19, నవంబర్ 2025, బుధవారం

సమస్య - 5309

20-11-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విముఖుఁడైన పతినిఁ గాంచి వెలఁది మురిసె”
(లేదా...)
“విముఖుండై పతి వీడి పోయెననుచున్ బ్రీతిన్ గనెన్ సాధ్వియే”

28 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. మ.
      అమితోన్మత్త కర ప్రమాద విష మద్యాసక్తి సామీప్యుడై
      కమనీయంబగు జీవితంబున ననుం గష్టంబులం ద్రోసె వి
      శ్వమయుండౌ హరికై యుపాస్తులను సల్పన్ మానె బానంబిటన్
      విముఖుండై పతి వీడి పోయెననుచుం బ్రీతిం గనెన్ సాధ్వియే !

      తొలగించండి
    2. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  2. సుముఖుడు దయార్ధ హృదయుడు సుగుణశీలి

    సతము పరుల మేల్గోరెడు సజ్జనుండు

    సత్యసంధుడె యగుచు దుష్కృత్యములకు

    విముఖుఁడైన పతినిఁ గాంచి వెలఁది మురిసె


    ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  3. వ్యసనములకు బానిసయైన పతిని గూర్చి
    పరితపించుచు పూజింప పరమశివుని
    పడతి వాంఛితమీడేరి వ్యసనములకు
    విముఖుఁడైన పతినిఁ గాంచి వెలఁది మురిసె

    రిప్లయితొలగించండి
  4. అందగాడనుచు నతిపలందరు భర్త
    వైపు మొగ్గుజూపించుట పసిగొనంగ ,
    పొరుగున సఖి దన మగని పొందుగోర
    విముఖుఁడైన పతినిఁ గాంచి వెలఁది మురిసె

    రిప్లయితొలగించండి

  5. మత్తికాడు పతియటంచు మగువ యెఱగి
    సహనమును జూపి మార్చగా సహచరండు
    విలువ జవరాలు లన్నను వెగటు గలిగి
    విముఖుఁడైన పతినిఁ గాంచి వెలఁది మురిసె.


    విమలుండంచును బంధువుల్ తెలుపగా స్వీకారమున్ జేయ నా
    రమణుండే రత తాలియై చెలగ నారాటమ్ము తా జెందకన్
    కమితన్మార్చగ వాడు మంజికల పై గారాబమున్ వీడగా
    విముఖుండై పతి వీడి పోయెననుచున్ బ్రీతిన్ గనెన్ సాధ్వియే.

    రిప్లయితొలగించండి
  6. తేటగీతి
    వ్యసనములచేత విత్తము వ్యయము గాగ
    పోషణంబుకు తిండియె పుట్టదయ్య
    బాలల చదువు కెట్లన వాటి పట్ల
    విముఖుఁడైన పతినిఁ గాంచి వెలఁది మురిసె!

    మత్తేభవిక్రీడితము
    సుముఖుండై చెడు నేస్తునిన్ గలువఁగన్ శోకంబునన్ నష్టమె
    ట్లు మహమ్మారులు కల్గ జేయుదురనన్ రోదించి వాగ్రుచ్చఁగన్
    నిముషంబైనను వెంటరాని సఖునిన్ నిందించి యా నేస్తుఁడున్
    విముఖుండై పతి వీడి పోయెననుచున్ బ్రీతిన్ గనెన్ సాధ్వియే!

    రిప్లయితొలగించండి
  7. ప్రముఖుడని స్తుతియించగ పరవశించి
    వల్లమాలిన ధర్మము నుల్లసిల్లి
    తుదకు జ్ఞానోదయమ్మున నధిగమించి
    విముఖుఁడైన పతినిఁ గాంచి వెలఁది మురిసె

    రిప్లయితొలగించండి
  8. ధవుడు గ్రహచార వశమున తరలిపోయి
    పడుపు కోమలి గృహమును విడువకుండి
    కాల మహిమ యనగ వెలయాలిపట్ల
    విముఖుఁడైన పతినిఁ గాంచి వెలఁది మురిసె

    సుముఖుండై మదిదోచుకొన్న మగడే సొంతింటినే వీడనా
    ప్రముఖుండౌ తన పత్నివెంటపడెనో ప్రఖ్యాత వేశ్యాంగనే
    తమకంబే తొలగంగ బుద్ధి బలమే దద్దిల్లి వైశాలిపై
    విముఖుండై పతి వీడి పోయెననుచున్ బ్రీతిన్ గనెన్ సాధ్వియే

    రిప్లయితొలగించండి
  9. కుమతుండై పతి దుష్ట సంగతమునన్ ఘోరాతిఘోరంపు ద్యూ
    తముకున్ బానిసయై చరింప సతి సద్భక్తిన్ శివున్ వేడఁగా
    ప్రమదమ్ముం గలుగంగ కాపురమునన్ బన్నంపు జూదమ్ముకున్
    విముఖుండై పతి వీడి పోయెననుచున్ బ్రీతిన్ గనెన్ సాధ్వియే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'ద్యూతమునకున్' అనడం సాధువు కదా!

