27-12-2025 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“దారికి నమస్కరించిన దక్కుఁ బరము”(లేదా...)“దారికి మ్రిక్కినన్ బహువిధంబుల మేలగు మోక్షమబ్బెడిన్”('అవధాన విద్యా సర్వస్వము' నుండి)
ఉ.చారు తపః క్రియా కలిత సంయమి సంభృత శైల పుత్రికం బేరు వెలుంగు గిత్తపయి వెల్గెడు సామిని గొల్చి ప్రీతితో జేరిన భక్త పుంగవుల శ్రీమయమౌ ఘన పూర్ణ భక్తి రాదారికి మ్రొక్కినన్ బహువిధంబుల మేలగు మోక్షమబ్బెడిన్ !
ఎట్టి యాపద మనుజున కెదురయినను కోరగనె రక్ష ణను సమకూర్చు చుండుపాంచ జన్యధరుడయిన పచ్చవలువ“దారి కి నమస్కరించిన దక్కుఁ బరము”
అల్పమైనట్టి సుఖముల కాశ పడక పరమ పదమును గోరెడి భక్తు లెపుడు సత్యమునెపుడు విడకుండ నిత్యము నెల దారికి నమస్కరించిన దక్కుఁ బరము.ధారుణి నేలు వారలకు దాసుడ వైచరి యించ నేమిరా కోరిన రీతి సంపదలు కూడిన కూడగవచ్చు కాని ని స్థారము దక్క బొదనుట సత్యము, చిత్తము నందు నిల్పి మా దారికి మ్రొక్కినన్ బహువిధంబుల మేలగు మోక్షమబ్బెడిన్.*(మా = చంద్రుడు)*
తేటగీతిగరళకంఠుఁడై కల్యాణ కారకునిగప్రజకు మేలొనరించెడు ప్రభువనంగసాంబమూర్తికి శివునికి జాబిలిజడదారికి నమస్కరించిన దక్కుఁ బరముఉత్పలమాలక్షీరజలాంబుధిన్ జెలఁగ క్ష్వేళము మ్రింగియు నీలకంఠుఁడైగౌరికి మోదమున్ గరపి కాచెను లోకుల, భక్త సత్క్రియాకారక సాంబమూర్తికి, దిగంబర శూలి, పురారి, గట్టువిల్దారికి మ్రొక్కినన్ బహువిధంబుల మేలగు మోక్షమబ్బెడిన్
నీరమే మన మనుగడ కారణమ్ముపాఱు నదుల జలంబులే ఫలములొసగుపుణ్య ఫలము నాశించి 'గో' పూర్వకమగు దారికి నమస్కరించిన దక్కుఁ బరమునీరము లేనిచోట మననేరదు మానవ జాతి యెన్నడున్దూరము నుండివచ్చి మదిదోచెడి సింధువు లోన మున్గగాఁదీరును కోర్కెలంద్రు మన దేశములోగల వృద్ధులెల్ల గోదారికి మ్రిక్కినన్ బహువిధంబుల మేలగు మోక్షమబ్బెడిన్
-మ్రొక్కులను దీర్చు నా స్వామి మ్రోల చేరుదారి అదిగొ అల్లదిగొ! పద పద వేగిరమ్ము శ్రీవారి మెట్టు ప్రార్థన యొనరిచిదారికి నమస్కరించిన దక్కు బరము
తే.గీ:నడక దారిన నేడు కొండలను జూచి నిన్ను దర్శించు శక్తి లేకున్న జనులునీదు భక్తులు నడచుచు మోద మందుదారికి నమస్కరించిన దక్కుఁ బరము
