తే.గీ:అల స్వయం సేవకులు తమ నణచి వేయ, ప్రభుత సమకట్టె ననియెడు భయము విడచి, యత్యవసరస్థితిన్ గూడ నారు బైట కష్టముల నిష్టపడి గుడిఁ గట్టినారు” (వలయాకారం లో ఉండటాన్ని గుడి కట్టటం అంటారు.ఆర్ ఎస్ ఎస్ వాళ్లు ఎమర్జెన్సీ లో కూడా ఇలా గుడి కట్టారు.వాళ్లు శాఖలో వలయాకారం లో కూర్చుంటారు.)
తేటగీతి
రిప్లయితొలగించండిపుట్టలో నిడుములని రామునకు., వగచి
కొలువునందలి సొమ్మును గూర్చిమిగుల
మురిసి గోపన్న నిలిచి, రామునకు బాప
కష్టముల, నిష్టపడి గుడిఁ గట్టినారు
ఉత్పలమాల
చూడగ లేక పుట్టఁ గల సుందరమూర్తిని రామచంద్రునిన్
వేడుక నాలయమ్మొకటి వేదికఁ జేయఁగ నెంచి పూనుచున్
వాడి ప్రభుత్వ సంపదను భక్తుడు గోపన, లేక యూరిలో
కూడు నమంగళమ్ములని, కోవెలఁ గట్టఁగఁ బూని రెల్లరున్
ఎండకెండుచు వానకునివముఁ గొనుచు
రిప్లయితొలగించండివిచ్చుతింజెందు రాముని విగ్రహమును
రక్షఁజేయఁగ నూరిలో ప్రజలు గూడి
కష్టముల నిష్టపడి గుడిఁ గట్టినారు
ఉ.
రిప్లయితొలగించండివేడుకఁ బొంది వైష్ణవులు వ్రేకదనంబున రాముఁ గొల్చిరా
నాడున పుట్టఁ గూల్చిరి వినమ్ర సమంచిత భక్తి నిల్పుచుం
బాడిరి రామ గాథలను, వైభవ సేవలొనర్చకుండినం
గూడు నమంగళమ్ములని, కోవెలఁ గట్టగఁ బూనిరెల్లరున్ !
రిప్లయితొలగించండిగ్రామపెద్దల జేరుచు భూమి సురులు
వచ్చుచుండెనరిష్టము పల్లెకనుచు
తెలిపి నంతట వారలు తొలగు నికను
కష్టముల నిష్టపడి , గుడిఁ గట్టినారు.
బాడుబు డొక్కడాతనికి వాస్తవ మంచు వచించె నిట్టులన్
నీడగ నాశ్రయించుకొని నీదు వినాశము గోరి యిప్పుడున్
దోడుగ దుష్టశక్తులవి తొందరలో నిను చేరి నంతటన్
గూడు నమంగళమ్ములని , కోవెలఁ గట్టఁగఁ బూని రెల్లరున్.
పురమునందలి ముఖ్యులు పొదిగొనంగ
రిప్లయితొలగించండిదేవునిపయి దమ బగితి దెలుపు కొనుట
కొరకయి వలయు ధనమును గూర్చు టందు
కష్టముల నిష్టపడి గుడిఁ గట్టినారు
కనుల ముందున్న రాముని కాలయమును
రిప్లయితొలగించండికాల హరణము చేయక కట్టినయెడఁ
గలుగు హర్షమని తలచి తొలగ జేయ
కష్టముల నిష్టపడి గుడిఁ గట్టినారు
తోడుగ దైవముండ పరితోషము నిండును జీవితంబునన్
వేడుకతోడ కోవెలను వేగమె కట్టక జాగుచేసినన్
జూడగ గడ్డుకాలమని చోదక దైవబలమ్ము లేనిచో
కూడు నమంగళమ్ములని కోవెలఁ గట్టఁగఁ బూని రెల్లరున్
భక్తి భావము పెంపొంద ప్రజలు గలిసి
రిప్లయితొలగించండిదేవళ మ్మును నిర్మింప దీక్ష బూని
ప్రోగు జేసిన ధనము తో పురము నందు
కష్ట ము నిష్ఠ పడి గుడి గట్టి నారు
తే.గీ:అల స్వయం సేవకులు తమ నణచి వేయ,
రిప్లయితొలగించండిప్రభుత సమకట్టె ననియెడు భయము విడచి,
యత్యవసరస్థితిన్ గూడ నారు బైట
కష్టముల నిష్టపడి గుడిఁ గట్టినారు”
(వలయాకారం లో ఉండటాన్ని గుడి కట్టటం అంటారు.ఆర్ ఎస్ ఎస్ వాళ్లు ఎమర్జెన్సీ లో కూడా ఇలా గుడి కట్టారు.వాళ్లు శాఖలో వలయాకారం లో కూర్చుంటారు.)
