కం:సరి యగు సుగంధముల తో నరిసెల రుచి కొఱకు వ్రేల్చు ! డా ముదమందున్” ధర యెక్కు వైన గొందురు త్వర లో మన వర్తకమ్ము తారల నంటున్. (అని ఒక వర్తకుడు తన వంట వారి తో అన్నట్లు. )
చం:పరి పరి పిండి వంటలను బాగుగ జేయు మటంచు జెప్ప వ చ్చిరె!మన యల్లునిన్ గనగ "ఛీ" యని పించెను వాడు మెక్కగా నరిసెల వ్రేల్చఁగావలయు నా? ముదమందున స్వాదువందఁగన్ మురిపె మొసంగునా సుతకు? మూర్ఖుడు మారడు తగ్గు డింతటన్.
(అల్లుడు వట్టి దుర్మార్గుడు. వాడికి కాస్త అరిసెలు రుచిగా చేస్తే అమ్మాయిని మంచి గా చూస్తాడని భర్త ఆశ. వా ణ్నెంత మర్యాద చేసినా మారడు. నువ్వేమీ ఓవర్ యాక్షన్ చెయ్యకు అని భార్య చికాకు పడింది. )
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసరియగు తైలము నొదవుట
రిప్లయితొలగించండి“అరిసెల రుచి కొఱకు ; వ్రేల్చు డాముదమందున్”
అరగని దంతయు ప్రొద్దున
విరోచనమగుచు బయటకు వెడలుట కొరకై
కందం
రిప్లయితొలగించండిమురిపెమ్మున వచ్చిన కూ
తురల్లుడున్ వారి సంతు తోషమునందా
చరణమ్మన సంక్రాంతికి
అరిసెల రుచి కొఱకు వ్రేల్చుడా ముదమందున్
చంపకమాల
మురిపెము మీరగన్ సుతయు ముద్దులు పంచెడు వారి పిల్లలున్
దరలియు రాగ నల్లుడును దక్కెదె మోదము తల్లిదండ్రికిన్
సరిపడునట్లుగన్ మరకసంక్రమణంపు సుపర్వ వేళలో
నరిసెల వ్రేల్చఁగావలయు నా ముదమందున స్వాదువందఁగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచ.
రిప్లయితొలగించండిమురిపెము పెంపునొందగ ప్రభూత సుధాతరమైన తీపికై
తరళ దినేశ కాలమున తమ్ముడ వంటలలోన చక్కగా
నరుదగు బెల్లముం గలిపి యచ్చటనుంచెను రేయి వచ్చె నా
యరిసెల వ్రేల్చగా వలయు నా ముదమందున స్వాదువందగన్ !
రిప్లయితొలగించండివెరజిన ధనమ్ము తోడను
వరుణాత్మజ గ్రోలి యొకడు వచియించెనటన్
పరిగృహ్య తోడ, నిట్టుల
నరిసెల రుచి కొఱకు వ్రేల్చు డాముదమందున్.
*(భర్త భార్య తో పలికిన మాటలుగా)*
బురకల మృత్యుభృత్యమును పూర్తిగ తీర్చుట కంచు వైద్యుడే
పరిమితి తోడ నాముదపు పానము మేలని చెప్పె, గాంచగా
నరుచి యటంచు గైకొనగ నౌరసు లిష్టము చూప రందుకే
యరిసెల వ్రేల్చఁగావలయు నాముదమందున స్వాదువందఁగన్
కం. ధరలుర్విని వీడియు నం
రిప్లయితొలగించండిబరమును ౙొచ్చెఁ గొనఁ దేఱి భారమ్మాయెన్
ఇరుకాటము నొకడనియెన్
అరిసెల రుచికొఱకు వ్రేల్చు డాముదమందున్
దేఱి = నెయ్యి
సరియగు నువ్వులు నూనెను
రిప్లయితొలగించండిపొరుగునగల తెలికవాడు ముదమారగని
చ్చె రుచికరంబని దెలుపుచు
నరిసెల రుచి కొఱకు వ్రేల్చుడా ముదమందున్
సరియగు రీతిఁ బండినవి చక్కని నువ్వులఁ గానుగాడి మా
పొరుగున నున్నవాడొకడు పొల్పున బంధువు లొచ్చియున్నదౌ
తరుణముఁ దెచ్చియిచ్చెనట తాఁముదమారగఁ దీసిన తైలరాజమే
యరిసెల వ్రేల్చఁగావలయునా ముదమందున స్వాదువందఁగన్
సరసము లాడుచు నొకపరి
రిప్లయితొలగించండిపరిహాస ము మేళవించి పలుక గ బూనె న్
విరస గా నాత డని యె
'నరి సెలు రుచి కొఱ కు వ్రేల్చు డాముద మందు న్ "
మూడవ పాదంలో విరసముగా అనిసవరణ చేయడమైనది
తొలగించండివిరిసిన పూలభంగి మురి
రిప్లయితొలగించండిపించు మృదుత్వమునందు నోటిలో
కరకర లాడుచుండి కరు
గన్ ఘనమౌరుచి నొప్పు రీతికై
సరగున నేతి యందున ప
సందుగ వన్నెలు చిందు నట్టు లా
యరిసెల వ్రేల్చఁగావలయు
నా! ముదమందున స్వాదువందఁగన్!
