(3)ఉ:ఇ జ్జగ మందె గొప్ప యని పించెడు వైద్యుల తోడ పైత్యముల్ బొజ్జను మించ బాధ లవి పోవుట పై సుమ చర్చ జేయగా "మజ్జిగ మంచి మం" దనియు, "మజ్జిగ పుల్లని వైన యంత నా మజ్జిగ కాలకూటమె సుమా!" యని చెప్పిరి మాన్యులెల్లరున్ (యాంకర్ సుమ పైత్యానికి వైద్యం గూర్చి వైద్యుల తో చర్చించింది.వారు"సుమా!" అని దంబోధించి పై విషయం చెప్పారు.)
కందం
రిప్లయితొలగించండికజ్జెము దిననిండె కడుపు
బుజ్జి మరేమితినకుండ పుట్టించు కథల్
సెజ్జను జేరుచు నిట్లనె,
"మజ్జిగ విషతుల్యమంద్రు మాన్యులు వింటే!"
ఉత్పలమాల
కజ్జెము మెక్కియున్ మిగుల, ఖాద్యము నేదియు స్వీకరించకే
బుజ్జిది యల్లెడున్ గథలు పొంతన లేవను రీతినెప్పుడున్
సెజ్జను జేరఁ బోవుచును జెప్పెను దల్లియె విస్తుబోవగన్,
"మజ్జిగ కాలకూటమె సుమా యని చెప్పిరి మాన్యులెల్లరున్! "
ఇజ్జగమున మద్యముగొన
రిప్లయితొలగించండిలజ్జితులే కానరారు రసికుల నడుమన్
సజ్జను లొప్పరె, కాదది
మజ్జిగ, విషతుల్యమంద్రు మాన్యులు వింటే
ఇజ్జగమందు చూడనగు నెవ్విధి మద్యము గ్రోలుచుందురో
లజ్జయొకింతయున్ గనము రాతిరి వేళలఁ బానశాలలో
సజ్జన సమ్మతంబగునె సర్వవినాశని మాధ్వి, కాదుగా
మజ్జిగ, కాలకూటమె సుమా యని చెప్పిరి మాన్యులెల్లరున్
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిఒజ్జ తలిపెనని నిన్ననె
రిప్లయితొలగించండివెజ్జునికెడ శంక తీర వెడలితి గదరా
గజ్జి చెయితోడ జిలికిన
మజ్జిగ విషతుల్యమంద్రు మాన్యులు వింటే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'తెలిపెనని'
🙏
తొలగించండి
రిప్లయితొలగించండిబుజ్జికి నివ్వగ జని యా
సజ్జను డప్పుడట నొక్క చచ్చిన గౌళిన్
మజ్జిగలోగని పలికెను
మజ్జిగ విషతుల్యమంద్రు మాన్యులు వింటే.
బుజ్జియె కోరెనంచు నొకముంతెడు ఘోలము నివ్వనెంచి పూ
సజ్జకు చెంతనున్న కలశమ్మున గౌళియె మూతకున్న యా
బెజ్జము నుండి జారిపడి బిద్దుట గాంచి యతండు పల్కెనే
మజ్జిగ కాలకూటమె సుమా యని చెప్పిరి మాన్యులెల్లరున్.
ఉ.
రిప్లయితొలగించండిముజ్జగముల్ చెలంగినను పూర్ణ సుదుగ్ధము లాభ్యమౌటయే
సజ్జను మానసంబు వలె సాధ్యము కాదని తోచుచుండె, నే
లజ్జలు లేని దుర్జనులు రమ్యతఁ జంపిరి పాలలోన, న
మ్మజ్జిగ కాలకూటమె సుమా యని చెప్పిరి మాన్యులెల్లరున్ !
