22, డిసెంబర్ 2025, సోమవారం

సమస్య - 5328

23-12-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మరుభూమిని నిసుక నమ్ముమా సిరులబ్బున్”
(లేదా...)
“అరిగి యెడారిలో నిసుక నమ్మి గడింపఁగవచ్చు సంపదన్”

16 కామెంట్‌లు:

  1. కందం
    దొరుక నదులలో దోచితె
    మరి మరి! భూగర్భ జలపు మట్టము పడియెన్!
    సరిపోదె కలిమి! పాపీ!
    మరుభూమిని నిసుక నమ్ముమా సిరులబ్బున్!

    చంపకమాల
    దొరుకగ నేరులన్ నదుల దోచ విచక్షణఁ గానకుండగన్
    మరిమరి! భూమిలో జలపు మట్టము జాఱెను త్రాగునీటికిన్
    కరువయె! చాలదందువయ! కల్మి! నరాధమ! సిగ్గు కాదొ? నీ
    వరిగి యెడారిలో నిసుక నమ్మి గడింపఁగవచ్చు సంపదన్!

    రిప్లయితొలగించండి
  2. పరిపాలన జేయుటకై
    యరుదగు రీతిగ నది తటి యనువని దలచన్
    శరము దరి నిర్మితి కొరక
    మరు భూమిని , నిసుక నమ్ముమా ! సిరులబ్బున్

    రిప్లయితొలగించండి

  3. పరమ పిసినారి జేరుచు
    విరాళము నడుగుట కంటె విశ్వము లోనన్
    ధరణీ రుహములె యుండని
    మరుభూమిని నిసుక నమ్ముమా సిరులబ్బున్.


    అరయగ వాడు లుబ్ధుడని యందరెఱుంగెదరైరి కాదె యె
    వ్వరికిని కాసు రాల్చడిది వాస్తవ మంచు నెఱంగి కూడ నీ
    పురమున నాసుపత్రికయి భూరి విరాళము గోర మందువే
    యరిగి యెడారిలో నిసుక నమ్మి గడింపఁగవచ్చు సంపదన్?

    రిప్లయితొలగించండి
  4. కం. అరుదగు అవకాశమ్మిది
    హరిహయపురిని మరిపించ నమరావతిలో
    వరరాజధానియగుచు న
    మరు భూమిని నిసుక నమ్ముమా సిరులబ్బున్

    హరిహయ పురి : ఇంద్రపురి
    అమరు భూమి : తగిన ప్రదేశము

    రిప్లయితొలగించండి
  5. కం॥ ధరణిని యుక్తి గల నరుఁడు
    పరిపరి విధములఁ గలిమినిఁ బడయగలమటం
    చు రచించె మాయల నెరిగి
    మరుభూమిని నిసుక నమ్ముమా సిరులబ్బున్

    చం॥ ధరణిని శక్తి యుక్తులను దాల్చఁగ సాధ్యము కానిదేదయా!
    విరివిగ మాయఁ జేయుచును విత్తముఁ బొందుట సాధ్యమే సుమా!
    సరగున కంచుఁ బైఁడియని చక్కగ దందనసేయు నేర్పరే
    అరగి యెడారిలో నిసుక నమ్మి గడింవచ్చు సంపదల్

    దందనసేయు మోసగించు

    రిప్లయితొలగించండి
  6. చం:తిరిగెద వేల రా బతుకు తెర్వుకు ,పోతివి థారెడారి ద
    గ్గరకు నుపాథి గోరి,యథికమ్ము గడించెద వేమి కాళ్లు రెం
    డరిగి యెడారిలో? నిసుక నమ్మి గడింపఁగవచ్చు సంపదన్
    స్థిరముగ నింట నుండి , యిక జేరకు మా రసపుత్రదేశమున్ !
    (కొదుకు ఉద్యొగాల కోసం రాజస్థాన్ దాకా పోయి తిరుగుతున్నాడు. తండ్రి వెలాకొలం గా థార్ ఎదారి దాకా అన్నాడు.ఇంటి దగ్గరే ఉంది ఇసుక వ్యాపారన్ చెయ్య మన్నాడు.థార్ ఎదారి రాజస్థాన్ లో ఉంది. రసపుత్రదేశము = రాజస్థాన్. )

    రిప్లయితొలగించండి
  7. తరుణము దొరికిన చాలని
    ధరణిని ధనములను బొంద తస్కరు లగుచున్
    వెరువరు దేనికి నైనను
    మరు భూమిని నిసుక నమ్ము మా సిరు లబ్బు న్!?

    రిప్లయితొలగించండి
  8. (1)కం:"సరి నీకున్ భూవర్తక,
    మరయ నిసుక గూడ సరి గ్రహస్థితి లో" నం
    చెరుకన్ జేసితి గద!ప
    ల్మరు! భూమిని, నిసుక నమ్ముమా సిరులబ్బున్!
    (జాతకం ప్రకారం రియల్ ఎస్టేట్ వ్యాపారం,ఇసుక వ్యాపారం కలిసొస్తాయని జ్యోతిషుడు చెప్పినట్లు. )

    రిప్లయితొలగించండి
  9. పరమేశ్వరు దయ కల్గినఁ
    బరఁగును నేఁటి మరుభూమి పంటల తోడన్
    ధర నిండ్లకు వలయు నిసుక
    మరుభూమిని నిసుక నమ్ముమా సిరు లబ్బున్

    [నమ్ము = విశ్వసించు]


    వర సఖ నమ్మి మూర్ఖులను వర్తక మప్పురి రాదు సేయఁగా
    నరిగి వనమ్ములో ఫలము లమ్మి గడింపఁగ వచ్చు దుడ్డు వే
    యరిగి ఘనాబ్ధికిన్ జలము నమ్మి గడింపఁగ వచ్చు సొత్తు నిం
    కరిగి యెడారిలో నిసుక నమ్మి గడింపఁగ వచ్చు సంపదన్

    రిప్లయితొలగించండి
  10. బరవసముగ కృషి సలిపిన
    సిరులను పండించవచ్చు స్థిర చిత్తముతో
    నిరుపమ వివేకమును గొని
    మరుభూమిని నిసుక నమ్ముమా సిరులబ్బున్

    రిప్లయితొలగించండి
  11. నిరుపమ దీక్షఁ బూని యనునిత్యము సాధనజేయ కార్యముల్
    సరవిని సానుకూలపడు సాధ్యము కానిది లేదు భూమిపై
    వెరవున కార్యసాధకుఁడు వీఁక ధనార్జన చేయనెంచ దా
    నరిగి యెడారిలో నిసుక నమ్మి గడింపఁగవచ్చు సంపదన్

    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    హరుడే వసించు సతతము
    మరుభూమిని; నిసుక నమ్ముమా సిరులబ్బున్
    దొరకగ నదులందున మరి
    జరిగెడు నష్టమునెఱిగియు స్వార్ధము తోడన్.

    రిప్లయితొలగించండి