      తొలగించండి

  10. మత్తేభవిక్రీడితము

    ప్రముఖుల్ చూపిన ధర్మమార్గమును దా పాటించి యొల్లప్పుడున్

    చెమటోర్చన్ వెనుకాడబోక కృతులన్ జేయున్ ఘనంబౌ నటుల్

    విమలాత్ముండయి దుష్టశీలుల గడున్ ద్వేషించి యవ్వారలన్

    విముఖుండై పతి వీడి పోయెననుచున్ బ్రీతిన్ గనెన్ సాధ్వియే



    ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  11. (Tell me of your friends, I shall tell about you అనే ఆంగ్ల నానుడిననుసరించి యండి)

    తే॥ మిత్ర బృందము నడవడి మిగుల దుష్ట
    బుద్ధినిఁ గరప సతి యటు పోరి తెలుపఁ
    దగు పగిదిని సత్యము దురిత గుణములకు
    విముఖుఁడైన పతినిఁ గాంచి వెలఁది మురిసె

    మ॥ సుముఖుండై చన జూద మాడుటకు దుష్టుల్ మిత్రులై యుండఁగన్
    సమయస్ఫూర్తిని భార్య బుద్ధిఁ గరపన్ సన్మార్గ దిక్సూచియై
    ప్రమిదల్ వెల్గఁగ నింటియందున దురభ్యాసంబు లన్నింటికిన్
    విముఖుండై పతి వీడి పోయెననచున్ బ్రీతిన్ గనెన్ సాధ్వియే

    రిప్లయితొలగించండి
  12. తే.గీ:విబుధు డౌ పతి శతకమున్ వెలువరింప
    వేమన కవీంద్రు వలె నాట వెలది బట్టె
    "యశము గొను" నాత డని తన యందు గూడ
    విముఖుఁడైన పతినిఁ గాంచి వెలఁది మురిసె”
    (ఆ కవి ఆట వెలది ని పట్టి వెలది పై విముఖు డైనా భర్తకి కీర్తి వస్తుం దని భార్య మురిసింది.)

    రిప్లయితొలగించండి
  13. మంచి మనసున్న మనిషిగా మసలు చుండి
    మానవత్వము చాటె డి మాన్యు డగుచు
    చిత్త శుద్ది గ మెలగుచు చెడ్డ పనుల
    విముఖు డైన పతిని గాంచి వెలది మురిసె

    రిప్లయితొలగించండి
  14. మ:"యమరాజా!వర మిచ్చి తీవు, పతి దేహాంతమ్ము బొందంగ సా
    ధ్యమె సంతానము సాధ్వి? కంచు ఘనమౌ తర్కమ్ము జేయంగ ధ
    ర్మము జింతించి యముండు ప్రాణవిభు వౌ ప్రాణమ్ములన్ దీయగా
    విముఖుండై , పతి వీడి, పోయె" ననుచున్ బ్రీతిన్ గనెన్ సాధ్వియే”
    (సావిత్రి తన తర్కం తో యముడు తన భర్త ప్రాణాలు తీసుకోకుండా వెళ్లి పోయా డని సంతోషించింది.)

    రిప్లయితొలగించండి
  15. తనదు భాగ్యముఁ దలపోసి తమ్మికంటి
    సంతతము సతీ రక్తుఁడై సుంత కాక
    కామ తప్తుండు నన్య కాంతా మణులకు
    విముఖుఁడైన పతినిఁ గాంచి వెలఁది మురిసె


    రమణీరత్నము గా సుధా వితరణార్థం బప్డు విష్ణుండు భా
    మ మనోహారినిఁ గాంచు కోర్కి సెలగం బంతంబుతోఁ జూచినన్
    రమనీయం బగు విష్ణుమాయ మదిఁ దెల్లం బైన వే మోహినీ
    విముఖుండై పతి వీడి పోయె ననుచున్బ్రీతిన్గనెన్ సాధ్వియే

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    స్వీయ సంపాదనే తన ధ్యేయమనుచు
    మదిని సతతము తలపోయు మాన్యుడతడు
    పర మహిళలను కోరక పర ధనముల
    విముఖుడైన పతినిఁ గాంచి వెలది మురిసె.

    రిప్లయితొలగించండి
  17. స్వార్జితమగు ద్రవ్యమె సంతస మిడునంచు
    మదిని సతతము తలచుచు మసలుచుండు
    పరుల సొమ్మును కోరక పరధనముల
    *"విముఖుఁడైన పతినిఁ గాంచి వెలఁది మురిసె”*

    రిప్లయితొలగించండి
  18. (నిన్నటి పూరణ)
    నిముసంబైనను వీడలేననుచు సాన్నిధ్యంబె స్వర్గంబుగా
    మమకారంబున దేలు భర్త కపుడా మాంచాల కర్తవ్యమే
    ప్రముఖంబంచు విధాయకంబు దెలుపన్ రాగంబు భోగంబులన్
    విముఖుండై పతి వీడి పోయెననుచున్ బ్రీతిన్ గనెన్ సాధ్వియే

    రిప్లయితొలగించండి