ఉ:దారిని బుణ్యదేశముల దందిగ దాకుచు భద్రశైలమున్జేరుక రామదర్శనము జేయుచు, ఠీవిగ రాణ్మహేంద్రినిన్జేరుక నన్నయన్ స్మృతికి జేర్చుచు బంగరు పంట లిచ్చు గోదారికి మ్రొక్కినన్ బహువిధంబుల మేలగు మోక్షమబ్బెడిన్
అవనిఁ గోదండ రామున కఖిల జనులు నిర్మలాంతరంగమ్ముల నిశ్చలంపు భక్తి సంతతం బడరఁగఁ బంక్తిముఖ వి దారికి నమస్కరించిన దక్కుఁ బరము ద్వారవతీ పురమ్మున సదామము వెల్గుచు నుండ నిత్యమున్ వారక వాసుదేవునకు భక్తి సతమ్ము మహోగ్ర భీక రాకార సురౌఘ నిర్దళన కాంచన భోజన దార్ఢ్య హృత్శిలా దారికి మ్రొక్కినన్ బహు విధంబుల మే లగు మోక్ష మబ్బెడిన్
తే॥ సద్గుణములఁ బడసి తగు శ్రద్ధ నిడుచుభక్తిమీరఁగ వేడఁగ శక్తి కొలదిమనము నిలిపి మోక్ష మొదవు మనుజులు జడదారికి నమస్కరించిన దక్కుఁ బరము ఉ॥ పారముఁ జేర్చు వాని నిజ భావన మీరఁగ సద్గుణమ్ములన్ధారణఁ జేసి నిత్యమటు వర్తిలి వేడిన చాలు నచ్యుతున్ దారణ మొందరే జనులు ధాత్రిని సత్యముఁ దెల్ప మర్త్యులాదారికి మ్రొక్కినన్ బహువిధంబుల మేలగు మోక్షమబ్బెడిన్దారి ధరించువాడు
తే॥గీవిడువక దననే గొలిచిన విడువక మనవెంట నుండి రక్షించెడి , విషధరునికినెరవుగ విపులయంతయు నిండిన నెలదారికి నమస్కరించిన దక్కుఁబరము!!
పెక్కు దారులు గలవండ్రు విబుధ వరులు వాటి గమ్యాలు తెలియక వరలు చుండ నెరుగ కుండగ దేనికి యే వి ధా న దారికి నమస్కరించిన దక్కు బరము?
చిత్త శుద్ధిగ సతతము సేవచేసిభక్తి తోడను పూవులు ఫలములొసగివినయముగనను దినమును విడువకజడ*"దారికి నమస్కరించిన దక్కుఁ బరము”*
ఉ.
రిప్లయితొలగించండిచారు తపః క్రియా కలిత సంయమి సంభృత శైల పుత్రికం
బేరు వెలుంగు గిత్తపయి వెల్గెడు సామిని గొల్చి ప్రీతితో
జేరిన భక్త పుంగవుల శ్రీమయమౌ ఘన పూర్ణ భక్తి రా
దారికి మ్రొక్కినన్ బహువిధంబుల మేలగు మోక్షమబ్బెడిన్ !
ఎట్టి యాపద మనుజున కెదురయినను
రిప్లయితొలగించండికోరగనె రక్ష ణను సమకూర్చు చుండు
పాంచ జన్యధరుడయిన పచ్చవలువ
“దారి కి నమస్కరించిన దక్కుఁ బరము”
రిప్లయితొలగించండిఅల్పమైనట్టి సుఖముల కాశ పడక
పరమ పదమును గోరెడి భక్తు లెపుడు
సత్యమునెపుడు విడకుండ నిత్యము నెల
దారికి నమస్కరించిన దక్కుఁ బరము.
ధారుణి నేలు వారలకు దాసుడ వైచరి యించ నేమిరా
కోరిన రీతి సంపదలు కూడిన కూడగవచ్చు కాని ని
స్థారము దక్క బొదనుట సత్యము, చిత్తము నందు నిల్పి మా
దారికి మ్రొక్కినన్ బహువిధంబుల మేలగు మోక్షమబ్బెడిన్.
