11-6-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పగఁ బెంచెడి మాట వినిన భద్రము గల్గున్”
(లేదా...)
“పగలం బెంచెడి మాటలన్ వినినచో భద్రంబు నీకయ్యెడిన్”
మ.భగవల్లీలలు దివ్య గాథలు జుమీ భాగ్యంబుగా నెంచగన్విగళత్భక్తి రస ప్రవాహ లహరుల్ వేఁ బారి నిండారి చిత్ ప్రగతిం జూపును లోకమున్ విడని యీ పాప స్వభావమ్ముపైఁ బగలం బెంచెడి మాటలన్ వినినచో భద్రంబు నీకయ్యెడిన్ !
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
దివ్యగాథలు సుమీ ; విగళద్భక్తి ; వే పాఱి
తగులమ్మున తగులుకొనినమిగులును సౌఖ్యమ్ము, మిగుల మేలొనగూడున్తగవులు మనలో తగవవిపగఁ బెంచెడి, మాట వినిన భద్రము గల్గున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
జగమున వింతగు యంహతియగుపడి వేగముగ వ్యాప్తి యగుచున్నదనన్నగరమునందు జనుల గాపగఁ బెంచెడి మాట వినిన భద్రము గల్గున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'యంహతి' ?
కందంతగు రీతి దేశమున నాపగలున్ సంధానమొనరి ప్రతి పొలమున పారగ జలమందు వసతులొప్పగఁ బెంచెడి మాట వినిన భద్రము గల్గున్మత్తేభవిక్రీడితముదిగులుంజెందెడు రైతునాదుకొనెడున్ దీరెంచి కాపాడగన్దగురీతిన్ నదులెల్లఁ గూడనను సంధానమ్ము మేలంచు నింపగ నెంచంగ జలాశయాల జలముల్ పారించు సౌకర్యమాపగలం బెంచెడి మాటలన్ వినినచో భద్రంబు నీకయ్యెడిన్
పగలున్ రాతిరు లేలనో పగలు కార్పణ్యమ్ములీ తీరుగన్తగులమ్ముల్ దగులన్ పరస్పరము విస్తారమ్ముగా మేలగున్తగవుల్ చాలును మాటలన్ విననిచో తథ్యమ్ముగా కయ్యముల్పగలం బెంచెడి, మాటలన్ వినినచో భద్రంబు నీకయ్యెడిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
సుగమమున తోయ మందినజగతికి యాహార మదియె జాస్తిగ లభియించుగద నిక వలదనక నాపగఁ బెంచెడి మాట వినిన భద్రము గల్గున్.జగతిన్ గాంచగ మానవాళి బ్రతుకన్ సర్వమ్మె ప్రాధాన్యమౌసుగమంబౌ కమతమ్మటన్ పొలములే శోభించు నిత్యంబు, నీచగ తీరంబున కోవెలల్ వెలిసె విస్తారమ్ముగా గాదె యాపగలం బెంచెడి మాటలన్ వినినచో భద్రంబు నీకయ్యెడిన్.
జగడంబులు మటుమాయముపగలన్ బంతములఁ విడుచు పరిణతి తోడన్ జగమంతా సుఖమయమౌపగఁ బెంచెడి మాట వినిన భద్రము గల్గున్జగమంతా సుఖశాంతులే మనుజులే సంసిద్ధులై యుండగాసుగుణాలే తనరించు నట్టి దిశగా చూపించి సన్మార్గమున్జగడంబుల్ తొలగంగ సూక్తులిడుచున్ సౌశీల్యమున్ జూపుమాపగలం బెంచెడి మాటలన్ వినినచో భద్రంబు నీకయ్యెడిన్[పెంచు = చంపు, రూపుమాపు]
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ధన్యవాదాలు గురూజీ 🙏
కం॥ వగపులఁ గనని బ్రదుకెలమిసొగసుగ సద్గుణములొదవ శుభములు విరయున్జగతిని దుర్గుణములపైఁబగఁ బెంచెడి మాట వినిన భద్రము గల్గున్మ॥ వగపుల్ గాంచక జీవితమ్మొదవ సద్భాగ్యమ్ముతో నొప్పెడిన్సొగసుల్ మీరఁగ సద్గుణమ్ములు ధరన్ శోభిల్లఁ బ్రాప్తించఁగన్నగవుల్ పూయవె దుర్గుణమ్ములను మానంగన్ సదా వాటిపైఁ బగలం బెంచెడి మాటలన్ వినినచో భద్రంబు నీకయ్యెడిన్చూపఁగ పాపఁగ ఆపఁగ మాపఁగ ఇలాంటివన్ని గకుముందు అర్ధానుస్వరముతో కూడుకున్నాయని వేరే విధంగా వ్రాసానండి.
