1, జనవరి 2026, గురువారం

సమస్య - 5338

2-1-2026 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మారుతి చక్రాయుధమున మారునిఁ జంపెన్”
(లేదా...)
“మారుతి చక్రఘాతమున మారునిఁ జంపెను రాజ్యకాంక్షతో”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి దుబాయి శతావధాన సమస్య)

16 కామెంట్‌లు:

  1. కందం
    కారాకిళ్లీ నములుచు
    నోరంటన్ జొంగ కార నుడివె ఘనుడిటుల్
    భారత భాగవతాలన్
    మారుతి చక్రాయుధమున మారునిఁ జంపెన్

    ఉత్పలమాల
    నీరజలోచనున్ దలచి నిష్ఠగ పాశురమాలపించెడున్
    తీరగు మాసమంచుఁ గొని తెచ్చితివే ప్రవచింప హీనునిన్
    లేరెవరన్నటుల్ మురిసి, లెక్కలుదండగ! వాడి కూతలన్,
    "మారుతి చక్రఘాతమున మారునిఁ జంపెను రాజ్యకాంక్షతో!"

    రిప్లయితొలగించండి
  2. ఉ.
    ధీర కపీశుడెవ్వ, డరి తేకువ కేశవుడేల త్రెంచె, వి
    ప్పారి హరేక్షణంబెవని యాయువు తీసె, భవాని దైత్యుతో
    పోరుచు నేమి చేసె, చెడి పోరు సుయోధనుడేల యొప్పెడిన్
    మారుతి, చక్రఘాతమున, మారుని, జంపెను, రాజ్యకాంక్షతో !

    రిప్లయితొలగించండి
  3. భారత భాగవతంబుల
    సారమెరుగు వానిబిల్చి జవదాటుమనన్
    వేరుగ చెప్పచు నిట్లనె
    "మారుతి చక్రాయుధమున మారునిఁ జంపెన్”

    రిప్లయితొలగించండి

  4. నీరధెవడుదాటె దురా
    చారుడు శిశుపాలు జక్రి చంపెనెటుల్ మ
    ల్లారి యజునేమి చేసెనొ
    మారుతి, చక్రాయుధమున, మారునిఁ జంపెన్.


    కోరిరటంచు ప్రేక్షకుల కోరిక దీర్చదలంచు వాడె యై
    వారికి జ్ఞానశూన్యుడుగు పామరు డొక్కడు దొంగ స్వామియే
    సూరుడ నంచు చెప్పుకుని చోద్యము గావచి యించె నిట్టులన్
    మారుతి చక్రఘాతమున మారునిఁ జంపెను రాజ్యకాంక్షతో.

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. [ క్రమాలంకారము ]

      మారుత సుతుడెవ్వడు? కం
      సారి వధించు విధమెద్ది? జడదాలుపువే
      ల్పీరసమున చేసినపని?
      మారుతి; చక్రాయుధమున; మారునిఁ జంపెన్

      మారుతనందనుండెవడు? మాధవు డెవ్విధిఁ జంపు దుష్టులన్?
      గారణకారణమ్ము సెగకన్నొన రించిన కార్యమేమిటో?
      మోరకుడై సుయోధనుడు పోరుకు నిర్ణయమేల సల్పెనో?
      మారుతి; చక్రఘాతమున; మారునిఁ జంపెను; రాజ్యకాంక్షతో

      తొలగించండి
  6. కందం:
    నేరక మదిరను గ్రోలెను
    ఘోరముగా శిరమునందుకొన మైకమ్మే
    జోరుగ మందుండనియెను
    మారుతి చక్రాయుధమున మారునిఁ జంపెన్

    ఉత్పలమాల:
    చేరిరి పానశాలకడ స్నేహితులందరు గ్రోల మద్యమున్
    జోరుగ తాగిరెల్లరును జోగుతు వాగిరవాక్కులెన్నియో
    ఘోరముగా నొకండనెను గ్రోలిన మైకమునందు నిట్టులన్
    మారుతి చక్రఘాతమున మారునిఁ జంపెను రాజ్యకాంక్షతో