*(మా = చంద్రుడు)*
తేటగీతి
రిప్లయితొలగించండిగరళకంఠుఁడై కల్యాణ కారకునిగ
ప్రజకు మేలొనరించెడు ప్రభువనంగ
సాంబమూర్తికి శివునికి జాబిలిజడ
దారికి నమస్కరించిన దక్కుఁ బరము
ఉత్పలమాల
క్షీరజలాంబుధిన్ జెలఁగ క్ష్వేళము మ్రింగియు నీలకంఠుఁడై
గౌరికి మోదమున్ గరపి కాచెను లోకుల, భక్త సత్క్రియా
కారక సాంబమూర్తికి, దిగంబర శూలి, పురారి, గట్టువి
ల్దారికి మ్రొక్కినన్ బహువిధంబుల మేలగు మోక్షమబ్బెడిన్
నీరమే మన మనుగడ కారణమ్ము
రిప్లయితొలగించండిపాఱు నదుల జలంబులే ఫలములొసగు
పుణ్య ఫలము నాశించి 'గో' పూర్వకమగు
దారికి నమస్కరించిన దక్కుఁ బరము
నీరము లేనిచోట మననేరదు మానవ జాతి యెన్నడున్
దూరము నుండివచ్చి మదిదోచెడి సింధువు లోన మున్గగాఁ
దీరును కోర్కెలంద్రు మన దేశములోగల వృద్ధులెల్ల గో
దారికి మ్రిక్కినన్ బహువిధంబుల మేలగు మోక్షమబ్బెడిన్
-
రిప్లయితొలగించండిమ్రొక్కులను దీర్చు నా స్వామి మ్రోల చేరు
దారి అదిగొ అల్లదిగొ! పద పద వేగి
రమ్ము శ్రీవారి మెట్టు ప్రార్థన యొనరిచి
దారికి నమస్కరించిన దక్కు బరము
తే.గీ:నడక దారిన నేడు కొండలను జూచి
రిప్లయితొలగించండినిన్ను దర్శించు శక్తి లేకున్న జనులు
నీదు భక్తులు నడచుచు మోద మందు
దారికి నమస్కరించిన దక్కుఁ బరము
ఉ:దారిని బుణ్యదేశముల దందిగ దాకుచు భద్రశైలమున్
రిప్లయితొలగించండిజేరుక రామదర్శనము జేయుచు, ఠీవిగ రాణ్మహేంద్రినిన్
జేరుక నన్నయన్ స్మృతికి జేర్చుచు బంగరు పంట లిచ్చు గో
దారికి మ్రొక్కినన్ బహువిధంబుల మేలగు మోక్షమబ్బెడిన్
అవనిఁ గోదండ రామున కఖిల జనులు
రిప్లయితొలగించండినిర్మలాంతరంగమ్ముల నిశ్చలంపు
భక్తి సంతతం బడరఁగఁ బంక్తిముఖ వి
దారికి నమస్కరించిన దక్కుఁ బరము
ద్వారవతీ పురమ్మున సదామము వెల్గుచు నుండ నిత్యమున్
వారక వాసుదేవునకు భక్తి సతమ్ము మహోగ్ర భీక రా
కార సురౌఘ నిర్దళన కాంచన భోజన దార్ఢ్య హృత్శిలా
దారికి మ్రొక్కినన్ బహు విధంబుల మే లగు మోక్ష మబ్బెడిన్
తే॥ సద్గుణములఁ బడసి తగు శ్రద్ధ నిడుచు
రిప్లయితొలగించండిభక్తిమీరఁగ వేడఁగ శక్తి కొలది
మనము నిలిపి మోక్ష మొదవు మనుజులు జడ
దారికి నమస్కరించిన దక్కుఁ బరము
ఉ॥ పారముఁ జేర్చు వాని నిజ భావన మీరఁగ సద్గుణమ్ములన్
ధారణఁ జేసి నిత్యమటు వర్తిలి వేడిన చాలు నచ్యుతున్
దారణ మొందరే జనులు ధాత్రిని సత్యముఁ దెల్ప మర్త్యులా
దారికి మ్రొక్కినన్ బహువిధంబుల మేలగు మోక్షమబ్బెడిన్
దారి ధరించువాడు
తే॥గీ
రిప్లయితొలగించండివిడువక దననే గొలిచిన విడువక మన
వెంట నుండి రక్షించెడి , విషధరునికి
నెరవుగ విపులయంతయు నిండిన నెల
దారికి నమస్కరించిన దక్కుఁబరము!!
పెక్కు దారులు గలవండ్రు విబుధ వరులు
రిప్లయితొలగించండివాటి గమ్యాలు తెలియక వరలు చుండ
నెరుగ కుండగ దేనికి యే వి ధా న
దారికి నమస్కరించిన దక్కు బరము?
చిత్త శుద్ధిగ సతతము సేవచేసి
రిప్లయితొలగించండిభక్తి తోడను పూవులు ఫలములొసగి
వినయముగనను దినమును విడువకజడ
*"దారికి నమస్కరించిన దక్కుఁ బరము”*