31, మే 2025, శనివారం

సమస్య - 5138

1-6-2025 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“సొత్తులోఁ బొత్తులెందుకు సోదరులకు”

(లేదా...)

“సొత్తుల పొత్తు లెందుకని సోదరులందఱఁ జంప నొప్పగున్”

27 కామెంట్‌లు:

  1. పితరుడు తమకయి వదలి వెళ్ళినట్టి
    సొత్తులోఁ బొత్తులెందుకు సోదరులకు ,
    సరి సమానపు విభజన సలుపు కొనిన
     యెట్టి తగవులు మున్ముందు నేరుపడవు

    రిప్లయితొలగించండి
  2. (అర్జునుడు ఆవేశంలో భీమునితో చెప్పే మాటలు)
    ఉ.
    మిత్తిని వింటినుంచితి నమేయ పరాక్రమ సంభ్రమంబుతో
    హృత్తత భీషణోద్ధతిని హీనులఁ గౌరవ సేనలందు నే
    చిత్తుగఁ జేసెదన్ వినుము శ్రీఘ్రమె యొప్పు ప్రతిజ్ఞ మీఱి యీ
    సొత్తుల పొత్తులెందుకని ? సోదరులందఱఁ జంప నొప్పగున్ !

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    సంధితోఁ బాయు వంశనాశమను తపన
    ధర్మజుండంపఁ గృష్ణుని తప్పు పట్టి
    యుద్ధమెంచిన రారాజు యూహలందు
    సొత్తులోఁ బొత్తులెందుకు సోదరులకు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. ఉత్పలమాల
      సత్తువ గల్గువారలని చాటితె మీరుచు నందనందనా!
      జొత్తురె పాండునందనలు సూటిగ సంధికి? పక్షపాతపున్
      జిత్తులవేల? పోరునకు సిద్ధమనంగను రాజరాజహో!
      సొత్తుల పొత్తు లెందుకని, సోదరులందఱఁ జంప నొప్పగున్!

      తొలగించండి
  4. తే॥ ఇత్తఱి మనమను తలఁపు నెవ్వరైనఁ
    గాంచెదరె నేను నాదను కమ్మఁదనపు
    రుచియె మనుజుల మనమున రోచనఁగన
    సొత్తులోఁ బొత్తులెందుకు సోదరులకు

    ఉ॥ ఇత్తఱి స్వార్థ రాగమున నెల్లరు మోహితులై మనమ్మునన్
    విత్తపు టూసు వచ్చినను వీడఁగ మేము మనమ్ము పూర్తిగా
    మొత్తము నాది నాకనెడి మోజుయె క్రమ్మగ నేఁడు పోచఁగన్
    సొత్తుల పొత్తు లెందుకని సోదరులందఱఁ జపం నొప్పగున్

    పోచు భావించు
    చంపుకోరు కాని సింహ భాగము లోపాయకారిగా తీసుకోవడము జరుగుతుందండి. తల్లిదండ్రులు కూడ కొన్న చోట్ల సమానంగా ఇవ్వరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సమస్య లోని జంప ను పొరపాటున జపం అని వ్రాసానండి

      తొలగించండి
    2. మరొక పూరణ

      ఉ॥ చిత్తము రాయివోలెఁ గని చేసెను క్రూరత నిండ నిట్టులన్
      విత్తము నాదు భార్యనిడి వీడడు తమ్మునిఁ ద్రోసి వైచెనే
      యిత్తఱిఁ బొందనన్నియిటు లెంచితిఁ ద్రోహము కాదు రాఘవా
      సొత్తుల పొత్తులెందుకని, సోదరులందఱఁ జంప నొప్పఁగున్

      సుగ్రీవుడు రామునికి తెలుపుట: నన్ను అధర్మంగా గెంటి వేస్తే అలాంటి సమయంలో (నాకు ఒక్కడే ఉన్నాడు) సోదరులెంతమందున్నా వారితో రాయబారం కంటే చంపడము మంచిది అనే అర్థముతో నండి.