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికం॥ సజ్జనులు స్వస్థతఁ బడయ
రిప్లయితొలగించండినొజ్జలు తెలుఁపగ వినుటయె యొప్పుననిరి యా
వెజ్జులు స్వస్థత చెడినను
మజ్జిగ విషతుల్యమంద్రు, మాన్యులు వింటే
ఉ॥ సజ్జన సూచనల్ దెలుప సౌఖ్యముఁ గూర్చును ధాత్రిలో సదా
యొజ్జలు వెజ్జులున్ గనఁగ నొప్పరె మాన్యులు సజ్జనాళియై
వెజ్జులు కొన్నిజబ్బులకు వీడను మజ్జిగ హెచ్చరించఁగన్
మజ్జిగ కాలకూటమె సుమా యని చెప్పిరి మాన్యులెల్లరున్
దక్షిణాదిలో జ్వరము జలుబు మొదలైనవాటికి పెరుగు మజ్జిగ వదలమనుట సామాన్యమేనండి. కాని గుజరాత్ లో వాటిని తీసుకోమనడం గమనించానండి
కం:బుజ్జీ !ఆ పచ్చి మిరప
రిప్లయితొలగించండిబజ్జీ తిని నీకు పెరిగె పైత్యము త్రాగన్
మజ్జిగ మందౌ, మరి పుల
మజ్జిగ విషతుల్యమంద్రు మాన్యులు వింటే”
(తాజా మజ్జిగ ఎసిడిటీ తగ్గిస్తాయి.కానీ పులిసిన మజ్జిగ ఎసిడిటీ పెంచుతాయి.)
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిలజ్జను వీడియు మద్యము
రిప్లయితొలగించండిబొజ్జ ను నిండంగ త్రాగి పొరలుచు నుడన్
మజ్జును దొలగ గ నీయగ
మజ్జిగ విషతుల్య మంద్రు మాన్యులు వింటే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉ:బొజ్జన రమ్ము నింపి పడి పోయెడు స్థాయిని జేర నొక్క," డీ
రిప్లయితొలగించండిమజ్జిగ త్రాగు" మంచు నొక మానిసి చెప్పగ, "వద్దు వద్దు రా!
బుజ్జికి మత్తు తగ్గుటకు పోయ వలెన్ రస మింత గాని యా
మజ్జిగ కాలకూటమె సుమా!" యని చెప్పిరి మాన్యులెల్లరున్.
(మద్యము ఎక్కువైతే ఆ కిక్కు తగ్గటానికి చారు మంచిది.మజ్జిగ తాగితే కిక్కు ఎక్కు వౌతుంది.)
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి(3)ఉ:ఇ జ్జగ మందె గొప్ప యని పించెడు వైద్యుల తోడ పైత్యముల్
రిప్లయితొలగించండిబొజ్జను మించ బాధ లవి పోవుట పై సుమ చర్చ జేయగా
"మజ్జిగ మంచి మం" దనియు,
"మజ్జిగ పుల్లని వైన యంత నా
మజ్జిగ కాలకూటమె సుమా!" యని చెప్పిరి మాన్యులెల్లరున్
(యాంకర్ సుమ పైత్యానికి వైద్యం గూర్చి వైద్యుల తో చర్చించింది.వారు"సుమా!" అని దంబోధించి పై విషయం చెప్పారు.)
పజ్జనఁ జేరి పలుక మఱు
రిప్లయితొలగించండిగుజ్జులు వెసఁ దాఁటి కల్లు కుడువఁగ నేలా
బొజ్జం గల కల్లునకున్
మజ్జిగ విషతుల్య మంద్రు మాన్యులు వింటే
బెజ్జము నెందు నైనఁ గడు వింతగ శోధన సేయు వారలే
ముజ్జగ మందుఁ బల్కుదురు పొంతన లేని విధమ్ము సుంత లో
గుజ్జది లేని వారలును గుందకు మయ్య వినంగ నిట్టులన్
మజ్జిగ కాలకూటమె సుమా యని చెప్పిరి మాన్యు లెల్లరున్
సమస్య:
రిప్లయితొలగించండిమజ్జిగ కాలకూటమె సుమా యని చెప్పిరి మాన్యులెల్లరున్!
ఉత్పలమాల:
ముజ్జగమందు తాటి కలు ముందుగ గాంచగ నొక్క రూపమున్
సజ్జనుడైన నేమి చెడు సంగతి యందురు క్రింద నుండినన్
తర్జని జూపి చెప్పుదురు తాతలు వద్దని కొన్ని వ్యాధులన్
మజ్జిగ కాలకూటమె సుమా యని చెప్పిరి మాన్యులెల్లరున్!
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
వెజ్జుడనెను త్రాగమనుచు
మజ్జిగ; విషతుల్యమంద్రు మాన్యులు వింటే
యిజ్జగమున కూల్ డ్రింకులు,
మజ్జిగ స్వస్థతను గూర్చు మండే యెండన్.