కం॥ సరియగు రీతిని వ్రాసిన
రిప్లయితొలగించండినరిసెల రుచి కొఱకు వ్రేల్చు మాబల నూనెన్
మరుపున ముద్రించె నిటుల
నరిసెల రుచి కొఱకు వ్రేల్చుడాముదమందున్
చం॥ అరిసెల వ్రేల్చఁగా వలయు నాబల నూనెను స్వాదువందఁగన్
సరియగు రీతినీ పగిదిఁ జక్కగ వ్రాసి యొసంగ ముద్రణన్
విరియఁగ మత్తు మద్యమటు ప్రీతిగఁ గ్రోలఁగ నిట్లు మార్చెనే!
అరిసెల వ్రేల్చఁగా వలయు నాముదమందున స్వాదువందఁగన్
ఆబలు ఆవాలు ఆవనూనె ఉత్తరాదిలో ఎక్కువగా వాడుతారండి.
కం:సరి యగు సుగంధముల తో
రిప్లయితొలగించండినరిసెల రుచి కొఱకు వ్రేల్చు ! డా ముదమందున్”
ధర యెక్కు వైన గొందురు
త్వర లో మన వర్తకమ్ము తారల నంటున్.
(అని ఒక వర్తకుడు తన వంట వారి తో అన్నట్లు. )
చం:పరి పరి పిండి వంటలను బాగుగ జేయు మటంచు జెప్ప వ
రిప్లయితొలగించండిచ్చిరె!మన యల్లునిన్ గనగ "ఛీ" యని పించెను వాడు మెక్కగా
నరిసెల వ్రేల్చఁగావలయు నా? ముదమందున స్వాదువందఁగన్
మురిపె మొసంగునా సుతకు? మూర్ఖుడు మారడు తగ్గు డింతటన్.
(అల్లుడు వట్టి దుర్మార్గుడు. వాడికి కాస్త అరిసెలు రుచిగా చేస్తే అమ్మాయిని మంచి గా చూస్తాడని భర్త ఆశ. వా ణ్నెంత మర్యాద చేసినా మారడు. నువ్వేమీ ఓవర్ యాక్షన్ చెయ్యకు అని భార్య చికాకు పడింది. )
మఱవకుఁ డీ మర్మమ్మును
రిప్లయితొలగించండివెఱవకుఁ డాహ్వానిత జన విసరం బెల్లం
దఱచుగఁ, గమ్మని నేతిని
నఱిసెల రుచి కొఱకు వ్రేల్వుఁడా, ముద మందున్
అఱచిన నేమి యా యతిథులై చనుదెంచిన వార లెల్ల ర
త్తఱి వెగ టంద డెందములఁ దప్పక దూరము సేయ వారి, నీ
కఱిముఱి కోప మున్న మది నందఱ కీయఁ దలంప వంత నా
యఱిసెల వ్రేల్వఁ గావలయు నాముద మందున, స్వాదు వందఁగన్
మురిపెము మీరగ నింటికి
రిప్లయితొలగించండినరుదెంచిన వేళ క్రొత్త యల్లుడు సుతతో
కరకరలాడెడు తీయని
యరిసెల రుచి కొఱకు వ్రేల్చుడా ముదమందున్
మురిపెము మీర పండుగకు ముచ్చట దీర్చగ కన్నకూతుతో
రిప్లయితొలగించండినరుదుగ నేగుదెంచెనని యల్లుఁడు సంతసమందిరెల్లరున్
సరగున పిండివంటలను స్వచ్ఛఁపు నేతినిదెచ్చి దానిలో
అరిసెల వ్రేల్చఁగావలయు నా ముదమందున స్వాదువందఁగన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
తరలియు నల్లుడు రాగా
మరదలు సంక్రాంతినాడు మరి యేడ్పించన్
సరదాగ యనె నిటుల పది
యరిసెలు రుచికొఱకు వ్రేల్చు డాముద
మందున్.