16, డిసెంబర్ 2025, మంగళవారం

సమస్య - 5332

17-12-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నేననంగ నీవె నీవు నేనె”
(లేదా...)
“నేనన నీవె నీవనిన నేనె కదా పరికింపఁ దత్త్వమున్”

14 కామెంట్‌లు:

  1. తలపులందు మనకు తారతమ్యము లేదు
    నేననంగ నీవె నీవు నేనె
    ఎన్నడైన గాని యింగములందూన
    నీకు నాకు నెరవు నిలువ కుండు

    రిప్లయితొలగించండి
  2. ఊనిన దేహమం దలరి
    యూహల నీవును నేననంచు నీ
    మేన జరించువారమయి
    మేదిని యందున వింతబంధముల్
    బేనుచు పెన్గులాడుచు త
    పించెడివారల మైతి మేలనో!
    నేనన నీవె నీవనిన
    నేనె కదా పరికింపఁ దత్త్వమున్!

    రిప్లయితొలగించండి
  3. భక్తరామదాసు ఆవేదన:

    ఆటవెలది
    పుట్టలోని నిన్ను పెట్టితిన్ గుడిలోన
    నంతరాత్మమౌచు నానతీయ
    నేననంగ నీవె నీవు నేనె యయిన
    చెరకునంపితేల? శ్రీరఘువర!

    ఉత్పలమాల
    కానల పుట్టలోఁ గనియుఁ గట్టితి నాలయమంతరాత్మవై
    యానతి నీయఁగన్ గదిలి యచ్యుత! శ్రీరఘురామ! భక్తితోన్
    బూనుచు నాదు మానసముఁ బొందియుఁ గోవెలఁ! గారఁ ద్రోయుదే?
    నేనన నీవె నీవనిన నేనె కదా పరికింపఁ దత్త్వమున్!

    రిప్లయితొలగించండి
  4. ఆ.వే.

    ఎల్లవేళలెపుడు ఎల్లరియందునన్
    కనగొనజగములను గాంచగలిగె
    హరునిజూడగమరి హరియెబలికె
    నేననంగనీవె నీవునేనె


    ✍🏻ఇంద్రకంటి భార్గవ నృసింహ

    రిప్లయితొలగించండి
  5. పూవులేనిచోట తావి యెటులనుండు
    నీవు లేక నేను నిలువలేను
    నిన్ను వీడలేను నిముసమైనా చెలీ
    నేననంగ నీవె నీవు నేనె

    రిప్లయితొలగించండి

  6. అర్ధ దేహ మందు నపురూపమున నిన్ను
    నిలుపు కుంటి గాదె నీర జాక్షి
    జగము తల్లి వీవు జగదీశ్వరుడ నేను
    నేననంగ నీవె నీవు నేనె.


    నేనును లోక రక్షయను నీమము తో చరియించు చుండగా
    హే నగ జాత నీకును మహీతల రక్షయె దీక్షయయ్యెనే
    మానిని పర్వతాత్మజ సమానమె యిర్వుర మిట్టి సృష్టి లో
    నేనన నీవె నీవనిన నేనె కదా పరికింపఁ దత్త్వమున్.

    రిప్లయితొలగించండి
  7. నీ నగుమోము చందురుఁడు నీ దరహాసము వెల్గు చంద్రికల్
    నేనును నీవు వేరనుట నేరము వేరుగ జూడకెన్నఁడున్
    మేనులు రెండు వేరయిన మెల్తుక ప్రాణమదొక్కటే సుమా
    నేనన నీవె నీవనిన నేనె కదా పరికింపఁ దత్త్వమున్

    రిప్లయితొలగించండి
  8. మేనిలోసగమును జానికొసగె శూలి
    వేరు భావమెచట వారి నడుమ
    బెరుకెరుగని జంట ప్రేమైక భావమే
    నేననంగ నీవె నీవు నేనె

    తానిడె మేనిలోసగము త్ర్యక్షుడు ప్రేయసి నందయంతికిన్
    మేనొకటైన తొల్గుగద మేలగు రీతిని భేదభావమే!
    మానసమందునిల్చితన మానస మిచ్చిన జంట డెందమే
    నేనన నీవె నీవనిన నేనె కదా పరికింపఁ దత్త్వమున్

    రిప్లయితొలగించండి
  9. హరి హరులకు మధ్య యంతర మది లేదు
    హరియు పలికె నిట్లు హరుని తోడ
    నేననo గ నీవె నీవె నేను మనకు
    భేద మన్న దేది లేదు లేదు

    రిప్లయితొలగించండి
  10. ఒక భక్తుడు భగవంతుని చేరుటకు తొలుత భక్తి పిదప జ్ఞాన మార్గములందు సాగుట

    ఆ॥ భక్తి మార్గ మొదవి ముక్తిఁ బడయనెంచి
    దాసుఁడ నగుచు నినుఁ దలఁతు సతము
    జ్ఞాన మార్గమందు చని పరిణితిఁ గన
    నేననంగ నీవె నీవు నేనె

    ఉ॥ నేనటు భక్తి మార్గమున నెమ్మిని సాగఁగ దాసుఁడే సదా
    మానక నిన్నె కొల్తునయ మన్నన సేయుచు నెల్లవేళలన్
    నేనిల జ్ఞాన సంపదల నిర్మల సత్యముఁ గాంచఁ దెల్సెనే
    నేనన నీవె నీవనిన నేనె కదా పరికింపఁ దత్త్వమున్

    దాసోఽహం సోఽహం తత్త్వమండి

    రిప్లయితొలగించండి


  11. ఆ.వె:ఎవరు గొప్ప కవియొ వివరించు మని కాళి
    దాసు కోర జెప్పె దనదు తీర్పు
    వాణి "దండి కవియు,భవభూతి విబుధుడున్
    నేననంగ నీవె నీవు నేనె"

    రిప్లయితొలగించండి
  12. ఉ:నే నొక జీవుడన్,మరియు నీవు జగత్తుకు కారణమ్మవౌ
    గాన రదేమి శంకరులు ? గర్వము బెంచెడు వారి బోధ లో
    నేనన నీవె, నీవనిన నేనె కదా! పరికింపఁ దత్త్వమున్
    నే నది నమ్మకుంటి నిక నే నొక దాసుడ నీకు శ్రీహరీ!
    (శంకరుల అద్వైతాన్ని ద్వైతులు,విశిష్టాద్వైతులు అంగీకరించరు. జీవో బ్రహ్మైవ అనేది గర్వాన్ని కలిగించే బోధ అని వారి అభిప్రాయం.దాన్ని అంగీకరించని వైష్ణవుని భక్తి ఇది.)

    రిప్లయితొలగించండి
  13. మాటల నెద నమ్మి మర్మమ్ము నేరక
    మోసపోకు మయ్య పురుష వర్య
    తియ్యగ వచియింత్రు నెయ్యమునకు నిట్లు
    నే ననంగ నీవె నీవు నేనె


    కానక యున్న సుంతయును గార్యము నాతని యందు నిట్లనున్
    నే నన నీవు కాదు మఱి నీవన నేనును గా దెఱుంగుమా
    యూనిన సుంత యేని యుపయోగము దా వచియించు నివ్విధిన్
    నే నన నీవె నీ వనిన నేనె కదా పరికింపఁ దత్త్వమున్

    రిప్లయితొలగించండి