      తొలగించండి
  5. రాయబారి కృష్ణుని తోడ రాజ రాజు
    పలికె నీ రీతి కటువు గా పంత మునను
    సొత్తు లో పొత్తు లెందుకు సోదరులకు
    సాధ్య మే కాదు పంచ గా చాలు పొమ్ము

    రిప్లయితొలగించండి
  6. రాయబారమునకు వెళ్లుమని కోరిన ధర్మరాజుతో శ్రీకృష్ణుడు పలికిన పలుకులు:-

    ఇత్తఱి తమ్ములంచు పగనెంచక సంధినిఁ గోరుచుంటివే
    యత్తఱి వారు జేసిన క్రియల్ మరువందగునెట్లు జూడగా
    నిత్తరుణీ విచారమది యే దెస తీరును ధర్మరాజ! యీ
    సొత్తుల పొత్తు లెందుకని సోదరులందఱఁ జంప నొప్పగున్!!

    రిప్లయితొలగించండి

  7. *(బాల దుర్యోధనుడు తండ్రిని పోగొట్టుకుని రాజ్యం చేరిన పాండవుల గూర్చి దుశ్శాసనునితో పలికినట్లుగా నూహించి)*

    తండ్రి పోయెననుచు పాండు తనయు లెల్ల
    జేరి రిటకు జననితోడ స్థిరము గాను
    పాలి చుట్టమనుచు వారు భాగ మడగ
    సొత్తులోఁ బొత్తులెందుకు సోదరులకు.


    ఇత్తఱి తండ్రి పోయెనని యిచ్చట జేరిన పాండు పుత్రులన్
    మెత్తురు ధర్మమూర్తులని మిక్కిలి పేరిమి జూపుచుండిరే
    చిత్తము నందు పెద్దలు విచిత్రమదేమన రాజ్య మంచనే
    సొత్తుల పొత్తు లెందుకని సోదరులందఱఁ జంప నొప్పగున్.

    రిప్లయితొలగించండి
  8. ధుర్యోధనుడు శ్రీ కృష్ణుడితో....

    జూదమున పరాభవమునే జూచినారు
    హస్త గతమైన సంపద ననుభవించు
    చుండ నెవ్విధి నిత్తును పాండవులకు
    సొత్తులోఁ బొత్తులెందుకు సోదరులకు


    భీముడు తన సోదరులతో....

    ఉత్తములైనవారు పరమోత్తమ మైన విశేష భావనల్
    చిత్తమునందు కల్గి తమ జీవితమున్ సవరించు కొందురే
    కత్తులు దూయు మూర్ఖులగు కౌరవ మూకల తోడ వ్యర్థమౌ
    సొత్తుల పొత్తు లెందుకని? సోదరులందఱఁ జంప నొప్పగున్

    రిప్లయితొలగించండి
  9. తే.గీ:ఇంట లేనట్టి లంచమ్ము లేల బిడ్డ
    పట్టె నలవాటుగా? దాని వదలకున్న
    నట్టి పాపపు సొమ్మేల యనుజులకును?
    సొత్తులోఁ బొత్తులెందుకు సోదరులకు?
    (నువ్వు లంచాలు తినటమే మన ఇంట్లో లేనిది.తింటే తిన్నావు కానీ ఆ పాపం లో సోదరులకి వాటా పెట్టకు అన్నాడు తండ్రి)

    రిప్లయితొలగించండి
  10. ఉ:ఇత్తరి నైన పెద్ద లగున నెల్లరు జెప్పిన మాట విందువే
    మెత్తగ గోరె ధర్మజుడు మిమ్ముల నూళ్లవి ఐదు కాని యా
    మెత్తన నొప్ప లేక మితి మీరెదొ! సంధిని వీడి యెట్టులన్
    సొత్తుల పొత్తు లెందుకని సోదరులందఱఁ జంప నొప్పగున్?
    (ఐదూళ్లు అడిగితే నిక్కి నీ స్వంత తమ్ము లందరినీ చంపుకోవటం సరైనదా? యుద్ధం వస్తే నీ తమ్ముళ్లు ఎలాగూ పోతారు అన్నాడు కృష్ణుడు.)

