24, డిసెంబర్ 2025, బుధవారం

సమస్య - 5330

25-12-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కన్నవారల కిడరాదు గౌరవమ్ము”
(లేదా...)
“కన్నవారలఁ గాంచినంతనె గౌరవించుట దోషమౌ”
('అవధాన పుష్కరిణి' మాస పత్రిక నుండి)

12 కామెంట్‌లు:

  1. మత్తకోకిల.
    నిన్న మొన్న జనించి పెద్దల నీతి వాక్కులు వీడి యో
    యన్నమందగ జేయు వస్తువులంచు జీవితమందు నే
    చెన్ను చేతలు సల్పలేని విచిత్రమౌ ఖలు దృష్టిలో
    కన్న వారల గాంచినంతనె గౌరవించుట దౌషమౌ !

    రిప్లయితొలగించండి
  2. ఎన్ని తీర్థములేగినన్ మరి యెన్నిపూజలు సల్పినన్
    కన్నవారి ఋణమ్ము దీర్చుట కాదు శక్యము సర్వదా
    నిన్ను తీరిచి దిద్ది నీకు వినీతి నేరిపినట్టియా
    కన్నవారలఁ గాంచినంతనె గౌరవించుట దోషమౌ?

    రిప్లయితొలగించండి
  3. ఎవరికి బవిసి నిడుటయో నెంచుటందు
    నెంతయో శ్రద్ధ నిడదగు< నెట్లనంగ
    నొకరి యున్నతి గని యీర్ష్య నొందువాని
    కన్నవారల కిడరాదు గౌరవమ్ము

    రిప్లయితొలగించండి
  4. నిన్ను కనిపెంచినట్టి నీ కన్నవారు
    నీకు దైవసమానులు నిక్కముగను
    ఏల తలఁతురు కొందరీ లీల భువిని
    కన్నవారల కిడరాదు గౌరవమ్ము!

    రిప్లయితొలగించండి
  5. తేటగీతి
    కన్యలన్ చెఱపట్టిన కర్కశుండు
    కన్న వాడైన, సత్యాంబ కాలరాచె!
    మీరి వర్తింప సంఘాన మెచ్చి యెపుడు
    కన్నవారల కిడరాదు గౌరవమ్ము

    మత్తకోకిల
    కన్నుగానక బందిచేయగ కన్యలన్ నరకుండహో!
    మిన్నకుండగ మాతసత్యయె మృత్యువున్ జవిఁ చూపెనే!
    యెన్నడైనను నెప్పుడైనను నేహ్యమౌ పథమంటినన్
    గన్నవారలఁ గాంచినంతనె గౌరవించుట దోషమౌ!

    రిప్లయితొలగించండి

  6. భువిని నినుగన్న వారలె పూజ్యు లనుట
    భారతీయసంస్కృతి చిన్న వాడ వంచు
    తెలుపు చుంటి వినుము నీ సుతులగు నీవు
    కన్నవారల కిడరాదు గౌరవమ్ము.


    పిన్నవంచును చెప్పుచుంటిని పేర్మి తోడను సోదరా
    కన్నవారలు తల్లిదండ్రుల కల్పమందున భక్తితో
    సన్నుతించుటె సంప్రదాయము సంపరాయల నీ విలన్
    కన్నవారలఁ గాంచినంతనె గౌరవించుట దోషమౌ.

    రిప్లయితొలగించండి
  7. తే. చిన్నతనమున నడవఁగ చేయినొసఁగి
    మిన్ను విరిగినా నిలచియు దన్నుగాను
    కన్ను దెరచినదాదిగా గాఁవ, నేల
    కన్నవారల కిడరాదు గౌరవమ్ము ?

    రిప్లయితొలగించండి
  8. కన్న తలిదండ్రుల కొసగి గౌరవమ్ము
    కన్నవారి సమూహము నెన్నదగును
    కన్నవారిలో నీచులన్ గాంచినపుడు
    కన్నవారల కిడరాదు గౌరవమ్ము

    కన్నవారగు తల్లిదండ్రుల కాదరమ్మున మ్రొక్కినన్
    గన్నవారి సమూహమందున గాంచవచ్చును గాదొకో
    చిన్నవారలు నీతిహీనులు సిగ్గుమాలిన వారలున్
    గన్నవారలఁ గాంచినంతనె గౌరవించుట దోషమౌ

    [ కన్నవారు = ప్రతివారు ]

    రిప్లయితొలగించండి
  9. తల్లి దండ్రులు భువిలోన దైవ సములు
    వారి సతతమ్ము బూజించి వరల వలయు
    నట్టి వారల నెందుకీ యవని యందు
    కన్న వారల కిడ రాదు గౌర వంబు?

    రిప్లయితొలగించండి
  10. తే॥గీ
    ధరణి నున్నతపదవిని తాము గెలిచి
    జనుల కింతనెరవునిచ్చు సత్వమిడక
    జగతినున్నట్టి సంపద సాధిమ మన
    కన్నవారలకుడరాదు గౌరవమ్ము!!

    (మనకు+అన్నవారలకు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్షమించండి. నేనింతముందు ప్రచురించిన పూరణ లోని పొరపాట్లను సవరించి మళ్ళీ ప్రచురిస్తున్నాను.(డిలీట్ చేయడం ఎలాగో తెలియలేదు)
      తే॥గీ
      ధరణి నున్నతపదవిని తాము గెలిచి
      జనుల కింతనెరవునిచ్చు సత్వమిడక
      జగతినున్నట్టి సంపద సాధిమ తమ
      కన్నవారలకిడరాదు గౌరవమ్ము!!

      (తమకు+అన్నవారలకు)

      తొలగించండి
  11. (1)తే.గీ: బతికి నన్నాళ్లు వారిని బాధ బెట్టి
    వ్రాసినట్టి గ్రంథముల సభన్ జదువుచు
    నన్యు లెవ్వరో మెచ్చగ నంకితమ్ము
    కన్నవారల కిడ రాదు గౌరవమ్ము”


    (2)ఉ: నన్ను, నీ యవధానినిన్, గవనమ్ము నందునదిట్టనౌ
    నన్ను గానక విద్య లేకయె నాల్గు మాటలు నేర్చుకన్
    చిన్న భాషణ లిచ్చు వారిని జేరదీసిరి మెచ్చి,నా
    కన్న వారల గాంచి నంతనె గౌరవించుట దోషమౌ

    రిప్లయితొలగించండి