తగు విధ సూచన లొసగుచు రగడలు లేకుండ జేయు రమణియ పథ o బగణి త సందియములు బా పగ బెంచె డి మాట వినిన భద్ర ము గల్గు న్
అగణిత సందియములు – వైరి సమాసము; సందియములు వాపఁగ
కం:పగ కాదు బిడ్డ నీ యెడ,పగలును రాత్రియును కష్ట పడు, గల్లా నింపగ జెప్పెతి,బేరము నిల్పగఁ, బెంచెడి మాట వినిన భద్రము గల్గున్(అని వ్యాపారస్తుడు కొడుక్కి చెప్పాడు.)
మ:పగవారెవ్వరు లేరు ,గెల్తు ననుచున్ భావించ కో నాయకా!పగ నీ పక్షము నందు కొందరికి నేర్పాటయ్యె,నీ మిత్రులన్పగలం బెంచెడి వారి ఘోష వినినన్ భద్రంబు నీకయ్యెడిన్”పగలన్ దీర్చు నుపాయ మైన వెదుకన్ బాగౌను నీ కెన్నికన్.(నీ పక్షం లోనే నీకు పగవాళ్లున్నారు.నీ మిత్రుల్లో పగ పెంచే మాటలు మాట్లాడుతున్నారు.అవ్వి విను.పగ తీర్చే ఉపాయ మైనా ఆలోచిస్తే మంచిది.)
నగ పతిత వర్ష జల మింపుగ నొక చోఁ గూడు యత్నము లొనర్చి వెసం దగు రీతిని విమల జ లా పగఁ బెంచెడి మాట వినిన భద్రము గల్గున్ తగునే పంతము లెల్ల వేళల వృథా దర్పమ్ము నీ కేలనో వగలే కల్గును బూనినం బగలు సంబంధమ్ము లెల్లం జెడుం జిగురింపంగ సహోదరత్వ మిలఁ గించిత్స్నేహమున్, మాన్పుచుం బగలం, బెంచెడి మాటలన్ వినినచో భద్రంబు నీ కయ్యెడిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తగువులు తంటాలుండకతగుసంస్కారము విలువలు ధర్మము తెలిపేటి గురువు మన మంచికి చెప్పగఁ బెంచెడి మాట వినిన భద్రము గల్గున్
సమస్య:“పగలం బెంచెడి మాటలన్ వినినచో భద్రంబు నీకయ్యెడిన్”మత్తేభవిక్రీడితము: సిగలం బట్టుచు రౌద్రమున్ వలదుగా శీఘ్రంపు నొప్పందమున్ పగలే లేవుగ, జ్ఞాతివైరమను కోపంబేమి లేదే మరీ తగవే వెట్టుచు పాలుపంచకయు తాత్సర్యంబు నేలో భళా పగలం బెంచెడి మాటలన్, వినినచో, భద్రంబు నీకయ్యెడిన్”(ధర్మరాజు సంధి సందేశం)
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.రగులును కలహము లింకనుపగఁ బెంచెడి మాట వినిన; భద్రము గల్గున్పగ వలనకలుగు నష్టముతగు రీతిగ నచ్చ చెప్ప తగవులయందున్.
జగతిని ననవరతమ్మునుజగతిని యాపంగనెంచు జనముల పనులన్రగిలెడు కలహంబుల నా*"పగఁ బెంచెడి మాట వినిన భద్రము గల్గున్”*తగదీకార్యమువీనులార విను మీదాక్షిణ్యమున్వీడుమాపగతుండీతడు కాడు బాలుడితడున్ వారించగా నెంచెగన్జగదీశుండితడంచువేగ పలికెన్ శాంతమ్ము గారాజుతో*“పగలం బెంచెడి మాటలన్ వినినచో భద్రంబు నీకయ్యెడిన్”*
మ.
