3-1-2026 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“నమ్మి కొలిచె గోదాదేవి నాగధరుని”(లేదా...)“తన చిత్తంబున నమ్మి శంకరుని గోదాదేవి గొల్చెం దమిన్”(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి దుబాయి శతావధాన సమస్య)
తేటగీతిచదివిన విషయమ్మున్ శిష్య! సక్రమముగవ్రాయమెచ్చని పంతులు వసుధఁ గలఁడె?తప్పు వ్రాసితె! నీ సమాధానమందునమ్మి కొలిచె గోదాదేవి నాగధరుని!మత్తేభవిక్రీడితముఅనయంబున్ గడు నిష్ఠగన్ జదివి యభ్యాసమ్మునన్ వ్రాసినన్నిను మెచ్చున్ జగమందు నొప్పయిన నా నేర్పించెడున్ బంతులున్కనుమా! వ్రాయగ నీవు నాగశయనున్ గాట్రేనిగన్, మారుచున్"తన చిత్తంబున నమ్మి శంకరుని గోదాదేవి గొల్చెం దమిన్"
పూలమాలలతో వెన్నుఁ బూజ చేసినమ్మి కొలిచె గోదాదేవి, నాగధరునివలచి యర్ధాంగి కాగోరి పగలు రేయితరుణి వలిగట్టుదొరపట్టి తపమొనర్చె
"నమ్మి కొలిచె గోదాదేవి నాగధరుని"నాగధరుని కాదు సఖుడా నగధరుడిని ;నాగధరుడన శివుడగు ; నగధరుడనగిరినియెత్తి రక్షించిన కృష్ణుడగును
పాశురముల రచించిన భక్తురాలు భక్తితో రంగనాథుని పతియటంచు నమ్మి కొలిచె గోదాదేవి, నాగధరుని.పతిగ పొంద తపము జేసె పర్వత సుత.మనుజండెవ్వడు నమ్మబోడు కద నీమాటల్ సఖా యెందుకీయనృతంబౌ పలుకుల్ వచింతువిక సత్యంబేమిటో తెల్సు గా జనులన్ మోసము చేయబోకుమది క్రచ్ఛమ్మందురే యప్పుడో తన చిత్తంబున నమ్మి శంకరుని గోదాదేవి గొల్చెం దమిన్?
సతతమా మనోహరుడగు శైలధరునినమ్మి కొలిచె గోదాదేవి; నాగధరునివలచి పెండ్లాడె చలిమలపట్టి గౌరి ప్రేమ చిగురించె నిరువురి భామలకునుచిననాడే మనసాడిపాడెను గదా శ్రీకృష్ణునిన్ దల్చుచున్మనసంతా కరివేల్పు నిండగ మనో మందారుడౌ కృష్ణుడేతన సర్వస్వము కాగ సౌఖ్యమిడుచున్ దారాడు సౌహార్ధమేతన చిత్తంబున నమ్మి శంకరుని గోదాదేవి గొల్చెం దమిన్[ శంకరుడు = సుఖమును గలుగఁజేయువాఁడు ]
నిజము శ్రీ రంగనాథుని నిగమవేద్యునమ్మి కొలిచె గోదాదేవి; నాగధరునినిరతమున్ గొల్చు పార్వతి నెమ్మితోడ;భక్తి గొలిచెడి వారలై పరగు గాదె!
అనిశంబున్ నగరాజపుత్రి మదిలో ధ్యానించి సద్భక్తితోతన ప్రాణేశ్వరుగా దలంచి హరునిన్ తాదాత్మ్యముం బొందెగాతన చిత్తంబున నమ్మి శంకరుని, గోదాదేవి గొల్చెం దమిన్మనమందున్ గిరిధారినిం గొలిచి పూమాలల్ సమర్పించుచున్
తే.గీ:"నమ్మి కొలిచె గోదా దేవి నాగశయను"ననుచు గవి పల్క లేఖకు డట్టి పద్యపాదమును పొరబాటున వ్రాసె నిట్లునమ్మి కొలిచె గోదాదేవి నాగధరుని.(కొందరు ప్రసిద్ధ కవులకు లేఖకు లుంటారు.పొరబాటున ఆ లేఖకుడు ఇలా తప్పు వ్రాసాడు.)
