కం:నేరవు తత్త్వము, నీ మది దూరగ నే నేర్ప లేను,దూషించను నిన్ నోరార భజన జేయుము దారా! కృతి!భజన మోక్షధామముఁ జేర్చున్” (కొందరు భర్తలు తత్త్వాన్ని బాగా తెలుసుకొని ఉంటారు.కానీ భార్యలకి అది తలకెక్కదు.వారికి భజన చాలు.భార్య పేరు కృతి.ఆమెతో భర్త పై విధం గా అన్నాడు.)
కందం
రిప్లయితొలగించండికూరిచె భాగవతమ్మును
జేరఁగ కైవల్య పథము శ్రీ పోతనయే
శౌరిదగు భక్తజన మం
దారాకృతి భజన మోక్షధామముఁ జేర్చున్
ఉత్పలమాల
కూరిచె పోతనార్యుడిలఁ గోరియు ముక్తిపథమ్ము భక్తిమై
జేరఁగ నీరజాక్షు నుతిఁ జేసె మహత్వ కవిత్వ సంపదన్
శౌరిఁ బరాత్పరున్ గొలిచి సద్యశమందెను ధాత్రి భక్త మం
దార నిరంజనాకృతి సదా భజియించుడు మోక్షలబ్ధికై!
చేరగనెంచినన్ భవుని చిత్తము చూపును భక్తిమార్గమే
రిప్లయితొలగించండికోరికలన్ జయించి నెలకొల్పుడు చేతనమందు భక్తి కే
దారుని పైనదృష్టినిడి తాత్వికచింతన తోడ భక్త మం
దార నిరంజనాకృతి సదా భజియించుఁడు మోక్షలబ్ధికై
చేరగ నెంచిన భర్గ్యుని
తొలగించండికోరికలన్నియు జయించి కొల్వుము భక్తిన్
సారగ్రీవుని శ్రితమం
దారాకృతి భజన మోక్షధామముఁ జేర్చున్
శ్రీరాముఁడు సకలజనుల
రిప్లయితొలగించండియారాధ్యుడు భక్తకోటి యఘములు బాపున్
తోరమ్ముగ తాపసమం
దారాకృతి భజన మోక్షధామముఁ జేర్చున్
గారవము జూపుచు సతిని
రిప్లయితొలగించండిజేరువకు బిలచుచు నామె చెక్కిలి నిమురన్
నారీమణి మైమరచగ
దారాకృతి భజన మోక్షధామముఁ జేర్చున్
కం॥ ధారుణిని త్రిదేవతలటు
రిప్లయితొలగించండిదారాకృతిని వెలసిరని తలఁచి తనరఁగన్
వారలనె చేరు సర్వము
దారాకృతి భజన మోక్షధామముఁ జేర్చున్
ఉ॥ ఓరి త్రిదేవతల్ మురిసి యొప్పి ధరించిరి యాలి రూపమున్
గోరిక లెల్ల తీర్చి తను కోరిన రీతిని మోదమందఁగన్
దీరుగఁ గాంచుమా భవినిఁ దెల్పఁగ ముక్తికి మార్గమై చనున్
దారానిరంజనాకృతి సదా భజియించుఁడు మోక్షలబ్ధికై
త్రిదేవతలలో అందరూ ఉంటారండి.
మరొక పూరణ
మారముఁ గాంచి విజ్ఞతను మన్నన సేయుచుఁ బాదదాసుఁడై
సారసనేత్రు భక్తిఁ గని సర్వము నీవని తల్చి యెంచుచున్
మీరక సద్గుణమ్ములను మిక్కిలి స్ఫూర్తిని మోదమంది బృ
న్దార నిరంజనాకృతి సదా భజియించుఁడు మోక్షలబ్ధికై
మారము మర్మము బృన్దార మనోజ్ఞ
రిప్లయితొలగించండిశ్రీరామ కార్యమన్నను
భారంబది కాదటంచు పలికెడి ఘనుడా
శ్రీరామ భాగవత మం
దారాకృతి భజన మోక్షధామముఁ జేర్చున్.
