'ప్రోషిత భర్తృక' (భర్త పరదేశానికి వెళ్లిన స్త్రీ) స్థితి ఇతివృత్తం.
భావం : జీవిత లక్ష్యాలను, స్వప్నాలను సాకారం చేసుకోవడం కోసం తన భర్త సౌదీ అరేబియాకు వలస వెళ్లగా, ఆ విరహవేదన రాధమ్మను దహిస్తోంది. ఆ అంతర్గత తాపం ఆమె దేహాన్ని ఎంతలా ఆవహించిందంటే, బయట ఉన్న చలితీవ్రత ఆమెను ఏమాత్రం బాధించడం లేదు.
మ:తలచన్ రుచ్యము కంద బచ్చలియె వింతన్ గొల్పు నాథుండు బ చ్చలి శ్లేష్మమ్మను,కంద నుష్ణ మను నే చక్కంగ నీ నాడు బ చ్చలినిన్, కందను గల్పి మెక్కెదను స్వేచ్ఛన్, నన్ను నీ కంద బ చ్చలి బాధింపదు వల్లభుండు పరదేశంబేగి రాకుండినన్ (కంద బచ్చలి ఈమె కిష్టం. వాడికి నచ్చదు.వాడు ఊళ్లో లేడు కాబట్టి బాధ లేకుండా వండుకు తినచ్చు. )
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండికందం
తొలగించండిసాధింపనెంచి పతి, నా
రాధించెడు సతి పనుపగ ప్రజ్ఞతఁగలుగన్
రోధనలుండక యెందున
బాధింపదు చలి విభుఁడు ప్రవాసంబుండన్
మత్తేభవిక్రీడితము
తలపుల్ బాధ్యతలందునన్ బరఁగగన్ దానెంచి పంపించుచున్
గొలువందున్ దగ నంకితంబునగుచున్ గూడంగ విత్తమ్ము ని
శ్చలతన్ నిల్వఁగ దారయే తలఁచి ప్రోత్సాహమ్మునందింపగన్
జలి బాధింపదు వల్లభుండు పరదేశంబేగి రాకుండినన్
సాధిగ నుండ దగదుగద ,
రిప్లయితొలగించండివీధిచివర భోగి మంట వేసిన వేళన్
దీధితి మంతుని వేడిమి ,
బాధింపదు చలి విభుఁడు ప్రవాసంబుండన్
సాధనమును గోరుచు నా
రిప్లయితొలగించండిమాధవుడను నిల్పి తనదు మదిలో సతమా
రాధించెడి మహిళల కిల
బాధింపదు చలి విభుఁడు ప్రవాసంబుండన్.
ఖలు లాశించెడి బుద్భుదమ్ములగు సౌఖ్యాలేల భూస్పృక్కు కున్
విలువైనట్టి నివృత్తిచాలనుచు సర్వేశుండె సర్వంబు గా
నిల పూజించు గుణాత్మురాలయిన నాయిల్లాలికిన్ గాంచగా
చలి బాధింపదు వల్లభుండు పరదేశంబేగి రాకుండినన్.
మేధస్సుకు సరితూగే
రిప్లయితొలగించండిప్రాధాన్యత నొందనెంచి పతితానరుగన్
సాధనతో సాధ్యంబగు
బాధింపదు చలి విభుఁడు ప్రవాసంబుండన్
పలు జీవాణువులున్నవన్నమిషతో వండించు నాతండు బ
చ్చలి కూరాకులనే నిరంతరముగా చాంచల్యరాహిత్యమున్
జెలి సౌముఖ్యము చూపకున్నఁ విధిగా సేవింపగాజేయు బ
చ్చలి బాధింపదు వల్లభుండు పరదేశంబేగి రాకుండినన్
కం. సాధించగ స్వప్నమ్ములు
రిప్లయితొలగించండిసౌదీనున్న పతివిరహసంజాతాగ్నిన్
రాధమ్మ రగులుచుండగ
బాధింపదు చలి విభుఁడు ప్రవాసంబుండన్
'ప్రోషిత భర్తృక' (భర్త పరదేశానికి వెళ్లిన స్త్రీ) స్థితి ఇతివృత్తం.
భావం : జీవిత లక్ష్యాలను, స్వప్నాలను సాకారం చేసుకోవడం కోసం తన భర్త సౌదీ అరేబియాకు వలస వెళ్లగా, ఆ విరహవేదన రాధమ్మను దహిస్తోంది. ఆ అంతర్గత తాపం ఆమె దేహాన్ని ఎంతలా ఆవహించిందంటే, బయట ఉన్న చలితీవ్రత ఆమెను ఏమాత్రం బాధించడం లేదు.