    రిప్లయితొలగించండి
  7. క్రమాలంకారమండి

    కం॥ శ్రీరామునిఁ గొలిచె నితఁడు
    వారించిన వినకనె శిశుపాలుఁడు మ్రగ్గెన్
    నేరుగ చూచుచుఁ ద్రినేత్రుఁడు
    మారుతి చక్రాయుధమున మారునిఁ జంపెన్

    ఉ॥ చేరెను రామ సన్నిధికి చేది నృపుండు మరించె నిట్టులన్
    నేరుగ నాగభూషణుఁడు నెమ్మది వీడఁ దపస్సు భంగమై
    కోరె సుయోధనుండనినె కుత్సితుఁడై పచరించి సర్వదా
    మారుతి చక్రఘాతమున మారునిఁ జంపెను రాజ్యకాంక్షతో

    మ్రగ్గు మరించు చచ్చు

    (బ్రహ్మశ్రీ వద్దిపర్తి గారికి దుబాయి శతావధానంలో ఇచ్చిన సమస్యలు సామాన్యులకు చాలా జటిలంగా ఉన్నాయండి)

    రిప్లయితొలగించండి


  8. నీరధి దాటినదెవ్వరు ?
    ఈరసమున కృష్ణుడడపు నేయస్త్రమునన్ ?
    వారుడు తెగటార్చెనెవని ?
    మారుతి, చక్రాయుధమున, మారునిఁ జంపెన్.

    రిప్లయితొలగించండి
  9. బారున మద్యము గ్రోలుచు
    జోరున వాగుచు బలికెను జోద్యము గాగన్
    "" పోరాటము సల్పుచు నా
    మారుతి చక్రాయు ధ మున మారుని జంపె న్ "

    రిప్లయితొలగించండి
  10. కం:శ్రీరామదూత యెవ్వడు?
    క్రూరున్ శిశుపాలు నెట్లు గూల్చెను హరియే ?
    చేరగ శివు డెవని దునిమె
    మారుతి,చక్రాయుధమున, మారునిఁ జంపెన్”
    (క్రమాలంకారం)

    రిప్లయితొలగించండి
  11. నేరముగా భావించి పు
    రారాతి కని విరి శరము లట ఫాలాగ్నిం,
    గోర కొనర్పఁగ సమరము
    మారుతి! చక్రాయుధమున, మారునిఁ జంపెన్


    నారి కసత్య మాడఁ గడు నైపుణ ముండు నటంచు విందు నే
    సూరి జనోక్త వాక్యమును సుంతయుఁ జింత యొనర్ప కాత్మలోఁ
    గోరి యసత్య మొక్కటినిఁ గోమలి పల్కు మనంగ నిట్లనెన్
    మారుతి చక్ర ఘాతమున మారునిఁ జంపెను రాజ్యకాంక్షతో

    రిప్లయితొలగించండి
  12. ఉ:మారుతి నామకుండు కవి మత్సఖు డాతడు, కావ్యసృష్టిలో
    ధీరుడు,చక్రఘాత మను దివ్యకథాళి రచించె ,నిన్ననే
    మారుతి చక్రఘాతమున మారునిఁ జంపెను, రాజ్యకాంక్షతో
    గౌరవ నాశనమ్మగుట గమ్రవిధిన్ విశద మ్మొనర్చెగా!
    (మారుతి అనే కవి చక్రఘాతం అనే పేరుతో కొన్ని దివ్యకథలని రచించాడు.వాటిలో నిన్న మన్మధ సంహారం కథ వ్రాసాడు. రాజ్యకాంక్ష తో కౌరవ వినాశాన్ని కూదా వ్రాసాడు.రచయిత మారుణ్ని చంపాడు అంటే చనిపోయిన కథ వ్రాసాడు అని భావం.)

    రిప్లయితొలగించండి
  13. కం॥
    ధారావని సుతుడెవ్వడు?
    శౌరిశరమదేమి గాముఁజంపగ చివ్వన్?
    భూరి నొసలేమి జేసెన్?
    మారుతి !చక్రాయుధమున! మారునిఁజంపెన్!!

    (క్రమాలంకారములో పూరణ)

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.
    (క్రమాలంకారము)
    వారధిని దాటి జానకి
    నేరు గనిరి? హరియు జంపె నెటులన్
    మొసలిన్
    శౌరి యెవరిని వధించెను?
    మారుతి,చక్రాయుధమున,మారుని జంపెన్.

    రిప్లయితొలగించండి