తే॥ పొరపడిన పండితుఁడొకఁడు పొరలఁ దప్పుతొలుత నాగశాయి యనుచుఁ బలుకఁ బోయి తత్తర పడి మార్చె నిటుల ధ్యాస వీడ నమ్మి కొలచె గోదాదేవి నాగధరునిమ॥ మనమానందము నొంద నచ్యుతిని సమ్మానించి ప్రేమించఁగన్దనరెన్ భ్రాతియు కోర్కెఁ గాంచు విధి సంధానించ విద్వత్తుతోఁగనఁగన్ బన్నగ ధారి తీర్చునని యాకాంక్షన్ బ్రసన్నుండునైతన చిత్తంబున నమ్మి శంకరుని గోదాదేవి గొల్చెం దమిన్(అచ్యుతుని ప్రేమించిన గోదాదేవి తన కోర్కెను తీర్చమని శివుని ప్రార్థించిది అని అండి)
మ:తనకున్ సాయము జేయ మన్మథుడు రా దల్చంగ వారించి శం భుని భక్తిన్ వరియింతు నంచు తపమున్ బూనెన్ బరాశక్తి యే తన చిత్తంబున నమ్మి శంకరుని ,గోదాదేవి గొల్చెం దమిన్తన నాథుండని రంగనాథుని బృహద్భక్తిన్ సదా దీక్ష తోన్.
మ:తనకున్ భర్తగ శౌరి జేయు మనుచున్ ధ్యానించె గా రుక్మిణీవనితారత్నము శాంభవిన్! మనమునన్ భావించి తద్గాధ గల్పన కావ్యమ్మున నిట్లు జేసె కవి "లీలన్ రంగనిన్ బొందగాతన చిత్తంబున నమ్మి శంకరుని గోదాదేవి గొల్చెం దమిన్.(భాగవతము లో కృష్ణుణ్ని భర్తగా చెయ్యమని రుక్మిణి శాంభవిని ధ్యానించ లేదా? అలాగే రంగని భర్తగా చెయ్యమని గోదాదేవి శంకరుణ్ని ప్రార్థించినట్లు ఒక కవి కల్పన చేసాడు.)
మునుపే రీతి నగాధిరాజసుత దా మోదంబునన్ జేరెనో తన చిత్తంబున నమ్మి శంకరుని; గోదాదేవి గొల్చెం దమిన్ఘనభూషాన్వితు గంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్దన ప్రాణేశునిగా వరించి సరసన్ దా జేరె దేవేరియై
చక్కఁగఁ దనకు భర్తగఁ జక్రధరుని దయ నొసంగు నని మదినిఁ దలఁచి యంత నరసి యర్ధ నారీశ్వరు కరుణ గరిమ నమ్మి కొలిచె గోదాదేవి నాగధరుని మునుముం దూనుచు మాల లింపుగను సమ్మోదమ్మునన్ నిత్యముం దన నాథుం డని పద్మనాభు మెడలోఁ దా నుంచు నా దండలం దన కింపారఁగ వెన్నునిం బతిగ సంధానింపఁగాఁ గోరుచుం దన చిత్తంబున నమ్మి శంకరుని గోదాదేవి గొల్చెం దమిన్
పూల దండలు ధరియించి పొల్పు గాను రంగ నాథుని కర్పించి రమణి తాను నమ్మి కొలిచె గోదాదేవి :: నాగ ధ రుని పరిణ యంబాడె పార్వతి వలచి మిగుల
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.స్వీకరించి రంగని తన ప్రియునిగానుపాశురములను రచియించి భక్తితోడ నమ్మి కొలిచె గోదాదేవి; నాగధరునిపతిగ పొందె తపము చేసి పార్వతి సతి.
గోప బాలుడె పతి యని కూర్మితోడ*“నమ్మి కొలిచె గోదాదేవి, నాగధరుని”*పార్వతియుకోరి మదిలోన భర్త గానువనిని తపమాచరించెను భక్తి తోడ.వనిలో దీక్షగ చేయుచుండతపమున్ భంగమ్ముచేయన్ వడిన్యనలాక్షుండును. క్రోధుడైగనగనేయగ్నిన్ మృతుండైనటమన్*“తన చిత్తంబున నమ్మి శంకరుని గోదాదేవి గొల్చెం దమిన్”*
తేటగీతి
రిప్లయితొలగించండిచదివిన విషయమ్మున్ శిష్య! సక్రమముగ
వ్రాయమెచ్చని పంతులు వసుధఁ గలఁడె?