ఉ:కూడును మంగళమ్ము లని కోవెల గట్టగ రామచంద్రు కై
రిప్లయితొలగించండికూడని వార లుందురని,కూర్చొన లేక విఘాత మేదియో
గూడగ జేతు రంచు నొక క్షోభయె లేక బరీక్ష జేయగా
కూడు నమంగళమ్ములని కోవెలఁ గట్టఁగఁ బూని రెల్లరున్”
(రామాలయం కట్ట బోతే విఘాతాలు వస్తాయని తెలిసినా అవి పరీక్షల వంటివి అని కట్టటం ప్రారంభించారు.)
అంచితమ్ముగ భక్తినిఁ బెంచినారు
రిప్లయితొలగించండినరవరుల నొక్క త్రాటిని నడపి నారు
మాన్యులై యెల్ల వారికి మసలినారు
కష్టముల నిష్టపడి గుడిఁ గట్టినారు
నేఁడిట లేదు మందిరము నీరజ నాభుని నిత్య పూజకై
పాడుచుఁ గీర్తనమ్ములను భక్తి యుతమ్ము విశేష రీతులన్
వేఁడఁగ నెల్ల రింపుగను విష్ణునిఁ జక్రి కృపా రసమ్మునం
గూడున మంగళమ్ము లని కోవెలఁ గట్టఁగఁ బూని రెల్లరున్
రిప్లయితొలగించండిగ్రామమున తప్పకా రఘు రామున కొక
సుందరమ్మగు పెద్దదౌ మందిర మది
యుండ వలయు నని తలచి యుత్సుకతను
*“కష్టముల నిష్టపడి గుడిఁ గట్టినారు”*
వేడిన యంత కోర్కెలను వేగమె తీర్చెడు దేవదేవుకున్
వీడున చూడచక్కనగువేల్పుల బొమ్మల నెల్ల నిల్పుచున్
వేడుకతోడ పూజలను విప్రవరేణ్యులు చేయకున్నచో
*“కూడు నమంగళమ్ములని కోవెలఁ గట్టఁగఁ బూని రెల్లరున్”*
సమస్య:
రిప్లయితొలగించండికూడు నమంగళమ్ములని కోవెలఁ గట్టఁగఁ బూని రెల్లరున్
ఉత్పలమాల:
పాడును బెట్టి యూరు, నిక, పారుట యొక్కటె దారి చూడగన్
వేడుక లేదు, వేదనలు వేడక వీడవు, ప్రాణ భీతియున్
వేడుదమంచు నీశునిక, వేగిర మంచును, భక్తి లేనిచో
కూడు, నమంగళమ్ములని, కోవెలఁ గట్టఁగఁ బూని రెల్లరున్
గూడెములో నివాసులకు కోరిక గల్గెను జానకీ సతిన్
రిప్లయితొలగించండిగూడిన రామచందురుని కోవెలఁ గట్టఁగ నూరియందునన్
పాడుచు రామకీర్తనలు భక్తిగ కోవెలఁ గట్టకున్నచో
కూడు నమంగళమ్ములని కోవెలఁ గట్టఁగఁ బూని రెల్లరున్
సమస్య:
రిప్లయితొలగించండికూడు నమంగళమ్ములని కోవెలఁ గట్టఁగఁ బూని రెల్లరున్
ఉత్పలమాల:
వీడగ నేల సంపదని, వీడిరి చూడక తల్లిదండ్రులన్
నేడు విదేశమందునను నేర్చిరి పూజలు సంతు కోసమై
కూడు నమంగళమ్ములని, కోవెలఁ గట్టఁగఁ బూని రెల్లరున్
వీడక పధ్ధతుల్ దమవి వీలుగ బాటలు వేయసాగిరే
(విదేశాలు వెళ్లి స్థిరపడి అక్కడ వారి పిల్లలకి మనపద్ధతులు నేర్పుతున్న వారెందరో)
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
గ్రామమందున లేదని రాముని గుడి
సేకరించి విరాళముల్ శీఘ్రముగను
భక్తులందరును కలసి పాటుపడుచు
కష్టముల నిష్టపడి గుడిఁ గట్టినారు.