడైన దానకర్ణునితో పోల్చడం?

      తొలగించండి
  16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  17. వటువు రూప మూని బలిచక్ర వర్తిని
    దాన మడుగ విరివి దానవుండు
    మూరి దాన మొసఁగె నారాయణున కని
    బలినిఁ బొగడె విష్ణుభక్తుఁ డొకఁడు


    జలద నిభాంగ పద్మ దళ చారు విలోచను బద్మ నాభు భూ
    వలయ నివాస జీవ చయ భక్త జనావన సక్త చిత్తుఁ జే
    తులను మొగిడ్చి యా భవ విదూరుఁ జతుర్దశ విశ్వ రాణ్మహా
    బలిని నుతించె విష్ణుపద పంకజ దాసుఁడు క్షుత్పిపాసతన్

    రిప్లయితొలగించండి
  18. భక్త రక్షకుండు బహువిధ రూపుండు
    రావణాంత కుండు రమ్య గుణుడు
    చక్ర ధరుడు మిగుల శక్తిమం తుడు మహా
    బలిని బొగడె విష్ణు భక్తు డొకడు

    రిప్లయితొలగించండి
  19. వలపల దాపలన్ననక భక్తజనాళికి దానమిచ్చుటన్
    బలిని నుతించె విష్ణుపద పంకజ దాసుడు క్షుత్పిపాసతన్
    కలుములు నిచ్చు నాతడును గాంక్షను వచ్చెను జంప రాజునున్
    నలరెడు వామనుండుగను నాకృతి నొందుచు యాచకుండుగన్

    రిప్లయితొలగించండి
  20. ఇల చెలరేగె రోగమిటులెల్లరి పాలిట ఘోర శాపమై
    తొలగెనుపాధి పేదలకు దూరమయెన్ గన బట్టెడన్నమే
    కలత రవంతయైన నణగార్చెడి దిక్కువు నీవటంచు నం
    బలిని నుతించె విష్ణుపద పంకజ దాసుఁడు క్షుత్పిపాసతన్

    రిప్లయితొలగించండి

  21. ఆ.వె:ఏది కోరు కొనిన నిపుడె నీకొసగెద
    ననుచు స్వార్థ రహితు డగుచు పలుక
    మూడడుగుల నేల ముదము తోడ నిడగ
    *బలిని పొగడె విష్ణుభక్తు డొకడు*

    ఆ.వె:దానమొసగినంత తప్పదు ముప్పని
    మనము నందు నెరిగి మథన పడక
    మాటతప్పబోరుమానధనులటన్న
    *బలిని బొగడె విష్ణుభక్తు డొకడు*. .


    అ.వె:వరములొసగువాడె కరమెత్తి యాచింప
    కాదు కూడ దనక కరము తోడ
    ధారపోసినట్టి దనుజాధి పతియైన
    *బలిని బొగడె విష్ణు భక్తు డొకడు*.

    రిప్లయితొలగించండి