కం:బాధించగ చలి నన్నున్
రిప్లయితొలగించండివేధించును స్వెట్ట రేల వేసితి వని సా
ధ్వీధర్మము కాదని, నను
బాధింపదు చలి విభుఁడు ప్రవాసంబుండన్”
(కొందరు సాడిస్ట్ మొగు ళ్లుంటారు.వాళ్కకి ఆడ వాళ్లు స్వెట్టర్ వెసినా,కాస్త ఆధునికం గా ఉన్నా గిట్టదు.చలికాలం లో ఇలాంటి మొగుల్లు దేశాంతరం లో ఉంటేనే హాయిగా ఉంటుంది. )
మ:చలి మంటన్ సుఖియించ నేను నది మెచ్చన్ లేడు, వా డెవ్వడో
రిప్లయితొలగించండిచలికిన్ జేరగ నన్ను దాకె నని రచ్చన్ జేయు, నా స్వెట్టరున్
జలికిన్ దాల్చ బ్రదర్శన మ్మనును, స్వేచ్ఛన్ జంపు నో దేవుడా!
చలి బాధింపదు వల్లభుండు పరదేశంబేగి రాకుండినన్”
కం॥ వేధించఁ బేదరికమటు
రిప్లయితొలగించండిసాధించి కనఁగఁ జన ధన సంపదలెన్నో
యా ధవుని క్షేమ చింతను
బాధింపదు చలి విభుఁడు ప్రవాసంబుండన్
మ॥ నెలవున్ వీడ గడించ సంపదలు సాన్నిధ్యంబుఁ గోల్పోయినన్
దలఁపుల్ నిండవె పత్ని యెప్పుడటులన్ ధ్యానించఁగన్ భర్తనే
శిలయై పోవునొ మానసమ్మున సదా క్షేమమ్ముఁ గాంక్షించుచున్
జలి బాధింపదు వల్లభుండు పరదేశంబేగి రాకుండినన్
(భర్త క్షేమము గురించిన చింతతో చలి ధ్యాస లేదని అండి ప్రతి merchant marine worker భార్య బాధ యిది)
మ:తలచన్ రుచ్యము కంద బచ్చలియె వింతన్ గొల్పు నాథుండు బ
రిప్లయితొలగించండిచ్చలి శ్లేష్మమ్మను,కంద నుష్ణ మను నే చక్కంగ నీ నాడు బ
చ్చలినిన్, కందను గల్పి మెక్కెదను స్వేచ్ఛన్, నన్ను నీ కంద బ
చ్చలి బాధింపదు వల్లభుండు పరదేశంబేగి రాకుండినన్
(కంద బచ్చలి ఈమె కిష్టం. వాడికి నచ్చదు.వాడు ఊళ్లో లేడు కాబట్టి బాధ లేకుండా వండుకు తినచ్చు. )
విలపింపన్ దగదో వయారి వినుమా విక్షోభమున్ వీడుమీ
రిప్లయితొలగించండిచలికాలంబున గాంతు కౌగిళులకున్ సామ్యంబు లేదైన నీ
నులివెచ్చందనమిచ్చు శాలువను మేనున్ గప్ప గొంతైననా
చలి బాధింపదు వల్లభుండు పరదేశంబేగి రాకుండినన్
నాధుఁడు దేశాంతరమున
రిప్లయితొలగించండిసాధింపఁగ సంపదలను చనినంతట నే
వేదన బూనదు శాలిని
బాధింపదు చలి విభుఁడు ప్రవాసంబుండన్
కులకాంతన్విడనాడి యొంటరిగ సంకోచింపకన్ నాధుఁడే
కొలువుంజేయ విదేశమేగె నచటన్గూర్చంగ నైశ్వర్యమున్
చెలువంబంతయు రిక్తమై వృధగ నిస్తేజమ్ము వేష్టించినన్
చలి బాధింపదు వల్లభుండు పరదేశంబేగి రాకుండినన్
సాధన జేయుచు సతతము
రిప్లయితొలగించండిసాధన లో మునిగి నట్టి సాధకు నికి సం
శో ధ కునికి నె య్య ది యును
బాధింపదు చలి విభుడు ప్రవాస o బుండన్
కలి కాలంబున వర్గ భేదముల
రిప్లయితొలగించండిసంగ్రామంబు సాగున్ సదా
అలవాటాయెను పేదవారలకు
వారర్ధాకలిన్ బండగా
నిలలో వారికి కష్ట నష్ట చయమీ
యెండల్ మరీ వర్షముల్
చలి బాధించదు వల్లభుండు పర
దేశంబేగి రాకుండినన్.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
బాధల భరించి నిత్యము
బోధించెడు యోగ గురువు బోధనతోడన్
సాధన చేయుచు నుండిన
బాధింపదు చలి, విభుడు ప్రవాసంబుండన్.