    రిప్లయితొలగించండి
  11. విత్తము రాజ భోగముల వెంపరలాటయె గాని యెన్నడున్
    పొత్తుల నిచ్చగింపరు కుబుద్ధులు బంధువులైన నెంచకన్
    కుత్తుకలుత్తరింత్రు గద క్రూరులు వారి స్వభావమందునన్
    సొత్తుల పొత్తు లెందుకని సోదరులందఱఁ జంప నొప్పగున్

    రిప్లయితొలగించండి
  12. కన్న కూఁతు రనినఁ బ్రేమ కన్న వారి
    కుండ నాశ్చర్య మే మున్న దుర్విఁ దండ్రి
    యెన్నఁడో తమ సోదరి కిచ్చి నట్టి
    సొత్తులోఁ బొత్తు లెందుకు సోదరులకు


    విత్త మనర్థ దాయకము వీరికి వైరము రేఁగఁ జేయ న
    త్యుత్తమ మంచు నెంచి పగ నొక్కటి యై పొరుగింటి వారలే
    చిత్తము లందు నూని చెడు చింతల నందఱు నొక్కి చెప్పఁగా
    సొత్తుల పొత్తు లెందుకని సోదరు, లందఱఁ జంప నొప్పగున్

    రిప్లయితొలగించండి
  13. సమస్య:
    సొత్తుల పొత్తు లెందుకని సోదరులందఱఁ జంప నొప్పగున్

    ఉత్పలమాల :

    కత్తుల మాటలేలనయ కాదని గ్రామములైదు నివ్వకే
    చిత్తుల మాయజేత మము చింతిల సేసి, కులాంగనన్ శిరం
    బెత్తగలేని రీతి మము వెట్టిన బాధల బంధ మెయ్యడిన్
    సొత్తుల పొత్తు లెందుకని సోదరులందఱఁ జంప నొప్పగున్

    రిప్లయితొలగించండి
  14. సమస్య:
    సొత్తుల పొత్తు లెందుకని సోదరులందఱఁ జంప నొప్పగున్

    ఉత్పలమాల :

    సత్తువలేని వారలమ సంగరమందువు భాగమిమ్మనన్
    నెత్తుటి కూడు కోరకను నెమ్మది సంధని బావనంపగన్
    చిత్తమునందు కాంక్షనను చింతయు లేదుగ జ్ఞాతి బంధమున్
    సొత్తుల పొత్తు లెందుకని సోదరులందఱఁ జంప నొప్పగున్

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    వదలి తల్లిదండ్రులను నావద్ద, నొక్క
    సారి యైనను రానట్టి వారు,మాత
    పితరులు మరణమొందిన పిదప కూడ
    నగ్రజులు రాక, యడిగిరి యాస్తి కొంత
    సొత్తులోఁ బొత్తు లెందుకు సోదరులకు?

    రిప్లయితొలగించండి
  16. భాగమొసగబో నాస్తిలో పాండవులకు
    జూదముననోడిరెల్లరుజూచుచుండ
    నీదుపలుకులాలించనోనీరజాక్ష
    సొత్తులో బొత్తు లెందుకు సోదరులకు

    బల్లూరి ఉమాదేవి
    జిత్తులమారియెత్తులనుచిత్తమునందునవైచు చెప్పుడున్
    మెత్తగమాటలాడుచునుమిక్కిలి ప్రేమనుచూపుచున్ సదా
    చిత్తమునందుదుష్టమగుచెయ్దములెంచుచుకౌరవుండుతా
    *“సొత్తుల పొత్తు లెందుకని సోదరులందఱఁ జంప నొప్పగున్

    రిప్లయితొలగించండి