23, నవంబర్ 2025, ఆదివారం

సమస్య - 5313

24-11-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“వారములో రెండుగ రవివారములయ్యెన్”
(లేదా...)
“వారములోన వచ్చె రవివారము సూడఁగ రెండుమారులున్”

10 కామెంట్‌లు:


  1. వారికి సెలవన నది రవి
    వారమె, పర్వదినమదియె వచ్చిన చో నా
    వారము సెలవదనంబా
    వారములో రెండుగ రవివారములయ్యెన్.


    వారము లోనచూడ పని భారము హెచ్చె విరామ మయ్య దే
    వారము కొక్కరోజు, బుధవారము రోజున గాంచ వర్షముల్
    భూరిగ వచ్చి వాగులవి పొంగగ కచ్చెరి మూసి వేయగా
    వారములోన వచ్చె రవివారము సూడఁగ రెండుమారులున్.

    రిప్లయితొలగించండి
  2. తీరుబడి దినమనగ సా
    ధారణ రవివారమొకటె తలపుకు వచ్చున్
    వేరు దినము మహమగుటన
    వారములో రెండుగ రవివారములయ్యెన్

    రిప్లయితొలగించండి
  3. [అమెరికా నుండి రవివారము నాడు బయలుదేరి భారత్ ను చేరుకొంటే వారము రోజులకంటే ముందుగానే రవివార మొస్తుంది. time zone difference]

    వారట పయనంబై రవి
    వారము చేరుకొనిరిటకుఁ వైమానికులై
    వారము దినములు ముగియక
    వారములో రెండుగ రవివారములయ్యెన్

    వారటబైలుదేరె రవివారము నాడొక ఖండమందునన్
    జేరిరి భారతావనిని శీఘ్రమె పెద్దవిమానమందునన్
    వారికి దక్కెనొక్కరవి వారము హాయిగ సేదతీరగా
    వారములోన వచ్చె రవివారము సూడఁగ రెండుమారులున్

    రిప్లయితొలగించండి
  4. కం:ఊరక తనిఖీ లయ్యెను
    వారములో రెండుగ, రవివారములయ్యెన్
    పేరుకు మాత్రము సెలవులు
    గా!రామా!చెరగ మారె కార్యాలయమే.
    (ఇన్స్పెక్షన్లు, ఆడిట్లు వారానికి రెండు వస్తే ఆదివారాలు కూడా ఆఫీసుకి వెళ్ల వలసి రావటం జరుగుతూ ఉంటుంది. )

    రిప్లయితొలగించండి
  5. ఉ:వారము నే వధానముల వారము గా నొనరింప నెంచగా
    నారుగు రే లభించ నిక నా ధనికొండకె రెండు మోపితిన్
    తీరిక గల్గె నాతనికి, తీరిక లేకయె యుండ నెల్లరున్
    వారములోన వచ్చె రవి వారము సూడఁగ రెండుమారులున్

    (వారం రోజులు అవధానాల వారం గా నడుపుదా మనుకొంటే ఆరుగురే దొరికారు.దాని తో ధనికొండ రవి ని రెండు వారాలు చెయ్య మన్నారు.అందరూ బిజీయే కానీ ధనికొండ రవి కి పని,పాట లేక తీరిక ఐ రెందు వారాలు చెయ్యటానికి ఒప్పుకున్నాడు.)

    రిప్లయితొలగించండి
  6. కం॥ తీరుగ విరామమని రవి
    వారము సర్వులుఁ దనియరె వరలుచు నటులన్
    జేరఁగ రెండు సెలవులొక
    వారములో, రెండుగ రవివారములయ్యెన్

    ఉ॥ తీరుగ భానువారమనఁ దెల్సు విరామమటంచుఁ దెల్లమై
    చేరనటుల్ విరామములు చిత్రముగా నొక వారమందునన్
    మీరఁగ నాశ రెండటుల మిక్కిలి మొదమునొంది పల్కిరే
    వారములోన వచ్చె రవివారము సూడఁగ రెండుమార్లుగన్

    రిప్లయితొలగించండి
  7. మేరయ లేని విధంబుగ
    కోరని సెలవులు లభింప కూరిమి తోడన్
    తీరుబడి గ నను కొంటి ని
    వారములో రెండు గ రవి వారము ల య్యె న్

    రిప్లయితొలగించండి
  8. కోరి భజింపఁగ నీ గ్రహ
    వారములను భక్తి తోడ వరుసల నెంచన్
    వారము వార మొసఁగు కై
    వారములో రెండుగ రవివారము లయ్యెన్

    [ కైవారము = పొగడ్త; గ్రహ వారము = గ్రహముల సమూహము]


    వారికి వీరి కెన్నఁడును భార మొసంగవు వీని కేల యీ
    దారుణమైన పంపకము ధర్మమె యివ్విధి దుఃఖ మీయఁగం
    దోరము కష్ట మయ్యె నిడు తొంటి విధమ్ముగ నిక్కమెంచ నీ
    వారము లోన వచ్చె రవి వారము సూడఁగ రెండు మాఱులున్

    [రవి వారము = రవి యొక్క తడవ]

    రిప్లయితొలగించండి
  9. వారములు చేసుకొన, రవి
    గారింటికి మరిమరి జనె కరుణను బిలవన్.
    ఆరీతిన నరయగ నొక
    వారములో రెండుగ రవివారములయ్యెన్.

    (వారాలు చేసుకునే అబ్బాయి రవిగారింటికి వారములో రెండు మార్లు వెళ్ళిన వైనం)

    రిప్లయితొలగించండి