రిప్లయితొలగించండిభగవల్లీలలు దివ్య గాథలు జుమీ భాగ్యంబుగా నెంచగన్
విగళత్భక్తి రస ప్రవాహ లహరుల్ వేఁ బారి నిండారి చిత్
ప్రగతిం జూపును లోకమున్ విడని యీ పాప స్వభావమ్ముపైఁ
బగలం బెంచెడి మాటలన్ వినినచో భద్రంబు నీకయ్యెడిన్ !
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిదివ్యగాథలు సుమీ ; విగళద్భక్తి ; వే పాఱి
తొలగించండితగులమ్మున తగులుకొనిన
రిప్లయితొలగించండిమిగులును సౌఖ్యమ్ము, మిగుల మేలొనగూడున్
తగవులు మనలో తగవవి
పగఁ బెంచెడి, మాట వినిన భద్రము గల్గున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిజగమున వింతగు యంహతి
రిప్లయితొలగించండియగుపడి వేగముగ వ్యాప్తి యగుచున్నదనన్
నగరమునందు జనుల గా
పగఁ బెంచెడి మాట వినిన భద్రము గల్గున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'యంహతి' ?
కందం
రిప్లయితొలగించండితగు రీతి దేశమున నా
పగలున్ సంధానమొనరి ప్రతి పొలమున పా
రగ జలమందు వసతులొ
ప్పగఁ బెంచెడి మాట వినిన భద్రము గల్గున్
మత్తేభవిక్రీడితము
దిగులుంజెందెడు రైతునాదుకొనెడున్ దీరెంచి కాపాడగన్
దగురీతిన్ నదులెల్లఁ గూడనను సంధానమ్ము మేలంచు నిం
పగ నెంచంగ జలాశయాల జలముల్ పారించు సౌకర్యమా
పగలం బెంచెడి మాటలన్ వినినచో భద్రంబు నీకయ్యెడిన్
పగలున్ రాతిరు లేలనో పగలు కార్పణ్యమ్ములీ తీరుగన్
రిప్లయితొలగించండితగులమ్ముల్ దగులన్ పరస్పరము విస్తారమ్ముగా మేలగున్
తగవుల్ చాలును మాటలన్ విననిచో తథ్యమ్ముగా కయ్యముల్
పగలం బెంచెడి, మాటలన్ వినినచో భద్రంబు నీకయ్యెడిన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసుగమమున తోయ మందిన
రిప్లయితొలగించండిజగతికి యాహార మదియె జాస్తిగ లభియిం
చుగద నిక వలదనక నా
పగఁ బెంచెడి మాట వినిన భద్రము గల్గున్.
జగతిన్ గాంచగ మానవాళి బ్రతుకన్ సర్వమ్మె ప్రాధాన్యమౌ
సుగమంబౌ కమతమ్మటన్ పొలములే శోభించు నిత్యంబు, నీ
చగ తీరంబున కోవెలల్ వెలిసె విస్తారమ్ముగా గాదె యా
పగలం బెంచెడి మాటలన్ వినినచో భద్రంబు నీకయ్యెడిన్.
జగడంబులు మటుమాయము
రిప్లయితొలగించండిపగలన్ బంతములఁ విడుచు పరిణతి తోడన్
జగమంతా సుఖమయమౌ
పగఁ బెంచెడి మాట వినిన భద్రము గల్గున్
జగమంతా సుఖశాంతులే మనుజులే సంసిద్ధులై యుండగా
సుగుణాలే తనరించు నట్టి దిశగా చూపించి సన్మార్గమున్
జగడంబుల్ తొలగంగ సూక్తులిడుచున్ సౌశీల్యమున్ జూపుమా
పగలం బెంచెడి మాటలన్ వినినచో భద్రంబు నీకయ్యెడిన్
[పెంచు = చంపు, రూపుమాపు]
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండికం॥ వగపులఁ గనని బ్రదుకెలమి
రిప్లయితొలగించండిసొగసుగ సద్గుణములొదవ శుభములు విరయున్
జగతిని దుర్గుణములపైఁ
బగఁ బెంచెడి మాట వినిన భద్రము గల్గున్
మ॥ వగపుల్ గాంచక జీవితమ్మొదవ సద్భాగ్యమ్ముతో నొప్పెడిన్
సొగసుల్ మీరఁగ సద్గుణమ్ములు ధరన్ శోభిల్లఁ బ్రాప్తించఁగన్
నగవుల్ పూయవె దుర్గుణమ్ములను మానంగన్ సదా వాటిపైఁ
బగలం బెంచెడి మాటలన్ వినినచో భద్రంబు నీకయ్యెడిన్
చూపఁగ పాపఁగ ఆపఁగ మాపఁగ ఇలాంటివన్ని గకుముందు అర్ధానుస్వరముతో కూడుకున్నాయని వేరే విధంగా వ్రాసానండి.