తప్పు వ్రాసితె! నీ సమాధానమందు
నమ్మి కొలిచె గోదాదేవి నాగధరుని!
మత్తేభవిక్రీడితము
అనయంబున్ గడు నిష్ఠగన్ జదివి యభ్యాసమ్మునన్ వ్రాసినన్
నిను మెచ్చున్ జగమందు నొప్పయిన నా నేర్పించెడున్ బంతులున్
కనుమా! వ్రాయగ నీవు నాగశయనున్ గాట్రేనిగన్, మారుచున్
"తన చిత్తంబున నమ్మి శంకరుని గోదాదేవి గొల్చెం దమిన్"
పూలమాలలతో వెన్నుఁ బూజ చేసి
రిప్లయితొలగించండినమ్మి కొలిచె గోదాదేవి, నాగధరుని
వలచి యర్ధాంగి కాగోరి పగలు రేయి
తరుణి వలిగట్టుదొరపట్టి తపమొనర్చె
"నమ్మి కొలిచె గోదాదేవి నాగధరుని"
రిప్లయితొలగించండినాగధరుని కాదు సఖుడా నగధరుడిని ;
నాగధరుడన శివుడగు ; నగధరుడన
గిరినియెత్తి రక్షించిన కృష్ణుడగును
రిప్లయితొలగించండిపాశురముల రచించిన భక్తురాలు
భక్తితో రంగనాథుని పతియటంచు
నమ్మి కొలిచె గోదాదేవి, నాగధరుని.
పతిగ పొంద తపము జేసె పర్వత సుత.
మనుజండెవ్వడు నమ్మబోడు కద నీమాటల్ సఖా యెందుకీ
యనృతంబౌ పలుకుల్ వచింతువిక సత్యంబేమిటో తెల్సు గా
జనులన్ మోసము చేయబోకుమది క్రచ్ఛమ్మందురే యప్పుడో
తన చిత్తంబున నమ్మి శంకరుని గోదాదేవి గొల్చెం దమిన్?
సతతమా మనోహరుడగు శైలధరుని
రిప్లయితొలగించండినమ్మి కొలిచె గోదాదేవి; నాగధరుని
వలచి పెండ్లాడె చలిమలపట్టి గౌరి
ప్రేమ చిగురించె నిరువురి భామలకును
చిననాడే మనసాడిపాడెను గదా శ్రీకృష్ణునిన్ దల్చుచున్
మనసంతా కరివేల్పు నిండగ మనో మందారుడౌ కృష్ణుడే
తన సర్వస్వము కాగ సౌఖ్యమిడుచున్ దారాడు సౌహార్ధమే
తన చిత్తంబున నమ్మి శంకరుని గోదాదేవి గొల్చెం దమిన్
[ శంకరుడు = సుఖమును గలుగఁజేయువాఁడు ]
నిజము శ్రీ రంగనాథుని నిగమవేద్యు
రిప్లయితొలగించండినమ్మి కొలిచె గోదాదేవి; నాగధరుని
నిరతమున్ గొల్చు పార్వతి నెమ్మితోడ;
భక్తి గొలిచెడి వారలై పరగు గాదె!
అనిశంబున్ నగరాజపుత్రి మదిలో ధ్యానించి సద్భక్తితో
రిప్లయితొలగించండితన ప్రాణేశ్వరుగా దలంచి హరునిన్ తాదాత్మ్యముం బొందెగా
తన చిత్తంబున నమ్మి శంకరుని, గోదాదేవి గొల్చెం దమిన్
మనమందున్ గిరిధారినిం గొలిచి పూమాలల్ సమర్పించుచున్
తే.గీ:"నమ్మి కొలిచె గోదా దేవి నాగశయను"
రిప్లయితొలగించండిననుచు గవి పల్క లేఖకు డట్టి పద్య
పాదమును పొరబాటున వ్రాసె నిట్లు
నమ్మి కొలిచె గోదాదేవి నాగధరుని.
(కొందరు ప్రసిద్ధ కవులకు లేఖకు లుంటారు.పొరబాటున ఆ లేఖకుడు ఇలా తప్పు వ్రాసాడు.)
