24, నవంబర్ 2025, సోమవారం

సమస్య - 5314

25-11-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆత్మశ్లాఘమ్మె తెచ్చు నలఘుయశమ్మున్”
(లేదా...)
“ఆత్మశ్లాఘము, సాధుదూషణములన్ ఖ్యాతిం గడింపం దగున్”

13 కామెంట్‌లు:

  1. ఆత్మజునకు జెప్పితి జీ
    వాత్మకు వలయు దగినంత పరిమాణమునన్
    ఆత్మవిసువాసము , మరియు
    ఆత్మశ్లాఘమ్మె తెచ్చు నలఘుయశమ్మున్

    రిప్లయితొలగించండి

  2. ఆత్మీయులు చెప్పెదరే
    యాత్మశ్లాఘమ్మఘమని యది వలదని పు
    ణ్యాత్ములు పలికెద రేవిధి
    యాత్మశ్లాఘమ్మె తెచ్చు నలఘుయశమ్మున్?


    ఆత్మీయుల్ ఘనులైన వారెపుడు సత్యార్థంబులే పల్కు పు
    ణ్యాత్ముల్ వారల మాటలన్ వినక సన్మార్గంబునే వీడి హీ
    నాత్ముల్ నెయ్యపు గాండ్ర మాటలు వినే యల్పుండవే ఎట్టులో
    యాత్మశ్లాఘము, సాధుదూషణములన్ ఖ్యాతిం గడింపం దగున్?

    రిప్లయితొలగించండి
  3. ఆత్మానందమొసఁగు పర
    మాత్మను మనసార గొలుచు మానవులకు, దే
    హాత్మల భేదముఁగని పర
    మాత్మశ్లాఘమ్మె తెచ్చు నలఘుయశమ్మున్

    రిప్లయితొలగించండి
  4. కందం
    ఆత్మీయముగ పలికి న
    ధ్యాత్మిక జ్ఞానమ్ము వడసి ధన్యులగుచు పా
    పాత్ముల మార్చియు వీడిన
    నాత్మశ్లాఘమ్మె, తెచ్చు నలఘుయశమ్మున్


    శార్దూలవిక్రీడితము
    ఆత్మీయమ్ముగ పల్క నేర్చి భువిలో నందించి సాయమ్ము య
    ధ్యాత్మానందము పొందుమార్గమును సంధానించి లోకాన పా
    పాత్ముల్ సైతము మార్పునొందునటులన్ వర్తించి వీడంగనే
    నాత్మశ్లాఘము, సాధుదూషణములన్ ఖ్యాతిం గడింపం దగున్

    రిప్లయితొలగించండి
  5. ఆత్మజ్ఞానమునను పర
    మాత్మనెఱిగి మరుగఁ గల్గు మాన్యతయశముల్
    ఆత్మద్రోహమె దలచగ
    ఆత్మశ్లాఘమ్మె తెచ్చు నలఘుయశమ్మున్

    రిప్లయితొలగించండి
  6. ఆత్మానందమ్ము కొరకు
    నాత్మజ్ఞానమును బడయు మప్రతిహతమై
    ఆత్మ ధృతిని సల్పిన పర
    మాత్మశ్లాఘమ్మె తెచ్చు నలఘుయశమ్మున్

    ఆత్మజ్ఞానము కోరి పొందుట సుసాధ్యంబౌను యత్నంబుతో
    నాత్మానందమటంచు సల్పు పనులే హాస్యాస్పదంబుల్ గదా!
    ఆత్మజ్ఞానము లేని మోక్షమెటులో హా! సల్పుటన్ వీడు నీ
    యాత్మశ్లాఘము, సాధుదూషణములన్ ఖ్యాతిం గడింపం దగున్

    రిప్లయితొలగించండి
  7. ఆత్మానందముఁగోరి మానవులు నిర్వ్యాజమ్ముగా నిచ్చలున్
    స్వాత్మన్ గొల్తురు భక్తి భావమున నా సర్వేశ్వరున్ వీడకన్
    ఆత్మానాత్మ వివేచనమ్మెరిగి యశ్రాంతమ్ము వర్జింపగా
    నాత్మశ్లాఘము, సాధుదూషణములన్ ఖ్యాతిం గడింపం దగున్