తగు విధ సూచన లొసగుచు
రిప్లయితొలగించండిరగడలు లేకుండ జేయు రమణియ పథ o
బగణి త సందియములు బా
పగ బెంచె డి మాట వినిన భద్ర ము గల్గు న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅగణిత సందియములు – వైరి సమాసము; సందియములు వాపఁగ
తొలగించండికం:పగ కాదు బిడ్డ నీ యెడ,
రిప్లయితొలగించండిపగలును రాత్రియును కష్ట పడు, గల్లా నిం
పగ జెప్పెతి,బేరము ని
ల్పగఁ, బెంచెడి మాట వినిన భద్రము గల్గున్
(అని వ్యాపారస్తుడు కొడుక్కి చెప్పాడు.)
మ:పగవారెవ్వరు లేరు ,గెల్తు ననుచున్ భావించ కో నాయకా!
రిప్లయితొలగించండిపగ నీ పక్షము నందు కొందరికి నేర్పాటయ్యె,నీ మిత్రులన్
పగలం బెంచెడి వారి ఘోష వినినన్ భద్రంబు నీకయ్యెడిన్”
పగలన్ దీర్చు నుపాయ మైన వెదుకన్ బాగౌను నీ కెన్నికన్.
(నీ పక్షం లోనే నీకు పగవాళ్లున్నారు.నీ మిత్రుల్లో పగ పెంచే మాటలు మాట్లాడుతున్నారు.అవ్వి విను.పగ తీర్చే ఉపాయ మైనా ఆలోచిస్తే మంచిది.)
నగ పతిత వర్ష జల మిం
రిప్లయితొలగించండిపుగ నొక చోఁ గూడు యత్నము లొనర్చి వెసం
దగు రీతిని విమల జ లా
పగఁ బెంచెడి మాట వినిన భద్రము గల్గున్
తగునే పంతము లెల్ల వేళల వృథా దర్పమ్ము నీ కేలనో
వగలే కల్గును బూనినం బగలు సంబంధమ్ము లెల్లం జెడుం
జిగురింపంగ సహోదరత్వ మిలఁ గించిత్స్నేహమున్, మాన్పుచుం
బగలం, బెంచెడి మాటలన్ వినినచో భద్రంబు నీ కయ్యెడిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితగువులు తంటాలుండక
రిప్లయితొలగించండితగుసంస్కారము విలువలు ధర్మము తెలిపే
టి గురువు మన మంచికి చె
ప్పగఁ బెంచెడి మాట వినిన భద్రము గల్గున్
సమస్య:
రిప్లయితొలగించండి“పగలం బెంచెడి మాటలన్ వినినచో భద్రంబు నీకయ్యెడిన్”
మత్తేభవిక్రీడితము:
సిగలం బట్టుచు రౌద్రమున్ వలదుగా శీఘ్రంపు నొప్పందమున్
పగలే లేవుగ, జ్ఞాతివైరమను కోపంబేమి లేదే మరీ
తగవే వెట్టుచు పాలుపంచకయు తాత్సర్యంబు నేలో భళా
పగలం బెంచెడి మాటలన్, వినినచో, భద్రంబు నీకయ్యెడిన్”
(ధర్మరాజు సంధి సందేశం)
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
రగులును కలహము లింకను
పగఁ బెంచెడి మాట వినిన; భద్రము గల్గున్
పగ వలనకలుగు నష్టము
తగు రీతిగ నచ్చ చెప్ప తగవులయందున్.
జగతిని ననవరతమ్మును
రిప్లయితొలగించండిజగతిని యాపంగనెంచు జనముల పనులన్
రగిలెడు కలహంబుల నా
*"పగఁ బెంచెడి మాట వినిన భద్రము గల్గున్”*
తగదీకార్యమువీనులార విను మీదాక్షిణ్యమున్వీడుమా
పగతుండీతడు కాడు బాలుడితడున్ వారించగా నెంచెగన్
జగదీశుండితడంచువేగ పలికెన్ శాంతమ్ము గారాజుతో
*“పగలం బెంచెడి మాటలన్ వినినచో భద్రంబు నీకయ్యెడిన్”*