శ్రీ రఘు రామకార్యమని సీతను గన్గొన నెంచి ధైర్యమున్
వారిధి దాటి లంకజని వానర శ్రేష్ఠుడు దానవాళినే
పేరడగించినట్టి కపి వీరుడు మారుతి రామభక్త మం
దార నిరంజనాకృతి సదా భజించుఁడు మోక్షలబ్ధికై.ృ
శ్రీరఘురామ నామమును చింతన చేసిన భక్తకోటికిన్
రిప్లయితొలగించండిదీరును సంకటమ్ము లిక దీరుగ సాగును జీవనమ్ము సం
సారపయోధి తారణము సర్వశుభమ్ముల గూర్చు భక్తమం
దార నిరంజనాకృతి సదా భజియించుడు మోక్షలబ్ధికై
తారక రాముని మదిలో
రిప్లయితొలగించండికోరిక తో నిలుపు కొనియు కూరిమి తోడన్
పారాయణ భక్తి గ మం
దారా కృతి భజన మో క్ష ధామము జేర్చు న్
శ్రీరాముని మదితలచుచు
రిప్లయితొలగించండిభారమునీదేయనుచునువాసిగనిరతం
బారాధించిన నామం
దారాకృతి భజనమోక్షధామము చేర్చున్
కం:నేరవు తత్త్వము, నీ మది
రిప్లయితొలగించండిదూరగ నే నేర్ప లేను,దూషించను నిన్
నోరార భజన జేయుము
దారా! కృతి!భజన మోక్షధామముఁ జేర్చున్”
(కొందరు భర్తలు తత్త్వాన్ని బాగా తెలుసుకొని ఉంటారు.కానీ భార్యలకి అది తలకెక్కదు.వారికి భజన చాలు.భార్య పేరు కృతి.ఆమెతో భర్త పై విధం గా అన్నాడు.)
ఉ:నేరక హిందు తత్త్వమును నింద లొనర్చ విదేశతత్త్వముల్
రిప్లయితొలగించండిమీరిన చిత్తజాడ్యమున, మీరలు వానిని నమ్మిరెట్టు లిం
పారెడు కృష్ణతత్త్వమును హాస్యమొనర్తురె? యోగి భక్తమం
దార నిరంజనాకృతి సదా భజియించుఁడు మోక్షలబ్ధికై”
(ఏవో విదేశీ మతాలవాళ్లు హిందూ తత్త్వాన్ని నింద చేస్తే మీరు నమ్ముతారా?యోగులకి,భక్తులకి కూడా నిరంజనుడైన కృష్ణుని తత్త్వమే ఉన్నతం.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసమస్య:
రిప్లయితొలగించండిదార నిరంజనాకృతి సదా భజియించుడు మోక్షలబ్ధికై.
ఉత్పలమాల:
మారుని తండ్రియే యితడు, మంగళదేవత దేవదేవుడే
కూరిమి మోక్షమిచ్చి భువి కూనల గాచెడు దివ్యమూర్తియే
ఓరిమి జూపు మాధవుని యోచన జేయక మ్రొక్కు నంబుజో
దార, నిరంజనాకృతి, సదా భజియించుడు, మోక్షలబ్ధికై.
ఉ.మా.
రిప్లయితొలగించండిపోరున నారుశత్రువులఁ బొల్పుగ నావల త్రోసివేయగాఁ,
గోరిక మీర శ్రీపతినిఁ గొల్చెడి మార్గమునందు సాగుచున్
జేరగ దివ్యధామమును, జిత్తమునందున నిల్పి భక్తమం
*దార నిరంజనాకృతి సదా భజించుఁడు మోక్షలబ్ధికై*
ఘోరతరైక మనుజ భవ
రిప్లయితొలగించండిపారావార తరణనిభ పద్మా సతియే
నారాయణ వక్షస్స్థిత
దారాకృతి భజన మోక్షధామముఁ జేర్చున్
సార హిమాద్రి సంభవను సామజ సంచయ వైరి వాహనన్
భార భవాబ్ధి తారకను బార్వతి లోక సవిత్రి సంత తా
పార దయా విలోకనను భర్గ మనోహరి భక్త లోక మం
దార నిరంజనాకృతి సదా భజియింపుఁడు మోక్షలబ్ధికై
రిప్లయితొలగించండిభారము వేసి యెల్లపుడు భక్తులు
గొల్చిన చిత్తశుద్ధితో
శౌరిని, తప్పకుండ కడు సంతస
మొందియు బ్రోచునంచు నా
భూరి వినమ్ర భక్తుడగు పోతన
యిట్టుల సెప్పె 'భక్త మం
దార నిరంజనాకృతి సదా భజి
యించుడు మోక్ష ప్రాప్తికై.'
యల్జి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉ.
రిప్లయితొలగించండిసారస వాసినీ సహిత సాంద్ర కృపాకర మూర్తి లోకముం
దారణమై సుభక్తతతిఁ దాటగ జేయును, బ్రేముడిన్ విభా
క్షీర పయోధి మధ్య శుభ కీర్తిమయాంచిత శేషతల్ప బృం
దార నిరంజనాకృతి సదా భజియించుడు మోక్షలబ్ధికై !
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
కోరుచు స్వర్గము చేరగ
శ్రీరఘురాముని నిరతము చిత్తమునందున్
ఆరాధించగ, పదమం
దారాకృతి భజన మోక్షధామము జేర్చున్.