    రిప్లయితొలగించండి
  8. వ్యంగంగా నండి నేడు చాలా మంది చేస్తున్నదే

    కం॥ ఆత్మోద్ధరణ ధనమున
    నాత్నోన్నతిఁ గనుఁ బలుకఁగ నధికుఁడనని జీ
    వాత్మ తలఁచ నేఁడు నిజమె
    ఆత్మశ్లాఘమ్మె తెచ్చు నలఘయశమ్మున్

    శా॥ ఆత్మోద్ధారణ మన్న విత్తమును సంహ్లాదమ్ముతోఁ గాంచుటే
    యాత్మోద్ధారణ స్వంత గొప్పలను నిత్యంబట్లు కీర్తించుటే
    యాత్మోద్ధారణ మన్న నన్యులను సత్యంబెంచ దూషించుటే
    ఆత్మశ్లాఘము సాధు దూషణములన్ ఖ్యాతిం గడింపందగున్

    రిప్లయితొలగించండి
  9. కం॥
    ఆత్మాభిమానమడలగ
    నాత్మన్యూనత పొలచెడి నాభీలమునన్
    స్వాత్మోత్సాహమ్మునిడెడి
    యాత్మశ్లాఘమ్మె తెచ్చు నలఘుయశమ్మున్

    రిప్లయితొలగించండి
  10. ఆత్మీయు ల వలె మెలగుచు
    నాత్మా నందము గలిగియు నారాట ముతో
    నాత్మ ను నిలిపియు నా పర
    మాత్మ శ్లా ఘ మ్మె తెచ్చు నలఘు యశమ్ము న్

    రిప్లయితొలగించండి
  11. కం:ఆత్మీయ లుండ రో పు
    ణ్యాత్మా! యెన్నికల లోన నన్యుల గడు దు
    ష్టాత్ము లనుచు దిట్టుటయును,
    నాత్మశ్లాఘమ్మె తెచ్చు నలఘుయశమ్మున్”

    రిప్లయితొలగించండి
  12. శా:ఆత్మన్ వంచన జేసి పల్కుదురు దుష్టాత్ముల్ యశో కాంక్షులై
    యాత్మజ్ఞానము నిచ్చు శంకరుని సిద్ధార్థున్ మహా మూర్ఖులం,
    చాత్మన్ జింతన జేయ నట్టి జనులం దా మూర్ఖతన్ వారి దౌ
    నాత్మశ్లాఘము, సాధుదూషణములన్ ఖ్యాతిం గడింపం దగున్”

    (ఈ రోజుల్లో మీడియా లో చూస్తే శంకరుడు,బుద్ధుడు మొదలైన మహాత్ములని నిందించి తమని మేధావులు గా చెప్పుకొని గుర్తింపు పొందే వా రున్నారు. ఆలొచించ లేని జనం లో వీళ్లు పేరు ప్రతిష్ఠలు పొంద వచ్చు. వివేకం ఉన్న వారిలో పొందరు.)

    రిప్లయితొలగించండి
  13. అత్మీయత వర్ధిల్ల ని
    జాత్మ సఖులపై సతమ్ము నత్యంతము జీ
    వాత్మకు నిరంతరము వీ
    తాత్మశ్లాఘమ్మె తెచ్చు నలఘు యశమ్మున్


    ఆత్మజ్ఞానము ప్రజ్వరిల్లఁ బరమాత్మాంతస్స్థి తాత్మీయ జీ
    వాత్మాలింగన కార్యముం దెలియ సత్యం బంచు నేపార న
    ధ్యాత్మం బత్యధికమ్ముగా నెడఁద నిత్యమ్మున్ విసర్జింపఁగా
    నాత్మశ్లాఘము, సాధు దూషణములన్ ఖ్యాతిం గడింపం దగున్

    రిప్లయితొలగించండి