తే॥ పొరపడిన పండితుఁడొకఁడు పొరలఁ దప్పు
రిప్లయితొలగించండితొలుత నాగశాయి యనుచుఁ బలుకఁ బోయి
తత్తర పడి మార్చె నిటుల ధ్యాస వీడ
నమ్మి కొలచె గోదాదేవి నాగధరుని
మ॥ మనమానందము నొంద నచ్యుతిని సమ్మానించి ప్రేమించఁగన్
దనరెన్ భ్రాతియు కోర్కెఁ గాంచు విధి సంధానించ విద్వత్తుతోఁ
గనఁగన్ బన్నగ ధారి తీర్చునని యాకాంక్షన్ బ్రసన్నుండునై
తన చిత్తంబున నమ్మి శంకరుని గోదాదేవి గొల్చెం దమిన్
(అచ్యుతుని ప్రేమించిన గోదాదేవి తన కోర్కెను తీర్చమని శివుని ప్రార్థించిది అని అండి)
మ:తనకున్ సాయము జేయ మన్మథుడు రా దల్చంగ వారించి శం
రిప్లయితొలగించండిభుని భక్తిన్ వరియింతు నంచు తపమున్ బూనెన్ బరాశక్తి యే
తన చిత్తంబున నమ్మి శంకరుని ,గోదాదేవి గొల్చెం దమిన్
తన నాథుండని రంగనాథుని బృహద్భక్తిన్ సదా దీక్ష తోన్.
మ:తనకున్ భర్తగ శౌరి జేయు మనుచున్ ధ్యానించె గా రుక్మిణీ
రిప్లయితొలగించండివనితారత్నము శాంభవిన్! మనమునన్ భావించి తద్గాధ గ
ల్పన కావ్యమ్మున నిట్లు జేసె కవి "లీలన్ రంగనిన్ బొందగా
తన చిత్తంబున నమ్మి శంకరుని గోదాదేవి గొల్చెం దమిన్.
(భాగవతము లో కృష్ణుణ్ని భర్తగా చెయ్యమని రుక్మిణి శాంభవిని ధ్యానించ లేదా? అలాగే రంగని భర్తగా చెయ్యమని గోదాదేవి శంకరుణ్ని ప్రార్థించినట్లు ఒక కవి కల్పన చేసాడు.)
మునుపే రీతి నగాధిరాజసుత దా మోదంబునన్ జేరెనో
రిప్లయితొలగించండితన చిత్తంబున నమ్మి శంకరుని; గోదాదేవి గొల్చెం దమిన్
ఘనభూషాన్వితు గంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్
దన ప్రాణేశునిగా వరించి సరసన్ దా జేరె దేవేరియై
చక్కఁగఁ దనకు భర్తగఁ జక్రధరుని
రిప్లయితొలగించండిదయ నొసంగు నని మదినిఁ దలఁచి యంత
నరసి యర్ధ నారీశ్వరు కరుణ గరిమ
నమ్మి కొలిచె గోదాదేవి నాగధరుని
మునుముం దూనుచు మాల లింపుగను సమ్మోదమ్మునన్ నిత్యముం
దన నాథుం డని పద్మనాభు మెడలోఁ దా నుంచు నా దండలం
దన కింపారఁగ వెన్నునిం బతిగ సంధానింపఁగాఁ గోరుచుం
దన చిత్తంబున నమ్మి శంకరుని గోదాదేవి గొల్చెం దమిన్
పూల దండలు ధరియించి పొల్పు గాను
రిప్లయితొలగించండిరంగ నాథుని కర్పించి రమణి తాను
నమ్మి కొలిచె గోదాదేవి :: నాగ ధ రుని
పరిణ యంబాడె పార్వతి వలచి మిగుల
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
స్వీకరించి రంగని తన ప్రియునిగాను
పాశురములను రచియించి భక్తితోడ
నమ్మి కొలిచె గోదాదేవి; నాగధరుని
పతిగ పొందె తపము చేసి పార్వతి సతి.
గోప బాలుడె పతి యని కూర్మితోడ
రిప్లయితొలగించండి*“నమ్మి కొలిచె గోదాదేవి, నాగధరుని”*
పార్వతియుకోరి మదిలోన భర్త గాను
వనిని తపమాచరించెను భక్తి తోడ.
వనిలో దీక్షగ చేయుచుండతపమున్ భంగమ్ముచేయన్ వడిన్
యనలాక్షుండును. క్రోధుడైగనగనేయగ్నిన్ మృతుండైనటమన్
*“తన చిత్తంబున నమ్మి శంకరుని గోదాదేవి గొల్చెం దమిన్”*